Inkscape/C2/Overview-of-Inkscape/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:19, 3 April 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:01 | Inkscape సిరీస్ పై Spoken Tutorials కు స్వాగతం. |
00:05 | ఈ సిరీస్ లో, Inkscape మరియు దాని లక్షణాలతో మనకి మనం సుపరిచితులము అవుదాము. |
00:11 | మనం నేర్చుకునేవి: పూర్వనిర్వచిత వివిధ ఆకారాలను గీయటం మరియు సవరించటం |
00:21 | రంగు చక్రం ఉపయోగించటం |
00:26 | బేజియర్ టూల్ ఉపయోగించటం |
00:33 | అవసరాన్ని బట్టి టెక్స్ట్ ను ఉపయోగించటం మరియు సర్దుబాటు చేయటం |
00:37 | ఉదాహరణకు సూపర్ స్క్రిప్ట్ మరియు సబ్ స్క్రిప్ట్ |
00:42 | టెక్స్ట్ పై ఇమేజ్ ను సూపర్ ఇంపోజ్ చేయటం |
00:47 | ఈ సిరీస్ లో, మనం ఆకారాల యొక్క ఒక కలయిక ఉపయోగించి ఒక టైల్ నమూనా రోపొందించటం కూడా నేర్చుకుంటాం. |
00:54 | ఒక పుష్పం వంటి గ్రాఫిక్స్ |
00:58 | బ్రోచర్స్ మరియు ఫ్లయర్స్ |
01:02 | పోస్టర్స్ మరియు బ్యానెర్లు |
01:06 | CD లేబెల్స్ |
01:10 | విజిటింగ్ కార్డ్స్ |
01:13 | లోగోస్ మరియు మరెన్నో |
01:17 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను ఉపయోగిస్తున్నాను: Ubuntu Linux12.04 మరియు Windows 7 OS |
01:24 | Inkscape వర్షన్ 0.48.4 |
01:28 | Inkscape అనేది ఒక Open Source vector graphics editor. |
01:31 | ఇది Linux, Mac OS X మరియు Windows పై పనిచేస్తుంది. |
01:36 | Inkscape అన్ని రకాల 2D గ్రాఫిక్ డిజైన్ల కొరకు ఉపయోగపడుతుంది. అవి - |
01:41 | దృష్టాంతాలు మరియు ఆకృతులు / కార్టూన్లు గీయడానికి |
01:46 | రంగుల నమూనాలు / నేపథ్యాలు సృష్టించడానికి |
01:50 | ఒక వెబ్ పేజీ లేఔట్ సృష్టించడానికి |
01:53 | చిత్రాలను ట్రేస్ చేయుటకు |
01:56 | వెబ్ ఆధారిత బటన్లు మరియు చిహ్నాలు సృష్టించడానికి |
02:00 | వెబ్ కోసం చిత్రాలను మార్చటానికి. |
02:05 | Synaptic Package Manager ను ఉపయోగించి Inkscape ను Ubuntu Linux పై ఇన్స్టాల్ చేయవచ్చు. |
02:11 | Synaptic Package Manager పై మరిన్ని వివరాలకు, పై మా వెబ్సైట్ లోని Linux ట్యుటోరియల్స్ ను సందర్శించండి. |
02:17 | Dash home కి వెళ్ళి, Inkscape అని టైప్ చేయండి. |
02:20 | మీరు logo పై డబుల్ క్లిక్ చేసి Inkscape ను తెరువవచ్చు. |
02:23 | ఇప్పుడు మనం Windows పై ఇన్క్ స్కేప్ ను ఇన్స్టాల్ చేయటం నేర్చుకుందాం. |
02:28 | మీ బ్రౌజర్ ను తెరచి. inkscape.org కు వెళ్ళండి. |
02:33 | Download బటన్ పై క్లిక్ చేయండి.Windows కు సంబందించిన Installer ఎంపికను ఎంచుకోండి. |
02:40 | మీరు ఈ వాక్యం Download Inkscape..... విత్ దిస్ వర్షన్ ను కనుగొని, దానిపై క్లిక్ చేయండి. |
02:46 | ఒక డైలాగ్ -బాక్స్ కనిపిస్తుందని గమనించండి, Save పై క్లిక్ చేయండి. |
02:51 | ఇన్స్టాలర్ ఫైల్ మీ కంప్యూటరులోకి డౌన్లోడ్ చేయబడుతుంది.Downloads ఫోల్డర్ కు వెళ్ళండి |
02:58 | ఇన్క్ స్కేప్ ఇన్స్టాల్ చేయటానికి exe ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి. |
03:02 | అప్రమేయ భాషగా English ఉంది. ఇప్పుడు Next పై క్లిక్ చేయండి. |
03:07 | Next పై మళ్ళీ క్లిక్ చేయండి. |
03:09 | Next పై మళ్ళీ క్లిక్ చేయండి. |
03:11 | Destination folder డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. అప్రమేయంగా,Programs files లో ఇన్క్ స్కేప్ సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు Install పై క్లిక్ చేయండి. |
03:20 | ఇన్క్ స్కేప్ ఇన్స్టాల్ అవుతుంది. దీనికి కొన్ని నిమిషాలు పట్టవచ్చు. |
03:25 | Next పై క్లిక్ చేయండి. సంస్థాపనను పూర్తి చేయడానికి Finish పై క్లిక్ చేయండి. |
03:30 | ఇప్పుడు, ఇన్క్ స్కేప్ సాఫ్ట్వేర్ స్వయంచాలకంగా తెరుచుకుంటుంది. |
03:34 | తెరుచుకోక పోతే, డెస్క్టాప్ పైన ఒక షార్ట్ కట్ ఐకాన్ సృష్టించబడి ఉంటుంది గమనించండి. తెరవటానికి దానిని డబుల్ -క్లిక్ చేయండి. |
03:42 | ఈ రెండు పద్దతులలో కూడా ఇన్క్ స్కేప్ తెరుచుకొనుట విఫలం అయితే, మీరు Start menu > All programs పై క్లిక్ చేసి ఆపై Inkscape పై క్లిక్ చేయండి. |
03:50 | ఇన్క్ స్కేప్ ఇంటర్ఫేస్ ఇప్పుడు తెరుచుకుంటుంది |
03:54 | ఇప్పుడు, ఈ ప్రదర్శన పూర్తి చేయడానికి నేను Linux కు తిరిగి వెళ్తున్నాను. |
03:58 | అయినప్పటికీ, చూపిన సోపానాలతో ఏ OS లో అయినా ఇన్క్ స్కేప్ పని చేస్తుంది. |
04:04 | ప్రధాన డ్రాయింగ్ ఏరియా ను canvas అంటారు. ఇక్కడే మనం అన్నిgraphics ను సృష్టిస్తాము. |
04:10 | Inkscape లో వివిధ రకాల టూల్ ఎంపికలు మరియు మెనూ ఎంపికలు ఉన్నాయి.ఈ సిరీస్ లో మనం ప్రతి ఒక దాని గూర్చి వివరంగా నేర్చుకుంటాం. |
04:17 | ఇప్పుడు, ఇన్క్ స్కేప్ ను ఎలా ఉపయోగించాలో క్లుప్తంగా నేర్చుకుందాం. |
04:21 | rectangle టూల్ ను ఎంచుకొని ఒక దీర్ఘ చతురస్ర ఆకారాన్ని రూపొందిద్దాం. |
04:25 | దీర్ఘ చతురస్ర ఆకారాన్ని గీయటానికి, canvas పై క్లిక్ చేయండి మరియు లాగండి. |
04:29 | ఇక్కడ మన దీర్ఘ చతురస్రం ఉంది. |
04:32 | ఈ ఇన్క్ స్కేప్ డ్రాయింగ్ ను save చేస్తాను. |
04:34 | File menu కి వెళ్ళి. Save పై క్లిక్ చేయండి. |
04:38 | నేను దీనికి drawing_1.svg గా పేరును ఇచ్చి, దీన్ని నా Documents ఫోల్డర్ లో భద్రపరుస్తాను. |
04:45 | ఇక్కడ, svg డిఫాల్ట్ Inkscape ఫైల్ ఎక్సటెన్షన్ల ను సూచిస్తుంది. |
04:49 | రాబోవు ట్యుటోరియల్స్ లో మనం Inkscape మరియు దాని అద్భుతమైన లక్షణాలు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుంటాము. |
04:55 | నేను ఇప్పటికే మీకు ఈ సిరీస్ లో ట్యుటోరియల్స్ నుండి గ్లింప్సెస్ ను చూపించాను. |
05:00 | క్రింది లింక్ వద్ద అందుబాటులో వీడియో ఉంది, అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని వివరిస్తుంది. దయచేసి దానిని చుడండి. |
05:06 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
05:13 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి, |
05:15 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తున్నాయి. |
05:21 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
05:25 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
05:27 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |