Inkscape/C2/Overview-of-Inkscape/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Inkscape సిరీస్ పై Spoken Tutorials కు స్వాగతం.
00:05 ఈ సిరీస్ లో, Inkscape మరియు దాని లక్షణాలతో మనకి మనం సుపరిచితులము అవుదాము.
00:11 మనం నేర్చుకునేవి, పూర్వనిర్వచిత వివిధ ఆకారాలను గీయటం మరియు సవరించటం.
00:21 రంగు చక్రం ఉపయోగించటం.
00:26 బేజియర్ టూల్ ఉపయోగించటం.
00:33 అవసరాన్ని బట్టి టెక్స్ట్ ను ఉపయోగించటం మరియు సర్దుబాటు చేయటం.
00:37 ఉదాహరణకు సూపర్ స్క్రిప్ట్ మరియు సబ్ స్క్రిప్ట్.
00:42 టెక్స్ట్ పై ఇమేజ్ ను సూపర్ ఇంపోజ్ చేయటం.
00:47 ఈ సిరీస్ లో, మనం ఆకారాల యొక్క ఒక కలయిక ఉపయోగించి ఒక టైల్ నమూనా రోపొందించటం కూడా నేర్చుకుంటాం.
00:54 ఒక పుష్పం వంటి గ్రాఫిక్స్,
00:58 బ్రోచర్స్ మరియు ఫ్లయర్స్,
01:02 పోస్టర్స్ మరియు బ్యానెర్లు,
01:06 CD లేబెల్స్,
01:10 విజిటింగ్ కార్డ్స్,
01:13 లోగోస్ మరియు మరెన్నో.
01:17 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను ఉపయోగిస్తున్నాను, Ubuntu Linux12.04 మరియు Windows 7 OS.
01:24 Inkscape వర్షన్ 0.48.4.
01:28 Inkscape అనేది ఒక Open Source vector graphics editor.
01:31 ఇది Linux, Mac OS X మరియు Windows పై పనిచేస్తుంది.
01:36 Inkscape అన్ని రకాల 2D గ్రాఫిక్ డిజైన్ల కొరకు ఉపయోగపడుతుంది. అవి -
01:41 దృష్టాంతాలు మరియు ఆకృతులు / కార్టూన్లు గీయడానికి,
01:46 రంగుల నమూనాలు / నేపథ్యాలు సృష్టించడానికి,
01:50 ఒక వెబ్ పేజీ లేఔట్ సృష్టించడానికి,
01:53 చిత్రాలను ట్రేస్ చేయుటకు,
01:56 వెబ్ ఆధారిత బటన్లు మరియు చిహ్నాలు సృష్టించడానికి,
02:00 వెబ్ కోసం చిత్రాలను మార్చటానికి.
02:05 Synaptic Package Manager ను ఉపయోగించి Inkscape ను Ubuntu Linux పై ఇన్స్టాల్ చేయవచ్చు.
02:11 Synaptic Package Manager పై మరిన్ని వివరాలకు, పై మా వెబ్సైట్ లోని Linux ట్యుటోరియల్స్ ను సందర్శించండి.
02:17 Dash home కి వెళ్ళి, Inkscape అని టైప్ చేయండి.
02:20 మీరు logo పై డబుల్ క్లిక్ చేసి Inkscape ను తెరువవచ్చు.
02:23 ఇప్పుడు మనం Windows పై ఇన్క్ స్కేప్ ను ఇన్స్టాల్ చేయటం నేర్చుకుందాం.
02:28 మీ బ్రౌజర్ ను తెరచి. inkscape.org కు వెళ్ళండి.
02:33 Download బటన్ పై క్లిక్ చేయండి.Windows కు సంబందించిన Installer ఎంపికను ఎంచుకోండి.
02:40 మీరు ఈ వాక్యం Download Inkscape..... విత్ దిస్ వర్షన్ ను కనుగొని, దానిపై క్లిక్ చేయండి.
02:46 ఒక డైలాగ్ -బాక్స్ కనిపిస్తుందని గమనించండి, Save పై క్లిక్ చేయండి.
02:51 ఇన్స్టాలర్ ఫైల్ మీ కంప్యూటరులోకి డౌన్లోడ్ చేయబడుతుంది. Downloads ఫోల్డర్ కు వెళ్ళండి.
02:58 ఇన్క్ స్కేప్ ఇన్స్టాల్ చేయటానికి exe ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి.
03:02 అప్రమేయ భాషగా English ఉంది. ఇప్పుడు Next పై క్లిక్ చేయండి.
03:07 Next పై మళ్ళీ క్లిక్ చేయండి.
03:09 Next పై మళ్ళీ క్లిక్ చేయండి.
03:11 Destination folder డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. అప్రమేయంగా,Programs files లో ఇన్క్ స్కేప్ సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు Install పై క్లిక్ చేయండి.
03:20 ఇన్క్ స్కేప్ ఇన్స్టాల్ అవుతుంది. దీనికి కొన్ని నిమిషాలు పట్టవచ్చు.
03:25 Next పై క్లిక్ చేయండి. సంస్థాపనను పూర్తి చేయడానికి Finish పై క్లిక్ చేయండి.
03:30 ఇప్పుడు, ఇన్క్ స్కేప్ సాఫ్ట్వేర్ స్వయంచాలకంగా తెరుచుకుంటుంది.
03:34 తెరుచుకోక పోతే, డెస్క్టాప్ పైన ఒక షార్ట్ కట్ ఐకాన్ సృష్టించబడి ఉంటుంది గమనించండి. తెరవటానికి దానిని డబుల్ -క్లిక్ చేయండి.
03:42 ఈ రెండు పద్దతులలో కూడా ఇన్క్ స్కేప్ తెరుచుకొనుట విఫలం అయితే, మీరు Start menu > All programs పై క్లిక్ చేసి ఆపై Inkscape పై క్లిక్ చేయండి.
03:50 ఇన్క్ స్కేప్ ఇంటర్ఫేస్ ఇప్పుడు తెరుచుకుంటుంది.
03:54 ఇప్పుడు, ఈ ప్రదర్శన పూర్తి చేయడానికి నేను Linux కు తిరిగి వెళ్తున్నాను.
03:58 అయినప్పటికీ, చూపిన సోపానాలతో ఏ OS లో అయినా ఇన్క్ స్కేప్ పని చేస్తుంది.
04:04 ప్రధాన డ్రాయింగ్ ఏరియా ను canvas అంటారు. ఇక్కడే మనం అన్ని graphics ను సృష్టిస్తాము.
04:10 Inkscape లో వివిధ రకాల టూల్ ఎంపికలు మరియు మెనూ ఎంపికలు ఉన్నాయి. ఈ సిరీస్ లో మనం ప్రతి ఒక దాని గూర్చి వివరంగా నేర్చుకుంటాం.
04:17 ఇప్పుడు, ఇన్క్ స్కేప్ ను ఎలా ఉపయోగించాలో క్లుప్తంగా నేర్చుకుందాం.
04:21 rectangle టూల్ ను ఎంచుకొని ఒక దీర్ఘ చతురస్ర ఆకారాన్ని రూపొందిద్దాం.
04:25 దీర్ఘ చతురస్ర ఆకారాన్ని గీయటానికి, canvas పై క్లిక్ చేయండి మరియు లాగండి.
04:29 ఇక్కడ మన దీర్ఘ చతురస్రం ఉంది.
04:32 ఈ ఇన్క్ స్కేప్ డ్రాయింగ్ ను save చేస్తాను.
04:34 File menu కి వెళ్ళి. Save పై క్లిక్ చేయండి.
04:38 నేను దీనికి drawing_1.svg గా పేరును ఇచ్చి, దీన్ని నా Documents ఫోల్డర్ లో భద్రపరుస్తాను.
04:45 ఇక్కడ, svg డిఫాల్ట్ Inkscape ఫైల్ ఎక్సటెన్షన్ల ను సూచిస్తుంది.
04:49 రాబోవు ట్యుటోరియల్స్ లో మనం Inkscape మరియు దాని అద్భుతమైన లక్షణాలు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుంటాము.
04:55 నేను ఇప్పటికే మీకు ఈ సిరీస్ లో ట్యుటోరియల్స్ నుండి గ్లింప్సెస్ ను చూపించాను.
05:00 క్రింది లింక్ వద్ద అందుబాటులో వీడియో ఉంది, అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని వివరిస్తుంది. దయచేసి దానిని చుడండి.
05:06 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
05:13 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,
05:15 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తున్నాయి.
05:21 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
05:25 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
05:27 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya