GChemPaint/C2/Formation-of-Bonds/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | అందరికి నమస్కారం. |
00:02 | జికెంపెయింట్ లో ఫార్మేషన్ అఫ్ బాండ్స్ (Formation of bonds in GChemPaint) ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది, |
00:10 | ఇప్పటికే వున్న బంధంకు బంధములు జోడించడం. |
00:13 | బంధాల (బాండ్ల)ను ఓరియంట్ చేయడం. |
00:15 | స్టీరియోకెమికల్ బాండ్లు జోడించడం. |
00:18 | వెడ్జ్ హషస్ ను ఇన్వర్స్ చేయడం. |
00:21 | ఇక్కడ ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04, |
00:27 | GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
00:33 | ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి, |
00:37 | GchemPaint(జికెంపెయింట్) రసాయన నిర్మాణ ఎడిటర్. |
00:40 | తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:46 | నేను ఈథేన్(Ethane) నిర్మాణం తో ఒక కొత్త జికెంపెయింట్ (GChemPaint) అప్లికేషన్ తెరిచాను. |
00:51 | సంతృప్త హైడ్రోకార్బన్స్(Saturated Hydrocarbons)ను అసంతృప్త హైడ్రోకార్బన్స్ (Unsaturated Hydrocarbons)గా ఎలా మార్చాలో నేర్చుకుందాం. |
00:58 | ఈథేన్(Ethane) నిర్మాణం కాపీ చేసి మరియు డిస్ప్లే ఏరియా (Display area)పై రెండుసార్లు పేస్టు చేద్దాం. |
01:05 | సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ (Select one or more objects) టూల్ పై క్లిక్ చేయండి. |
01:08 | ఈథేన్(Ethane) నిర్మాణం ఎంచుకోవడానికి దాని పై క్లిక్ చేయండి. |
01:11 | నిర్మాణం కాపీ చేయడానికి Ctrl + C ప్రెస్ చేయండి. |
01:14 | నిర్మాణాలు పేస్ట్ చేయడానికి Ctrl + V ప్రెస్ చేయండి. |
01:19 | రెండు నిర్మాణాలు ఒకదాని పై మరొకటి అతిపాతం (overlap) చెందటం గమనించండి. |
01:23 | రెండవ అతిపాతం చెందే నిర్మాణం పక్కకి కదుపుదాం.(జరుపుదాం) |
01:27 | నిర్మాణం పై కర్సర్ ను ఉంచి మౌస్ తో లాగండి. |
01:33 | నిర్మాణాల లో కార్బన్ పరమాణువుల మధ్య ఏక బంధం ను గమనించండి. |
01:40 | మొదట గా ఏక బంధంను ద్విబంధంగా మారుద్దాం. |
01:44 | యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది ముల్టిప్లిసిటి అఫ్ ఏన్ ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of an existing one) టూల్ పై క్లిక్ చేద్దాం. |
01:51 | రెండవ ఈథేన్(Ethane) నిర్మాణంలో ఇదివరకే వున్న బంధం పై క్లిక్ చేయండి. |
01:55 | ఏక బంధం ఒక ద్విబంధంగా మారటం (మార్చబడడం) గమనించండి. |
02:00 | హైడ్రోజన్(Hydrogen) పరమాణువుల సంఖ్య 6 నుండి 4 వరకు తగ్గుతుంది. |
02:06 | కొత్త నిర్మాణం ఇథీన్(Ethene). |
02:09 | తదుపరి ఏక బంధంను త్రిబంధం కు మారుద్దాం. |
02:14 | మూడో ఈథేన్(Ethane) నిర్మాణం లో ఇదివరకే వున్నబాండ్ పై రెండుసార్లు క్లిక్ చేయండి. |
02:20 | ఏక బంధం త్రిబంధం కు మారటం(మార్చబడడం) గమనించండి. |
02:25 | హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య 6 నుండి 2 తగ్గుతుంది. |
02:30 | కొత్త నిర్మాణం ఈథైన్ (Ethyne). |
02:34 | నిర్మాణాల కు పేర్లు వ్రాద్దాము. |
02:37 | యాడ్ ఆర్ మాడిఫై ఎ టెక్స్ట్(Add or modify a text)టూల్ పై క్లిక్ చేయండి. |
02:41 | నిర్మాణాల దిగువ క్లిక్ చేయండి. |
02:43 | ఈథేన్(Ethane), ఇథీన్(Ethene) మరియు ఈథైన్ (Ethyne )గా నిర్మాణాలకు పేర్లు నమోదు చేయండి. |
02:53 | తదుపరి, టెట్రాహెడ్రల్ జామెట్రీ (Tetrahedral geometry)గురించి నేర్చుకుందాం. |
02:57 | నిర్మాణాలు ఒక వైపుకు జరుపుదాం. |
03:00 | అన్ని ఆబ్జక్ట్స్ (నిర్మాణాల) ను ఎంచుకోడానికి Ctrl + A ప్రెస్ చేయండి. |
03:03 | సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ (Select one or more objects)టూల్ పై క్లిక్ చేసి నిర్మాణాలు లాగండి. |
03:10 | ఇక్కడ టెట్రాహెడ్రల్ మీథేన్ (Tetrahedral Methane) నిర్మాణం కోసం ఒక స్లయిడ్ ఉంది. |
03:14 | అన్ని బంధాల పొడవులు 1.09 ఆంస్ట్రాంగ్ (Angstrom)కు సమానంగా ఉంటాయి. |
03:19 | టెట్రాహెడ్రల్ మీథేన్ (Tetrahedral methane)నిర్మాణంలో అన్ని బంధాల కోణా లు 109.5 డిగ్రీకు సమానoగా ఉన్నాయి. |
03:31 | టెట్రాహెడ్రల్ ఈథేన్ (Tetrahedral Ethane)నిర్మాణం గీద్దాం. |
03:35 | యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది ముల్టిప్లిసిటి అఫ్ ఏన్ ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of existing one)టూల్ పై క్లిక్ చేద్దాం. |
03:41 | డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి. |
03:43 | సమాంతర దిశలో బాండ్ ఓరియంట్ చేయండి. |
03:47 | బంధం ప్రతి అంచున మూడు బాండ్లు గీయండి. |
03:51 | టెట్రాహెడ్రల్ జామెట్రీ (Tetrahedral geometry) ఏర్పాటు చేయడానికి బంధాలు ఓరియంట్ చేయండి. |
03:55 | ప్రతీ అంచు పైన క్లిక్ చేయండి. తర్వాత వివిధ దిశల్లో మూడు బంధాలను ఓరియంట్ చేయండి. |
04:02 | అదేవిధంగా ఇతర అంచుల పై గీద్దాం. |
04:07 | చివర్ల లో హైడ్రోజన్ పరమాణువులు జొడిద్దాం. |
04:10 | చివర్ల లో హైడ్రోజన్ పరమాణువులను జోడించేందుకు, హెచ్(H) నొక్కండి. |
04:16 | వచ్చిన సబ్ -మెనూ నుండి Hను ఎంచుకుంటాను. |
04:21 | హైడ్రోజన్ అణువు టూల్ బాక్స్ లో కనిపించడం గమనించండి. |
04:26 | యాడ్ ఆర్ మాడిఫై ఏన్ ఆటం(Add or modify an atom) టూల్ పై క్లిక్ చేయండి. |
04:29 | హైడ్రోజన్ పరమాణువులు జోడించడానికి అన్ని స్థానాల పై క్లిక్ చేయండి. |
04:37 | ఈథేన్(Ethane) నిర్మాణంకు, స్టీరియో కెమికల్ (Stereochemical) బంధాలు జోడిద్దాం. |
04:42 | టూల్ బాక్స్ లో అందుబాటులో ఉన్న, స్టీరియో కెమికల్ (Stereochemical) బంధములు, |
04:46 | యాడ్ ఎ వేడ్జ్ బాండ్ (Add a wedge bond), |
04:48 | యాడ్ ఎ హాష్ బాండ్ (Add a hash bond), |
04:50 | యాడ్ ఎ స్క్విగ్గ్ల్ బాండ్ (Add a squiggle bond), |
04:53 | మరియు యాడ్ ఎ ఫోర్ బాండ్ (Add a fore bond). |
04:55 | ఈథేన్(Ethane)ను స్టిరియోకెమికల్(Stereochemical) నిర్మాణం కు మార్చేందుకు యాడ్ ఎ వేడ్జ్ బాండ్(Add a wedge bond) ను వాడుదాం. |
05:03 | యాడ్ ఎ వేడ్జ్ బాండ్(Add a wedge bond) పై క్లిక్ చేయండి. |
05:05 | తర్వాత అన్ని బంధాల పై క్లిక్ చేయండి. |
05:10 | మార్పులుగమనించండి. |
05:13 | యాడ్ ఎ హాష్ బాండ్ (Add a hash bond) పై క్లిక్ చేయండి. |
05:15 | ఆపై డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి. |
05:19 | ఇన్వేర్ట్ వేడ్జ్ హషేస్ (Invert wedge hashes)గురించి వివరిస్తాను. |
05:25 | ఎడిట్ మెను వద్దకు వెళ్ళి ప్రేఫరేన్సస్(Preferences) కు నావిగేట్ చేసి, దానిపై క్లిక్ చేయండి. |
05:31 | GChemPaint Preferences(జికెంపెయింట్ ప్రేఫరేన్సస్) విండో తెరుచుకుంటుంది. |
05:34 | ఇన్వేర్ట్ వెడ్జ్ హషేస్(Invert wedge hashes) చెక్ బాక్స్ క్లిక్ చేయండి. |
05:38 | ఒకవేళ సెట్ చేస్తే, వెడ్జ్ హషేస్ (wedge hashes)బంధాలు సాధారణ కన్వెన్షన్ ను అనుసరిస్తాయి. |
05:43 | బంధం సన్నని చివరన మొదలై విస్తృత చివరన అంతం అవుతుంది. |
05:50 | ఇది బాండ్ ను సరిగ్గా చూపడంలో(దృశ్యమానం చేయడం) సహాయపడుతుంది. |
05:55 | జికెంపెయింట్(GChemPaint) లో డిఫాల్ట్ కన్వెన్షన్ ఇన్వెర్స్. ఎందుకంటే ఇది దృష్టికోణ నియమాలతో మరింత స్థిరంగా వుంటుంది. |
06:05 | హాష్ బంధంలో మార్పులను గమనించండి. |
06:09 | క్లోజ్ (Close) బటన్ పై క్లిక్ చేసి విండోను మూసివేద్దాము. |
06:13 | ఈథేన్(Ethane)నిర్మాణంలో ని బాండ్ల ను ఆడ్ ఎ హాష్ బాండ్ (Add a hash bond) కు మారుద్దాం. |
06:18 | యాడ్ ఎ హాష్ బాండ్ (Add a hash bond) క్లిక్ చేయండి. |
06:21 | అన్ని బాండ్లపై క్లిక్ చేయండి. |
06:27 | ఇప్పుడు ఫైలు సేవ్ చేద్దాం. |
06:30 | టూల్బార్ నుండి సేవ్ ది కరెంట్ ఫైల్ (Save the current file) చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
06:34 | సేవ్ యాస్ (Save as) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
06:37 | ఫార్మేషన్ అఫ్ బాండ్(Formation of bond) గా ఫైల్ కు పేరు ఇవ్వండి. |
06:41 | సేవ్ బటన్ క్లిక్ చేయండి. |
06:44 | సంగ్రహముగా, |
06:46 | ఈ ట్యుటోరియల్ లో నేర్చుకున్నవి, |
06:49 | ఇప్పటికే వున్న బంధంకు బంధాలు జోడించడం. |
06:52 | బాండ్ల ను ఓరియంట్ చేయడం. |
06:54 | స్టీరియోకెమికల్ బాండ్లు జోడించడం. |
06:56 | వెడ్జ్ హషస్ ను ఇన్వర్స్ చేయడం. |
07:00 | అసైన్మెంట్ గా, |
07:01 | ప్రొపేన్ ను ప్రోపైన్ కు మార్చండి. |
07:04 | ప్రొపేన్ మరియు బ్యూటేన్ నిర్మాణాలు గీయండి. |
07:07 | స్టీరియో కెమికల్ బాండ్స్ చూపించండి. |
07:11 | పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. |
07:16 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో చూడండి. |
07:19 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
07:23 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
07:33 | ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
07:36 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి . |
07:42 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
07:47 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
07:54 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
http://spoken-tutorial.org/NMEICT-Intro. |
08:00 | యానిమేషన్ చేసిన వారు ఉదయ చంద్రిక. |
08:02 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, ధన్యవాదాలు. |