KTurtle/C3/Special-Commands-in-KTurtle/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం, స్పెషల్ కమాండ్స్ ఇన్ కే టర్టల్ పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి,
లెర్న్ కమాండ్ మరియు రాండమ్ కమాండ్. |
00:15 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను,
ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04. కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా. |
00:28 | మీకు KTurtle గూర్చి ప్రాథమిక అవగాహన ఉందని మేము భావిస్తున్నాము. |
00:33 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్సైట్ సందర్శించండి. |
00:39 | కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం. |
00:42 | డాష్ హోమ్ పై క్లిక్ చేయండి. |
00:44 | సెర్చ్ బార్ లో కే టర్టల్ అని టైప్ చేసి, |
00:47 | కే టర్టల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
00:50 | ముందుగా లెర్న్ కమాండ్ గూర్చి తెలుసుకుందాం. |
00:53 | లెర్న్ ఇది ఒక ప్రత్యేక కమాండ్. ఇది మీకు సొంత కమాండ్స్ సృష్టించడానికి ఉపయోగపడుతుంది. |
01:01 | లెర్న్ కమాండ్ ఇన్పుట్ ను తీసుకొని, ఔట్పుట్ ను తిరిగి ఇస్తుంది. |
01:05 | ఒక కొత్త కమాండ్ ఎలా సృష్టించ బడిందో చూద్దాం. |
01:10 | నేను క్లియర్ వ్యూ పొందటానికి ప్రోగ్రామ్ టెక్స్ట్ లోకి జూమ్ చేస్తాను. |
01:14 | ఒక చతురస్రాన్ని గీయటానికి ఎడిటర్ లో ఒక కోడ్ ని టైప్ చేద్దాం. |
01:19 | రిపీట్ 4 వితిన్ కర్లీ కర్లీ బ్రాకెట్స్
{ ఫార్వర్డ్ 10 టర్న్ లెఫ్ట్ 90 } |
01:31 | ఇక్కడ, సంఖ్య 10 చతురస్రం యొక్క భుజము పొడవును ను సూచిస్తుంది. |
01:37 | ఇప్పుడు,లెర్న్ కమాండ్ ఉపయోగించి,ఒక చతురస్రాన్ని గీయటానికి కావలసిన (చేరియున్న) కమాండ్స్ ని నేర్చుకుందాం. |
01:45 | మనం చతురస్రం గీయటానికి కావాల్సిన కమాండ్స్ జతకు స్క్వేర్గా పేరు పెడదాం. |
01:50 | learn కమాండ్ లో, అది నేర్చుకోబోయే కమాండ్ యొక్క పేరు, learn తరువాత వస్తుంది. ఈ సందర్భం లో అది స్క్వేర్. |
01:59 | ఇప్పుడు కింది కోడ్ ను టైప్ చేద్దాం, |
02:02 | లెర్న స్పేస్ స్క్వేర్ స్పేస్ $x. |
02:10 | కర్లీ బ్రాకెట్స్ ను చేర్చుదాం. |
02:13 | 10 ను $x తో భర్తీ చేద్దాం. |
02:19 | మనం నిర్వచించిన కొత్త కమాండ్ స్క్వేర్ గా పిలవబడుతుంది. |
02:23 | చతురస్రం పరిమాణాన్ని సరి చేయటానికి,స్క్వేర్ ఒక ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ $x ను తీసుకుంటుంది. |
02:31 | మీరు ఈ కోడ్ ని రన్ చేసినపుడు స్క్వేర్ ఎలాంటి ఔట్పుట్ ఇవ్వదని గమనించండి. |
02:37 | లెర్న్ కమాండ్, కేవలం ఇతర కమాండ్ స్క్వేర్ని తర్వాత ఉపయోగించడానికి మాత్రమే నేర్చుకుంటుంది. |
02:43 | స్క్వేర్ కమాండ్ ఇప్పుడు కోడ్ లోని మిగితా అన్ని సాధారణ కమాండ్ లు లాగానే ఉపయోగించబడింది. |
02:51 | ఇక్కడ నేను మరి కొన్ని వరుసలను చేర్చుతున్నాను. |
02:54 | గో 200,200
స్క్వేర్ 100 అని టైప్ చేద్దాం. |
03:04 | స్క్వేర్ 100 కమాండ్ ఉపయోగించి, టర్టల్ 100 కొలతలతో ఒక చతురస్రాన్ని గీస్తుంది. |
03:11 | ఇప్పుడు ఈ కోడ్ ని రన్ చేద్దాం. |
03:13 | టర్టల్ కేన్వాస్ పైన ఒక చతురస్రాన్ని గీస్తుంది. |
03:17 | ఇప్పుడు 100 ని 50 చేత భర్తీ చేద్దాం. |
03:22 | మళ్ళీ రన్ చేద్దాం. |
03:23 | టర్టల్ 50 కొలతలతో ఇంకొక స్క్వేర్ ను గీస్తుంది. |
03:28 | ఈ కమాండ్, ఈ ప్రోగ్రామ్ పరిధిలో మాత్రమే ఉంపయోగించవచ్చు అన్నది దయచేసి గమనించండి. |
03:35 | నేను ప్రస్తుత కోడ్ ను ఎడిటర్ నుండి క్లియర్ చేస్తున్నాను. |
03:38 | కేన్వాస్ ను క్లీన్ చేయాటానికి క్లియర్ కమాండ్ టైప్ చేసి రన్ చేయండి. |
03:44 | తర్వాత, మనం random కమాండ్ గురించి నేర్చుకుందాం. |
03:48 | రాండమ్ కమాండ్ ఇన్పుట్ తీసుకుంటుంది మరియు ఔట్పుట్ ను తిరిగి ఇస్తుంది. |
03:52 | రాండమ్ కమాండ్ కోసం సింటాక్స్, random X,Y. |
03:57 | అక్కడ X మరియు Y రెండు ఇన్పుట్స్. |
04:01 | X కనిష్ట ఔట్పుట్ ను ఏర్పరుస్తుంది మరియు Y గరిష్ట ఔట్పుట్ ను ఏర్పరుస్తుంది. |
04:07 | ఔట్పుట్ అనేది X మరియు Yల మధ్య యాదృచ్చికంగా ఎంచుకోబడే సంఖ్య. |
04:13 | ఈ అప్లికేషన్ లో 'రాండమ్' కమాండ్ ను ఉపయోగిద్దాం. |
04:18 | నేను ఇప్పటికే టెక్స్ట్-ఎడిటర్ లో ఒక కోడ్ ని కలిగి ఉన్నాను. |
04:22 | ఇప్పుడు నేను కోడ్ కోసం వివరిస్తాను. |
04:24 | రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజీషన్ కు సరి చేస్తుంది. |
04:29 | ఇక్కడ,random 1,20 కమాండ్, 1 తో సమానము లేదా 1 కంటే పెద్దదైన మరియు 20 తో సమానము లేదా 20 కంటే చిన్నదైన ఒక సంఖ్యని ఎంచుకొని, దానిని వేరియబుల్ x కు కేటాయిస్తుంది. |
04:44 | రిపీట్ కమాండ్ మరియు కర్లీ బ్రాకెట్స్ లో ఉన్నకమాండ్స్ ఒక వృత్తాన్నిగీస్తాయి. |
04:51 | నేను కోడ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ కే టర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను. |
04:58 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కే టర్టల్ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
05:03 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. |
05:08 | మనము ఈ కోడ్ ను రన్ చేసినపుడు, |
05:10 | టర్టల్ 1 మరియు 20 మధ్యలో వ్యాసార్థం తో కేన్వాస్ పైన ఒక వృత్తాన్ని గీస్తుంది. |
05:16 | ఈ కోడ్ ని కొన్ని సార్లు అమలు చేద్దాం. |
05:20 | ప్రతీసారి వేరు వేరు వ్యాసార్ధాలతో వృత్తాలు ఉత్పత్తి కావటం మీరు చూడగలరు. |
05:26 | మీరు ఈ కోడ్ ను అమలు చేసిన ప్రతిసారి, వేరు వేరు వ్యాసార్ధలతో ఒక వృత్తం కేన్వాస్ పైన గీయబడుతుంది. |
05:33 | ఇప్పుడు మనం ఒక ఉదాహరణలో ఈ రెండు కమాండ్ లు లెర్న్ మరియు రాండమ్లను ఉపయోగిద్దాం. |
05:39 | నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను. కేన్వాస్ ను క్లియర్ చేయటానికి 'క్లియర్' కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను. |
05:48 | నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ని కలిగి ఉన్నాను. |
05:52 | ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను. |
05:55 | రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది. |
06:00 | canvassize 300,300 కాన్వాస్ వెడల్పు మరియు ఎత్తులు ఒకో దాన్ని 300 పిక్సల్స్ కు ఫిక్స్ చేస్తుంది. |
06:09 | $R, $Gమరియు $B అనేవి మూడు వేరియబుల్స్ నేను వాటికి కేటాయిస్తున్నవి 0 మరియు 255 మధ్యలో ఉన్న యాదృచ్చిక విలువలు. |
06:19 | ఈ కమాండ్ లో canvascolor $R, $Gమరియు$B, |
06:23 | ఎరుపు -పచ్చ -నీలంల కలయిక ముందు అమలు చేసిన స్టెప్ లో కేటాయించిన వేరియబుల్స్ R, G మరియు B విలువలతో భర్తీ అవుతుంది. |
06:34 | ఎప్పుడైతే కమాండ్ అమలు అవుతుందో అప్పుడు కేన్వాస్ కలర్ యాదృచ్చికంగా సెట్ అవుతుంది. |
06:41 | $రెడ్, $బ్లూ, $గ్రీన్ అనేవి మరొక వేరియబుల్స్ జత, |
06:45 | వాటికీ, 0 మరియు 255 మధ్యలో ఉన్న యాదృచ్చిక విలువలు యాదృచ్చికంగా కేటాయించబడినవి. |
06:53 | పెన్ కలర్ $రెడ్, $బ్లూ మరియు $గ్రీన్ ఎరుపు-నీలం-పచ్చ కలయిక విలువలన్నీ వేరియబుల్స్ తో భర్తీ అవుతాయి. |
07:02 | $రెడ్, $గ్రీన్ మరియు $బ్లూ లకు ముందు అమలు చేసిన స్టెప్ లో ఏ యాదృచ్చిక విలువలు కేటాయించబడ్డాయో, ఆ విలువలతో. |
07:10 | కమాండ్ అమలు కాగానే పెన్ కలర్ కూడా యాదృచ్చికంగా సెట్ చేయబడుతుంది. |
07:18 | పెన్ విడ్త్ 2 పెన్ యొక్క విడ్త్ ను 2 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది. |
07:25 | తర్వాత, ఒక సర్కిల్ ను గీయటం నేర్చుకోవటానికి నేను కోడ్ ను ఎంటర్ చేశాను. |
07:30 | ఇక్కడ $x సర్కిల్ యొక్క పరిమాణాన్ని సూచిస్తుంది. |
07:35 | repeat కమాండ్ మరియు దానిని అనుసరించే కర్లీ బ్రాకెట్స్ లోని కోడ్ ఒక వృత్తాని గీస్తుంది. |
07:43 | తర్వాత కమాండ్ ల జత, అనగా go కమాండ్ మరియు దానిని అనుసరించేసర్కిల్ కమాండ్, నిర్దేశించిన కొలతలతో వృత్తాలను గీస్తాయి. |
07:54 | ఉదాహరణకు: 5 కొలతతో ఉన్న వృత్తం, 5 కొలతతో |
08:01 | గో కమాండ్ లో, నిర్దేశించిన సమన్వయంవద్ద X మరియు Y స్థానాలతో ఒక వృత్తాన్ని గీస్తుంది. |
08:09 | ప్రతీ ఒక వృత్తానికి, నేను కేన్వాస్ పైన వేరు వేరు స్థానాలను పేర్కొన్నాను. |
08:16 | నేను కోడ్ ను టెక్స్ట్-ఎడిటర్ నుండి కాపీ చేసి కేటర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
08:23 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కేటర్టల్ ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
08:29 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. |
08:33 | నేను ఈ కోడ్ ను ఫుల్ స్పీడ్ లో అమలు చేస్తున్నాను. |
08:37 | మీరు ఈ కోడ్ ను రన్ ఎంపిక లో పేర్కొన్న ఏదయినా వేగం వద్ద అమలు చేయవచ్చు. |
08:43 | నేను ఈ కోడ్ ను కొన్ని సార్లు రన్ చేస్తాను. |
08:46 | యాదృచికంగా సరి చేయబడిన పెన్ కలర్ మరియు కేన్వాస్ కలర్ యొక్క విలువలలో తేడాను మీరు చూడవచ్చు. |
08:54 | ప్రతీ ఒక అమలు పైపెన్ మరియు కేన్వాస్ కలర్ లో వచ్చే మార్పును గమనించండి. |
09:01 | మీరు ఈ కోడ్ ను మీరు కోరుకున్నట్టు ఎన్ని సార్లయినా అమలు చేయండి మరియు యాదృచ్చికంగా సెట్ చేయబడిన పెన్ మరియు కేన్వాస్ విలువలలో వచ్చే మార్పులను గమనించండి. |
09:15 | దీనితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
09:20 | సారాంశం చూద్దాం. |
09:22 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చున్నవి,
'లెర్న్' కమాండ్ మరియు 'రాండమ్' కమాండ్. |
09:30 | మీకోసం పరిష్కరించటానికి ఒక అసైన్మెంట్ గా, |
09:32 | లెర్న్ కమాండ్ ఉపయోగించి- ఒక
పంచభుజి చతురస్రం దీర్ఘ చతురస్రం షడ్భుజి మీ కేన్వాస్ పైన ఉన్న అన్ని మూలల్లో గీయండి మరియు |
09:45 | కేన్వాస్ మధ్యలో ఒక వృత్తాన్నిగీయండి. |
09:49 | 'random' కమాండ్ ఉపయోగించి, వివిధ రంగులను సృష్టించండి మరియు |
09:55 | మీ రేఖాగణిత ఆకారాలు మరియు కేన్వాస్ లను అనుకూలీకరించండి. |
10:00 | ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి, |
10:04 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
10:08 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
10:13 | స్పోకెన్ ట్యుటోరియల్ టీం, |
10:15 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
10:19 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
10:22 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి, contact@spoken-tutorial.org |
10:29 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
10:33 | దీనికి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
10:40 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది, |
10:46 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి. |
10:50 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |