Talk:KTurtle/C3/Special-Commands-in-KTurtle/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 అందరికి నమస్కారం, స్పెషల్ కమాండ్స్ ఇన్ కే టర్టల్ పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి:

“లెర్న్” కమాండ్ మరియు “రాండమ్” కమాండ్.

00:15 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
ఉబుంటు లైనక్స్ ఓఎస్  వర్షన్ 12.04.
కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా .
00:28 మీకు 'KTurtle' గూర్చి ప్రాథమిక అవగాహన ఉందని మేము భావిస్తున్నాము.
00:33 ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్సైట్ సందర్శించండి.

http://spoken-tutorial.org

00:39 కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
00:42 డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
00:44 సెర్చ్ బార్ లో కే టర్టల్ అని టైప్ చేసి,
00:47 కే టర్టల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
00:50 ముందుగా లెర్న్ కమాండ్ గూర్చి తెలుసుకుందాం
00:53 లెర్న్ ఇది ఒక ప్రత్యేక కమాండ్. ఇది మీకు సొంత కమాండ్స్ సృష్టించడానికి ఉపయోగపడుతుంది.
01:01 లెర్న్ కమాండ్ ఇన్పుట్ ను తీసుకొని, ఔట్పుట్ ను తిరిగి ఇస్తుంది.
01:05 ఒక కొత్త కమాండ్ ఎలా సృష్టించ బడిందో చూద్దాం.
01:10 నేను క్లియర్ వ్యూ పొందటానికి ప్రోగ్రామ్ టెక్స్ట్ లోకి జూమ్ చేస్తాను.
01:14 ఒక చతురస్రాన్ని గీయటానికి ఎడిటర్ లో ఒక కోడ్ ని టైప్ చేద్దాం.
01:19 రిపీట్ 4 వితిన్ కర్లీ కర్లీ బ్రాకెట్స్

{ ఫార్వర్డ్ 10 టర్న్ లెఫ్ట్ 90 }

01:31 ఇక్కడ, సంఖ్య 10 చతురస్రం యొక్క భుజము పొడవును ను సూచిస్తుంది.
01:37 ఇప్పుడు,లెర్న్ కమాండ్ ఉపయోగించి,ఒక చతురస్రాన్ని గీయటానికి కావలసిన (చేరియున్న) కమాండ్స్ ని నేర్చుకుందాం.
01:45 మనం చతురస్రం గీయటానికి కావాల్సిన కమాండ్స్ జత కు స్క్వేర్గా పేరు పెడదాం.
01:50 learn కమాండ్ లో, అది నేర్చుకోబోయే కమాండ్ యొక్క పేరు, 'learn' తరువాత వస్తుంది. ఈ సందర్భం లో అది"స్క్వేర్
01:59 ఇప్పుడు కింది కోడ్ ను టైప్ చేద్దాం:
02:02 లెర్న స్పేస్ స్క్వేర్ స్పేస్$x.
02:10 కర్లీ బ్రాకెట్స్ ను చేర్చుదాం.
02:13 10 ను $x తో భర్తీ చేద్దాం.
02:19 మనం నిర్వచించిన కొత్త కమాండ్ స్క్వేర్ గా పిలవబడుతుంది.
02:23 చతురస్రం పరిమాణాన్ని సరి చేయటానికి,స్క్వేర్ ఒక ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ $x ను తీసుకుంటుంది.
02:31 మీరు ఈ కోడ్ నిరన్ చేసినపుడు స్క్వేర్ ఎలాంటి ఔట్పుట్ ఇవ్వదని గమనించండి.
02:37 లెర్న్ కమాండ్, కేవలం ఇతర కమాండ్ స్క్వేర్ని తర్వాత ఉపయోగించడానికి మాత్రమే నేర్చుకుంటుంది
02:43 స్క్వేర్ కమాండ్ ఇప్పుడు కోడ్ లోని మిగితా అన్ని సాధారణ కమాండ్ లు లాగానే ఉపయోగించబడింది.
02:51 ఇక్కడ నేను మరి కొన్ని వరుసలను చేర్చుతున్నాను.
02:54 గో 200,200

స్క్వేర్ 100 అని టైప్ చేద్దాం

03:04 స్క్వేర్ 100 కమాండ్ ఉపయోగించి, టర్టల్ 100 కొలతలతో ఒక చతురస్రాన్ని గీస్తుంది.
03:11 ఇప్పుడు ఈ కోడ్ ని రన్ చేద్దాం.
03:13 టర్టల్ కేన్వాస్ పైన ఒక చతురస్రాన్ని గీస్తుంది.
03:17 ఇప్పుడు 100 ని 50 చేత భర్తీ చేద్దాం.
03:22 మళ్ళీ రన్ చేద్దాం.
03:23 టర్టల్ 50 కొలతలతో ఇంకొక స్క్వేర్ ను గీస్తుంది.
03:28 కమాండ్ , ఈ ప్రోగ్రామ్ పరిధిలో మాత్రమే ఉంపయోగించవచ్చు అన్నది దయచేసి గమనించండి.
03:35 నేను ప్రస్తుత కోడ్ ను ఎడిటర్ నుండి క్లియర్ చేస్తున్నాను.
03:38 కేన్వాస్ ను క్లీన్ చేయాటానికి క్లియర్ కమాండ్ టైప్ చేసిరన్ చేయండి.
03:44 తర్వాత, మనం “random” కమాండ్ గురించి నేర్చుకుందాం.
03:48 రాండమ్ కమాండ్ ఇన్పుట్ తీసుకుంటుంది మరియు ఔట్పుట్ ను తిరిగి ఇస్తుంది.
03:52 రాండమ్ కమాండ్ కోసం సింటాక్స్: “random X,Y”
03:57 అక్కడ X మరియు Y రెండు ఇన్పుట్స్.
04:01 X కనిష్ట ఔట్పుట్ ను ఏర్పరుస్తుంది మరియు Y గరిష్ట ఔట్పుట్ ను ఏర్పరుస్తుంది.
04:07 ఔట్పుట్ అనేది X మరియు Y ల మధ్య యాదృచ్చికంగా ఎంచుకోబడే సంఖ్య.
04:13 అప్లికేషన్ లో “రాండమ్” కమాండ్ ను ఉపయోగిద్దాం.
04:18 నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక కోడ్ ని కలిగి ఉన్నాను.
04:22 ఇప్పుడు నేను కోడ్ కోసం వివరిస్తాను.
04:24 “రిసెట్” కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజీషన్ కు సరి చేస్తుంది.
04:29 ఇక్కడ,random 1,20 కమాండ్, 1 తో సమానము లేదా 1 కంటే పెద్దదైన మరియు 20 తో సమానము లేదా 20 కంటే చిన్నదైన ఒక సంఖ్యని ఎంచుకొని, దానిని వేరియబుల్ 'x' కు కేటాయిస్తుంది.
04:44 రిపీట్ కమాండ్ మరియు కర్లీ బ్రాకెట్స్ లో ఉన్నకమాండ్స్ ఒక వృత్తాన్నిగీస్తాయి.
04:51 నేను కోడ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ కే టర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను.
04:58 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కే టర్టల్ఎడిటర్ లోకి టైప్ చేయండి.
05:03 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
05:08 మనము ఈ కోడ్ ను రన్ చేసినపుడు,
05:10 టర్టల్ 1 మరియు 20 మధ్యలో వ్యాసార్థం తో కేన్వాస్ పైన ఒక వృత్తాన్ని గీస్తుంది.
05:16 ఈ కోడ్ ని కొన్ని సార్లు అమలు చేద్దాం.
05:20 ప్రతీసారి వేరు వేరు వ్యాసార్ధాలతో వృత్తాలు ఉత్పత్తి కావటం మీరు చూడగలరు.
05:26 మీరు ఈ కోడ్ ను అమలు చేసిన ప్రతిసారి, వేరు వేరు వ్యాసార్ధలతో ఒక వృత్తం కేన్వాస్ పైన గీయబడుతుంది.
05:33 ఇప్పుడు మనం ఒక ఉదాహరణలో ఈ రెండు కమాండ్ లు లెర్న్ మరియు రాండమ్లను ఉపయోగిద్దాం.
05:39 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను. కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
05:48 నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ని కలిగి ఉన్నాను.
05:52 ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
05:55 “రిసెట్” కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.
06:00 'canvassize 300,300 కాన్వాస్ వెడల్పు మరియు ఎత్తులు ఒకో దాన్ని 300 పిక్సల్స్ కు ఫిక్స్ చేస్తుంది.
06:09 $R, $Gమరియు $B అనేవి మూడు వేరియబుల్స్ నేను వాటికి కేటాయిస్తున్నవి 0మరియు255మధ్యలో ఉన్న యాదృచ్చిక విలువలు.
06:19 ఈ కమాండ్ లో canvascolor $R, $Gమరియు$B,
06:23 ఎరుపు -పచ్చ -నీలం ల కలయిక ముందు అమలు చేసిన స్టెప్ లో కేటాయించిన వేరియబుల్స్ 'R', 'G' మరియు 'B' విలువలతో భర్తీ అవుతుంది.
06:34 ఎప్పుడైతే కమాండ్ అమలు అవుతుందో అప్పుడు కేన్వాస్ కలర్ యాదృచ్చికంగా సెట్ అవుతుంది.
06:41 $రెడ్, $బ్లూ, $గ్రీన్ అనేవి మరొక వేరియబుల్స్ జత,
06:45 వాటికీ, 0 మరియు 255 మధ్యలో ఉన్న యాదృచ్చిక విలువలు యాదృచ్చికంగా కేటాయించబడినవి
06:53 పెన్ కలర్ $రెడ్, $బ్లూ మరియు $గ్రీన్ ఎరుపు-నీలం-పచ్చ కలయిక విలువలన్నీవేరియబుల్స్ తో భర్తీ అవుతాయి.
07:02 $రెడ్, $గ్రీన్ మరియు $బ్లూ లకు ముందు అమలు చేసిన స్టెప్ లో ఏ యాదృచ్చిక విలువలు కేటాయించబడ్డాయో అవి (ఆ విలువలతో).
07:10 కమాండ్ అమలు కాగానే పెన్ కలర్ కూడా యాదృచ్చికంగా సెట్ చేయబడుతుంది.
07:18 పెన్ విడ్త్ 2 పెన్ యొక్క విడ్త్ ను 2 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది.
07:25 తర్వాత, ఒక సర్కిల్ ను గీయటం నేర్చుకోవటానికి నేను కోడ్ ను ఎంటర్ చేశాను.
07:30 ఇక్కడ $xసర్కిల్ యొక్క పరిమాణాన్ని సూచిస్తుంది.
07:35 'repeat' కమాండ్ మరియు దానిని అనుసరించే కర్లీ బ్రాకెట్స్ లోని కోడ్ ఒక వృత్తాని గీస్తుంది.
07:43 తర్వాత కమాండ్ ల జత, అనగా 'go' కమాండ్ మరియు దానిని అనుసరించేసర్కిల్ కమాండ్, నిర్దేశించిన కొలతలతో వృత్తాలను గీస్తాయి
07:54 ఉదాహరణకు: 5 కొలతతో ఉన్న వృత్తం, 5 కొలతతో
08:01 గో కమాండ్ లో, నిర్దేశించిన సమన్వయంవద్ద 'X' మరియు 'Y' స్థానాలతో ఒక వృత్తాన్ని గీస్తుంది.
08:09 ప్రతీ ఒక వృత్తానికి, నేను కేన్వాస్ పైన వేరు వేరు స్థానాలను పేర్కొన్నాను.
08:16 నేను కోడ్ ను టెక్స్ట్-ఎడిటర్ నుండి కాపీ చేసి కే టర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
08:23 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కే టర్టల్ఎడిటర్ లోకి టైప్ చేయండి.
08:29 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
08:33 నేను ఈ కోడ్ ను ఫుల్ స్పీడ్ లో అమలు చేస్తున్నాను.
08:37 మీరు ఈ కోడ్ ను రన్ ఎంపిక లో పేర్కొన్న ఏదయినా వేగం వద్ద అమలు చేయవచ్చు.
08:43 నేను ఈ కోడ్ ను కొన్ని సార్లు రన్ చేస్తాను.
08:46 యాదృచికంగా సరి చేయబడిన పెన్ కలర్ మరియు కేన్వాస్ కలర్ యొక్క విలువలలో తేడాను మీరు చూడవచ్చు
08:54 ప్రతీ ఒక అమలు పైపెన్ మరియు కేన్వాస్ కలర్ లో వచ్చే మార్పును గమనించండి.
09:01 మీరు ఈ కోడ్ ను మీరు కోరుకున్నట్టు ఎన్ని సార్లయినా అమలు చేయండి మరియు యాదృచ్చికంగా సెట్ చేయబడిన పెన్ మరియు కేన్వాస్ విలువలలో వచ్చే మార్పులను గమనించండి.
09:15 దీనితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:20 సారాంశం చూద్దాం.
09:22 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చున్నవి:
“లెర్న్” కమాండ్ మరియు
“రాండమ్” కమాండ్.
09:30 మీకోసం పరిష్కరించటానికి ఒక అసైన్మెంట్ గా,
09:32 లెర్న్ కమాండ్ ఉపయోగించి- ఒక
పంచభుజి
చతురస్రం
దీర్ఘ చతురస్రం
షడ్భుజి
మీ కేన్వాస్ పైన ఉన్న అన్ని మూలల్లో గీయండి మరియు
09:45 కేన్వాస్ మధ్యలో ఒక వృత్తాన్నిగీయండి.
09:49 “random”కమాండ్ ఉపయోగించి, వివిధ రంగులను సృష్టించండి మరియు
09:55 మీ రేఖాగణిత ఆకారాలు మరియు కేన్వాస్ లను అనుకూలీకరించండి.
10:00 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:

http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial

10:04 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
10:08 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
10:13 స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
10:15 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
10:19 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
10:22 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:

contact@spoken-tutorial.org

10:29 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:33 దీనికి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది
10:40 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:

http://spoken-tutorial.org/NMEICT-Intro

10:46 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి
10:50 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya