LibreOffice-Suite-Calc/C3/Using-Charts-and-Graphs/Telugu
From Script | Spoken-Tutorial
Time | Naration |
0:00 | లిబ్రే ఆఫీస్ క్యాల్క్- Inserting charts in spreadsheets గురించి తెలియబరిచే స్పోకన్ ట్యూటోరియల్కు స్వాగతం. |
0:07 | ఈ ట్యూటోరియల్లో మనం నేర్చుకునేది, |
0:11 | చార్ట్ను సృస్టించుట ఎడిట్ మరియు ఫార్మ్యాట్ చేయుట |
0:14 | చార్ట్ను రీ-సైజ్ చేయుట మరియు కదుపుట. |
0:18 | ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.ను ఉపయోగిస్తున్నాము. |
0:27 | లిబ్రే ఆఫీసు క్యాల్క్ లోని వివిధ రకాల (viewing)వ్యూయింగ్ ఎంపికలతో మొదలుపెడదాం. |
0:32 | పాఠకులకు సమాచారం అందించుటకు చార్ట్ లు ఒక శక్తి వంతమైన పద్దతి. |
0:37 | లిబ్రే ఆఫీసు క్యాల్క్ మీ డాటాను ఫార్మ్యాట్ చేయుటకు వివిధ రకాల చార్ట్ ఫార్మాట్లను అందిస్తుంది. |
0:43 | క్యాల్క్ను వినియోగించి, మీరు చాలా వరకూ డేటాను అనుకూలీకరించవచ్చు. |
0:48 | personal finance tracker.ods sheetను తెరుద్దాం. |
0:53 | sheetలో వున్న ప్రతీ Itemకు సంబందించిన Spent మొత్తంను నింపుదాం. |
0:59 | E3తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం 6500ను టైపు చేద్దాం. |
1:06 | ఇలాగే column దిగువగా వెళ్తూE4,E5,E6 మరియు E7 లతో సూచించబడిన cellsలో 1000,625,310 మరియు 2700 అని టైపు చేద్దాం. |
1:26 | తర్వాత, sheetలో వున్న ప్రతీ Itemకు సంబందించిన Received మొత్తంను నింపుదాం. |
1:31 | F3తో సూచించబడిన cell పై క్లిక్ చేసి, మొత్తం 500 టైపు చేద్దాం. |
1:37 | ఇలాగే column దిగువగా వెళ్తూ F4,F5,F6 మరియు F7లతో సూచించబడిన cellsలో 200,75,10 మరియు 700 అని టైపు చేద్దాం. |
1:54 | ఇప్పుడు ఈ టేబుల్కు చార్ట్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం. |
1:58 | చార్ట్ను తయారు చేయడానికి, ముందుగా చార్ట్ లో చుపించాలనుకున్న డాటాను ఎంచుకోవాలి. |
2:04 | SN సెల్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ ను వదలకుండా, 700 వున్నసెల్ చివరి వరకు కర్సర్ను లాగండి. |
2:14 | మెనూ బార్లోని Insert ఎంపిక పై క్లిక్ చేసి చార్ట్ ఎంపిక పై క్లిక్ చేయాలి. |
2:21 | Default చార్ట్, వర్క్ షీట్లో ప్రవేశ పెట్టబడడం గమనించండి. |
2:27 | ఏకకాలమందు చార్ట్ Wizard డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
2:32 | default చార్ట్ ఎంచుకోబడడం Chart Wizardలో కనిపిస్తుంది. |
2:36 | చార్ట్ Wizard లోని మార్పులను బట్టి default చార్ట్ తాజా(update) అవుతుంది. |
2:42 | చార్ట్ Wizard డైలాగ్ బాక్స్ లో మూడు ముఖ్య భాగాలు వున్నవి, చార్ట్ ను సెట్ చేయడానికి సంబందించిన steps, choose a chart type, మరియు ప్రతీ చార్ట్ typeకు సంబందించిన ఎంపికలు. |
2:55 | 3D Look ఎంపిక ను తనిఖీ చేయడం ద్వారా, చార్ట్ థ్రీ డైమెన్షన్స్ లో కనిపిస్తుంది. |
3:03 | ఈ ఎంపికలను ప్రయత్నిద్దాము. |
3:05 | Choose a chart type ఫెల్డ్ లోని Bar ఎంపిక పై క్లిక్ చేద్దాం. |
3:11 | నమూనా చార్ట్ Bar ఫార్మాట్ పట్టికలో డేటా ప్రాతినిధ్యాన్ని చూపడం గమనించండి. |
3:19 | అదేవిధంగా మీరు Pie,Area,Bubble వంటి ఇతర ఎంపికల పై క్లిక్ చేయవచ్చు |
3:28 | మరియు Choose a chart type ఫీల్డ్ లోని అనేక ఎంపికల తో కావలసిన చార్ట్ రాకమును పొందవచ్చు. |
3:35 | Steps ఎంపికలలో Data Range అనే మరొక ఎంపిక వుంది. |
3:40 | ఈ ఎంపికను ఉపయోగించి, మీరు మ్యాన్యూవల్గా మీ చార్ట్ లోని డేటా పరిధిని సవరించవచ్చు. |
3:48 | డాటాను ప్లాట్ చేయుటకు డిఫాల్ట్ ఎంపిక, Data series in columns. |
3:54 | ఇందుకు బదులుగా Data series in rowsతో డాటాను ప్లాట్ చేసే విధానం మార్చవచ్చు. |
4:02 | చార్ట్ శైలి Column ను ఎంచుకుంటే ఇది ఉపయోగకరం గా వుంటుంది. |
4:10 | చివరగా, First row as labelను ఉపయోగించడానికి ఎంచుకోవచ్చు. |
4:24 | లేదా First column as labelను ఉపయోగించాలా. |
4:28 | లేదా రెండింటినీ చార్ట్ అక్షాలలో లేబుల్స్ల ఉపయోగించ వచ్చు. |
4:34 | తర్వాత, column లోని డాటా series పై మళ్లీ క్లిక్చేద్దాం. |
4:38 | ఇప్పుడు మన నమూనా చార్ట్ లో, Received హెడ్డింగ్ లోని డేటాను తిసివేయాలంటే, ముందుగా Data range ఫీల్డ్ లోపట క్లిక్ చేయాలి. |
4:49 | తర్వాత $A$1 is to $F$7 range ను $A$1 is to $D$7 range గా ఎడిట్ చేయాలి. |
5:03 | Received హెడ్డింగ్ లోని డేటా, చార్ట్ లో కనిపించకపోవడం గమనించండి, |
5:11 | తర్వాత Data Series ఏమి చేస్తుందో చూద్దాం. |
5:15 | మన స్ప్రెడ్ షీట్ లోని డాటా వున్న మొత్తం ఐదు రోస్ ఇక్కడ కనబడడం గమనించండి. |
5:21 | Add మరియు Remove బటన్స్ చార్ట్ నుండి డేటా వరుసలను జోడించడానికి లేదా తొలగించడానికి అనుమతిస్తాయి. |
5:29 | Up మరియు Down బటన్స్ తో డేటాను తిరిగి వరస క్రమంలో పెట్టవచ్చు. |
5:34 | చార్ట్ లో డాటా ను ఎలా చూపించాలో ఎంచుకున్న తర్వాత, డైలాగ్ బాక్స్లో Finish బటన్ పై క్లిక్ చేయాలి . |
5:43 | స్ప్రెడ్ షీట్లో చార్ట్ ప్రవేశపెట్టబడడం గమనించండి. |
5:47 | స్ప్రెడ్ షీట్లో చార్ట్ ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకున్న తర్వాత, |
5:51 | లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో చార్ట్ ను ఎలా ఫార్మ్యాట్ చేయాలో నేర్చుకుందాం. |
5:56 | Format మెను లో ఫార్మాటింగ్ కోసం అనేక ఎంపికలు ఉన్నాయి. |
6:00 | మరియు చార్ట్ యొక్క ప్రదర్శన నిశిత లేదా (fine-tuning) చేయడానికి చాలా ఎంపికలు వున్నవి. |
6:04 | స్ప్రెడ్ షీట్లో ప్రవేశ పెట్టిన చార్ట్ ను ఫార్మ్యాట్చేద్దాం. |
6:08 | చార్ట్ పై డబుల్ క్లిక్ చేయండి. అది ఒక బూడిద సరిహద్దుతో చుట్టుకోబడతుంది. |
6:13 | అది Edit మోడ్గా సూచిస్తుంది. |
6:18 | ముఖ్య మెనూలో Format ఎంపిక పై క్లిక్ చేయండి. |
6:22 | డ్రాప్ డౌన్ మేను లో Format Selection, Position and Size, Arrangement, Chart Wall, Chart Area మరియు మరిన్ని ఫార్‌మ్యాటింగ్ ఎంపికలు వుండడం గమనించండి. |
6:37 | చార్ట్ యొక్క స్థానమును మార్చడానికి, అమర్చుటకు, background మరియు చార్ట్ యొక్క titleను ఫార్మ్యాట్ చేయడానికి ఉపయోగిస్తారు. |
6:44 | తరచుగా వినియోగించే ఫార్‌మ్యాటింగ్ ఎంపికలును ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం. |
6:49 | Format Selection ఎంపికతో Chart Area హెడ్డింగ్తో ఒక dialog box తెరుచుకుంటుంది. |
6:56 | Borders, Area మరియు Transparency అనే మూడు ట్యాబ్స్ను గమనించండి. |
7:03 | డిఫాల్ట్ గా Borders ట్యాబ్ ఎంచుకోబడుతుంది. |
7:07 | చార్ట్ యొక్క సరిహద్దు, శైలి మరియు రంగును మారుద్దాం. |
7:11 | ఇందుకోసం Style ఫీల్డ్ పై క్లిక్ చేసి Continuous ఎంచుకుందాం. |
7:16 | తర్వాత అదే విధంగా Color ఫీల్డ్లో Green పై క్లిక్ చేద్దాం. |
7:21 | OK బటన్ పై క్లిక్ చేద్దాం. |
7:26 | చార్ట్ యొక్క సరిహద్దు, శైలి మరియు రంగు మారడం గమనించండి. |
7:31 | Title ఎంపిక చార్ట్ టైటిల్ను మరియు దాని అక్షాలను ఫార్మ్యాట్ చేస్తుంది. |
7:36 | Axis ఎంపిక చార్ట్ ను తయారు చేసే రేఖలను ఫార్మ్యాట్ చేస్తుంది. |
7:41 | అలాగే X మరియు Y అక్షాల పై కనిపించే టెక్స్ట్యొక్క ఫాంట్ ను ఫార్మ్యాట్ చేస్తుంది. |
7:46 | తరువాత వీటి గురించి తెలుసుకోవడానికి మీ స్వంత ఎంపికలు అన్నీ అన్వేషించండి. |
7:53 | చార్ట్ ఏరియా యొక్క బ్యాక్‌గ్రౌండ్ మార్చడానికి కూడా క్యాల్క్లో ఎంపిక వుంది. |
7:58 | చార్ట్ ఏరియా అనగా చార్ట్ graphic చుట్టూ వున్న, main title మరియు key లతో కలగలసిన ప్రదేశం. |
8:05 | చార్ట్ ఏరియాను ఫార్మ్యాట్ చేయడానికి Format ఎంపిక పై క్లిక్ చేసి Chart Wall ను ఎంచుకోండి. |
8:12 | Chart Wall హెడ్డింగ్ తో ఒక డిలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
8:17 | Style ఫెల్డ్ లో Continuous అని కనిపిస్తుంది ఎందుకంటే ఇదే మన చివరి ఎంపిక. |
8:22 | Color ఫెల్డ్ లో Red క్లిక్ చేయండి. |
8:26 | పరిమాణం 0.20cmకు మారుద్దాం. |
8:31 | OK బటన్ పై క్లిక్ చేద్దాం. |
8:35 | చార్ట్ ఏరియా యొక్క శైలి మరియు రంగు మారడం గమనించండి. |
8:41 | తర్వాత చార్ట్ లో ఎలెమెంట్స్ను ఎలా రిసైజ్ చేయాలో మరియు ఎలా కదపాలో చూద్దాం. |
8:46 | చార్ట్ ను రిసైజ్ చేయడానికి నమూనా చార్ట్ పై క్లిక్ చేయండి. |
8:51 | చార్ట్ చుట్టూ గ్రీన్ హ్యాండ్డిల్స్ రావడం చూడండి. |
8:54 | చార్ట్ యొక్క పరిమాణం పెంచడానికి లేదా తగ్గించడానికి, చార్ట్ యొక్క నాలుగు కొనల్లోని ఏదో ఒక మార్కర్ను పట్టుకొని లాగాలి. |
9:03 | చార్ట్ ను కదపడానికి, ముందుగా చార్ట్ పై క్లిక్ చేయాలి. |
9:07 | ఇప్పుడు చార్ట్ లో ఎక్కడైనా కర్సర్ను ఉంచండి. |
9:11 | కర్సర్ చేతిలా మారుతుంది. |
9:14 | చార్ట్ ను క్లిక్ చేసి కావాల్సిన ప్రదేశానికి కదిపి మౌస్ బటన్ ను వదిలి వేయండి. |
9:20 | మీరు చార్ట్ ను కదిపారు. |
9:24 | తర్వాత Position and Size డిలోగ్ బాక్స్ను ఉపయోగించి చార్ట్స్ ను ఎలా రిసైజ్ చేయాలో చూద్దాం. |
9:30 | మళ్లీ, చార్ట్పై క్లిక్ చేయండి. |
9:33 | చార్ట్ పై రైట్-క్లిక్ చేసి, కాంటెక్స్ట్ మేను లో Position and Sizeను ఎంచుకోండి. |
9:40 | Position and Size డిలోగ్ బాక్స్ వస్తుంది. |
9:44 | ఇక్కడ చార్ట్ యొక్క X మరియు Y స్థానములు మరియు చార్ట్ యొక్క width మరియు heightను సెట్ చేయడానికి వివిధ రంగములు వున్నవి. |
9:52 | మన చార్ట్ లో X కొవొర్డినేట్ ను 1.00కు మరియు Y కొవొర్డినేట్ను 0.83కు సెట్ చేద్దాం. |
10:02 | OK బటన్ పై క్లిక్ చేద్దాం. |
10:04 | చార్ట్ areaలో చార్ట్ సెట్ చేసిన విలువలను బట్టి చార్ట్ తనంతటే పొసిషన్ అవుతుంది. |
10:12 | ఇప్పుడు మనం స్పోకన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చామ్. |
10:16 | సంగ్రహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,
చార్ట్లను తయారు చేయుట Edit మరియు Format చేయుట. |
10:21 | చార్ట్స్ ను స్ప్రెడ్ షీట్లో పునఃపరిమాణం(Resize) చేయుట మరియు కదుపుట. |
10:27 | సంగ్రహ పరీక్ష. |
10:29 | practice.ods స్ప్రెడ్ షీట్ను తెరవండి. |
10:34 | డాటా కు Pie chartను ప్రవేశపెట్టండి. |
10:37 | చార్ట్ ను రీ-సీజ్ చేసి షీట్ యొక్క కింది కుడి కొనకు కదపండి. |
10:42 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:46 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది |
10:50 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
10:54 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం. |
10:56 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
11:00 | ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
11:04 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి. |
11:11 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
11:15 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
11:23 | ఈ మిషన్ గురించి, |
11:26 | http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
11:34 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |