Python/C3/Loops/Telugu
From Script | Spoken-Tutorial
| Time | Narration |
| 0:01 | హలో ఫ్రెండ్స్ పైథాన్‌లో 'లూప్స్' మీద ట్యుటోరియల్‌కు స్వాగతం. |
| 0:05 | ఈ ట్యుటోరియల్ చరమాంకానికి మీరు ఈ క్రిందివి చేయగలుగుతారు,
1. ఫర్ (for) లూప్ ఉపయోగించడం 2. వైల్ (while) లూప్ ఉపయోగించడం 3. లూప్స్‌తో ఆడుకోడానికి బ్రేక్ (break), కంటిన్యూ (continue) మరియు పాస్ (pass) స్టేట్మెంట్లను ఉపయోగించడం. |
| 0:17 | ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు, మీరు "గెటింగ్ స్టార్టెడ్ విత్ ఫర్" మరియు "కండిషనల్స్" మీద ట్యుటోరియల్ను పూర్తి చేయమని సూచిస్తున్నాము. |
| 0:24 | మనము ఐపైథాన్ ఇంటర్ప్రెటర్తో మొదలు పెడదాము. |
| 0:28 | టెర్మినల్‌లో ఐపైథాన్ అని టైప్ చేయండి |
| 0:32 | మనము మొదట వైల్ లూప్‌తో మొదలు పెడదాము. |
| 0:34 | కండిషన్ True అయినంత వరకు లూపును రిపీటెడ్ ఎగ్జెక్యూషన్ కొరకు వైల్ లూప్‌ను ఉపయోగిస్తారు. |
| 0:39 | మనము 10 కంటే తక్కువ ఉన్న బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ అన్నీ వైల్ లూపును ఉపయోగించి ప్రింట్ చేద్దాము. |
| 0:45 | టైప్ చేయండి i = 1
while i less than 10 colon
print i multiply by i
i += 2
|
| 1:19 | ఈ లూపు 10 కన్నా తక్కువ ఉన్న బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్‌ను ప్రింట్ చేస్తుంది. |
| 1:23 | వైల్ లూపు, పదే పదే కండిషన్ సరి అయినదా అని చెక్ చేసి లూపు లోపల బ్లాక్ ఆఫ్ కోడ్‌ను ఎగ్జెక్యూట్ చేస్తుంది, అది ఉంటే. |
| 1:30 | పైథాన్‌లో ఏ ఇతర బ్లాకు లాగా, వైల్ బ్లాకు లోపలి కోడ్ 4 స్పేసెస్ ద్వారా కుడివైపున ఇండెంట్ చేయబడి ఉంటుంది. |
| ఇక్కడ వీడియోకు విరామం కల్పించి, ఈ క్రింది అభ్యాసమును ప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి. | |
| 1:49 | 10 కన్న తక్కువ అయిన అన్ని సరిసంఖ్యల యొక్క స్క్వేర్స్ ప్రింట్ చేయడానికి వైల్ లూపును వ్రాయండి. |
| 1:55 | పరిష్కారం కొరకు టెర్మినల్ వైపు మరలండి. |
| 1:58 | టైప్ చేయండి i = 2
while i less than 10 colon
print i multiply by i
i += 2
|
| 2:27 | ఇప్పుడు మనము ఫర్ లూపును ఉపయోగించి 10 కన్నా తక్కువ ఉన్న అన్ని బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్‌ను ప్రింట్ చేసే అదే సమస్యను పరిష్కరిద్దాము. |
| 2:34 | మనకు తెలుసు, ఫర్ లూపు ఒక లిస్టు మీదుగా లేదా ఏ ఇతర సీక్వెన్షియల్ డాటా టైప్ మీదుగా ఐటరేట్ చేస్తుంది. |
| 2:40 | కనుక, 10 కన్నా తక్కువ ఉన్న బేసి సంఖ్యలను పొందడానికి మనము రేంజ్ ఫంక్షన్‌ను ఉపయోగిస్తాము, ఆ తర్వాత దాని మీద ఐటరేట్ చేసి కావలసిన పదార్ధాన్ని ప్రింట్ చేయండి. |
| 2:48 | టైప్ చేయండి రేంజ్లో n కొరకు బ్రాకెట్లో 1 కామా 10 కామా 2 కోలన్
print n multiply by n
|
| 3:07 | ఇదివరకు లాగానే ఇప్పుడు కూడా అదే ఔట్పుట్ లభించడం మనము చూడగలము. |
| 3:10 | కోడ్ యొక్క గీతలు తక్కువగా ఉండడం గమనించండి. |
| 3:13 | వీడియోకు కాసేపు విరామం కల్పించి, ఈ క్రింది అభ్యాసమును ప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి. |
| 3:19 | 10 కన్నా తక్కువ ఉన్న అన్ని సరి సంఖ్యల యొక్క స్క్వేర్స్ ప్రింట్ చేయుటకు ఫర్ లూప్ వ్రాయండి. |
| 3:24 | పరిష్కారం కొరకు టెర్మినల్ వైపు మరలండి. |
| 3:26 | రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్ లో 2 కామా 10 కామా 2 కోలన్
print n multiply by n
|
| 3:46 | మనమిప్పుడు కీవర్డ్స్, పాస్, బ్రేక్ మరియు కంటిన్యూ ఎలా ఉపయోగించాలో చూద్దాము. |
| 3:52 | మనకు ఇప్పటికే తెలుసు, పాస్ అనేది కేవలం ఒక సింటాక్టిక్ ఫిల్లర్. |
| 3:56 | దానిని తమ లోపల ఏ కోడ్ లేని బ్లాక్స్ పూర్తి చేయడానికి ఉపయోగిస్తారు. |
| 4:02 | రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్ లో 2 కామా 10 కామా 2 కోలన్
pass
|
| 4:20 | బ్రేక్ అనేది అత్యంత లోపల ఉండే లూప్నుండి బ్రేక్ ఔట్ అవ్వడం కోసం ఉపయోగిస్తారు. |
| 4:24 | 10 కన్నా తక్కువ ఉన్న అన్ని బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ ప్రింట్ చేయడానికి ఉపయోగించే వైల్ లూప్‌ను బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగిస్తూ ఈ క్రింది విధంగా మార్చవచ్చు |
| 4:31 | టైప్ = 1
while True colon print i multiply by i
i += 2
if i less than 10 colon
break
|
| 5:10 | కనుక if అనేది వైల్ లూప్‌లో లేనందున మనకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది
కనుక టైప్ చేయండి while True colon
print i multiply by i
i += 2
if i less than 10 colon
break if అనేది వైల్ లూప్‌లో ఉండేలా చూసుకోండి. |
| 5:42 | కంటిన్యూ అనేది ఈ ఐటరేషన్లో మిగిలిన లూప్ యొక్క ఎగ్జెక్యూషన్ను దాటవేయడానికి ఇంకా ఈ ఐటరేషన్ అంతం దాకా కొనసాగడానికీ ఉపయోగిస్తారు. |
| 5:50 | ఉదాహరణకు, 3కు బహుళ గుణిజములు కాని 10 కన్నా తక్కువ అయిన అన్ని బేసి సంఖ్యల యొక్క స్క్వేర్స్ మనము ప్రింట్ చేయాలనుకుంటున్నాము, మనము ఫర్ లూపును ఈ క్రింది విధంగా మారుస్తాము. |
| 6:03 | రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్లో 1 కామా 10 కామా 2 కోలన్
if n modulo 3 == 0 colon
continue
print n multiply by n
|
| 6:36 | ఇక్కడ వీడియోకు విరామం కల్పించి, ఈ క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియోను మరల పునఃప్రారంభించండి. |
| 6:41 | 4 కు బహుళ గుణిజములు అయి ఉండి 10 కన్నా తక్కువ అయిన సరిసంఖ్యల యొక్క స్క్వేర్స్ ప్రింట్ చేయుటకు (2 కామా 10 కామా 2) రేంజ్‌తో కంటిన్యూ కీవర్డ్‌ని ఉపయోగించి ఫర్ లూపును మార్చండి, |
| 6:53 | (రేంజ్ ఫంక్షన్ కాల్‌ను మార్చకండి) |
| 6:59 | పరిష్కారం కొరకు టెర్మినల్ వైపు మరలండి. |
| 7:02 | రేంజ్లో n కొరకు టైప్ చేయండి బ్రాకెట్స్లో 1 కామా 10 కామా 2 కోలన్
if n modulo 4 colon
continue
print n multiply by n
|
| 7:30 | ఇది ఈ ట్యుటోరియల్ యొక్క చరమాంకానికి మనను చేరుస్తుంది. |
| 7:33 | ఈ ట్యుటోరియల్‌లో మనము నేర్చుకున్నది, 1. "ఫర్" మరియు "వైల్" లూపులను ఉపయోగించి సీక్వెన్స్ మీద ఐటరేట్ చేయడం. |
| 7:38 | 2. "బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించి లూప్స్ నుండి బ్రేక్ ఔట్ అవ్వడం |
| 7:42 | 3. "కంటిన్యూ స్టేట్మెంట్ ఉపయోగించి ఐటరేషన్స్ దాటవేయడం |
| 7:45 | 4. లూపులో "పాస్ స్టేట్మెంట్ ఉపయోగించడం. |
| 7:49 | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని సెల్ఫ్ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి |
| 7:52 | 1. రేంజ్ (1 కామా 4) ఇచ్చిన సందర్భములో; నంబర్ 1 మాత్రమే ప్రింట్ చేసే కోడ్ వ్రాయండి. |
| 8:01 | 2. ఐటరేషన్స్ దాటవేయడానికి ఏ స్టేట్మెంట్ మీరు ఉపయోగిస్తారు. - బ్రేక్ - పాస్ - కంటిన్యూ |
| 8:10 | ఇక జవాబులు. |
| 8:12 | 1. ఫర్ లూపులో మనము బ్రేక్ స్టేట్మెంటును ఈ విధముగా ఉపయోగించగలము,
కోలన్ కోలన్ |
| 8:21 | రేంజ్లో i కోసం బ్రాకెట్స్లో 1 కామా 4 కోలన్ |
| 8:27 | ప్రింట్ i బ్రేక్ |
| 8:30 | ఐటరేషన్స్ దాటవేయడానికి, మనము కంటిన్యూ స్టేట్మెంట్ ఉపయోగిస్తాము. |
| 8:37 | మీరు ఈ ట్యుటోరియల్ ఆస్వాదించారని దీనిని ఉపయోగకరముగా ఉన్నదని భావించారని అనుకుంటున్నాము. |
| 8:41 | ధన్యవాదములు! |