LibreOffice-Suite-Math/C2/Markup-Language-for-writing-formula-Formula-Formatting/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration | |
00:00 | లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము. | |
00:04 | ఈ ట్యుటోరియల్ లో మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము: | |
00:08 | ఫార్ములా మరియు ఫార్ములా ఫార్మాటింగ్ లను వ్రాయడము కొరకు మార్క్ అప్ లాంగ్వేజ్ : Fonts, Alignment మరియు Spacing | |
00:18 | గత ట్యుటోరియల్ లో మేము Math కొరకు mark up language ను పరిచయము చేసాము. | |
00:24 | ఇప్పుడు Mark up language గురించి నేర్చుకుందాము. | |
00:28 | ఇప్పుడు ముందుగా ఒక Writer documentను ఓపెన్ చేయండి మరియు Writer లో Math application ను కాల్ చేయండి. | |
00:35 | Writerకనుక అప్పటికే open అయి ఉన్నట్లు అయితే అప్పుడు పైన ఉన్న Insert menuపైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత Object పైన క్లిక్ చేయండి మరియు Formula ను ఎంచుకోండి. | |
00:46 | Writerకనుక ఓపెన్ చేసి లేక పోతే, మనము దానిని Windows Start menu నుంచి ఇన్వోక్ చేయవచ్చు. | |
00:55 | ఒక formula ను వ్రాయడము కొరకు Elements window ను వాడడము అన్నిటికంటే తేలికైన పద్ధతి. | |
01:01 | కానీ Formula Editorలో డైరెక్ట్ గా mark up languageను వ్రాయడము అనేది ఒక formulaను వేగముగా వ్రాసే పద్ధతి | |
01:10 | ఎందుకు అంటే ఒక formula కొరకు markup languageను వ్రాయడము అనేది మనము ఇంగ్లీష్ లో formulaను చదవడముతో పోలి ఉంటుంది. | |
01:18 | ఉదాహరణకు, ‘4into3’ అని వ్రాయడము కొరకు Formula Editor window లో మనము కేవలము ‘4times3’ అని మాత్రమే వ్రాయవలసి ఉంటుంది. | |
01:28 | మనము ఆ తరువాతి ఉదాహరణకు వెళ్ళే ముందుగా ఇక్కడ ఒక ఖాళీ లైన్ ను ఇన్సర్ట్ చేద్దాము. | |
01:36 | కేవలము ఒక మార్క్ అప్ ‘newline’ అని టైప్ చేయండి మరియు క్రొత్త లైన్ Writer gray box area లో ఇన్సర్ట్ చేయబడడమును గమనించండి. | |
01:46 | ‘Some more example formulae: newline’ అని టైప్ చేద్దాము. | |
01:51 | తేలికగా చదవగలగడము కొరకు మనము ఒకసారి ఎంటర్ కీ ను ప్రెస్ చేద్దాము. | |
01:57 | మరియు ‘x greater than equal to y’ అని వ్రాయండి. | |
02:03 | ఇక్కడ మనము సూత్రమునకు నంబర్ కూడా ఇద్దాము. | |
02:07 | కనుక ‘1. xgreater than equal toynew line’ అని టైప్ చేసి, ఎంటర్ ప్రెస్ చేద్దాము. | |
02:18 | Notice the Writer grayboxరీఫ్రెష్ అయి అందులో కంటెంట్ సెంటర్ లో కనిపించడమును గమనించండి. | |
02:25 | ఇప్పుడు ‘ato the power of2’ అని వ్రాద్దాము. | |
02:30 | మరియు మార్క్ అప్ : ‘2. 'a' యారో పైన 10 వైపుకు పాయింట్ చేస్తూ ’ న్యూ లైన్ అని ఉంటుంది మరియు ఎంటర్ ను ప్రెస్ చేయండి. | |
02:42 | Writer గ్రే బాక్స్ లో గణిత సింబల్ ను గమనించండి. | |
02:48 | ఇప్పుడు ‘square root of 16 = 4’ అని వ్రాయండి. | |
02:55 | ‘3. sqrt ‘16’ విలువ 4 అని కర్లీ బ్రాకెట్ లలో వ్రాయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. | |
03:06 | Writer గ్రే బాక్స్ లో ఈ ఫార్ములా ను గమనించండి. | |
03:10 | సరే, ఇప్పుడు ‘a suffix n’ కొరకు ఒక సమేషన్ సింబల్ ను వ్రాయడము ద్వారా, a1 + a2 + a3 so on + ‘an’ ను సూచించండి. | |
03:28 | మరియు మార్క్ అప్ :, ‘4. sum a underscore n new line’ అవుతుంది, ఎంటర్ ప్రెస్ చేయండి. | |
03:37 | ఇప్పుడు ఒక ఫంక్షన్ టో ఒక ఇంటిగ్రల్ ను ప్రయత్నించండి. ఇంటిగ్రల్ f x d x ను వ్రాయడము కొరకు మార్క్ అప్,‘5. intfx dx newline’ అవుతుంది. | |
03:54 | మరియు Writer ఏరియా లో ఇంటిగ్రల్ సింబల్ ను గమనించండి.. | |
04:00 | ఇప్పుడు మనము చేసిన పనిని సేవ్ చేసుకుందాము. పైన ఉన్న ఫైల్ మెనూ కు వెళ్ళండి మరియు Save పైన క్లిక్ చేయండి. | |
04:09 | డాక్యుమెంట్ యొక్క పేరు MathExample1 గా పెట్టండి. | |
04:16 | ఇప్పుడు మనము వ్రాసిన ఫార్ములే ఎలా ఫార్మాట్ చేయాలో నేర్చుకుందాము. | |
04:21 | అవి అన్నీ సెంటర్ లో వచ్చాయి అని మరియు వాటి మధ్య ఎక్కువ ఖాళీ ప్రదేశము లేదు అన్న సంగతిని గమనించండి. | |
04:28 | మనము వివిధ ఫార్మాట్ మార్పులు చేయడము కొరకు Format మెనూ ను వాడవచ్చు. | |
04:35 | ఇప్పుడు అన్ని ఫార్ములే ను ఎడమ వైపుకు ఎలైన్ చేద్దాము. | |
04:40 | దీని కొరకు, మీరు ఫార్మాట్ మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఎలైన్మెంట్ ను ఎంచుకోండి. | |
04:46 | క్రొత్త విండో లో లెఫ్ట్ ఆప్షన్ ను ఎంచుకోండి మరియు ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. | |
04:54 | ఇప్పుడుఫార్ములేఅన్నీకూడాలెఫ్ట్ఎలైన్అయినసంగతినిగమనించండి | |
04:58 | మనము Format మెనూ లో ‘Fonts’ ను ఎంచుకోవడము ద్వారా ఫాంట్ స్టైల్ ను మార్చుకోవచ్చు | |
05:06 | ఇక్కడ వివిధ కాటగిరీలను గమనించండి: | |
05:10 | మనము చలరాశులకు ఒక రకమైన ఫాంట్, ఫంక్షన్లకు మరొక రకమైన ఫాంట్, సంఖ్యలకు మరియు టెక్స్ట్ కు మరొక ఫాంట్ కూడా సెట్ చేసుకోవచ్చు. | |
05:23 | ఫాంట్ స్టైల్ ను మాడిఫై చేయడము కొరకు, Modify బటన్ పై క్లిక్ చేయండి మరియు category Variables ను ఎంచుకోండి. | |
05:34 | list box లో Arial Black ను ఎంచుకుందాము మరియు ఓకే బటన్ పై క్లిక్ చేద్దాము. | |
05:43 | మరియు ఇక్కడ Ok బటన్ పై క్లిక్ చేయడము ద్వారా ఫాంట్ ను సేవ్ చేద్దాము. | |
05:50 | ఇప్పుడు Now notice the font changes in the Writer గ్రే బాక్స్ లో ఫాంట్ మార్పులను గమనిద్దాము | |
05:56 | ఫార్ములాల ఫాంట్ సైజ్ ను పెంచడము కొరకు, Format మెనూ కు వెళ్ళండి మరియు Font Size పైన క్లిక్ చేయండి | |
06:06 | ఇప్పుడు Base size ను ‘18 point’ కు పెంచండి మరియు OK పైన క్లిక్ చేయండి. | |
06:15 | మనము ఇతర కాటగిరీల సైజ్ లను అంటే టెక్స్ట్, ఇండెక్సెస్ లేదా ఆపరేటర్స్ లను మార్చవచ్చు. | |
06:25 | మనము చేసిన అన్ని ఫాంట్ చేంజ్ లను undo చేయడము కొరకు మనము Default button ను కూడా వాడవచ్చు. | |
06:32 | ఫార్ములా లలో ఫాంట్ సైజ్ మార్పులను గమనించండి. | |
06:37 | ఆ తరువాత ఫార్ములాల స్పేసింగ్ లో మార్పులు చేద్దాము. | |
06:42 | ఫార్మాట్ మెనూ పైన క్లిక్ చేయండి మరియు Spacing ను ఎంచుకోండి. | |
06:47 | ఇప్పుడు spacing, line spacing మరియు root spacing లు ప్రతి ఒక్కదానిని 20 శాతము మార్పు చేయండి. | |
06:56 | మనము ప్రతి ఒక్క స్పేసింగ్ టైప్ పై క్లిక్ చేస్తూ ఉంటే, సెంటర్ లో ఉన్న ఇమేజ్ ఆ స్పేసింగ్ టైప్ యొక్క స్థానమును చూపిస్తూ ఉంటుంది. | |
07:05 | మరలా దీనిని చేయడము కొరకు మనము వివిధ స్పేసింగ్ టైప్ లను ఎంచుకోవచ్చు. అలా చేయడము కొరకు, ఇప్పుడు Category button పైన క్లిక్ చేయండి. | |
07:16 | లేదా మీ మార్పులను undo చేయడము కొరకు Default బటన్ ను వాడండి. | |
07:22 | ఇప్పుడు Ok బటన్ ను క్లిక్ చేద్దాము. | |
07:25 | మరియు Writer గ్రే బాక్స్ లో వస్తున్న మార్పులను గమనించండి. | |
07:30 | Elements window లో మరింత ఫార్మాటింగ్ అందుబాటులో ఉన్నది. | |
07:36 | ఇప్పుడు View menu నుంచి Elements window ను తీసుకుందాము. | |
07:40 | ఇక్కడ, రెండవ కాటగిరీ ల రో లో చివరి ఐకాన్ పైన క్లిక్ చేద్దాము. | |
07:47 | ఇక్కడ tooltip ‘Formats’ అని చెపుతుంది. | |
07:51 | ఇక్కడ, మనము subscripts మరియు superscripts, alignments, matrix, new lines మరియు gaps ల ఎలైన్మేంట్ ను ఎంచుకోవచ్చు. | |
08:03 | ఇప్పుడు ఐదవ ఉదాహరణలో ఒక లాంగ్ గాప్ ను సంఖ్య 5 తరువాత పరిచయము చేద్దాము. ‘5.’ తరువాత క్లిక్ చేద్దాము. | |
08:13 | అప్పుడు Elements window నుంచి Formats> Long Gap పైన క్లిక్ చేయండి. | |
08:20 | లాంగ్ గాప్ కు మార్క్ అప్ లాంగ్వేజ్ గా ‘tilde’ కారెక్టర్ ఉన్నది. మరియు ఒక షార్ట్ గాప్ కు అది ‘Tiray’ కారెక్టర్. | |
08:29 | 5 సంఖ్య తరువాత క్రొత్త గాప్ ను గమనించండి. | |
08:33 | కనుక ఇలా మనము మన ఫార్ములాలను ఫార్మాట్ చేసుకోవచ్చు. | |
08:38 | Math అందించే అన్ని ఫార్మాటింగ్ ఆప్షన్ లను మొహమాటమూ లేకుండా ఎక్స్ప్లోర్ చేసి చూడండి. | |
08:44 | ఓకే, మీరు ఈ ఎసైన్మెంట్ చేయవలసి ఉంటుంది: | |
08:47 | Writer window లో మార్క్ అప్ ను వాడి ఈ క్రింది ఫార్ములాలను వ్రాయండి. | |
08:53 | అవసరము అనుకుంటే Elements window ను వాడండి. | |
08:57 | సమేషన్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ 2 | |
09:02 | Sin to the power of x plus cos to the power of x = 1 (Elements window లోని Functions category ని వాడండి ) | |
09:15 | గత స్లైడ్ నుంచి అనుసరించింది, సమేషన్ 1 to n of x ను వ్రాయండి. | |
09:23 | (సమేషన్ కు అవధులను సెట్ చేయడము కొరకు Operators category ను వాడండి) | |
09:29 | ఫాంట్ ను Arial కు మరియు size ను 18 point కు మార్చండి | |
09:35 | మరియు సింబల్ ల మధ్య మరింత స్పేస్ ను అందించండి. | |
09:40 | దీనితో మనము మార్క్ అప్ లాంగ్వేజ్ మరియు ఫార్ములా ఫార్మాటింగ్ ఇన్ లిబ్రేఆఫీస్ మాథ్ అనే ట్యుటోరియల్ చివరి భాగమునకు వచ్చాము. | |
09:49 | సంగ్రహముగా తెలపాలి అంటే మనము ఈ క్రింది అంశములను నేర్చుకున్నాము : | |
09:52 | ఫార్ములా మరియు ఫార్ములా ఫార్మాటింగ్ లను వ్రాయడము కొరకు మార్క్ అప్ లాంగ్వేజ్ : Fonts, Alignment మరియు Spacing | |
10:01 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము , దీనికి ICT, MHRD ద్వారా భారత ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. | |
10:14 | http://spoken-tutorial.org. చేత ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందించబడినది. | |
10:19 | మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro.. ఈ లింక్ లో అందించబడినది. | |
10:23 | ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల.. ఇంక విరమిస్తున్నాము | |
10:33 | మాతో చేరినందుకు కృతజ్ఞతలు. |