LibreOffice-Suite-Calc/C2/Basic-Data-Manipulation/Telugu
From Script | Spoken-Tutorial
Contents
Resources for recording
VISUAL CUE | NARRATION |
00:00 | లిబ్రేఆఫీస్ Calc-బేసిక్స్ ఆఫ్ డేటా మానిప్యులేషన్ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము. |
00:07 | ఈ ట్యుటోరియల్లో మీరు ఈ క్రింది వాటి గురించి నేర్చుకుంటారు: |
00:09 | ఫార్ములా బేసిక్స్ యొక్క పరిచయము |
00:12 | కాలమ్ ల ద్వారా సార్టింగ్ చేయడము |
00:15 | డేటా ను ఫిల్టరింగ్ చేయడము యొక్క బేసిక్స్ |
00:17 | ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము. |
00:27 | మన ట్యుటోరియల్ ను లిబ్రే ఆఫీస్ Calcలో వాడే బేసిక్ ఫార్ములాలను నేర్చుకోవడముతో మొదలు పెడదాము. |
00:35 | ఫార్ములాలు అనేవి సంఖ్యలు మరియు చలరాశులను వాడి ఫలితములను రాబట్టే సమీకరణములు. |
00:41 | ఒక స్ప్రెడ్ షీట్ లో చలరాసులు అనేవి సమీకరణము పూర్తి అవ్వడము కొరకు కావలసిన డేటా ను కలిగి ఉండే సెల్ స్థానములు. |
00:47 | చాలా సాధారణముగా జరుగుతూ ఉండే అర్థమెటిక్ ఆపరేషన్లుగా కూడిక, తీసివేత, గుణకారము మరియు భాగహారములు ఉన్నాయి. |
00:56 | ఇప్పుడు ముందుగా మన “Personal-Finance-Tracker.ods” ఫైల్ ను ఓపెన్ చేద్దాము. |
01:02 | మన “personal finance tracker.ods” ఫైల్ లో “Cost” అనే హెడింగ్ క్రింద అన్ని ఖర్చుల యొక్క ధరను ఎలా కూడాలో చూద్దాము. |
01:13 | “SUM TOTAL” just under “Miscellaneous” క్రింద మనము “SUM TOTAL” అనే మరొక హెడింగ్ ను ఇవ్వవలసి ఉంటుంది. |
01:19 | మరియు మనము సెల్ A8 పైన క్లిక్ చేయాలి మరియు వరుస సంఖ్యను “7” గా ఇవ్వాలి. |
01:25 | ఇప్పుడు మనము ధరల యొక్క మొత్తమును డిస్ప్లే చేయాలి అని అనుకున్న సెల్ సంఖ్య “C8” పైన క్లిక్ చేయండి. |
01:32 | అన్ని ధరలను యాడ్ చేయడము కొరకు మనము “ఈజ్ ఈక్వల్ టు సమ్” అని టైప్ చేస్తాము మరియు బ్రాకెట్లలో కూడవలసిన కాలమ్ ల యొక్క రేంజ్ ”C3 colon C7”ను ఇస్తాము. |
01:44 | ఇప్పుడు కీ బోర్డ్ మీది “Enter” ను ప్రెస్ చేయండి. |
01:47 | “Cost” క్రింద ఉన్న అన్ని ఐటమ్ లు కూడబడడమును మీరు గమనించవచ్చు |
01:51 | ఇప్పుడు Calc లో ఎలా తీసివేత చేయాలో నేర్చుకుందాము. |
01:55 | మనము “ఇంటి అద్దె” మరియు “విద్యుత్ బిల్లు” ల ధరలను తీసివేసి దానిని A9 అని రిఫర్ చేయబడే సెల్ లో డిస్ప్లే చేయాలి అని అనుకుంటే ముందుగా A9 సెల్ పైన క్లిక్ చేయండి |
02:06 | ఇప్పుడు ఈ సెల్ లో “is equal to” అని టైప్ చేయండి మరియు బ్రాకెట్ లలో ఆయా సెల్ రిఫరెన్స్ లను అంటే “C3 minus C4” అని టైప్ చేయండి. |
02:17 | కీ బోర్డ్ పైన ఉన్న “Enter” కీ ను ప్రెస్ చేయండి. |
02:20 | ఆ రెండు సెల్ రిఫరెన్స్ ల ధరలు తీసివేయబడి అవి A9 అనే సెల్ నంబర్ లో డిస్ప్లే చేయబడడమును మీరు గమనించవచ్చు. |
02:29 | ఇప్పుడు మార్పులను undo చేద్దాము. |
02:32 | అలాగే వివిధ సెల్ లలో ఉన్న డేటా ను గుణకారము లేదా భాగహారము చేయవచ్చు. |
02:37 | స్ప్రెడ్ షీట్ లో ఉన్న మరొక బేసిక్ ఆపరేషన్ గా సంఖ్యల సరాసరిని కనుగొనడము అంటే ఫైండింగ్ ది “Average” ఆఫ్ నంబర్స్ ఉన్నది. |
02:43 | దానిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. |
02:45 | “Average” just below the “SUM TOTAL” సెల్ క్రింద “Average” అనే హెడింగ్ ను ఇవ్వండి. |
02:50 | మనము ఇక్కడ మొత్తము ధర యొక్క యావరేజ్ ను డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నాము. |
02:55 | కనుక “C9” సెల్ పైన క్లిక్ చేయండి |
02:58 | ఇప్పుడు మనము “is equal to” Average అని మరియు బ్రాకెట్ లలో ధరను టైప్ చేస్తాము. |
03:04 | కీ బోర్డ్ మీద ఉన్న “Enter” కీ ను ప్రెస్ చేయండి. |
03:07 | “Cost” కాలమ్ యొక్క యావరేజ్ ఈ సెల్ లో డిస్ప్లే చేయబడడమును మీరు గమనించవచ్చు. |
03:11 | ఇప్పుడు మార్పులను undo చేద్దాము. |
03:15 | అలాగే ఒక హారిజాంటల్ రో లోని ఎలిమెంట్ల యావరేజ్ ను కూడా మీరు కనుగొనవచ్చు. |
03:20 | మనము ఫార్ములాల గురించి మరియు ఆపరేటర్ల గురించి ఎడ్వాన్స్డ్ లెవల్ ట్యుటోరియల్ లలో నేర్చుకోవచ్చు. |
03:25 | ఇప్పుడు ఒక Calcspreadsheet లో డేటా ను ఎలా “Sort” చేయాలో నేర్చుకుందాము. |
03:30 | షీట్ లో కనిపిస్తున్న సెల్ లను సార్టింగ్ మీకు కావలసిన పద్ధతిలో అమరుస్తుంది. |
03:35 | Calc లో మీరు డేటాను మూడు క్రైటీరియాల వరకు సార్ట్ చేయవచ్చు. ఇవి ఒకదాని తరువాత మరొకటి అప్లై చేయబడతాయి. |
03:43 | మీరు ఒక ప్రత్యేకమైన ఐటమ్ కొరకు వెతుకుతున్నప్పుడు అవి సరిపోతాయి మరియు మీరు డేటాను ఫిల్టర్ చేసిన తరువాత మరింత శక్తివంతము కూడా అవుతాయి. |
03:51 | ఇప్పుడు మనము “Costs” అనే హెడింగ్ క్రింద ఉన్న డేటాను ఆరోహణ క్రమములో సార్ట్ చేయాలి అని అనుకున్నాము అనుకోండి. |
03:57 | కనుక ముందుగా మనము “Cost” అనే సెల్ ను క్లిక్ చేయడము ద్వారా సార్టింగ్ చేయవలసిన సెల్ లను హైలైట్ చేస్తాము. |
04:03 | ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను పట్టుకుని ఉంచి దానిని “2000” అని ఉన్న సెల్ చివర వరకు కాలమ్ గుండా డ్రాగ్ చేయండి. |
04:12 | ఇది మనము సార్ట్ చేయాలి అని అనుకున్న కాలమ్ ను ఎంపిక చేస్తుంది. |
04:15 | ఇప్పుడు మెనూ బార్ లోని “Data” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Sort” పైన క్లిక్ చేయండి. |
04:21 | ఆ తరువాత “Current Selection” పై క్లిక్ చేయండి. |
04:24 | “Sort criteria” మరియు “Options” ను కలిగి ఉన్న ఒక డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది |
04:31 | “Sort criteria” టాబ్ లో మీరు , “Sort by” ఫీల్డ్ లో “Cost” ను ఎంచుకోండి . |
04:37 | ధరను ఆరోహణ క్రమములో సార్ట్ చేయడము కొరకు దాని ప్రక్కనే ఉన్న “Ascending” ఆప్షన్ పైన క్లిక్ చేయండి. |
04:44 | ఇప్పుడు “OK” బటన్ పైన క్లిక్ చేయండి. |
04:47 | కాలమ్ ఆరోహణ క్రమములో సార్ట్ అవ్వడమును మీరు గమనించవచ్చు. |
04:51 | అలాగే, అవరోహణ క్రమములో సార్ట్ చేయడము కొరకు “Descending” పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “OK” బటన్ పైన క్లిక్ చేయండి. |
04:59 | ఇప్పుడు మార్పులను Undo చేద్దాము. |
05:02 | అన్ని కాలమ్ లను ముందుగా ఎంచుకుని ఆ తరువాత సార్ట్ ఆప్షన్లను అప్లై చేయడము ద్వారా చాలా కాలమ్ లను ఒకేసారి సార్ట్ చేయవచ్చు. |
05:09 | మనము వరుస సంఖ్యలను మరియు ధరలను సార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము అనుకోండి. |
05:14 | కనుక మనము ఇంతకు పూర్వము చేసిన విధముగా కాలమ్ లను ఎంచుకోండి. |
05:18 | ఇప్పుడు మెనూ బార్ లోని “Data” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు “Sort” ఆప్షన్ పైన క్లిక్ చేయండి. |
05:24 | అప్పుడు కనిపించే డయలాగ్ బాక్స్ లో ముందుగా “Sort by” ఫీల్డ్ లో “Cost” ను ఎంచుకోండి. |
05:30 | ఆ తరువాత “Then by” ఫీల్డ్ లో “SN” ను ఎంచుకోండి . |
05:35 | రెండు ఆప్షన్లలో కూడా వాటికి దగ్గరలో ఉన్న “ Descending” ను ఎంచుకోండి మరియు ఆ తరువాత “OK” బటన్ పై క్లిక్ చేయండి. |
05:43 | రెండు హెడింగ్ లు కూడా అవరోహణ క్రమములో సార్ట్ అవ్వడమును మీరు చూడవచ్చు |
05:47 | ఇప్పుడు మార్పులను Undo చేద్దాము |
05:49 | ఇప్పుడు లిబ్రేఆఫీస్ Calc లో డేటా ను ఎలా ఫిల్టర్ చేయాలో మనము నేర్చుకుందాము |
05:53 | ఒక ఫిల్టర్ అనేది డిస్ప్లే చేయబడడము కొరకు ప్రతి ఎంట్రీకు తప్పనిసరిగా ఉండవలసిన కండీషన్ల యొక్క లిస్ట్. |
06:00 | స్ప్రెడ్ షీట్ లో ఒక ఫిల్టర్ ను అప్లై చేయడము కొరకు “Item” అనే పేరు ఉన్న సెల్ పైన క్లిక్ చేద్దాము. |
06:07 | ఇప్పుడు మెనూ బార్ లోని “Data” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Filter” ఆప్షన్ పైన క్లిక్ చేయండి. |
06:12 | పాప్ అప్ మెనూ నుంచి “AutoFilter” ఆప్షన్ పైన క్లిక్ చేయండి. |
06:16 | ఒక యారో హెడింగ్ ల పైన మార్క్ చేసి ఉండడమును మీరు చూడవచ్చు. |
06:20 | “Item” అనే పేరు ఉన్న సెల్ మీద ఉన్న డౌన్ యారో పైన క్లిక్ చేయండి. |
06:24 | ఇప్పుడు “Electricity Bill” కు సంబంధించిన డేటా ను మాత్రమే డిస్ప్లే చేయాలి అని అనుకుంటే . |
06:29 | అప్పుడు “Electricity Bill” ఆప్షన్ పైన క్లిక్ చేయండి. |
06:34 | “Electricity Bill” కు సంబంధించిన డేటా మాత్రమే ఈ షీట్ లో డిస్ప్లే చేయబడడమును మీరు గమనించవచ్చు. |
06:40 | మిగిలిన ఆప్షన్లు అన్నీ ఫిల్టర్ చేయబడ్డాయి. |
06:43 | మొత్తము డేటాను చూడడము కొరకు ”Item” అనే పేరు ఉన్న సెల్ యొక్క డౌన్ వర్డ్ యారో పైన మరలా క్లిక్ చేయండి మరియు “All” పైన క్లిక్ చేయండి. |
06:52 | ఇప్పుడు మనము నిజముగా వ్రాసిన మొత్తము డేటాను చూడగలము అని మీరు గమనించవచ్చు. |
06:59 | “AutoFilter” మాత్రమే కాకుండా , “Standard Filter” మరియు “Advanced Filter” అనే రెండు ఇతర ఫిల్టర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి, వీటి గురించి మనము ఈ వరుస లోని ఇతర స్థాయిలలో నేర్చుకుంటాము. |
07:11 | దీనితో మనము లిబ్రేఆఫీస్ Calc అనే స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము : |
07:15 | మనము నేర్చుకున్నది సంగ్రహముగా తెలపాలి అంటే : |
07:18 | ఫార్ములా యొక్క బేసిక్ లతో పరిచయము |
07:21 | కాలమ్ లతో సార్ట్ చేయడము |
07:23 | డేటాను ఫిల్టర్ చేయడము యొక్క బేసిక్స్ |
07:26 | ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
07:30 | అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది. |
07:33 | మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. |
07:37 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ |
07:40 | *స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది. |
07:43 | ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది. |
07:47 | మరిన్ని వివరముల కొరకు contact@spoken -tutorial.org ను కు వ్రాయండి |
07:53 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము |
07:58 | *దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
08:06 | *ఈ మిషన్ గురించి మరింత సమాచారము |
08:08 | *spoken hyphen tutorial.org/NMEICT -Intro వద్ద అందుబాటులో ఉన్నది |
08:16 | *ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల. ఇంక విరమిస్తున్నాము |
08:20 | *మాతో కలిసినందుకు కృతజ్ఞతలు. |