LibreOffice-Suite-Calc/C2/Basic-Data-Manipulation/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | లైబ్ర్ ఆఫీస్ క్యాల్క్ – బేసిక్స్ ఒఫ్ డాటా మనిప్యులేషన్(Basics of Data Manipulation)గురించి తెలియబరిచే స్పోకన్ ట్యూటోరియల్ కు స్వాగతం |
00:07 | ఈ ట్యూటోరియల్ లో మనం నేర్చుకునేది: |
00:09 | సూత్రముల ప్రాథమిక అంశాల పరిచయం |
00:12 | కాలమ్స్ ప్రకారముగా అమర్చుట |
00:15 | ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు. |
00:17 | ఇక్కడ మనం ఉబుంటు లినక్స్(Ubuntu Linux) వర్షన్ 10.04 మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తున్నాము |
00:27 | లిబ్రె ఆఫీస్ క్యాల్క్ లో ఉపయోగించే ప్రాథమిక సూత్రము ల తో మన ట్యూటోరియల్ ను ప్రారంభిద్దాం. |
00:35 | ఫొర్ములాలు, సంఖ్యలను మరియు చలరాశి లను (వేరియబుల్స్)ఉపయోగించి ఫలితాలను సాధించే సమీకరణములు. |
00:41 | ఒక స్ప్రెడ్‌షీట్ లో, సమీకరణము పూర్తి చేయడానికి కావలసిన సమాచారం చలరాశి ల(వేరియబుల్)తో సూచించబడే సెల్ లొకేషన్స్ కలిగి వుంటాయి. |
00:47 | ఇక్కడ ఎక్కువగా ఉపయోగించే అంకగణితపరికర్మలు, అడిషన్, సబ్‌ట్ర్యాక్షన్, మల్టిప్లికేషన్ మరియు డివిషన్. |
00:56 | ముందుగా మనంపర్సనల్-ఫైనాన్స్-ట్ర్యాకర్.ఆడ్స్ (Personal Finance traker.ods) ఫైల్ ను తెరుద్దాం. |
01:02 | personal finance tracker.ods (పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్.ods) ఫైల్ లో,cost(కాస్ట్) హెడ్డింగ్ దిగువన వున్న ఖర్చులన్నింటిని ఎలా జోడించాలో చూద్దాం. |
01:13 | Miscellaneous(మిసిలేనీయియస్ )కింద Sum Total(సమ్ టోటల్ )అనే మరొక హెడ్డింగ్ ఇద్దాం. |
01:19 | A8 సెల్ పై క్లిక్ చేసి సీరియల్ నంబర్ 7 ఇద్దాం. |
01:25 | ఖర్చుల మొత్తాన్ని చూపించే సెల్ నంబర్C8 పై క్లిక్ చేద్దాం. |
01:32 | ఖర్చులన్నింటిని కల్పడానికి is equal to SUM(ఇస్ ఈక్వల్ టు సమ్) అని టైపు చేసి, బ్రేసస్ లో ఏ కాలమ్ లోని ఖర్చులను కలపాలో ఆ కాలమ్ యొక్క రేంజ్ టైపు చేద్దాం, అనగా C3 కోలన్ C7. |
01:44 | ఇప్పుడు ఎంటర్ నొక్కుద్దాం. |
01:47 | Cost( కాస్ట్) దిగువన వున్న అంశాలు అన్ని కూడడం గమనించవచ్చు. |
01:51 | ఇప్పుడు క్యాల్క్ లో తీసివేత ఎలా చేయాలో చూద్దాం. |
01:55 | ఒకవేళHouse Rent(హౌస్ రెంట్) మరియు Electricity bill(ఎలెక్ట్రిసిటీ బిల్) ఖర్చులను తీసివేసి, A9 తో సూచించబడిన సెల్ లో చూపించాలంటే మొదటగా A9 సెల్ పై క్లిక్ చేయండి. |
02:06 | ఇప్పడు ఈ సెల్ లో is equal to(ఇస్ ఈక్వల్ టు )అని టైపు చేసి బ్రేసస్ లో ఆయా సెల్ రిఫరెన్స్ అనగా,C3 మైనస్ C4 అని టైపు చేయండి. |
02:17 | ఇప్పడు కీ బోర్డు పై ఎంటర్ నోక్కండి. |
02:20 | రెఫెర్ చేయబడిన రెండు సెల్ లోని ఖర్చులు తీసివేయబడి ఫలితం A9 సెల్లో కనిపించడం చూడవచ్చు. |
02:29 | మార్పులను అండూ చేద్దాం |
02:32 | ఇదేవిధముగా, వివిధ సెల్ లోని అంశముల కూడిక మరియు తీసివేత చేయవచ్చు. |
02:37 | స్ప్రెడ్‌షీట్ లో మరొక ప్రాథమిక కర్మ సంఖ్యల సగటు కనుక్కోవడం. |
02:43 | ఇప్పుడు దీనిని ఎలా అమలు చేయాలో చూద్దాం |
02:45 | Sum Total( సమ్ టోటల్) సెల్ క్రింద Average(ఆవరేజ్) అని హెడ్డింగ్ ఇద్దాం. |
02:50 | ఇక్కడ టోటల్ కాస్ట్ యొక్క సగటు చూపిద్దాం |
02:55 | కాబట్టిC9 సెల్ పై క్లిక్ చేద్దాం. |
02:58 | is equal to( ఇస్ ఈక్వల్ టు ) Average(ఆవరేజ్) మరియు బ్రేసస్ లో Cost(కాస్ట్) అని టైపు చేద్దాం. |
03:04 | ఇప్పుడు కీ బోర్డు పై ఎంటర్ నొక్కుద్దాం. |
03:07 | Cost(కాస్ట్)కాలమ్ యొక్క సగటు, ఈ సెల్ల్లో కనిపించడం చూడవచ్చు. |
03:11 | మార్పులను అండూ చేద్దాం. |
03:15 | ఇదే విధముగా హారిజాంటల్ రో లోని అంశములన్నింటి సగటును కనుక్కోవచ్చు. |
03:20 | మరిన్ని ఫార్మలే మరియు ఆపరేటర్స్ గురించి అడ్వ్యాన్స్డ్ లెవెల్ ట్యూటోరియల్స్ లో నేర్చుకుందాం. |
03:25 | ఒక క్యాల్క్ స్ప్రెడ్‌షీట్ లో అంశములను ఎలా సార్ట్ చేయాలో చూద్దాం. |
03:30 | సార్టింగ్ కనిపించే సెల్స్ ను మనకు కావలసిన విధముగా అమరుస్తుంది |
03:35 | క్యాల్క్ లో, మీరు మూడు ప్రమాణాల వరకు ఉపయోగించి డేటా క్రమం చేయవచ్చు, వీటిని ఒకదాని తర్వాత మరోక్కదాన్ని వినియోగించవచ్చు. |
03:43 | అవి మీకు ఒక ప్రత్యేక అంశం శోధించడానికి సులభాముగా అవుతుంది మరియు కావాల్సిన డాటా ను ఫిల్టర్ చేసిన తర్వాత శక్తివంతమౌతాయి. |
03:51 | ఒకవేళ,Costs హెడ్డింగ్ దిగువన వున్న అంశములను ఆరోహన క్రమం లో అమర్చాలంటే. |
03:57 | Cost పై క్లిక్ చేసి అమర్చలనుకున్న సెల్ల్స్ ను హైలైట్ చేయాలి. |
04:03 | మౌస్ ఎడమ బటన్ పట్టుకొని, కాలమ్ మీదుగా 2000 అని ఉన్న సెల్ చివరి వరకు లాగండి. |
04:12 | ఇది మనం అమర్చాలనుకున్న కాలమ్ ను ఎంపిక చేసుకుంటుంది. |
04:15 | ఇప్పుడు మేను బార్ నుండిడాటా ఎంపిక పై క్లిక్ చేసి sort(సార్ట్) పై క్లిక్ చేయండి. |
04:21 | తర్వాతcurrent selection(కరెంట్ సెలెక్షన్) ను ఎంచుకోండి. |
04:24 | Sort Criteria(సార్ట్ క్రైటీరియా) మరియు Options (ఆప్షన్స్) ట్యాబ్స్ తో ఒక డైయలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
04:31 | Sort Criteria(సార్ట్ క్రైటీరియ) ట్యాబ్ లో,Sort by(సార్ట్ బై) ఫీల్డ్ లో Cost(కాస్ట్) ను ఎంచుకోండి. |
04:37 | Cost(కాస్ట్) ను ఆరోహణ క్రమంలో అమర్చాలంటే దీని పక్కనే వున్న Ascending(అసెండింగ్) పిక ను ఎంచుకోండి. |
04:44 | ఇప్పుడుOK బటన్ పై క్లిక్ చేయండి. |
04:47 | కాలమ్ ఆరోహణ క్రమంలో ఏర్పడడం గమనించవచ్చు . |
04:51 | అదే విధముగా, అవరోహణ క్రమంలో అమర్చాలంటే ,Descending(డిసెండింగ్) పై క్లిక్ చేసి తర్వాతOK బటన్ పై క్లిక్ చేయండి . |
04:59 | మార్పులను అండూ చేద్దాం. |
05:02 | అనేక కాలమ్స్ ను అమర్చడానికి మొదటగా అన్నింటిని ఎంచుకొని తర్వాత సార్ట్ ఎంపికలను ఉపయోగించండి. |
05:09 | ఒకవేళ మనం సీరియల్ నంబర్స్ మరియు కాస్ట్ లను అమర్చాలంటే. |
05:14 | ముందు మాదిరిగా కాలమ్స్ అన్నిటిని ఎంచుకోవాలి. |
05:18 | ఇప్పుడు మేను బార్ లోనిData(డాటా) ఎంపిక పై క్లిక్ చేసి Sort(సార్ట్) పై క్లిక్ చేయాలి. |
05:24 | డైయలోగ్ బాక్స్ లో నుండి Sort by(సార్ట్ బై) ఫీల్డ్లో ముందుగా Cost(కాస్ట్) ను ఎంచుకోవాలి. |
05:30 | తర్వాత Then by(దెన్ బై ) ఫీల్డ్ లో నుండి SN(స్న్)ను ఎంచుకోవాలి. |
05:35 | రెండు ఎంపికాలకు దెగ్గారగా ఉన్న Descending( డిసెండింగ్) పై క్లిక్ చేసి OK బటన్ పై క్లిక్ చేయాలి. |
05:43 | హెడ్డింగ్స్ రెండు అవరోహణ క్రమంలో అమరిక పొందడం గమనించండి. |
05:47 | మార్పులను అండూ చేద్దాం. |
05:49 | ఇప్పుడు లిబ్రే ఆఫీస్ కల్క్ లో డాటాను ఎలా ఫిల్టర్ చేయాలో చూద్దాం. |
05:53 | ఫిల్టర్ అనగా షరతుల జాబితా. ఈ ప్రకారంగా ప్రతీ ఎంట్రీ కనిపిస్తుంది. |
06:00 | స్ప్రెడ్‌షీట్ లో ఫిల్టర్ ఉపయోగించడానికి,Item(ఐటమ్) అనే సెల్ పై క్లిక్ చేద్దాం. |
06:07 | మేను బార్ లోని Data(డాటా) ఎంపిక పై క్లిక్ చేసి Filter(ఫిల్టర్) పై క్లిక్ చేద్దాం. |
06:12 | పాప్ అప్ మేను లో నుండి Auto Filter(ఆటో ఫిల్టర్) ఎంపిక పై క్లిక్ చేద్దాం. |
06:16 | హెడ్డింగ్స్ పై బాణం గుర్తు రావడం గమనించండి. |
06:20 | Item(ఐటమ్) సెల్ లోని డౌన్ ఆరో పై క్లిక్ చేయండి . |
06:24 | ఒకవేళElectricity Bill(ఎలెక్ట్రిసిటీ బిల్) కు సంబందించిన డాటా ను మాత్రమే చూపించాలంటే. |
06:29 | Electricity Bill(ఎలెక్ట్రిసిటీ బిల్) ఎంపిక పై క్లిక్ చేయండి. |
06:34 | Electricity Bill(ఎలెక్ట్రిసిటీ బిల్)కు సంబందించిన డాటా మాత్రమే కనపడ్డం గమనించండి. |
06:40 | మిగితా ఎంపికలు ఫిల్టర్ అయినాయి. |
06:43 | డాటా మొత్తం చూడాలంటే, మళ్ళీ ఒకసారి Item(ఐటమ్) సెల్ పై ఉన్న డౌన్ ఆరో పై క్లిక్ చేసి All(ఆల్) పై క్లిక్ చేయండి |
06:52 | ఇప్పుడు మనం అసలు వ్రాసిన డాటా ను అంతా చూడవచ్చు. |
06:59 | Auto Filter(ఆటో ఫిల్టర్) తోపాటుగా Standard Filter(స్టాండర్డ్ ఫిల్టర్) మరియు Advanced Filter(అడ్వ్యాన్స్డ్ ఫిల్టర్) అనే మరో రెండు ఫిల్టర్ ఎంపికలు ఉన్నవి.వీటి గురించి మనం ఈ సీరీస్ లోని తర్వాతి దశలలో నేర్చుకుందాం. |
07:11 | లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియబర్చే స్పోకన్ ట్యూటోరియల్ ముగింపుకు వచ్చాం: |
07:15 | సంక్షిప్తముగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది: |
07:18 | సూత్రముల యొక్క ప్రాథమిక అంశాల -పరిచయం. |
07:21 | కాలమ్స్ ప్రకారముగా అమర్చుట. |
07:23 | ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు |
07:26 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
07:30 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది |
07:33 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
07:37 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం |
07:40 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది |
07:43 | ఆన్లైన్ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు జరిచేస్తుంది. |
07:47 | మరిన్ని వివరాలకు, దయచేసి Contact@spoken-tutorial.org(కాంట్యాక్ట్@స్పోకన్-ట్యూటోరియల్. ఆర్గ్) కు వ్రాసి సంప్రదించండి. |
07:53 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
07:58 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
08:06 | ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
08:16 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |