Firefox/C2/Searching-and-Auto-complete/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:40, 8 March 2013 by Sneha (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 మొజిల్లా ఫైర్‌ఫాక్స్ - సెర్చ్ మరియు ఆటో-కంప్లీట్ ఫీచర్స్ మీద స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో మనము సెర్చ్ ఎలా ఉపయోగించాలో, సెర్చ్ ఇంజన్స్ ఎలా మానేజ్ చేయాలో, ఇంకా ఫైండ్ బార్‌ను ఎలా ఉపయోగించాలో,
00:15 అడ్రెస్ బార్‌లో ఆటో-కంప్లీట్ ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము.
00:18 ఈ ట్యుటోరియల్‌లో, Ubuntu 10.04 మీద మనం ఫైర్‌ఫాక్స్ వర్షన్ 7.0 ఉపయోగిస్తాము
00:26 ఇంటర్నెట్ మీద మనుషులు చేసే అత్యంత సాధారణమైన పని సమాచారం కోసం సెర్చ్ చేయడం.
00:31 ఎవరయినా ఒక నిర్దిష్టమైన వెబ్‌సైట్ కోసం లేదా కొంత ఇతర సమాచారం కోసం సెర్చ్ చేయగలరు.
0:37 ఇంటర్నెట్ మీద సమాచారం సెర్చ్ సులభతరం చేయడానికి మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌కి అనేక ఫంక్షనాలిటీస్ ఉన్నాయి.
00:44 మనం వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాము.
00:47 సెర్చ్ చేయడములో ఒక పధ్ధతి ఇతర వెబ్‌సైట్స్‌ను విజిట్ చేయడం.
00:50 ఎందుకంటే సెర్చ్ ఇంజన్లు కూడా వెబ్‌సైట్సే కాబట్టి!
00:54 URL బార్‌లో, 'www.google.com' అని టైప్ చేయండి.
00:59 గూగుల్ హోమ్ పేజ్ కనపడుతుంది.
01:01 గూగుల్ హోమ్ పేజ్ మధ్యలో మెయిన్ సెర్చ్ బాక్స్‌లో, 'email' అని టైప్ చేసి >> సెర్చ్ క్లిక్ చేయండి.
01:07 సెర్చ్ ఇంజన్ అన్ని ఫలితాలను చూపుతుంది.
01:10 మనం అన్నిటికన్నా పైన ఉన్న ఫలితం gmail, అంటే గూగుల్ యొక్క email అయి ఉండడం చూడగలము.
01:16 కానీ మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌తో అదే పని చేయడానికి మరింత సులభతరమైన పధ్ధతి ఉంది.
01:20 నావిగేషన్ టూల్‌బార్ యొక్క URL బార్‌కు ప్రక్కన, ఒక సెర్చ్ బార్ ఫీల్డ్ ఉంటుంది.
01:26 ప్రత్యామ్నాయంగా, మీరు సెర్చ్ బార్ ఫీల్డ్‌లోకి నేరుగా వెళ్ళడానికి CTRL+k నొక్కగలరు.
01:33 సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి తర్వాత 'email' అని టైప్ చేయండి.
01:36 దాని ప్రక్కన ఉన్న మాగ్నిఫయింగ్ గ్లాస్ ఐకాన్‌ను క్లిక్ చేయండి.
01:40 కంటెంట్స్ ఏరియాలో మనం సెర్చ్ యొక్క ఫలితాలను చూస్తాము.
01:44 మనం అన్నిటికన్నా పైన ఉన్న ఫలితం gmail, అంటే గూగుల్ యొక్క email అయి ఉండడం చూడగలము.
01:50 సెర్చ్ బార్ యొక్క ఎడమ వైపున, ఫలితాలను ప్రదర్శించడానికి ఉపయోగించిన సెర్చ్ ఇంజన్ యొక్క లోగో కనపడుతుంది.
01:58 మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో ఉపయోగించే డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్ 'google'.
02:02 మనం మన ఛాయిస్‌కి అనుగుణముగా సెర్చ్ ఇంజన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
02:08 సెర్చ్ బార్‌ లోపల గూగుల్ యొక్క సెర్చ్ ఇంజన్ లోగో మీద క్లిక్ చేయండి.
02:12 మనము అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజన్స్ యొక్క లోగోస్, "Yahoo" మరియు "Bing"తో సహా ఒక డ్రాప్ డౌన్ బాక్స్ కనపడడం చూడగలము.
02:21 డ్రాప్ డౌన్ బాక్స్ నుండి "Yahoo" ఎంపిక చేసుకోండి.
02:24 మనము సెర్చ్ బార్ యొక్క ఎడమ వైపు ఉన్న లోగో ఇప్పుడు "Yahoo" లోగోగా మారడం పరిశీలించగలము.
02:30 ఇప్పుడు మనం మరల సెర్చ్ బార్‌లో 'email' అని టైప్ చేసి మాగ్నిఫయింగ్ గ్లాస్‌ను క్లిక్ చేద్దాము.
02:36 ఈ సారి మనము కంటెంట్స్ ఏరియాలో కనపడే ఫలితాలు "Yahoo" సెర్చ్ ఇంజన్ నుండి అయి ఉండడం చూడగలము.
02:42 ఫలితాలు మునుపటి సారి కంటే కొద్దిగా భిన్నంగా ఉండడం పరిశీలించండి.
02:46 అన్నిటికన్నా పైన ఉన్న ఫలితం gmail కాదు. దాని బదులు పైన ఉన్న ఫలితం "Yahoo" మెయిల్‌గా కనపడుతుంది.
02:53 సెర్చ్ బార్‌లోపల సెర్చ్ ఇంజన్ లోగోను మరల క్లిక్ చేయండి.
02:57 డ్రాప్ డౌన్ బాక్స్‌లో, 'Manage Search Engines'ను ఎంపిక చేయండి.
03:07 ఇది 'Manage Search Engines' లిస్ట్ అనే పేరుగల డయలాగ్ బాక్స్ తెరుస్తుంది.
03:07 లిస్టులోని చివరి ఐటమ్ మీద క్లిక్ చేయండి.
03:10 కుడి వైపున ఉన్న బటన్స్ ఇప్పుడు ఎనేబుల్ అవుతాయి. 'Remove' బటన్ మీద క్లిక్ చేయండి.
03:16 మనం ఎంపిక చేసుకున్న ఐటమ్ లిస్ట్ మీద లేకపోవడం చూస్తాము.
03:21 డయలాగ్ బాక్స్ క్లోస్ చేయడానికి OK మీద క్లిక్ చేయండి.
03:24 సెర్చ్ బార్ లోపల సెర్చ్ ఇంజన్ లోగో మీద క్లిక్ చేయండి.
03:29 "Manage Search Engines" మీద క్లిక్ చేయండి.
03:32 "Manage Search Engines" లిస్ట్ డయలాగ్ బాక్స్ పాపప్ అవుతుంది.
03:37 డయలాగ్ క్రింద 'Get more search engines...' అనే ఒక లింకు కనపడుతుంది.
03:42 దాని మీద క్లిక్ చేయండి.
03:43 ఒక క్రొత్త బ్రౌజర్ టాబ్ ఓపెన్ అవుతుంది.
03:46 అది మనం సెర్చ్ బార్‌కు ఆడ్ చేయగలిగిన సెర్చ్ ఇంజన్ల యొక్క సంఖ్య డిస్ప్లే చేస్తుంది.
03:51 మీరు మీ ఆవశ్యకతకు అనుగుణముగా ఎన్ని సెర్చ్ ఇంజన్లనయినా ఆడ్ చేసుకోవచ్చు.
03:55 మనము టాబ్ యొక్క మూలన ఉన్న x మీద క్లిక్ చేసి ఈ టాబ్‌ను క్లోస్ చేద్దాము.
04:00 మనము "Find bar" సహాయముతో కంటెంట్స్ ఏరియాలో ఉండే స్పెసిఫిక్ టెక్స్ట్‌ను కనుగొనగలము.
04:07 URL బార్‌లో, 'www.gmail.com' టైప్ చేసి ఎంటర్ టైప్ చేయండి.
04:13 gmail హోమ్ పేజ్ లోడ్ అయినపుడు, 'Edit' మీద క్లిక్ చేసి తర్వాత 'Find' మీద క్లిక్ చేయండి.
04:19 బ్రౌజర్ విండో క్రింద ఒక "Find bar" కనపడుతుంది.
04:22 "Find bar" యొక్క టెక్స్ట్ బాక్స్‌లో, 'gmail' అని టైప్ చేయండి.
04:28 మనం టైప్ చేస్తుండగా, కంటెంట్స్ ఏరియాలో ఆ టెక్స్ట్ యొక్క ఫస్ట్ఇన్స్టన్స్ హైలైట్ అవ్వడం చూస్తాము.
04:36 'Next' మీద క్లిక్ చేయడం పదం యొక్క తరువాతి ఇన్స్టన్స్ మీదకు ఫోకస్‌ను మూవ్ చేస్తుంది.
04:41 'Previous' మీద క్లిక్ చేయడం పదం యొక్క మునుపటి ఇన్స్టన్స్ మీదకు ఫోకస్‌ను మూవ్ చేస్తుంది.
04:46 'Highlight all' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
04:49 మనం కంటెంట్స్ ఏరియాలో సెర్చ్ టెక్స్ట్ యొక్క అన్ని ఇన్స్టన్సెస్ హైలైట్ చేసి ఉండడం చూస్తాము.
04:56 తన ఆటో-కంప్లీట్ ఫంక్షన్‌తో మొజిల్లా ఫైర్‌ఫాక్స్ URLలో వెబ్ అడ్రెసెస్ టైప్ చేయడం సులభతరం చేస్తుంది.
05:04 మనం అడ్రెస్ బార్‌లో మొత్తం వెబ్ అడ్రెస్ టైప్ చేయాల్సిన అవసరం లేదు.
05:08 ఇది ప్రయత్నించండి: అడ్రెస్ బార్‌లో 'gma' అని టైప్ చేయండి.
05:12 మొజిల్లా ఫైర్‌ఫాక్స్ మనం టైప్ చేస్తోన్న పదాన్ని ఆటో-కంప్లీట్ చేయడానికి ప్రయత్నించడం చూస్తాము.
05:17 అది 'gma'తో మొదలయ్యే వెబ్‌సైట్స్‌కు సంబంధించిన డ్రాప్ డౌన్ లిస్ట్ చూపిస్తుంది.
05:23 డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి 'gmail' లింక్ ఎంపిక చేసుకోండి.
05:27 కంటెంట్స్ ఏరియాలో 'gmail' వెబ్‌పేజ్ లోడ్ అవుతుంది.
05:30 మనం ఈ ఫీచర్ ఇష్టపడకపోతే, మనం దానిని టర్న్ ఆఫ్ చేయవచ్చు.
05:34 "Edit' మీద క్లిక్ చేసి తర్వాత "Preferences" మీద క్లిక్ చేయండి.
05:37 విండోస్ యూజర్లు మొదట "Tools" మీద తర్వాత "Options" మీద క్లిక్ చేయవచ్చు.
05:41 మెయిన్ మెను టాబ్స్ యొక్క లిస్ట్‌లోనుండి "Privacy" టాబ్ ఎంపిక చేసుకోండి.
05:46 డయలాగ్ బాక్స్ యొక్క క్రింది భాగమున, 'When using location bar, suggest' అనే ఆప్షన్ ఉంటుంది.
05:53 డ్రాప్ డౌన్ లిస్ట్ యొక్క arrow మీద దానిని ఎక్స్‌పాండ్ చేయడానికి క్లిక్ చేయండి.
05:56 లిస్ట్ నుండి 'Nothing' ఎంపిక చేయండి.
05:59 డయలాగ్ బాక్స్ క్లోస్ చేయడానికి 'Close' మీద క్లిక్ చేయండి.
06:03 మనం అడ్రెస్ బార్‌కి మరల వెళ్ళి 'gma' అని టైప్ చేద్దాము. ఏ సజెషన్స్ రాకపోవడం గమనించండి.
06:09 ఇది మొజిల్లా ఫైర్‌ఫాక్స్ - సర్చింగ్ మరియు ఆటో-కంప్లీట్ ఫీచర్స్ మీద ట్యుటోరియల్ సమాప్తం చేస్తుంది.
06:16 ఈ ట్యుటోరియల్‌లో మనము సెర్చ్ ఎలా ఉపయోగించాలో, సెర్చ్ ఇంజన్ ఎలా మానేజ్ చేయాలో, ఫైండ్ బార్, ఆటో కంప్లీట్ మరియు అడ్రెస్ బార్‌లను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము.
06:27 ఈ కాంప్రిహెన్‌షన్ టెస్ట్ అసైన్‌మెంట్ ప్రయత్నించండి.
06:30 సెర్చ్ బార్‌లోని సెర్చ్ ఇంజన్‌ను "Yahoo"కు మార్చండి.
06:34 'spoken tutorial' కొరకు సెర్చ్ చేయండి.
06:36 మొదటి ఫలితం మీద క్లిక్ చేయండి.
06:40 "video" అన్న పదం ఎన్ని సార్లు కనపడుతుందో కనుగొనండి.
06:44 పదము "video" యొక్క అన్ని ఇన్స్టన్సెస్ వెబ్‌పేజ్‌లో హైలైట్ చేయడం కోసం 'Highlight all' మీద క్లిక్ చేయండి.
06:51 http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorialలో అందుబాటులో ఉన్న వీడియో చూడండి.
06:54 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ను సంగ్రహపరుస్తుంది.
06:58 మీకు మంచి బాండ్‌విడ్త్ లేని పక్షములో, మీరు దానిని డౌన్‌లోడ్ చేసుకుని చూడవచ్చు.
07:02 స్పోకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంది.
07:08 ఆన్‌లైన్ టెస్ట్ పాస్ అయినవారికి యోగ్యతాపత్రాలను ఇస్తుంది.
07:11 మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.orgకి వ్రాయండి.
07:18 స్పోకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగము.
07:22 అది నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్, ICT, MHRD, భారత ప్రభుత్వము చేత సహకరించబడుతోంది.
07:30 ఈ మిషన్ మీద మరింత సమాచారం spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Introలో అందుబాటులో ఉంది.
07:41 ఈ ట్యుటోరియల్ DesiCrew Solutions Pvt. Ltd. చేత కాంట్రిబ్యూట్ చేయబడుతోంది.
07:46 చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Sneha, Yogananda.india