Firefox/C2/Searching-and-Auto-complete/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 మొజిల్లా ఫయర్ ఫాక్స్ - సర్చ్ మరియు ఆటో-కంప్లీట్ ఫీచర్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకోబోయే ఆంశాలు- సర్చ్ ను ఎలా ఉపయోగించాలి, సర్చ్ ఇంజన్స్ ఎలా నిర్వహించాలి, ఫైండ్ బార్‌ను ఎలా ఉపయోగించాలి.
00:15 అడ్రెస్ బార్‌లో ఆటో-కంప్లీట్ ఎలా ఉపయోగించాలి.
00:18 ఈ ట్యుటోరియల్‌లో, ఫయర్ ఫాక్స్ వర్షన్ 7.0, ఉబుంటు 10.04 పైన ఉపయోగిస్తున్నాము
00:26 ఇంటర్నెట్ పైన మనుషులు చేసే అత్యంత సాధారణమైన పని సమాచారం కోసం వెదకడం.
00:31 ఒక నిర్దిష్టమైన వెబ్‌సైట్ కోసం లేదా కొంత ఇతర సమాచారం కోసం వెదకవచ్చు.
00:37 ఇంటర్నెట్ పై సమాచారం వెదకడం సులభం చేయడానికి మొజిల్లా ఫయర్ ఫాక్స్ వద్ద అనేక కార్యాచరణాలు ఉన్నయి.
00:44 మనం వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాము.
00:47 వెదుకుటకు ఒక పధ్ధతి ఇతర వెబ్ సైట్ లను సందర్శించడం.
00:50 ఎందుకంటే సర్చ్ ఇంజన్లు కూడా వెబ్ సైట్లే కాబట్టి!
00:54 URL బార్‌లో, www.google.com అని టైప్ చేయండి.
00:59 గూగుల్ హోమ్ పేజ్ కనపడుతుంది.
01:01 గూగుల్ హోమ్ పేజ్ లోని సర్చ్ బాక్స్ లో, email అని టైప్ చేసి >> సర్చ్ క్లిక్ చేయండి.
01:07 సర్చ్ ఇంజన్ అన్ని ఫలితాలను చూపుతుంది.
01:10 మనం మొదటి ఫలితంగా gmail , అంటే గూగుల్ యొక్క email ను చూడగలము.
01:16 కానీ మొజిల్లా ఫయర్ ఫాక్స్ లో పని చేయడానికి ఒక సులువైన మార్గం ఉంది.
01:20 నావిగేషన్ టూల్‌బార్ లోని URL బార్‌కు ప్రక్కన, ఒక సర్చ్ బార్ ఫీల్డ్ ఉంది.
01:26 ప్రత్యామ్నాయంగా, సర్చ్ బార్ ఫీల్డ్‌లోకి నేరుగా వెళ్ళడానికి CTRL+k ని నొక్కగలరు.
01:33 సర్చ్ బార్ పైన క్లిక్ చేసి, email అని టైప్ చేయండి.
01:36 దాని ప్రక్కన ఉన్న మాగ్నిఫయింగ్ గ్లాస్ (భూతద్దం) ఐకాన్‌ను క్లిక్ చేయండి.
01:40 కంటెంట్స్ ఏరియాలో శోధన ఫలితాలను చూస్తాము.
01:44 మనం మొదటి ఫలితంగా gmail , అంటే గూగుల్ యొక్క email ను చూడగలము.
01:50 సర్చ్ బార్ ఎడమ వైపున, ఫలితాలను ప్రదర్శించడానికి ఉపయోగించిన సర్చ్ ఇంజన్ లోగో కనపడుతుంది.
01:58 మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఉపయోగించే డిఫాల్ట్ సర్చ్ ఇంజన్ google.
02:02 కానీ మనకు ఆ నిర్బంధానం లెదు. మనకు నచ్చిన సర్చ్ ఇంజన్‌ను ఎంచుకోవచ్చు.
02:08 సర్చ్ బార్‌ లోపల గూగుల్ సర్చ్ ఇంజన్ యొక్క లోగో పై క్లిక్ చేయండి.
02:12 డ్రాప్ డౌన్ బాక్స్ లో ప్రజాదరణ పొందిన సర్చ్ ఇంజిన్ ల లోగోలు, Yahoo మరియు Bingతో సహా కనబడుతాయి.
02:21 డ్రాప్ డౌన్ బాక్స్ నుండి Yahoo ఎంచుకోండి.
02:24 సర్చ్ బార్ యొక్క ఎడమ వైపు ఉన్న లోగో ఇప్పుడు Yahoo లోగోగా మారడం గమనించండి.
02:30 మనం మళ్ళీ సర్చ్ బార్‌లో email అని టైప్ చేసి మాగ్నిఫయింగ్ గ్లాస్‌ను క్లిక్ చేద్దాం
02:36 ఈ సారి కంటెంట్ ఏరియాలో కనపడే ఫలితాలు Yahoo సర్చ్ ఇంజన్ నుండి వచ్చాయి అని చూడవచ్చు.
02:42 ఫలితాలు మునుపటి సారి కంటే కొద్దిగా భిన్నంగా ఉండుట గమనించండి.
02:46 మొదటి ఫలితంగా ఇకపై Gmail కాదు. దానికి బదులుగా Yahoo(యాహూ) మెయిల్‌ కనపడుతుంది.
02:53 సర్చ్ బార్‌లోపల సర్చ్ ఇంజన్ లోగోను మళ్ళి క్లిక్ చేయండి.
02:57 డ్రాప్ డౌన్ బాక్స్ లో, Manage Search Engines(మేనేజ్ సర్చ్ ఇంజిన్స్) ఎంచుకోండి.
03:01 Manage Search Engines list(మేనేజ్ సెర్చ్ఇంజిన్స్ లిస్ట్ ) అనే డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
03:07 జాబితాలో ని చివరి ఐటెమ్ పై క్లిక్ చేయండి.
03:10 కుడి వైపు ఉన్న బటన్స్ క్రియాశీలత పొందుతాయి. Remove(రిమువ్ ) బటన్ పై క్లిక్ చేయండి.
03:16 మనం ఎంచుకున్న ఐటమ్, జాబితాలో ఇకపై లేదని గమనించండి.
03:21 డయలాగ్ బాక్స్ మూసివేయుటకు OK పై క్లిక్ చేయండి.
03:24 సర్చ్ బార్ లోపల సర్చ్ ఇంజన్ లోగో పై మళ్ళి క్లిక్ చేయండి.
03:29 Manage Search Engines(మేనేజ్ సర్చ్ ఇంజిన్స్) పై క్లిక్ చేయండి.
03:32 Manage Search Engines list (మేనేజ్ సర్చ్ ఇంజిన్స్ లిస్ట్) డయలాగ్ బాక్స్ పాపప్ అవుతుంది.
03:37 డయలాగ్ బాక్స్ క్రింద Get more search engines... అనే లింకు కనపడుతుంది.
03:42 దాని పై క్లిక్ చేయండి. ఒక కొత్త బ్రౌజర్ టాబ్ తెరుచుకుంటుంది.
03:46 ఇది సర్చ్ బార్‌కు జోడించే సర్చ్ ఇంజన్ల యొక్క సంఖ్య ప్రదర్శిస్తుంది
03:51 మీరు మీ అవసరాలకు అనుగుణంగా ఏవైనా సర్చ్ ఇంజన్ల జోడించవచ్చు.
03:55 మనము టాబ్ మూలలో ఉన్న x పై క్లిక్ చేసి ఈ టాబ్ ను మూసివేద్దాం
04:00 మనం Find bar సహాయముతో కంటెంట్స్ ఏరియాలో ఉన్న నిర్దిష్టమైన టెక్స్ట్ ను కనుగొనగలం
04:07 URL బార్‌లో, www.gmail.com అని టైపు చేసి ఎంటర్ నొక్కండి
04:13 gmail హోమ్ పేజ్ లోడ్ కాగానే, Edit పై క్లిక్ చేసి ఆ తర్వాత, Find పై న క్లిక్ చేయండి.
04:19 బ్రౌజర్ విండో క్రింద ఒక Find bar కనపడుతుంది.
04:22 Find bar యొక్క టెక్స్ట్ బాక్స్‌లో, gmail అని టైప్ చేయండి.
04:28 టైప్ చేస్తుండగానే, కంటెంట్ ఏరియాలో ఆ టెక్స్ట్ యొక్క మొదటి నిదర్శనము హైలైట్ అవ్వడం చూడగలం
04:36 Next (నెక్స్ట్) పై క్లిక్ చేయడం తో పదం యొక్క తరువాతి నిదర్శనము వైపు దృష్టి వెళ్తుంది
04:41 Previous పై క్లిక్ చేయడం తో పదం యొక్క మునుపటి నిదర్శనము వైపు దృష్టి వెళ్తుంది
04:46 Highlight all ఎంపిక పై క్లిక్ చేయండి.
04:49 మనం కంటెంట్స్ ఏరియాలో శోధన టెక్స్ట్ యొక్క అన్నీ నిదర్శనాలు హైలైట్ అవడం చూడవచ్చు.
04:56 మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఆటో-కంప్లీట్ ఫంక్షన్‌తో URL బార్లో వెబ్ అడ్రెసెస్ ను టైప్ చేయడం సులభతరం చేస్తుంది.
05:04 మనం అడ్రెస్ బార్‌లో మొత్తం వెబ్ అడ్రెస్ టైప్ చేయాల్సిన అవసరం లేదు.
05:08 ఇది ప్రయత్నించండి. అడ్రెస్ బార్‌లో gma అని టైప్ చేయండి.
05:12 మొజిల్లా ఫయర్ ఫాక్స్ మనం టైప్ చేస్తోన్న పదాన్ని ఆటో-కంప్లీట్ చేయుటకు ప్రయత్నిస్తుందని గమనించండి.
05:17 ఇది gma తో మొదలయ్యే వెబ్ సైట్ల ఒక డ్రాప్ డౌన్ జాబితా చూపిస్తుంది.
05:23 డ్రాప్ డౌన్ జాబితా నుండి gmail లింక్ ను ఎంచుకోండి
05:27 కంటెంట్స్ ఏరియాలో gmail వెబ్‌పేజ్ లోడ్ అవుతుంది.
05:30 మనకు ఈ లక్షణం నచ్చకపోతే మనం దానిని తెసివేయ్యవచ్చు.
05:34 Edit పై క్లిక్ చేసి తర్వాత Preferences పైన క్లిక్ చేయండి.
05:37 విండోస్ వినియోగదారులు, Tools పై క్లిక్ చేసి Options పైన క్లిక్ చేయవచ్చు.
05:41 మెయిన్ మెను టాబ్స్ యొక్క జాబితా నుండి Privacy ట్యాబ్ను ఎంచుకోండి.
05:46 డయలాగ్ బాక్స్ యొక్క క్రింది భాగమున, When using location bar, suggest అనే ఎంపిక ఉంది.
05:53 దానిని విస్తరించుటకు డ్రాప్ డౌన్ జాబితా యొక్క యారో ను క్లిక్ చేయండి
05:56 జాబితా నుండి Nothing ఎంచుకోండి.
05:59 డయలాగ్ బాక్స్ ను మూసి వెయ్యడానికి Close పైన క్లిక్ చేయండి.
06:03 అడ్రెస్ బార్‌ లో gma అని మరల టైప్ చేసినప్పుడు ఏ సలహా రాకపోవడం గమనించండి .
06:09 ఇంతటితో మొజిల్లా ఫయర్ ఫాక్స్ - సర్చింగ్ మరియు ఆటో-కంప్లీట్ ఫీచర్స్ పై ట్యుటోరియల్ ముగుస్తుంది.
06:16 ఈ ట్యుటోరియల్‌లో మనము సర్చ్ ఎలా ఉపయోగించాలో, సర్చ్ ఇంజన్ ఎలా నిర్వహించాలో , ఫైండ్ బార్, ఆటో కంప్లీట్ మరియు అడ్రెస్ బార్‌లను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము.
06:27 ఈ కాంప్రిహెన్‌షన్ టెస్ట్ అసైన్‌మెంట్ ను ప్రయత్నించండి.
06:30 సర్చ్ బార్‌లోని సర్చ్ ఇంజన్‌ను Yahooకు మార్చండి.
06:34 spoken tutorial కొరకు సర్చ్ చేయండి.
06:36 మొదటి ఫలితం మీద క్లిక్ చేయండి.
06:40 video అన్న పదం ఎన్ని సార్లు కనపడుతుందో కనుగొనండి.
06:44 video పదము యొక్క అన్ని నిదర్శనాలు వెబ్‌పేజ్‌లో హైలైట్ చేయడం కోసం Highlight all పైన క్లిక్ చేయండి.
06:51 ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
06:54 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ను సారాంశాన్ని తెలుపుతుంది.
06:58 మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
07:02 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది.
07:08 ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది.
07:11 మరిన్ని వివరాల కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:18 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము.
07:22 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
07:30 ఈ మిషన్ మీద మరింత సమాచారం spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Introలో అందుబాటులో ఉంది.
07:41 ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి.
07:46 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Sneha, Yogananda.india