Drupal/C3/Drupal-Site-Management/Telugu
Time | Narration |
00:01 | ద్రుపల్ సైట్ మానేజ్మెంట్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది-
రిపోర్ట్ లను వీక్షించుట, ద్రుపల్ ని నవీకరించుట, మోడ్యూల్స్ మరియు థీమ్ లను నవీకరించుట, పాత వర్షన్ ని రిస్టోర్ చేయుట. |
00:18 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి-
ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు. |
00:33 | సైట్ మానేజ్మెంట్ అంటే ఏమిటి?
సైట్ నిర్వహణ అంటే: దృపల్ వెనుక ఉన్న కోడ్‌ని నవీకరించుట అనగా కోర్, మాడ్యూల్స్ మరియు థీమ్స్. |
00:44 | ఎర్రర్స్‌ని పరిశీలించి సరిచేయుట, యూసర్ల ప్రవర్తన అధ్యయనం చేయడం మొదలైనవి. |
00:51 | మనం ముందుగా నిర్మించిన వెబ్‌సైట్‌ని తెరుద్దాం. |
00:56 | సైట్ మానేజ్మెంట్ యొక్క ఆరంభ బిందువు రిపోర్ట్స్ మెనూ. మీకు అదనపు సహాయం అవసరం ఉంటే, హెల్ప్ మెనుని కూడా సంప్రదించవచ్చు. |
01:07 | Reports పై క్లిక్ చేయండి. మన ద్రుపల్ సైట్ పై పొందగలిగే రిపోర్ట్ ల జాబితా చూస్తారు. |
01:14 | Available Updates పై క్లిక్ చేయండి. |
01:17 | ఏదైనా ఎరుపు నేపథ్యంలో ఉంటే, ఒక security update అనగా భద్రతా నవీకరణ ఉందని అర్థం మరియు దానిని త్వరలోనే అప్డేట్ చేయాలి |
01:25 | పసుపు రంగులో ఉంటే, అది ఒక భద్రతా నవీకరణ కాదు కానీ ఒక మెరుగైన వెర్షన్ అందుబాటులో ఉందని అర్థం. |
01:33 | సెట్టింగ్స్ టాబ్ పైన, మనము ద్రుపలకి తరచుగా నవీకరణలను ఎలా తనిఖీ చేయాలో చెప్పవచ్చు. |
01:40 | అప్డేట్ లు ఉంటే మనకు ఇమెయిల్ పంపమని ద్రుపల్కి చెప్పవచ్చు. దానిని చేయుటకు సిఫార్సు చేయబడినది. |
01:50 | రిపోర్ట్స్ క్రింద Recent log messages, ద్రుపల్ ద్వారా కనుగొనబడిన ఎర్రర్ల జాబిత ఇస్తుంది. వీటిని అప్పుడప్పుడు చూడాలి. |
02:01 | రిపోర్ట్స్ క్రింద Status report , ద్రుపల్ ద్వారా గుర్తించబడిన ఇన్స్టలేషన్ లేదా కన్ఫిగరేషన్ సమస్యలను చూపిస్తుంది. |
02:10 | ఉదాహరణకు-
నేను MySQL 5.6.30 పై ఉన్నాను మరియు నా ద్రుపల్ కోర్ స్టేటస్ అప్ టు డేట్ లేదు, నా డేటాబేస్ అప్ టు డేట్ ఉంది మొదలైనవి. |
02:25 | రిపోర్ట్స్ క్రింద Top 'access denied' errors మరియు Top 'page not found' errors కూడా ముఖ్యమైనవి. |
02:34 | మన సైట్ చాల బాగా పని చేస్తుందని నిర్ధారించడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి. |
02:41 | Top search phrases మీ సైట్ పై శోధన రూపాలుగా తరచూ వాడబడిన పదాలు అందిస్తుంది. |
02:49 | మన ద్రుపల్ వెబ్సైట్ లో రిపోర్టింగ్ విభాగం గూర్చి అర్థం చేసుకోవడం సైట్ ని నిలబెట్టడానికి ముందడుగు. |
02:57 | తరువాత, ద్రుపల్ని అప్డేట్ చేయడం తెలుసుకుందాం. |
03:01 | Available Updates పై క్లిక్ చేయండి. |
03:04 | ద్రుపల్ కోర్ యొక్క ప్రస్తుత వర్షన్ 8.1.0 మరియు సిఫార్సు చేసిన వర్షన్ 8.1.6 అని చూడవచ్చు. |
03:15 | ఇది రికార్డింగ్ చేసే సమయంలో ఉన్న స్థితి. |
03:20 | మీరు ఇక్కడ వేరే సిఫార్సు చేసిన వర్షన్‌ని చూడవచ్చు. |
03:24 | ద్రుపల్ యొక్క ప్రస్తుత సిఫార్సు చేసిన వర్షన్ కనుగొనేందుకు మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అని గమనించండి. |
03:32 | ద్రుపల్ కోర్ యొక్క నవీకరణ కోసం కోడ్ ఫైళ్ళను మాన్యువల్ గా డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది మరియు దానిని సైట్ పై అప్లై చెయ్యాలి. |
03:40 | మీరు అప్‌గ్రేడింగ్ ప్రక్రియ ను అంచెలంచెలుగా చూస్తారు. |
03:45 | Bitnami ద్రుపల్ స్టాక్ కి ఈ క్రింది సోపానాలు వర్తిస్తాయి. |
03:50 | కానీ ఇక్కడ ఉన్న చాలా సోపానాలు, ఏ ఇతర ద్రుపల్ సంస్థాపనా కైనా వర్తిస్తాయి. |
03:57 | మొదటి సోపానం:
మీ సైట్ ని Maintenance modeలో పెట్టండి. |
04:03 | దాని కోసం 'Configurationకి వెళ్ళి, Development క్రింద ఉన్న Maintenance modeని క్లిక్ చేయండి. |
04:11 | Put site into maintenance mode ఎంపిక ని చెక్ చేయండి. |
04:16 | సేవ్ కన్ఫిగరేషన్ బటన్‌పై క్లిక్ చేయండి. |
04:19 | Maintenance mode సక్రియంగా ఉన్నపుడు అడ్మిస్ట్రేటర్ లు మాత్రమే లాగిన్ చేయవచ్చు. |
04:26 | ఒకవేళ మీరు పొరపాటున అడ్మిన్ నుండి లాగ్ అవుట్ చేస్తే, మీ హోమ్ పేజీ యొక్క URL /user నుండి తరువాత లాగిన్ చేయవచ్చు. |
04:37 | ఇతరులు సైట్ నిర్వహణలో ఉందని ఒక సందేశాన్ని చూస్తారు. |
04:42 | రెండవ సోపానం:
మనము డేటాబేస్ యొక్క ప్రస్తుత వర్షన్‌ని బ్యాకప్ చేయాలి. |
04:47 | Bitnami Drupal Stack యొక్క కంట్రోల్ విండో తెరవండి. |
04:52 | ఈ నియంత్రణ విండోను ఎలా తెరవాలో తెలుసుకొనుటకు ద్రుపల్ సంస్థాపన ట్యుటోరియల్ ని చూడండి. |
05:00 | Open PhpMyAdmin బటన్ పై క్లిక్ చేయండి. |
05:05 | మనము phpmyadmin పేజీ కి మళ్ళించబడుతాము. |
05:10 | డిఫాల్ట్ యూజర్పేరు రూట్. |
05:13 | ద్రుపల్ అడ్మిన్ పాస్ వర్డ్ మరియు phpMyAdmin పాస్వర్డ్ రెండు ఒకటే. |
05:20 | యూసర్ నేమ్ ని రూట్ టైప్ చేసి, ద్రుపల్ అడ్మిన్ పాస్వర్డ్ టైప్ చేయండి ఆ తరువాత Go బటన్ క్లిక్ చేయండి. |
05:29 | బ్యాక్ అప్ తీసుకోవడానికి మొదట పనెల్ ఎగువన ఉన్న Export బటన్ క్లిక్ చేయండి. |
05:36 | ఆ పై Export method ని Custom గా ఎంచుకోండి. |
05:40 | డేటాబేస్ జాబిత క్రింద ఉన్న bitnami_drupal8 ని ఎంచుకోండి. |
05:45 | అవుట్ ఫుట్ విభాగం క్రింద ఫైల్ నేమ్ టెంప్లేట్ ని drupal-8.1.0 ఇచ్చి, కంప్రెషన్ ని gzipped గా సెట్ చేయండి. |
05:58 | మీ ప్రస్తుత వర్షన్ బట్టి ఫైల్ నేమ్ భిన్నంగా ఉండవచ్చు. |
06:03 | Object creation options విభాగం క్రింద Add DROP DATABASE statement ఎంపిక పై చెక్ మార్క్ పెట్టండి. |
06:12 | Add DROP TABLE ఎంపిక పై చెక్ మార్క్ పెట్టండి. |
06:16 | క్రిందికి స్క్రోల్ చేసి దిగువన ఉన్న Go బటన్ క్లిక్ చేయండి. |
06:21 | ఫైల్ సేవ్ చేయుటకు OK బటన్ క్లిక్ చేయండి. |
06:25 | మీ Downloads ఫోల్డర్ కి వెళ్ళి బ్యాక్ అప్ ఫైల్ drupal-8.1.0.sql.gz ని తనిఖీ చేయండి. |
06:36 | మూడవ సోపానం:
మనం అన్ని సర్వర్ లను షట్ డౌన్ చేయాలి |
06:42 | అన్ని నడుస్తున్న సర్వర్లు ఆపడానికి Bitnami Drupal Stack కంట్రోల్ విండో కి వెళ్ళండి. |
06:49 | Manage Servers ట్యాబ్ పై క్లిక్ చేసి ఆ పై Stop All బటన్ పై క్లిక్ చేయండి. |
06:56 | నాలుగోవ సోపానం:
Welcome ట్యాబ్ మరియు ఆ పై Open Application Folder బటన్ ల పై క్లిక్ చేయండి. |
07:04 | ఇది ఫైల్ని బ్రౌసర్ లో తెరుస్తుంది. |
07:07 | apps, drupal మరియు చివరికి htdocs ఫోల్డర్లు నావిగేట్ చేయండి. |
07:15 | ఐదవ సోపానం:
ద్రుపల్ యొక్క ప్రస్తుత వర్షన్ కోసం కోడ్ బ్యాకప్ చేయుటకు ఒక ఫోల్డర్ సృష్టించాలి. |
07:24 | ఈ ఫోల్డర్ కి ప్రస్తుత వర్షన్ యొక్క పేరు పట్టండి. |
07:29 | తదుపరి బ్యాక్ అప్ డేటాబేస్ ఫైల్ ని drupal-8.1.0 కి తరలించండి. |
07:36 | ఆరవ సోపానం:
htdocs ఫోల్డర్ కి వెళ్ళండి. |
07:42 | తదుపరి కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు అన్ని ఇతర ఫైళ్ళను కట్ మరియు పేస్ట్ పద్దతి లో బ్యాక్ అప్ ఫోల్డర్ drupal-8.1.0 కి తరలించండి. |
07:55 | ఇది డేటాబేస్ మరియు కోడ్ లను ఒకే స్థానం లో ఉంచుతుంది. |
08:00 | ఇది కోర్ యొక్క పాత వర్షన్ బ్యాక్ అప్ కాపీ, మీకు గనక వెనక్కి రెవెర్ట్ చెయ్యాల్సి ఉంటే. |
08:07 | ఏడవ సోపానం:
మన htdocs ఫోల్డర్ కి వెళ్ళండి. |
08:13 | తదుపరి ద్రుపల్ యొక్క నూతన వర్షన్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. |
08:18 | మీ బ్రౌసర్ ని తెరిచి, చూపించిన లింక్ కి వెళ్ళండి:https://www.drupal.org/project/drupal. |
08:24 | ద్రుపల్ 8 యొక్క నూతన సిఫార్సు చేసిన వర్షన్‌ని డౌన్లోడ్ చేసుకోండి |
08:28 | రికార్డింగ్ చేసే సమయం లో అది Drupal core 8.1.6 ఉండేది. |
08:35 | ఈ వర్షన్ మీరు చూస్తున్నప్పుడు భిన్నంగా ఉండవచ్చు. |
08:40 | తెరుచుటకు దాని పై క్లిక్ చేయండి. |
08:43 | డౌన్లోడ్ చేయుటకు tar.gz లేదా zip ఫైల్ క్లిక్ చేయండి. |
08:49 | ఫైల్ సేవ్ చేయుటకు OK బటన్ క్లిక్ చేయండి. |
08:53 | మీ Downloads ఫోల్డర్ కి వెళ్ళి ద్రుపల్ జిప్ ఫైల్ ని htdocs ఫోల్డర్ కి తరలించండి. |
09:01 | drupal-8.1.6.zip ఫైల్, ఈ ట్యుటోరియల్ వెబ్ పేజీ యొక్క Code files లింక్ లో అందించబడింది. |
09:11 | మీకు ఇంటర్ నెట్ కనెక్షన్ లేక పొతే, దానిని డౌన్లోడ్ చేసి ఉపయోగించండి. |
09:18 | ఎనిమిదవ సోపానం:
ఫైల్ ని Unzip చేయండి. ఇది drupal-8.1.6అనే ఫోల్డర్ ని htdocs ఫోల్డర్ లో సృష్టిస్తుంది. |
09:30 | ఫైల్ తెరుచుటకు దాని పై డబల్ క్లిక్ చేయండి. |
09:34 | కొత్త ద్రుపల్ ఫోల్డర్ నుండి కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు ఇతర సాధారణ ఫైళ్ళను htdocs ఫోల్డర్ కి తరలించండి. |
09:44 | తొమ్మిదవ సోపానం:
Bitnami Drupal Stack కంట్రోల్ విండో కు వెళ్ళండి. |
09:51 | ఇప్పుడు Manage Servers ట్యాబ్ కి వెళ్ళి, Start All బటన్ పై క్లిక్ చేసి అన్ని సర్వర్లు మొదలు పెట్టండి. |
10:00 | పదవ సోపానం:
Welcome ట్యాబ్, Go to Application బటన్ మరియు Access Drupal లింక్ లను క్లిక్ చేసి, మన సైట్ ను సందర్శించండి. |
10:12 | రిపోర్ట్స్ ఆ పై స్టేటస్ రిపోర్ట్ కి వెళ్ళండి. |
10:17 | ఇక్కడ, ద్రుపల్ వర్షన్ సంఖ్య నూతనమైనదని ధృవీకరించవచ్చు. |
10:24 | కానీ మన డేటా బేస్ అవుట్ అఫ్ డేట్ అయింది. |
10:27 | ప్రతి సారి కోర్, మాడ్యూల్ లేదా ఒక థీమ్ ని అప్డేట్ చేస్తే డేటాబేస్ ని కూడా అప్డేట్ చేయాలి |
10:36 | పదకొండవ సోపానం:
డేటాబేస్‌ని అప్డేట్ చేయడం నేర్చుకుందాం. |
10:42 | ఎక్స్టెండ్ మెనూ కి వెళ్ళి update script లింక్ పై క్లిక్ చేయండి. |
10:47 | Continue బటన్ క్లిక్ చేయండి. |
10:51 | ఇక్కడ కొన్ని పెండింగ్ అప్డేట్స్ ఉన్నాయని చెపుతుంది. మీకు కొంచం భిన్నంగా ఉండవచ్చు. |
10:58 | Apply pending updates బటన్ పై క్లిక్ చేయండి. |
11:04 | Administration pages లింక్ క్లిక్ చేయండి. |
11:08 | ఇక్కడ ఏ లోపాలు లేవు మనం విజయవంతంగా కోర్ని నవీకరించాము. |
11:14 | పన్నెండోవ సోపానం:
Go online లింక్ క్లిక్ చేయండి. |
11:18 | Put site to maintenance mode ఎంపిక పై చెక్ మార్క్ తీసివెయ్యండి. |
11:25 | Save configuration బటన్ క్లిక్ చేయండి. |
11:29 | ఇది అన్ని యూసర్ లకు సైట్ ని ఆన్లైన్ మోడ్ లోకి తీసుకెళ్తుంది. |
11:34 | ఇప్పటివరకు చర్చించిన సోపానాలు Bitnami సంస్థాపన కోసం పని చేస్తాయి. |
11:40 | మీరు ఇతర పద్ధతులు ఉపయోగించి ఉంటే, చాలా సోపానాలు ఒకేలా ఉంటాయి, Bitnami విభాగాలకు తప్ప. |
11:48 | థీమ్స్ మరియు మాడ్యూల్స్ ని నవీకరించడం నేర్చుకుందాం. |
11:53 | ఇది చాల సులభం కోర్ నవీకరణని పోలిస్తే, ఎందుకంటే ద్రుపల్ దానిని ఒక బటన్ క్లిక్ తో పూర్తీ చేస్తుంది. |
12:01 | కొన్ని సార్లు మనకు కేవలం మాడ్యూల్స్ లేదా థీమ్స్ యొక్క అప్డేట్లు మాత్రమే ఉంటాయి కోర్ నవీకరణ లేకుండా. |
12:09 | ఒకటవ సోపానం:
రిపోర్ట్స్ మెనూ ఆ పై Available updates పై క్లిక్ చేయండి. |
12:15 | Update ట్యాబ్ క్లిక్ చేయండి. |
12:19 | ఇక్కడ కొన్ని థీమ్స్ మరియు మాడ్యూల్స్ ని అప్డేట్ చెయ్యాలని గమనించండి. |
12:25 | అన్నిటిని ఎంచుకోండి. |
12:28 | ఆ పై Download these updates బటన్ క్లిక్ చేయండి. |
12:33 | performing updates in maintenance mode చెక్ బాక్స్ ఆన్ చేసి ఉందని నిర్ధారించుకోండి. |
12:39 | అప్డేట్ ని అప్లై చేయుటకు Continue బటన్ క్లిక్ చేయండి. |
12:43 | ఇది కోడ్ ని నవీకరించి సైట్ ని ఆన్లైన్ మోడ్ లోకి తెస్తుంది. |
12:49 | రెండవ సోపానం:
Run database updates లింక్ క్లిక్ చేయండి. |
12:55 | డేటాబేస్ బ్యాక్ అప్ చెయ్యకపోతే, ఇంతక ముందు చేసినట్టు చేయండి. |
13:01 | Continue బటన్ క్లిక్ చేయండి. |
13:04 | మనం కోర్ని అప్డేట్ చేసి నట్లు ఇది డేటాబేస్ ని అప్డేట్ చేస్తుంది. |
13:09 | Apply pending updates బట న్ క్లిక్ చేయండి. |
13:14 | Administration pages లింక్ క్లిక్ చేయండి. |
13:18 | పల్ సైట్ ని సాధారణంగా ఆన్ లైన్ మోడ్ కి తెస్తుంది. |
13:24 | ఇలా జరగక పొతే, మీరు పేజీ ఎగువన Go online అనే ఎంపిక ని చూస్తారు. |
13:33 | మూడవ సోపానం:
చివరిగా ఆంతా అప్ టు డేట్ ఉందా అని తనిఖీ చేద్దాం. |
13:39 | Reports మెనూ మరియు Available updates పై క్లిక్ చేయండి. |
13:44 | ఇక్కడ మన ద్రుపల్ కోర్, మాడ్యూల్స్ మరియు థీమ్స్ ప్రతిదీ అప్ టు డేట్ ఉంది. |
13:51 | పాత వర్షన్ కి ఎలా రెవెర్ట్ చెయ్యాలో నేర్చుకుందాం. |
13:56 | మనకు తెలిసో తెలియకో నవీకరణ విఫలమైతే, మనం మునుపటి వెర్షన్‌కి వెళ్ళవచ్చు. |
14:05 | దీని కోసం మనం పాత కోర్ మరియు డేటాబేస్లను పునరుద్ధరించాలి. |
14:10 | ఒకటవ సోపానం:
సైట్ ని Maintenance modeలో పెట్టండి. |
14:17 | రెండవ సోపానం:
అన్ని సర్వర్స్ ని Drupal Stack Control విండో నుండి స్టాప్ చేయండి |
14:25 | మూడవ సోపానం:
htdocs ఫోల్డర్ తెరవండి. |
14:30 | కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు ఇతర సాధారణ ఫైళ్ళను drupal-8.1.0 ఫోల్డర్ కి తరలించండి. |
14:40 | htdocs ఫోల్డర్ కి వెళ్ళి పాత వర్షన్ ఫోల్డర్ ని తెరవండి. |
14:44 | ఆ పై కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు ఇతర సాధారణ ఫైళ్ళను drupal-8.1.0 నుండి htdocs ఫోల్డర్ కి తరలించండి. |
15:00 | నాలుగోవ సోపానం:
Apache మరియు MySQL servers ని Drupal Stack Control విండో నుండి మొదలు పెట్టండి. |
15:11 | అయిదవ సోపానం:
పాత డేటాబేస్‌ని పునరుద్ధరించడం. |
05:15 | ద్రుపల్ స్టాక్ కంట్రోల్ విండో నుండి phpMyAdmin పేజీ ని తెరవండి. |
15:23 | ఎగువ ప్యానెల్లో ని Import బటన్‌పై క్లిక్ చేయండి. |
15:27 | Browse బటన్‌పై క్లిక్ చేయండి. |
15:30 | ఇక్కడ బ్యాక్ అప్ డేటాబేస్ ఫైల్ ఎంచుకుంటాము. |
15:34 | ఆ పై దిగువన ఉన్న 'గో' బటన్ క్లిక్ చేయండి. |
15:38 | ఆరవ సోపానం:
చివరి సోపానం మనం పాత వర్షన్ కి వచ్చామా లేదా అని తనిఖీ చేయడం. |
15:45 | ద్రుపల్ సైట్ కి వెళ్ళండి. |
15:49 | Reports మెనూ మరియు Status report పై క్లిక్ చేయండి. |
15:52 | ఇక్కడ మన ద్రుపల్ వర్షన్ 8.1.0 అని చూడగలం. |
15:59 | మనం కోర్ మరియు డేటాబేస్ లని మాత్రమే పాత వెర్షన్ కి రెవెర్ట్ చేయగలమని గమనించండి. |
16:05 | ద్రుపల్ చే మాడ్యూల్స్ మరియు థమ్స్ అప్డేట్ చెయ్యబడ్డయి. |
16:10 | మనము ఆరోవా సోపానం లో దాని కాపీ చెయ్యలేదు అందుకే దాని పాత వర్షన్ లు ఇక్కడ చూడలేము. |
16:18 | దీనితో ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
16:22 | సారాంశం చూద్దాం. |
16:25 | ఈ ట్యుటోరియల్ లో మనం సైట్ మానేజ్మెంట్ యొక్క ముఖ్యమైన అంశాల గురించి నేర్చుకున్నాము.
రిపోర్ట్ లను వీక్షించడం మరియు విశ్లేషించడం, డేటాబేస్ మరియు కోడ్ యొక్క బ్యాకప్. |
16:39 | ద్రుపల్ కోర్ని నవీకరించడం, మాడ్యూల్స్ మరియు థీమ్స్‌ని నవీకరించడం మరియు ఒక బ్యాక్ అప్ వెర్షన్ యొక్క పునరుద్ధరణ. |
16:49 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. |
16:54 | దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
16:58 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్‌లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. |
17:03 | మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
17:06 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
17:22 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు. |