Drupal/C3/Drupal-Site-Management/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 ద్రుపల్ సైట్ మానేజ్మెంట్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది-

రిపోర్ట్ లను వీక్షించుట, ద్రుపల్ ని నవీకరించుట, మోడ్యూల్స్ మరియు థీమ్ లను నవీకరించుట, పాత వర్షన్ ని రిస్టోర్ చేయుట.

00:18 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి-

ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు.

00:33 సైట్ మానేజ్మెంట్ అంటే ఏమిటి?

సైట్ నిర్వహణ అంటే: దృపల్ వెనుక ఉన్న కోడ్ని నవీకరించుట అనగా కోర్, మాడ్యూల్స్ మరియు థీమ్స్.

00:44 ఎర్రర్స్ని పరిశీలించి సరిచేయుట, యూసర్ల ప్రవర్తన అధ్యయనం చేయడం మొదలైనవి.
00:51 మనం ముందుగా నిర్మించిన వెబ్సైట్ని తెరుద్దాం.
00:56 సైట్ మానేజ్మెంట్ యొక్క ఆరంభ బిందువు రిపోర్ట్స్ మెనూ. మీకు అదనపు సహాయం అవసరం ఉంటే, హెల్ప్ మెనుని కూడా సంప్రదించవచ్చు.
01:07 Reports పై క్లిక్ చేయండి. మన ద్రుపల్ సైట్ పై పొందగలిగే రిపోర్ట్ ల జాబితా చూస్తారు.
01:14 Available Updates పై క్లిక్ చేయండి.
01:17 ఏదైనా ఎరుపు నేపథ్యంలో ఉంటే, ఒక security update అనగా భద్రతా నవీకరణ ఉందని అర్థం మరియు దానిని త్వరలోనే అప్డేట్ చేయాలి
01:25 పసుపు రంగులో ఉంటే, అది ఒక భద్రతా నవీకరణ కాదు కానీ ఒక మెరుగైన వెర్షన్ అందుబాటులో ఉందని అర్థం.
01:33 సెట్టింగ్స్ టాబ్ పైన, మనము ద్రుపలకి తరచుగా నవీకరణలను ఎలా తనిఖీ చేయాలో చెప్పవచ్చు.
01:40 అప్డేట్ లు ఉంటే మనకు ఇమెయిల్ పంపమని ద్రుపల్కి చెప్పవచ్చు. దానిని చేయుటకు సిఫార్సు చేయబడినది.
01:50 రిపోర్ట్స్ క్రింద Recent log messages, ద్రుపల్ ద్వారా కనుగొనబడిన ఎర్రర్ల జాబిత ఇస్తుంది. వీటిని అప్పుడప్పుడు చూడాలి.
02:01 రిపోర్ట్స్ క్రింద Status report , ద్రుపల్ ద్వారా గుర్తించబడిన ఇన్స్టలేషన్ లేదా కన్ఫిగరేషన్ సమస్యలను చూపిస్తుంది.
02:10 ఉదాహరణకు-

నేను MySQL 5.6.30 పై ఉన్నాను మరియు నా ద్రుపల్ కోర్ స్టేటస్ అప్ టు డేట్ లేదు, నా డేటాబేస్ అప్ టు డేట్ ఉంది మొదలైనవి.

02:25 రిపోర్ట్స్ క్రింద Top 'access denied' errors మరియు Top 'page not found' errors కూడా ముఖ్యమైనవి.
02:34 మన సైట్ చాల బాగా పని చేస్తుందని నిర్ధారించడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి.
02:41 Top search phrases మీ సైట్ పై శోధన రూపాలుగా తరచూ వాడబడిన పదాలు అందిస్తుంది.
02:49 మన ద్రుపల్ వెబ్సైట్ లో రిపోర్టింగ్ విభాగం గూర్చి అర్థం చేసుకోవడం సైట్ ని నిలబెట్టడానికి ముందడుగు.
02:57 తరువాత, ద్రుపల్ని అప్డేట్ చేయడం తెలుసుకుందాం.
03:01 Available Updates పై క్లిక్ చేయండి.
03:04 ద్రుపల్ కోర్ యొక్క ప్రస్తుత వర్షన్ 8.1.0 మరియు సిఫార్సు చేసిన వర్షన్ 8.1.6 అని చూడవచ్చు.
03:15 ఇది రికార్డింగ్ చేసే సమయంలో ఉన్న స్థితి.
03:20 మీరు ఇక్కడ వేరే సిఫార్సు చేసిన వర్షన్ని చూడవచ్చు.
03:24 ద్రుపల్ యొక్క ప్రస్తుత సిఫార్సు చేసిన వర్షన్ కనుగొనేందుకు మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అని గమనించండి.
03:32 ద్రుపల్ కోర్ యొక్క నవీకరణ కోసం కోడ్ ఫైళ్ళను మాన్యువల్ గా డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది మరియు దానిని సైట్ పై అప్లై చెయ్యాలి.
03:40 మీరు అప్గ్రేడింగ్ ప్రక్రియ ను అంచెలంచెలుగా చూస్తారు.
03:45 Bitnami ద్రుపల్ స్టాక్ కి ఈ క్రింది సోపానాలు వర్తిస్తాయి.
03:50 కానీ ఇక్కడ ఉన్న చాలా సోపానాలు, ఏ ఇతర ద్రుపల్ సంస్థాపనా కైనా వర్తిస్తాయి.
03:57 మొదటి సోపానం:

మీ సైట్ ని Maintenance modeలో పెట్టండి.

04:03 దాని కోసం 'Configurationకి వెళ్ళి, Development క్రింద ఉన్న Maintenance modeని క్లిక్ చేయండి.
04:11 Put site into maintenance mode ఎంపిక ని చెక్ చేయండి.
04:16 సేవ్ కన్ఫిగరేషన్ బటన్పై క్లిక్ చేయండి.
04:19 Maintenance mode సక్రియంగా ఉన్నపుడు అడ్మిస్ట్రేటర్ లు మాత్రమే లాగిన్ చేయవచ్చు.
04:26 ఒకవేళ మీరు పొరపాటున అడ్మిన్ నుండి లాగ్ అవుట్ చేస్తే, మీ హోమ్ పేజీ యొక్క URL /user నుండి తరువాత లాగిన్ చేయవచ్చు.
04:37 ఇతరులు సైట్ నిర్వహణలో ఉందని ఒక సందేశాన్ని చూస్తారు.
04:42 రెండవ సోపానం:

మనము డేటాబేస్ యొక్క ప్రస్తుత వర్షన్ని బ్యాకప్ చేయాలి.

04:47 Bitnami Drupal Stack యొక్క కంట్రోల్ విండో తెరవండి.
04:52 ఈ నియంత్రణ విండోను ఎలా తెరవాలో తెలుసుకొనుటకు ద్రుపల్ సంస్థాపన ట్యుటోరియల్ ని చూడండి.
05:00 Open PhpMyAdmin బటన్ పై క్లిక్ చేయండి.
05:05 మనము phpmyadmin పేజీ కి మళ్ళించబడుతాము.
05:10 డిఫాల్ట్ యూజర్పేరు రూట్.
05:13 ద్రుపల్ అడ్మిన్ పాస్ వర్డ్ మరియు phpMyAdmin పాస్వర్డ్ రెండు ఒకటే.
05:20 యూసర్ నేమ్ ని రూట్ టైప్ చేసి, ద్రుపల్ అడ్మిన్ పాస్వర్డ్ టైప్ చేయండి ఆ తరువాత Go బటన్ క్లిక్ చేయండి.
05:29 బ్యాక్ అప్ తీసుకోవడానికి మొదట పనెల్ ఎగువన ఉన్న Export బటన్ క్లిక్ చేయండి.
05:36 ఆ పై Export method ని Custom గా ఎంచుకోండి.
05:40 డేటాబేస్ జాబిత క్రింద ఉన్న bitnami_drupal8 ని ఎంచుకోండి.
05:45 అవుట్ ఫుట్ విభాగం క్రింద ఫైల్ నేమ్ టెంప్లేట్ ని drupal-8.1.0 ఇచ్చి, కంప్రెషన్ ని gzipped గా సెట్ చేయండి.
05:58 మీ ప్రస్తుత వర్షన్ బట్టి ఫైల్ నేమ్ భిన్నంగా ఉండవచ్చు.
06:03 Object creation options విభాగం క్రింద Add DROP DATABASE statement ఎంపిక పై చెక్ మార్క్ పెట్టండి.
06:12 Add DROP TABLE ఎంపిక పై చెక్ మార్క్ పెట్టండి.
06:16 క్రిందికి స్క్రోల్ చేసి దిగువన ఉన్న Go బటన్ క్లిక్ చేయండి.
06:21 ఫైల్ సేవ్ చేయుటకు OK బటన్ క్లిక్ చేయండి.
06:25 మీ Downloads ఫోల్డర్ కి వెళ్ళి బ్యాక్ అప్ ఫైల్ drupal-8.1.0.sql.gz ని తనిఖీ చేయండి.
06:36 మూడవ సోపానం:

మనం అన్ని సర్వర్ లను షట్ డౌన్ చేయాలి

06:42 అన్ని నడుస్తున్న సర్వర్లు ఆపడానికి Bitnami Drupal Stack కంట్రోల్ విండో కి వెళ్ళండి.
06:49 Manage Servers ట్యాబ్ పై క్లిక్ చేసి ఆ పై Stop All బటన్ పై క్లిక్ చేయండి.
06:56 నాలుగోవ సోపానం:

Welcome ట్యాబ్ మరియు ఆ పై Open Application Folder బటన్ ల పై క్లిక్ చేయండి.

07:04 ఇది ఫైల్ని బ్రౌసర్ లో తెరుస్తుంది.
07:07 apps, drupal మరియు చివరికి htdocs ఫోల్డర్లు నావిగేట్ చేయండి.
07:15 ఐదవ సోపానం:

ద్రుపల్ యొక్క ప్రస్తుత వర్షన్ కోసం కోడ్ బ్యాకప్ చేయుటకు ఒక ఫోల్డర్ సృష్టించాలి.

07:24 ఈ ఫోల్డర్ కి ప్రస్తుత వర్షన్ యొక్క పేరు పట్టండి.
07:29 తదుపరి బ్యాక్ అప్ డేటాబేస్ ఫైల్ ని drupal-8.1.0 కి తరలించండి.
07:36 ఆరవ సోపానం:

htdocs ఫోల్డర్ కి వెళ్ళండి.

07:42 తదుపరి కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు అన్ని ఇతర ఫైళ్ళను కట్ మరియు పేస్ట్ పద్దతి లో బ్యాక్ అప్ ఫోల్డర్ drupal-8.1.0 కి తరలించండి.
07:55 ఇది డేటాబేస్ మరియు కోడ్ లను ఒకే స్థానం లో ఉంచుతుంది.
08:00 ఇది కోర్ యొక్క పాత వర్షన్ బ్యాక్ అప్ కాపీ, మీకు గనక వెనక్కి రెవెర్ట్ చెయ్యాల్సి ఉంటే.
08:07 ఏడవ సోపానం:

మన htdocs ఫోల్డర్ కి వెళ్ళండి.

08:13 తదుపరి ద్రుపల్ యొక్క నూతన వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి.
08:18 మీ బ్రౌసర్ ని తెరిచి, చూపించిన లింక్ కి వెళ్ళండి:https://www.drupal.org/project/drupal.
08:24 ద్రుపల్ 8 యొక్క నూతన సిఫార్సు చేసిన వర్షన్ని డౌన్లోడ్ చేసుకోండి
08:28 రికార్డింగ్ చేసే సమయం లో అది Drupal core 8.1.6 ఉండేది.
08:35 ఈ వర్షన్ మీరు చూస్తున్నప్పుడు భిన్నంగా ఉండవచ్చు.
08:40 తెరుచుటకు దాని పై క్లిక్ చేయండి.
08:43 డౌన్లోడ్ చేయుటకు tar.gz లేదా zip ఫైల్ క్లిక్ చేయండి.
08:49 ఫైల్ సేవ్ చేయుటకు OK బటన్ క్లిక్ చేయండి.
08:53 మీ Downloads ఫోల్డర్ కి వెళ్ళి ద్రుపల్ జిప్ ఫైల్ ని htdocs ఫోల్డర్ కి తరలించండి.
09:01 drupal-8.1.6.zip ఫైల్, ఈ ట్యుటోరియల్ వెబ్ పేజీ యొక్క Code files లింక్ లో అందించబడింది.
09:11 మీకు ఇంటర్ నెట్ కనెక్షన్ లేక పొతే, దానిని డౌన్లోడ్ చేసి ఉపయోగించండి.
09:18 ఎనిమిదవ సోపానం:

ఫైల్ ని Unzip చేయండి. ఇది drupal-8.1.6అనే ఫోల్డర్ ని htdocs ఫోల్డర్ లో సృష్టిస్తుంది.

09:30 ఫైల్ తెరుచుటకు దాని పై డబల్ క్లిక్ చేయండి.
09:34 కొత్త ద్రుపల్ ఫోల్డర్ నుండి కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు ఇతర సాధారణ ఫైళ్ళను htdocs ఫోల్డర్ కి తరలించండి.
09:44 తొమ్మిదవ సోపానం:

Bitnami Drupal Stack కంట్రోల్ విండో కు వెళ్ళండి.

09:51 ఇప్పుడు Manage Servers ట్యాబ్ కి వెళ్ళి, Start All బటన్ పై క్లిక్ చేసి అన్ని సర్వర్లు మొదలు పెట్టండి.
10:00 పదవ సోపానం:

Welcome ట్యాబ్, Go to Application బటన్ మరియు Access Drupal లింక్ లను క్లిక్ చేసి, మన సైట్ ను సందర్శించండి.

10:12 రిపోర్ట్స్ ఆ పై స్టేటస్ రిపోర్ట్ కి వెళ్ళండి.
10:17 ఇక్కడ, ద్రుపల్ వర్షన్ సంఖ్య నూతనమైనదని ధృవీకరించవచ్చు.
10:24 కానీ మన డేటా బేస్ అవుట్ అఫ్ డేట్ అయింది.
10:27 ప్రతి సారి కోర్, మాడ్యూల్ లేదా ఒక థీమ్ ని అప్డేట్ చేస్తే డేటాబేస్ ని కూడా అప్డేట్ చేయాలి
10:36 పదకొండవ సోపానం:

డేటాబేస్ని అప్డేట్ చేయడం నేర్చుకుందాం.

10:42 ఎక్స్టెండ్ మెనూ కి వెళ్ళి update script లింక్ పై క్లిక్ చేయండి.
10:47 Continue బటన్ క్లిక్ చేయండి.
10:51 ఇక్కడ కొన్ని పెండింగ్ అప్డేట్స్ ఉన్నాయని చెపుతుంది. మీకు కొంచం భిన్నంగా ఉండవచ్చు.
10:58 Apply pending updates బటన్ పై క్లిక్ చేయండి.
11:04 Administration pages లింక్ క్లిక్ చేయండి.
11:08 ఇక్కడ ఏ లోపాలు లేవు మనం విజయవంతంగా కోర్ని నవీకరించాము.
11:14 పన్నెండోవ సోపానం:

Go online లింక్ క్లిక్ చేయండి.

11:18 Put site to maintenance mode ఎంపిక పై చెక్ మార్క్ తీసివెయ్యండి.
11:25 Save configuration బటన్ క్లిక్ చేయండి.
11:29 ఇది అన్ని యూసర్ లకు సైట్ ని ఆన్లైన్ మోడ్ లోకి తీసుకెళ్తుంది.
11:34 ఇప్పటివరకు చర్చించిన సోపానాలు Bitnami సంస్థాపన కోసం పని చేస్తాయి.
11:40 మీరు ఇతర పద్ధతులు ఉపయోగించి ఉంటే, చాలా సోపానాలు ఒకేలా ఉంటాయి, Bitnami విభాగాలకు తప్ప.
11:48 థీమ్స్ మరియు మాడ్యూల్స్ ని నవీకరించడం నేర్చుకుందాం.
11:53 ఇది చాల సులభం కోర్ నవీకరణని పోలిస్తే, ఎందుకంటే ద్రుపల్ దానిని ఒక బటన్ క్లిక్ తో పూర్తీ చేస్తుంది.
12:01 కొన్ని సార్లు మనకు కేవలం మాడ్యూల్స్ లేదా థీమ్స్ యొక్క అప్డేట్లు మాత్రమే ఉంటాయి కోర్ నవీకరణ లేకుండా.
12:09 ఒకటవ సోపానం:

రిపోర్ట్స్ మెనూ ఆ పై Available updates పై క్లిక్ చేయండి.

12:15 Update ట్యాబ్ క్లిక్ చేయండి.
12:19 ఇక్కడ కొన్ని థీమ్స్ మరియు మాడ్యూల్స్ ని అప్డేట్ చెయ్యాలని గమనించండి.
12:25 అన్నిటిని ఎంచుకోండి.
12:28 ఆ పై Download these updates బటన్ క్లిక్ చేయండి.
12:33 performing updates in maintenance mode చెక్ బాక్స్ ఆన్ చేసి ఉందని నిర్ధారించుకోండి.
12:39 అప్డేట్ ని అప్లై చేయుటకు Continue బటన్ క్లిక్ చేయండి.
12:43 ఇది కోడ్ ని నవీకరించి సైట్ ని ఆన్లైన్ మోడ్ లోకి తెస్తుంది.
12:49 రెండవ సోపానం:

Run database updates లింక్ క్లిక్ చేయండి.

12:55 డేటాబేస్ బ్యాక్ అప్ చెయ్యకపోతే, ఇంతక ముందు చేసినట్టు చేయండి.
13:01 Continue బటన్ క్లిక్ చేయండి.
13:04 మనం కోర్ని అప్డేట్ చేసి నట్లు ఇది డేటాబేస్ ని అప్డేట్ చేస్తుంది.
13:09 Apply pending updates బట న్ క్లిక్ చేయండి.
13:14 Administration pages లింక్ క్లిక్ చేయండి.
13:18 పల్ సైట్ ని సాధారణంగా ఆన్ లైన్ మోడ్ కి తెస్తుంది.
13:24 ఇలా జరగక పొతే, మీరు పేజీ ఎగువన Go online అనే ఎంపిక ని చూస్తారు.
13:33 మూడవ సోపానం:

చివరిగా ఆంతా అప్ టు డేట్ ఉందా అని తనిఖీ చేద్దాం.

13:39 Reports మెనూ మరియు Available updates పై క్లిక్ చేయండి.
13:44 ఇక్కడ మన ద్రుపల్ కోర్, మాడ్యూల్స్ మరియు థీమ్స్ ప్రతిదీ అప్ టు డేట్ ఉంది.
13:51 పాత వర్షన్ కి ఎలా రెవెర్ట్ చెయ్యాలో నేర్చుకుందాం.
13:56 మనకు తెలిసో తెలియకో నవీకరణ విఫలమైతే, మనం మునుపటి వెర్షన్కి వెళ్ళవచ్చు.
14:05 దీని కోసం మనం పాత కోర్ మరియు డేటాబేస్లను పునరుద్ధరించాలి.
14:10 ఒకటవ సోపానం:

సైట్ ని Maintenance modeలో పెట్టండి.

14:17 రెండవ సోపానం:

అన్ని సర్వర్స్ ని Drupal Stack Control విండో నుండి స్టాప్ చేయండి

14:25 మూడవ సోపానం:

htdocs ఫోల్డర్ తెరవండి.

14:30 కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు ఇతర సాధారణ ఫైళ్ళను drupal-8.1.0 ఫోల్డర్ కి తరలించండి.
14:40 htdocs ఫోల్డర్ కి వెళ్ళి పాత వర్షన్ ఫోల్డర్ ని తెరవండి.
14:44 ఆ పై కోర్ మరియు వెండర్ ఫోల్డర్ లు మరియు ఇతర సాధారణ ఫైళ్ళను drupal-8.1.0 నుండి htdocs ఫోల్డర్ కి తరలించండి.
15:00 నాలుగోవ సోపానం:

Apache మరియు MySQL servers ని Drupal Stack Control విండో నుండి మొదలు పెట్టండి.

15:11 అయిదవ సోపానం:

పాత డేటాబేస్ని పునరుద్ధరించడం.

05:15 ద్రుపల్ స్టాక్ కంట్రోల్ విండో నుండి phpMyAdmin పేజీ ని తెరవండి.
15:23 ఎగువ ప్యానెల్లో ని Import బటన్పై క్లిక్ చేయండి.
15:27 Browse బటన్పై క్లిక్ చేయండి.
15:30 ఇక్కడ బ్యాక్ అప్ డేటాబేస్ ఫైల్ ఎంచుకుంటాము.
15:34 ఆ పై దిగువన ఉన్న 'గో' బటన్ క్లిక్ చేయండి.
15:38 ఆరవ సోపానం:

చివరి సోపానం మనం పాత వర్షన్ కి వచ్చామా లేదా అని తనిఖీ చేయడం.

15:45 ద్రుపల్ సైట్ కి వెళ్ళండి.
15:49 Reports మెనూ మరియు Status report పై క్లిక్ చేయండి.
15:52 ఇక్కడ మన ద్రుపల్ వర్షన్ 8.1.0 అని చూడగలం.
15:59 మనం కోర్ మరియు డేటాబేస్ లని మాత్రమే పాత వెర్షన్ కి రెవెర్ట్ చేయగలమని గమనించండి.
16:05 ద్రుపల్ చే మాడ్యూల్స్ మరియు థమ్స్ అప్డేట్ చెయ్యబడ్డయి.
16:10 మనము ఆరోవా సోపానం లో దాని కాపీ చెయ్యలేదు అందుకే దాని పాత వర్షన్ లు ఇక్కడ చూడలేము.
16:18 దీనితో ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
16:22 సారాంశం చూద్దాం.
16:25 ఈ ట్యుటోరియల్ లో మనం సైట్ మానేజ్మెంట్ యొక్క ముఖ్యమైన అంశాల గురించి నేర్చుకున్నాము.

రిపోర్ట్ లను వీక్షించడం మరియు విశ్లేషించడం, డేటాబేస్ మరియు కోడ్ యొక్క బ్యాకప్.

16:39 ద్రుపల్ కోర్ని నవీకరించడం, మాడ్యూల్స్ మరియు థీమ్స్ని నవీకరించడం మరియు ఒక బ్యాక్ అప్ వెర్షన్ యొక్క పునరుద్ధరణ.
16:49 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం.
16:54 దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
16:58 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది.
17:03 మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
17:06 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
17:22 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig