LibreOffice-Suite-Calc/C2/Basic-Data-Manipulation/Telugu
From Script | Spoken-Tutorial
VISUAL CUE | NARRATION | |
00:00 | లైబ్ర్ ఆఫీస్ క్యాల్క్ – బేసిక్స్ ఒఫ్ డాటా మనిప్యులేషన్(Basics of Data Manipulation)గురించి తెలియబరిచే స్పోకన్ ట్యూటోరియల్ కు స్వాగతం | |
00:07 | ఈ ట్యూటోరియల్ లో మనం నేర్చుకునేది: | |
00:09 | సూత్రముల ప్రాథమిక అంశాల పరిచయం | |
00:12 | కాలమ్స్ ప్రకారముగా అమర్చుట | |
00:15 | ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు | |
00:17 | ఇక్కడ మనం ఉబుంటు లినక్స్(Ubuntu Linux) వెర్షన్ 10.04 మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4. ను ఉపయోగిస్తున్నాము | |
00:27 | లిబ్రె ఆఫీస్ క్యాల్క్ లో ఉపయోగించే ప్రాథమిక సూత్రము ల తో మన ట్యూటోరియల్ ను ప్రారంభిద్దాం. | |
00:35 | ఫొర్ములాలు, సంఖ్యలను మరియు చలరాశి లను (వేరియబుల్స్ )ఉపయోగించి ఫలితాలను సాధించే సమీకరణములు. | |
00:41 | ఒక స్ప్రెడ్‌షీట్ లో, సమీకరణము పూర్తి చేయడానికి కావలసిన సమాచారం చలరాశి ల(వేరియబుల్)తో సూచించబడే సెల్ లొకేషన్స్ కలిగి వుంటాయి. | |
00:47 | ఇక్కడ ఎక్కువగా ఉపయోగించే అంకగణితపరికర్మలు, అడిషన్, సబ్ట్ర్యాక్షన్, మల్టిప్లికేషన్ మరియు డివిషన్. | |
00:56 | ముందుగా మనం “పర్సనల్-ఫైనాన్స్-ట్ర్యాకర్.ఆడ్స్” (Personal Finance traker.ods) ఫైల్ ను తెరుద్దాం. | |
01:02 | ”personal finance tracker.ods (“పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్.ods”) ఫైల్ లో, “cost”(“కాస్ట్”) హెడ్డింగ్ దిగువన వున్న ఖర్చులన్నింటిని ఎలా జోడించాలో చూద్దాం. | |
01:13 | “Miscellaneous “(“మిసిలేనీయియస్” )కింద Sum Total(“సమ్ టోటల్” )అనే మరొక హెడ్డింగ్ ఇద్దాం. | |
01:19 | A8 సెల్ పై క్లిక్ చేసి సీరియల్ నంబర్ 7 ఇద్దాం. | |
01:25 | ఖర్చుల మొత్తాన్ని చూపించే సెల్ నంబర్ “C8” పై క్లిక్ చేద్దాం. | |
01:32 | ఖర్చులన్నింటిని కల్పడానికి “is equal to SUM”( “ఇస్ ఈక్వల్ టు సమ్”) అని టైపు చేసి, బ్రేసస్ లో ఏ కాలమ్ లోని ఖర్చులను కలపాలో ఆ కాలమ్ యొక్క రేంజ్ టైపు చేద్దాం, అనగా “C3 కోలన్ C7”. | |
01:44 | ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేద్దాం. | |
01:47 | ”Cost”(“ కాస్ట్”) దిగువన వున్న అంశాలు అన్ని కూడడం గమనించవచ్చు. | |
01:51 | ఇప్పుడు క్యాల్క్ లో తీసివేత ఎలా చేయాలో చూద్దాం. | |
01:55 | ఒకవేళ “House Rent”( “హౌస్ రెంట్”) మరియు “Electricity bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్")
ఖర్చులను తీసివేసి, A9 తో సూచించబడిన సెల్ లో చూపించాలంటే మొదటగా A9 సెల్ పై క్లిక్ చేయండి. | |
02:06 | ఇప్పడు ఈ సెల్ లో "is equal to”(“ఇస్ ఈక్వల్ టు ” )అని టైపు చేసి బ్రేసస్ లో ఆయా సెల్ రిఫరెన్స్ అనగా, “C3 మైనస్ C4” అని టైపు చేయండి. | |
02:17 | ఇప్పడు కీ బోర్డు పై ఎంటర్ ప్రెస్ చేద్దాం. | |
02:20 | రెఫెర్ చేయబడిన రెండు సెల్ లోని ఖర్చులు తీసివేయబడి ఫలితం A9 సెల్లో కనిపించడం చూడవచ్చు. | |
02:29 | మార్పులను అండూ చేద్దాం | |
02:32 | ఇదేవిధముగా, వివిధ సెల్ లోని అంశముల కూడిక మరియు తీసివేత చేయవచ్చు | |
02:37 | స్ప్రెడ్‌షీట్ లో మరొక ప్రాథమిక కర్మ సంఖ్యల సగటు కనుక్కోవడం. | |
02:43 | ఇప్పుడు దీనిని ఎలా అమలు చేయాలో చూద్దాం | |
02:45 | ”Sum Total”(“ సమ్ టోటల్”) సెల్ క్రింద "Average”(“ఆవరేజ్”) అని హెడ్డింగ్ ఇద్దాం. | |
02:50 | ఇక్కడ టోటల్ కాస్ట్ యొక్క ఆవరేజ్ను చూపిద్దాం | |
02:55 | కాబట్టి “C9” సెల్ పై క్లిక్ చేద్దాం. | |
02:58 | ”is equal to(“ ఇస్ ఈక్వల్ టు ”) Average(ఆవరేజ్) మరియు బ్రేసస్ లో Cost(కాస్ట్) అని టైపు చేద్దాం | |
03:04 | ఇప్పుడు కీ బోర్డు పై ఎంటర్ ప్రెస్ చేద్దాం. | |
03:07 | ”Cost”(“కాస్ట్”)కాలమ్ యొక్క ఆవరేజ్, ఈ సెల్ల్లో
కనిపించడం చూడవచ్చు. | |
03:11 | మార్పులను అండూ చేద్దాం | |
03:15 | ఇదే విధముగాహారిజాంటల్ రో లోని అంశములన్నింటి సగటును కనుక్కోవచ్చు. | |
03:20 | మరిన్ని ఫార్మలే మరియు ఆపరేటర్స్ గురించి అడ్వ్యాన్స్డ్ లెవెల్ ట్యూటోరియల్స్ లో నేర్చుకుందాం. | |
03:25 | ఒక క్యాల్క్ స్ప్రెడ్‌షీట్ లో అంశములను ఎలా సార్ట్ చేయాలో చూద్దాం. | |
03:30 | సార్టింగ్ కనిపించే సెల్స్ ను మనకు కావలసిన విధముగా అమరుస్తుంది | |
03:35 | క్యాల్క్ లో, మీరు మూడు ప్రమాణాల వరకు ఉపయోగించి డేటా క్రమం చేయవచ్చు, వీటిని ఒకదాని తర్వాత మరోక్కదాన్ని వినియోగించవచ్చు. | |
03:43 | అవి మీకు ఒక ప్రత్యేక అంశం శోధించడానికి సులభాముగా అవుతాయి మరియు కావాల్సిన డాటా ను ఫిల్టర్ చేసిన తర్వాత శక్తివంతమౌతాయి. | |
03:51 | ఒకవేళ, “Costs” హెడ్డింగ్ దిగువన వున్న అంశములను ఆరోహన క్రమం లో అమర్చాలంటే. | |
03:57 | “Cost” పై క్లిక్ చేసి అమర్చలనుకున్న సెల్ల్స్ ను హైలైట్ చేయాలి. | |
04:03 | మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని, కాలమ్ మీదుగా "2000" అని ఉన్న సెల్ చివరి వరకు లాగండి. | |
04:12 | ఇది మనం అమర్చాలనుకున్న కాలమ్ ను ఎంపిక చేసుకుంటుంది. | |
04:15 | ఇప్పుడు మేను బార్ నుండి “డాటా” ఎంపిక పై క్లిక్ చేసి "sort(“సార్ట్”) పై క్లిక్ చేయండి. | |
04:21 | తర్వాత “current selection”(“కరెంట్ సెలెక్షన్”) ను ఎంచుకోండి. | |
04:24 | “Sort Criteria”(“సార్ట్ క్రైటీరియా”) మరియు Options (“ఆప్షన్స్”) ట్యాబ్స్ తో ఒక డైయలోగ్ బాక్స్ తెరుచుకుంటుంది. | |
04:31 | “Sort Criteria”(“సార్ట్ క్రైటీరియ”) ట్యాబ్ లో, “Sort by(“సార్ట్ బై”) ఫీల్డ్ లో “Cost”(“కాస్ట్”) ను ఎంచుకోండి. | |
04:37 | “Cost”(“కాస్ట్”) ను ఆరోహణ క్రమంలో అమర్చాలంటే దీని పక్కనే వున్న Ascending(“అసెండింగ్”) పిక ను ఎంచుకోండి. | |
04:44 | ఇప్పుడు “OK” బటన్ పై క్లిక్ చేయండి. | |
04:47 | కాలమ్ ఆరోహణ క్రమంలో ఏర్పడడం గమనించవచ్చు . | |
04:51 | అదే విధముగా, అవరోహణ క్రమంలో అమర్చాలంటే , “Descending(“డిసెండింగ్”) పై క్లిక్ చేసి తర్వాత “OK” బటన్ పై క్లిక్ చేయండి . | |
04:59 | మార్పులను అండూ చేద్దాం. | |
05:02 | అనేక కాలమ్స్ ను అమర్చడానికి మొదటగా అన్నింటిని ఎంచుకొని తర్వాత సార్ట్ ఎంపికలను ఉపయోగించండి. | |
05:09 | ఒకవేళ మనం సీరియల్ నంబర్స్ మరియు కాస్ట్ లను అమర్చాలంటే. | |
05:14 | ముందు మాదిరిగా కాలమ్స్ అన్నిటిని ఎంచుకోవాలి. | |
05:18 | ఇప్పుడు మేను బార్ లోని “Data”(“డాటా”) ఎంపిక పై క్లిక్ చేసి "Sort”(“సార్ట్”) పై క్లిక్ చేయాలి. | |
05:24 | డైయలోగ్ బాక్స్ లో నుండి "Sort by”(“సార్ట్ బై”) ఫీల్డ్‌లో ముందుగా "Cost(“కాస్ట్”) ను ఎంచుకోవాలి. | |
05:30 | తర్వాత "Then by”(“దెన్ బై ”) ఫీల్డ్ లో నుండి "SN”(“స్న్”) ను ఎంచుకోవాలి. | |
05:35 | రెండు ఎంపికాలకు దెగ్గారగా ఉన్న Descending(“ డిసెండింగ్”) పై క్లిక్ చేసి " OK” బటన్ పై క్లిక్ చేయాలి. | |
05:43 | హెడ్డింగ్స్ రెండు అవరోహణ క్రమంలో అమరిక పొందడం గమనించండి. | |
05:47 | మార్పులను అండూ చేద్దాం. | |
05:49 | ఇప్పుడు లిబ్రే ఆఫీస్ కల్క్ లో డాటాను ఎలా ఫిల్టర్ చేయాలో చూద్దాం. | |
05:53 | ఫిల్టర్ అనగా షరతుల జాబితా. ఈ ప్రకారంగా ప్రతీ ఎంట్రీ కనిపిస్తుంది. | |
06:00 | స్ప్రెడ్‌షీట్ లో ఫిల్టర్ ఉపయోగించడానికి, “Item”(“ఐటమ్”) అనే సెల్ పై క్లిక్ చేద్దాం. | |
06:07 | మేను బార్ లోని "Data”(“డాటా”) ఆప్షన్ పై క్లిక్ చేసి "Filter”(“ఫిల్టర్”) పై క్లిక్ చేద్దాం. | |
06:12 | పాప్ అప్ మేను లో నుండి “Auto Filter”(“ఆటో ఫిల్టర్”) ఎం పిక పై క్లిక్ చేద్దాం | |
06:16 | హెడ్డింగ్స్ పై బాణం గుర్తు రావడం గమనించండి. | |
06:20 | Item(“ఐటమ్”) సెల్ లోని డౌన్ ఆరో పై క్లిక్ చేయండి . | |
06:24 | ఒకవేళ “Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”) కు సంబందించిన డాటా ను మాత్రమే చూపించాలంటే. | |
06:29 | “Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”) ఎంపిక పై క్లిక్ చేయండి. | |
06:34 | “Electricity Bill”(“ఎలెక్ట్రిసిటీ బిల్”) కు సంబందించిన డాటా మాత్రమే కనపడ్డం గమనించండి. | |
06:40 | మిగితా ఎంపికలు ఫిల్టర్ అయినాయి. | |
06:43 | డాటా మొత్తం చూడాలంటే, మళ్లీ ఒకసారి "Item”(”ఐటమ్”) సెల్ పై ఉన్న డౌన్ ఆరో పై క్లిక్ చేసి All(“ఆల్”) పై క్లిక్ చేయండి | |
06:52 | ఇప్పుడు మనం అసలు వ్రాసిన డాటా ను అంతా చూడవచ్చు. | |
06:59 | “Auto Filter”(“ఆటో ఫిల్టర్”) తోపాటుగా "Standard Filter”(“స్టాండర్డ్ ఫిల్టర్”) మరియు "Advanced Filter”(“అడ్వ్యాన్స్డ్ ఫిల్టర్”) అనే మరో రెండు ఫిల్టర్ ఎంపికలు ఉన్నవి.
వీటి గురించి మనం ఈ సీరీస్ లోని తర్వాతి దశలలో నేర్చుకుందాం. | |
07:11 | లిబ్రే ఆఫీస్ కల్క్ గురించి తెలియబర్చే స్పోకన్ ట్యూటోరియల్ ముగింపుకు వచ్చాం: | |
07:15 | సంక్షిప్తముగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది: | |
07:18 | సూత్రము ల యొక్క ప్రాథమిక అంశాల -పరిచయం. | |
07:21 | కాలమ్స్ ప్రకారముగా అమర్చుట. | |
07:23 | ఫిల్టరింగ్ డాటా - ప్రాథమిక అంశాలు | |
07:26 | *ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | |
07:30 | * ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది | |
07:33 | * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. | |
07:37 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం | |
07:40 | *స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది | |
07:43 | * ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది | |
07:47 | *మరిన్ని వివరాలకు , దయచేసి Contact@spoken-tutorial.org(కాంట్యాక్ట్@స్పోకన్-ట్యూటోరియల్. ఆర్గ్) కు వ్రాసి సంప్రదించండి. | |
07:53 | * స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, | |
07:58 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | |
08:06 | * ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది . | |
08:16 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య మాతో చేరినందుకు ధన్యవాదములు |