Health-and-Nutrition/C2/Indian-Law-to-Protect-Breastfeeding/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 23:06, 8 May 2021 by Simhadriudaya (Talk | contribs)
|
|
00:00 | తల్లిపాలు ఇవ్వడాన్ని రక్షించడం కోసం ఉన్న భారత చట్టంపై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని గురించి నేర్చుకుంటాము: |
00:09 | శిశువు పాల యొక్క ప్రత్యామ్నాయాలు లేదా IMS. |
00:13 | IMS చట్టం. |
00:16 | మొదట మనం శిశువు పాల యొక్క ప్రత్యామ్నాయాలు ఏమిటి అనేది అర్థం చేసుకుందాం? |
00:23 | శిశువు పాల యొక్క ప్రత్యామ్నాయాలను IMS అని కూడా పిలుస్తారు. |
00:29 | IMS అనేవి పాక్షికంగా శిశువుకు అందించే ఆహారాలు |
00:33 | లేదా తల్లి పాలకు పూర్తి ప్రత్యమ్నాయంగా ఇచ్చే ఆహారాలు. |
00:39 | 2 సంవత్సరాల వయస్సు వరకు శిశువులకు ఇచ్చే అన్ని వాణిజ్య శిశు ఆహారాలు ఇందులో ఉన్నాయి. |
00:48 | ఈ ట్యుటోరియల్‌లో, మనం IMS ను వాణిజ్య శిశు ఆహారాలు (బేబీ ఫుడ్స్) లేదా శిశు ఆహారాలు (బేబీ ఫుడ్స్) గా సూచిస్తాము. |
00:58 | ప్రజలు వాణిజ్య శిశు ఆహారాలను ఎందుకు ఉపయోగిస్తున్నారు? |
01:03 | వాణిజ్య శిశు ఆహార పదార్థాలు అనేవి జనాదరణ పొందడానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. |
01:11 | వాణిజ్య శిశు ఆహారాలను తల్లి పాలతో పోల్చి చెప్పిన కల్పితకధ అనేది మొదటి కారణం. |
01:20 | దానివలన అవికూడా తల్లి పాలు వలెనే అంతే మంచివని నమ్ముతారు. |
01:26 | కనుక వారు తల్లిపాలు ఇవ్వడాన్ని పూర్తిగా వాటితో ప్రత్యామ్నాయం చేస్తారు. |
01:31 | ఇవన్నీ తెలియని కొంతమంది ప్రజలు తల్లి పాల కంటే ఇవే మంచివని నమ్ముతారు. |
01:40 | ఈ కల్పితకధ ఇలా ప్రజాదరణ పొందింది ఎందుకంటే వాటివలన కలిగే హాని తెలియదు లేదా అంత సులభంగా చూడలేరు. |
01:48 | ప్రజలకు వాటివలన కలిగే హానికరమైన ప్రభావాల గురించి సరిగ్గా మార్గనిర్దేశం చేయబడలేదు. |
01:54 | అలాగే, మార్కెటింగ్ పద్ధతులు అనేవి వాటిని తల్లిపాలు ఇవ్వడంతో సమానంగా చిత్రీకరించి చూపిస్తాయి. |
02:02 | చాలా మంది వైద్యులు లేదా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు కూడా వాటి యొక్క హానికరమైన ప్రభావాల గురించి తెలియదు. |
02:10 | తల్లి పాలివ్వకపోవడం వల్ల కలిగే నష్టాలు కూడా వారికి తెలియదు. |
02:17 | అందువల్ల, చాలా మంది ప్రజలు వాణిజ్య శిశు ఆహారాలను ప్రమాదకరమైనవిగా పరిగణించరు. |
02:25 | వాణిజ్య శిశు ఆహార పదార్థాలకు సాధారణ సమాజపు అంగీకారమూ ఉంది. |
02:32 | అదేవిధంగా పాల సీసాలు మరియు కృత్రిమ ఉరుగుజ్జులకూ ఇది వర్తిస్తుంది. |
02:39 | ఏ వాణిజ్య శిశు ఆహారం కూడా తల్లి పాలివ్వడంతో సమానం కాదు. |
02:46 | వారు తల్లి పాల యొక్క సాధారణ భాగాలను అనుకరించవచ్చు. |
02:52 | సాధారణ భాగాలు ప్రోటీన్లు, కేలరీలు లేదా కొవ్వులు కలిగిఉంటాయి. |
02:59 | ఏమైనప్పటికి, అవి తల్లి పాలలోని అనేక భాగాలను కలిగి ఉండవు. |
03:06 | అలాగే, ప్రతి తల్లికి మరియు ఆమె బిడ్డకూ తల్లి పాలు అనేవి మారుతూ ఉంటాయి. |
03:13 | వాణిజ్య శిశు ఆహారాలు అనేవి ఈ లక్షణాన్నికలిగిఉండవు. |
03:18 | అవి అందరు తల్లులు మరియు పిల్లలకు ఒకేలా ఉంటాయి. |
03:24 | అవి తల్లి పాలివ్వడం యొక్క మానసిక-భావోద్వేగ ప్రయోజనాలను కూడా కలిగిఉండవు. |
03:31 | అవి శిశువుల్లో పోషకాహార లోపం లేదా ఊబకాయాన్ని కలిగిస్తాయని బాగా తెలుసు. |
03:38 | అవి అంటు వ్యాధులు మరియు సంక్రమణ వ్యాధులకు కూడా కారణమవుతాయి. |
03:44 | ఈ వ్యాధులలో హృదయ సంబంధ సమస్యలు కూడా ఉన్నాయి. |
03:48 | ఇంకా అలెర్జీలు. |
03:51 | వాటియొక్క అతి చెత్త ప్రభావం ఏమిటంటే, అవి తల్లి పాలివ్వడం అనేది శిశువులకు అంత ముఖ్యం కాదనిపించేలా చేస్తాయి. |
03:59 | అవి తల్లి పాలివ్వడం అనేది ఉచితం మరియు ఉత్తమమైనదని తెలుసుకోకుండా ప్రజలను ఆపేస్తాయి. |
04:08 | శిశు ఆహారాలు (బేబీ ఫుడ్స్) ను వాడటానికి 2 వ కారణం అవి సులభమైన సత్వరమార్గంలా అనిపించడం. |
04:16 | తల్లి పాలివ్వడం అనేది ఒక కళ. |
04:19 | సరైన పద్దతిలో తల్లి పాలివ్వడాన్ని నేర్చుకోవడానికి లేదా సహాయం చేయడానికి సమయం మరియు కృషి అవసరం. |
04:28 | తల్లి పాలివ్వడాన్ని నేర్చుకునేటప్పుడు సమస్యలు కూడా ఉండవచ్చు. |
04:34 | ఇంట్లో తల్లి పాలు ఇవ్వటానికి తల్లికి కుటుంబం యొక్క మద్దతు అవసరం. |
04:40 | ఇంటి బయట లేదా పనిచేసే స్థలం వద్ద తల్లి పాలు ఇవ్వటానికి ఆమెకు సమాజం యొక్క మద్దతు కూడా అవసరం. |
04:49 | అందువల్ల, వాణిజ్య శిశు ఆహారాలు అనేవి అనుకూలమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడతాయి. |
04:57 | ఇప్పుడు మనం వాణిజ్య శిశు ఆహార పదార్థాల యొక్క వాడకానికి ఉన్న మూడవ కారణం గురించి చర్చిద్దాం. |
05:04 | సరైన అవగాహన లేని ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు శిశు ఆహారాలను ఒక సులభమైన పరిష్కారంగా ఉపయోగిస్తారు. |
05:12 | తల్లి సరిగ్గా పాలివ్వడానికి తల్లులకు ఎలా సహాయం చేయాలో కూడా వారికి తెలియకపోవచ్చు. |
05:18 | కనుక, సమస్యాత్మక పరిస్థితిలో, వారు అప్రమేయంగా వాణిజ్య శిశు ఆహార పదార్థాలను సిఫార్సు చేస్తారు. |
05:27 | శిశు ఆహారాల (బేబీ ఫుడ్స్) ను వాడటానికి 4 వ కారణం తయారీదారులు చేసే వారి భారీ ప్రమోషన్. |
05:36 | శిశు ఆహారాల (బేబీ ఫుడ్స్) ను కొనేలా ప్రజలను ఒప్పించడానికి వారు శాస్త్రీయ పదాలు మరియు రివార్డులను ఉపయోగిస్తారు. |
05:44 | వారు శిశు ఆహారాల (బేబీ ఫుడ్స్) ను సులభంగా సూచించమని ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను వాటిని ఉపయోగించడానికి ఒప్పిస్తారు. |
05:52 | శిశు ఆహారాల (బేబీ ఫుడ్స్) ను వాడటానికి 5 వ కారణం కొత్తగా తల్లయిన వారియొక్క మానసిక బలహీనత. |
06:01 | వారి స్వంత సమస్యల సమయంలో వారి చింతలు అనేవి పెరుగుతాయి. |
06:06 | వరదలు లేదా COVID-19 సంక్షోభం వంటి విపత్తుల సమయంలో కూడా ఇవి పెరుగుతాయి. |
06:16 | వారు విశ్వాసాన్ని కోల్పోతారు మరియు తల్లి పాలు ఒక్కటే తమ బిడ్డకు సరిపోవు అని భావిస్తారు. |
06:23 | శిశు ఆహారాల (బేబీ ఫుడ్స్) యొక్క ఉపయోగం గురించిన తప్పుడు సలహాలను వారు నమ్మడం ప్రారంభిస్తారు. |
06:31 | అప్పుడు వారు వాణిజ్య శిశు ఆహారాలను (కమర్షియల్ బేబీ ఫుడ్స్) వాడటం ప్రారంభిస్తారు. |
06:37 | ఇప్పుడు మనం వాణిజ్య శిశు ఆహారాల (కమర్షియల్ బేబీ ఫుడ్స్) ప్రమోషన్ యొక్క చరిత్రను క్లుప్తంగా చర్చిద్దాం. |
06:45 | అవి ఆవిష్కరించబడిన నుండి, వాటి ప్రమోషన్ అనేది తల్లిపాలు ఇవ్వడం అంత ముఖ్యం కాదని అనిపించేలా చేసింది. |
06:53 | వాటి యొక్క కంపెనీలు నేరుగా గర్భిణీలు లేదా పాలిచ్చే మహిళలు మరియు ఆరోగ్య కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటాయి. |
07:02 | వారు పోషకాహారం లేదా తల్లి పాలివ్వడం పై వర్క్‌షాప్‌ల ద్వారా శిశు ఆహారాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తారు. |
07:09 | వారు వరదలు లేదా భూకంపాలు వంటి అత్యవసర సమయాల్లో వారి ఉత్పత్తులను ఉచితంగా పంపిణీ చేస్తారు. |
07:19 | కిరాణా దుకాణాలు మరియు మెడికల్ స్టోర్లలో కూడా శిశు ఆహారాలను (బేబీ ఫుడ్స్) ప్రోత్సహించడానికి వారు ప్రయత్నిస్తారు. |
07:27 | వాణిజ్య శిశు ఆహారాలు (కమర్షియల్ బేబీ ఫుడ్స్) అనేవి దుకాణాల్లో ప్రముఖంగా ప్రదర్శించబడతాయి. |
07:33 | వాణిజ్య శిశు ఆహారాలను (కమర్షియల్ బేబీ ఫుడ్స్) కొని ఉంపయోగించేలాగా ప్రజల్నిఆకర్షించడానికి వారు ప్రోత్సాహకాలను ఉపయోగిస్తారు. |
07:42 | శిశువుల కొరకు ఈ వ్యూహాలు అనేవి ఎంత హానికరమో ఆరోగ్య ఆందోళనాకారులు గ్రహించారు. |
07:50 | జీవితంలో శైశవదశ (బాల్యదశ) అనేది హాని కలగడానికి అవకాశం ఉన్న కాలం. |
07:55 | ఆహరాన్నిఇవ్వడానికి సరిపడని పద్ధతులు అంటే వాణిజ్య శిశు ఆహారాలను (కమర్షియల్ బేబీ ఫుడ్స్) తప్పుగా ఉపయోగించడం వంటివి చాలా ప్రమాదకరం. |
08:05 | కనుక, వాణిజ్య శిశు ఆహారాల (కమర్షియల్ బేబీ ఫుడ్స్) యొక్క ప్రమోషన్ ను నియంతరించడానికి ప్రత్యేక చట్టాలు అనేవి అవసరం. |
08:14 | అందుకోసమే, International Code of Marketing of Breastmilk Substitutes అనేది సృష్టించబడింది. |
08:23 | ఇది 1981 లో World Health Assembly చేత ఆమోదించబడింది. |
08:30 | శిశు ఆహారాల యొక్క మార్కెటింగ్‌ను నియంత్రించడానికి చట్టాలను రూపొందించాలని ఇది అన్ని దేశాలను కోరింది. |
08:39 | Infant Milk Substitutes, Feeding Bottles and Infant Foods (Regulation of Production, Supply and Distribution) Act 1992, and Amendment Act 2003 ను భారతదేశం ఆమోదించింది. |
08:57 | దీనిని IMS చట్టం అని కూడా అంటారు. |
09:02 | ఈ కోడ్ ను అమలుచేయడానికి అన్నిదేశాల చేత ఆమోదించబడిన అనేక చట్టాలు ఉన్నాయి. |
09:09 | ఈ అన్ని చట్టాలలో, IMS చట్టం అనేది అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటి. |
09:17 | IMS చట్టం యొక్క నిబంధనలు అనేవి చాలా స్పష్టంగా BPNI చేత ఇవ్వబడ్డాయి. |
09:25 | BPNI అనేది Breastfeeding Promotion Network of India. |
09:32 | ఇప్పుడు, మనం IMS చట్టం యొక్క 10 ఉల్లంఘనలను చర్చిద్దాం. |
09:39 | ఒకవేళ IMS చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే: |
09:44 | ఏ విధంగానైనా ఒక ఆహారాన్ని ప్రోత్సహిస్తే, అంటే ప్రత్యేకంగా 2 సంవత్సరాల వయస్సు లోపలి పిల్లల కొరకు. |
09:53 | ఆ ఆహారం యొక్క పేరు ఏంటి అని పట్టింపు లేదు. |
09:57 | ఒకవేళ IMS చట్టం పరిధిలో ఉన్న ఉత్పత్తులను ప్రచారం చేసినట్లయితే. |
10:04 | ఇందులో శిశువుల పాల ప్రత్యామ్నాయాలు, పాల సీసాలు మరియు శిశువుల ఆహారం ఉన్నాయి. |
10:12 | వీటిపై ఏ రూపంలో నైనా లేదా ఏ మాధ్యమంలోనైనా, ఎలాంటి ప్రకటన అయినా అది IMS చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. |
10:20 | టీవీ, వార్తాపత్రికలు, సచిత్రపత్రికలు, పత్రికలు, రేడియో, ఎస్ఎంఎస్ ప్రకటనలు ఇందులోకి వస్తాయి. |
10:30 | సోషల్ మీడియా, బిల్ బోర్డులు, బ్యానర్లు మరియు ఇతర ప్రకటనలు కూడా ఇందులోకి వస్తాయి. |
10:39 | ఒకవేళ ఆ ఉత్పత్తిని గానీ లేదా దాని నమూనాలను గానీ ఏ వ్యక్తికైనా నేరుగా పంపిణీ చేసినట్లయితే. |
10:47 | గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే మహిళలు ఇందులోకి వస్తారు. |
10:53 | ఒకవేళ ఆ ఉత్పత్తిని ఉపయోగించేలా చేయడానికి లేదా విక్రయించడానికి ఏదైనా ప్రోత్సాహకాన్ని గానీ ఇచ్చినట్లయినా. |
11:01 | అంటే ప్రోత్సాహకాలు డిస్కౌంట్ లు లేదా ఉచిత బహుమతులు మొదలైనవి కావచ్చు. |
11:08 | IMS యొక్క ప్రమోషన్ కు సంబంధించిన విద్యా సామగ్రి పంపిణీ చేయబడినట్లయినా. |
11:16 | అమ్మకాలను పెంచుకోవడానికి, ఈ ఉత్పత్తుల యొక్క లేబుల్స్ పై నిర్దిష్ట చిత్రాలను కలిగి కలిగిఉన్నట్లయినా. |
11:24 | ఇవి తల్లులు, పిల్లలు, కార్టూన్లు, గ్రాఫిక్స్ మొదలైనవాటి యొక్క చిత్రాలు కావచ్చు. |
11:33 | ఒక ఆసుపత్రి గానీ, నర్సింగ్ హోమ్, కెమిస్ట్ షాప్ వారు గానీ ఏ విధంగానైనా IMS ను ప్రోత్సహించినట్లయినా. |
11:41 | IMS కంపెనీల ప్లకార్డులు లేదా పోస్టర్లను ప్రదర్శించడం ఇందులో ఉన్నాయి. |
11:49 | ఒకవేళ IMS ను ప్రోత్సహించడానికి ఆరోగ్య కార్యకర్తలకు లేదా వారి కుటుంబానికి డబ్బు లేదా బహుమతులు ఇచ్చినట్లయినా. |
11:58 | ఒక IMS సంస్థ గానీ లేదా దాని యొక్క పంపిణీదారు గానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దత్తును అందించినట్లయినా. |
12:08 | వీటికొరకు నిధులు ఇవ్వడం ఇందులోకి వస్తుంది, సెమినార్లు |
12:11 | సభలు,
సమావేశాలు |
12:14 | లేదా శిక్షణా తరగతులు. |
12:17 | ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి స్పాన్సర్‌షిప్‌లు, |
12:21 | పరిశోధన కొరకు గ్రాంట్లు లేదా ఫెలోషిప్‌లు. |
12:25 | ఆరోగ్య కార్యకర్తలు లేదా వారి సంఘాల యొక్క స్పాన్సర్షిప్ కూడా అనుమతించబడదు. |
12:33 | ఒకవేళ IMS అమ్మకాల యొక్క పరిమాణం అనేది అమ్మకపు కమిషన్‌ను పరిష్కరించడం కోసం ఆధారం అయినట్లయితే. |
12:42 | అలా చేయడం ద్వారా, IMS సంస్థ గానీ లేదా దాని ఉత్పత్తి పంపిణీదారు గానీ IMS చట్టాన్ని ఉల్లంఘించినవారు అవుతారు. |
12:51 | దయచేసి ఇటువంటి ఉల్లంఘనలను వెంటనే రిపోర్ట్ చేయండి. |
12:56 | అలా చేయడానికి, మీరు BPNI STANPAN SURAKSHA మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చు. |
13:05 | ఈ అప్లికేషన్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటుంది. |
13:11 | ఒక ఉల్లంఘనను రిపోర్ట్ చేయడానికి ఇది 2 సాధారణ దశలను మాత్రమే కలిగి ఉంటుంది. |
13:17 | మీరు ఏదైనా ఉల్లంఘనను గుర్తించినప్పుడు, ఈ అప్లికేషన్ ను తెరవండి. |
13:23 | మెనులోని Report promotion of baby foods or feeding bottles టాబ్ క్లిక్ చేయండి. |
13:32 | రిపోర్టింగ్ పేజీ తెరవబడుతుంది. |
13:36 | నిర్దేశించిన కాలమ్స్ లో అవసరమైన సమాచారాన్ని అందించండి. |
13:42 | ఒకవేళ మీరు ఏదైనా ఫొటోని గానీ పత్రాన్ని గానీ కలిగిఉంటే దాన్ని అటాచ్ చేయండి. |
13:48 | దాన్ని సబ్మిట్ చేయండి. |
13:51 | గుర్తుంచుకోండి, IMS కంపెనీలు తమ ప్రకటనలలో తల్లి పాలివ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను పేర్కొనవచ్చు. |
13:59 | ఏదేమైనా, అలాంటి ప్రకటన ఏదైనా ఒక తల్లికి, తల్లి పాలివ్వడం కోసం ఆమె వేసుకున్న ప్రణాళికలో అనుమానాన్ని కలిగిస్తుంది. |
14:07 | వారి ప్రకటనలు అనేవి శిశు ఆహారాలను వీలైనంత ఎక్కువ మంది తల్లులకు విక్రయించడానికి రూపొందించబడ్డాయి. |
14:14 | తల్లి, తన పాలివ్వడాన్ని ఎంత త్వరగా ఆపివేస్తే, అంత ఎక్కువ ఫార్ములా అనేది కొనుగోలు చేయబడుతుంది. |
14:21 | ఈ కారణంగానే IMS కంపెనీలు తల్లి పాలివ్వడం అనేది అంత ముఖ్యమైనది కాదు అనిపించేలా చేస్తాయి. |
14:30 | కనీసం 2 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు శిశువుకు తల్లి పాలివ్వడం అనేది తప్పనిసరి. |
14:38 | తల్లి బిడ్డకు తగినన్నిపాలివ్వటానికి, పాలివ్వడంలో సరైన పద్దతిని తెలుసుకోవడం అనేది ముఖ్యం. |
14:45 | ఇదే సిరీస్‌లోని ఇతర ట్యుటోరియల్‌లలో దీని గురించి చర్చించబడింది. |
14:51 | ఇది ఈ ట్యుటోరియల్ చివరికి మనలను తీసుకువస్తుంది.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |