Health-and-Nutrition/C2/Indian-Law-to-Protect-Breastfeeding/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:00 తల్లిపాలు ఇవ్వడాన్ని రక్షించడం కోసం ఉన్న భారత చట్టంపై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని గురించి నేర్చుకుంటాము:
00:09 శిశువు పాల యొక్క ప్రత్యామ్నాయాలు లేదా IMS.
00:13 IMS చట్టం.
00:16 మొదట మనం శిశువు పాల యొక్క ప్రత్యామ్నాయాలు ఏమిటి అనేది అర్థం చేసుకుందాం?
00:23 శిశువు పాల యొక్క ప్రత్యామ్నాయాలను IMS అని కూడా పిలుస్తారు.
00:29 IMS అనేవి పాక్షికంగా శిశువుకు అందించే ఆహారాలు
00:33 లేదా తల్లి పాలకు పూర్తి ప్రత్యమ్నాయంగా ఇచ్చే ఆహారాలు.
00:39 2 సంవత్సరాల వయస్సు వరకు శిశువులకు ఇచ్చే అన్ని వాణిజ్య శిశు ఆహారాలు ఇందులో ఉన్నాయి.
00:48 ఈ ట్యుటోరియల్‌లో, మనం IMS ను వాణిజ్య శిశు ఆహారాలు (బేబీ ఫుడ్స్) లేదా శిశు ఆహారాలు (బేబీ ఫుడ్స్) గా సూచిస్తాము.
00:58 ప్రజలు వాణిజ్య శిశు ఆహారాలను ఎందుకు ఉపయోగిస్తున్నారు?
01:03 వాణిజ్య శిశు ఆహార పదార్థాలు అనేవి జనాదరణ పొందడానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి.
01:11 వాణిజ్య శిశు ఆహారాలను తల్లి పాలతో పోల్చి చెప్పిన కల్పితకధ అనేది మొదటి కారణం.
01:20 దానివలన అవికూడా తల్లి పాలు వలెనే అంతే మంచివని నమ్ముతారు.
01:26 కనుక వారు తల్లిపాలు ఇవ్వడాన్ని పూర్తిగా వాటితో ప్రత్యామ్నాయం చేస్తారు.
01:31 ఇవన్నీ తెలియని కొంతమంది ప్రజలు తల్లి పాల కంటే ఇవే మంచివని నమ్ముతారు.
01:40 ఈ కల్పితకధ అనేది ఇలా ప్రజాదరణ పొందింది ఎందుకంటే వాటివలన కలిగే హాని తెలియదు లేదా అంత సులభంగా చూడలేరు.
01:48 ప్రజలకు వాటివలన కలిగే హానికరమైన ప్రభావాల గురించి సరిగ్గా మార్గనిర్దేశం చేయబడలేదు.
01:54 అలాగే, మార్కెటింగ్ పద్ధతులు అనేవి వాటిని తల్లిపాలు ఇవ్వడంతో సమానంగా చిత్రీకరించి చూపిస్తాయి.
02:02 చాలా మంది వైద్యులు లేదా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు కూడా వాటి యొక్క హానికరమైన ప్రభావాల గురించి తెలియదు.
02:10 తల్లి పాలివ్వకపోవడం వల్ల కలిగే నష్టాలు కూడా వారికి తెలియదు.
02:17 అందువల్ల, చాలా మంది ప్రజలు వాణిజ్య శిశు ఆహారాలను ప్రమాదకరమైనవిగా పరిగణించరు.
02:25 వాణిజ్య శిశు ఆహార పదార్థాలకు సాధారణ సమాజపు అంగీకారమూ ఉంది.
02:32 అదేవిధంగా పాల సీసాలు మరియు కృత్రిమ ఉరుగుజ్జులకూ ఇది వర్తిస్తుంది.
02:39 ఏ వాణిజ్య శిశు ఆహారం కూడా తల్లి పాలివ్వడంతో సమానం కాదు.
02:46 వారు తల్లి పాల యొక్క సాధారణ భాగాలను అనుకరించవచ్చు.
02:52 సాధారణ భాగాలు ప్రోటీన్లు, కేలరీలు లేదా కొవ్వులు కలిగిఉంటాయి.
02:59 ఏమైనప్పటికి, అవి తల్లి పాలలోని అనేక భాగాలను కలిగి ఉండవు.
03:06 అలాగే, ప్రతి తల్లికి మరియు ఆమె బిడ్డకూ తల్లి పాలు అనేవి మారుతూ ఉంటాయి.
03:13 వాణిజ్య శిశు ఆహారాలు అనేవి ఈ లక్షణాన్నికలిగిఉండవు.
03:18 అవి అందరు తల్లులు మరియు పిల్లలకు ఒకేలా ఉంటాయి.
03:24 అవి తల్లి పాలివ్వడం యొక్క మానసిక-భావోద్వేగ ప్రయోజనాలను కూడా కలిగిఉండవు.
03:31 అవి శిశువుల్లో పోషకాహార లోపం లేదా ఊబకాయాన్ని కలిగిస్తాయని బాగా తెలుసు.
03:38 అవి అంటు వ్యాధులు మరియు సంక్రమణ వ్యాధులకు కూడా కారణమవుతాయి.
03:44 ఈ వ్యాధులలో హృదయ సంబంధ సమస్యలు కూడా ఉన్నాయి.
03:48 ఇంకా అలెర్జీలు.
03:51 వాటియొక్క అతి చెత్త ప్రభావం ఏమిటంటే, అవి తల్లి పాలివ్వడం అనేది శిశువులకు అంత ముఖ్యం కాదనిపించేలా చేస్తాయి.
03:59 అవి తల్లి పాలివ్వడం అనేది ఉచితం మరియు ఉత్తమమైనదని తెలుసుకోకుండా ప్రజలను ఆపేస్తాయి.
04:08 శిశు ఆహారాలు (బేబీ ఫుడ్స్) ను వాడటానికి 2 వ కారణం అవి సులభమైన సత్వరమార్గంలా అనిపించడం.
04:16 తల్లి పాలివ్వడం అనేది ఒక కళ.
04:19 సరైన పద్దతిలో తల్లి పాలివ్వడాన్ని నేర్చుకోవడానికి లేదా సహాయం చేయడానికి సమయం మరియు కృషి అవసరం.
04:28 తల్లి పాలివ్వడాన్ని నేర్చుకునేటప్పుడు సమస్యలు కూడా ఉండవచ్చు.
04:34 ఇంట్లో తల్లి పాలు ఇవ్వటానికి తల్లికి కుటుంబం యొక్క మద్దతు అవసరం.
04:40 ఇంటి బయట లేదా పనిచేసే స్థలం వద్ద తల్లి పాలు ఇవ్వటానికి ఆమెకు సమాజం యొక్క మద్దతు కూడా అవసరం.
04:49 అందువల్ల, వాణిజ్య శిశు ఆహారాలు అనేవి అనుకూలమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడతాయి.
04:57 ఇప్పుడు మనం వాణిజ్య శిశు ఆహార పదార్థాల యొక్క వాడకానికి ఉన్న మూడవ కారణం గురించి చర్చిద్దాం.
05:04 సరైన అవగాహన లేని ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు శిశు ఆహారాలను ఒక సులభమైన పరిష్కారంగా ఉపయోగిస్తారు.
05:12 తల్లి సరిగ్గా పాలివ్వడానికి తల్లులకు ఎలా సహాయం చేయాలో కూడా వారికి తెలియకపోవచ్చు.
05:18 కనుక, సమస్యాత్మక పరిస్థితిలో, వారు అప్రమేయంగా వాణిజ్య శిశు ఆహార పదార్థాలను సిఫార్సు చేస్తారు.
05:27 శిశు ఆహారాల (బేబీ ఫుడ్స్) ను వాడటానికి 4 వ కారణం తయారీదారులు చేసే వారి భారీ ప్రమోషన్.
05:36 శిశు ఆహారాల (బేబీ ఫుడ్స్) ను కొనేలా ప్రజలను ఒప్పించడానికి వారు శాస్త్రీయ పదాలు మరియు రివార్డులను ఉపయోగిస్తారు.
05:44 వారు శిశు ఆహారాల (బేబీ ఫుడ్స్) ను సులభంగా సూచించమని ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను వాటిని ఉపయోగించడానికి ఒప్పిస్తారు.
05:52 శిశు ఆహారాల (బేబీ ఫుడ్స్) ను వాడటానికి 5 వ కారణం కొత్తగా తల్లయిన వారియొక్క మానసిక బలహీనత.
06:01 వారి స్వంత సమస్యల సమయంలో వారి చింతలు అనేవి పెరుగుతాయి.
06:06 వరదలు లేదా COVID-19 సంక్షోభం వంటి విపత్తుల సమయంలో కూడా ఇవి పెరుగుతాయి.
06:16 వారు విశ్వాసాన్ని కోల్పోతారు మరియు తల్లి పాలు ఒక్కటే తమ బిడ్డకు సరిపోవు అని భావిస్తారు.
06:23 శిశు ఆహారాల (బేబీ ఫుడ్స్) యొక్క ఉపయోగం గురించిన తప్పుడు సలహాలను వారు నమ్మడం ప్రారంభిస్తారు.
06:31 అప్పుడు వారు వాణిజ్య శిశు ఆహారాలను (కమర్షియల్ బేబీ ఫుడ్స్) వాడటం ప్రారంభిస్తారు.
06:37 ఇప్పుడు మనం వాణిజ్య శిశు ఆహారాల (కమర్షియల్ బేబీ ఫుడ్స్) ప్రమోషన్ యొక్క చరిత్రను క్లుప్తంగా చర్చిద్దాం.
06:45 అవి ఆవిష్కరించబడిన నుండి, వాటి ప్రమోషన్ అనేది తల్లిపాలు ఇవ్వడం అంత ముఖ్యం కాదని అనిపించేలా చేసింది.
06:53 వాటి యొక్క కంపెనీలు నేరుగా గర్భిణీలు లేదా పాలిచ్చే మహిళలు మరియు ఆరోగ్య కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటాయి.
07:02 వారు పోషకాహారం లేదా తల్లి పాలివ్వడం పై వర్క్‌షాప్‌ల ద్వారా శిశు ఆహారాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తారు.
07:09 వారు వరదలు లేదా భూకంపాలు వంటి అత్యవసర సమయాల్లో వారి ఉత్పత్తులను ఉచితంగా పంపిణీ చేస్తారు.
07:19 కిరాణా దుకాణాలు మరియు మెడికల్ స్టోర్లలో కూడా శిశు ఆహారాల‌ను (బేబీ ఫుడ్స్) ప్రోత్సహించడానికి వారు ప్రయత్నిస్తారు.
07:27 వాణిజ్య శిశు ఆహారాలు (కమర్షియల్ బేబీ ఫుడ్స్) అనేవి దుకాణాల్లో ప్రముఖంగా ప్రదర్శించబడతాయి.
07:33 వాణిజ్య శిశు ఆహారాలను (కమర్షియల్ బేబీ ఫుడ్స్) కొని ఉంపయోగించేలాగా ప్రజల్నిఆకర్షించడానికి వారు ప్రోత్సాహకాలను ఉపయోగిస్తారు.
07:42 శిశువుల కొరకు ఈ వ్యూహాలు అనేవి ఎంత హానికరమో ఆరోగ్య ఆందోళనాకారులు గ్రహించారు.
07:50 జీవితంలో శైశవదశ (బాల్యదశ) అనేది హాని కలగడానికి అవకాశం ఉన్న కాలం.
07:55 ఆహరాన్నిఇవ్వడానికి సరిపడని పద్ధతులు అంటే వాణిజ్య శిశు ఆహారాలను (కమర్షియల్ బేబీ ఫుడ్స్) తప్పుగా ఉపయోగించడం వంటివి చాలా ప్రమాదకరం.
08:05 కనుక, వాణిజ్య శిశు ఆహారాల (కమర్షియల్ బేబీ ఫుడ్స్) యొక్క ప్రమోషన్ ను నియంతరించడానికి ప్రత్యేక చట్టాలు అనేవి అవసరం.
08:14 అందుకోసమే, International Code of Marketing of Breastmilk Substitutes అనేది సృష్టించబడింది.
08:23 ఇది 1981 లో World Health Assembly చేత ఆమోదించబడింది.
08:30 శిశు ఆహారాల యొక్క మార్కెటింగ్‌ను నియంత్రించడానికి చట్టాలను రూపొందించాలని ఇది అన్ని దేశాలను కోరింది.
08:39 Infant Milk Substitutes, Feeding Bottles and Infant Foods (Regulation of Production, Supply and Distribution) Act 1992, and Amendment Act 2003 ను భారతదేశం ఆమోదించింది.
08:57 దీనిని IMS చట్టం అని కూడా అంటారు.
09:02 ఈ కోడ్ ను అమలుచేయడానికి అన్నిదేశాల చేత ఆమోదించబడిన అనేక చట్టాలు ఉన్నాయి.
09:09 ఈ అన్ని చట్టాలలో, IMS చట్టం అనేది అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటి.
09:17 IMS చట్టం యొక్క నిబంధనలు అనేవి చాలా స్పష్టంగా BPNI చేత ఇవ్వబడ్డాయి.
09:25 BPNI అనేది Breastfeeding Promotion Network of India.
09:32 ఇప్పుడు, మనం IMS చట్టం యొక్క 10 ఉల్లంఘనలను చర్చిద్దాం.
09:39 ఒకవేళ IMS చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే:
09:44 ఏ విధంగానైనా ఒక ఆహారాన్ని ప్రోత్సహిస్తే, అంటే ప్రత్యేకంగా 2 సంవత్సరాల వయస్సు లోపలి పిల్లల కొరకు.
09:53 ఆ ఆహారం యొక్క పేరు ఏంటి అని పట్టింపు లేదు.
09:57 ఒకవేళ IMS చట్టం పరిధిలో ఉన్న ఉత్పత్తులను ప్రచారం చేసినట్లయితే.
10:04 ఇందులో శిశువుల పాల ప్రత్యామ్నాయాలు, పాల సీసాలు మరియు శిశువుల ఆహారం ఉన్నాయి.
10:12 వీటిపై ఏ రూపంలో నైనా లేదా ఏ మాధ్యమంలోనైనా, ఎలాంటి ప్రకటన అయినా అది IMS చట్టాన్ని ఉల్లంఘిస్తుంది.
10:20 టీవీ, వార్తాపత్రికలు, సచిత్రపత్రికలు, పత్రికలు, రేడియో, ఎస్ఎంఎస్ ప్రకటనలు ఇందులోకి వస్తాయి.
10:30 సోషల్ మీడియా, బిల్ బోర్డులు, బ్యానర్లు మరియు ఇతర ప్రకటనలు కూడా ఇందులోకి వస్తాయి.
10:39 ఒకవేళ ఆ ఉత్పత్తిని గానీ లేదా దాని నమూనాలను గానీ ఏ వ్యక్తికైనా నేరుగా పంపిణీ చేసినట్లయితే.
10:47 గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే మహిళలు ఇందులోకి వస్తారు.
10:53 ఒకవేళ ఆ ఉత్పత్తిని ఉపయోగించేలా చేయడానికి లేదా విక్రయించడానికి ఏదైనా ప్రోత్సాహకాన్ని గానీ ఇచ్చినట్లయినా.
11:01 అంటే ప్రోత్సాహకాలు డిస్కౌంట్ లు లేదా ఉచిత బహుమతులు మొదలైనవి కావచ్చు.
11:08 IMS యొక్క ప్రమోషన్ కు సంబంధించిన విద్యా సామగ్రి పంపిణీ చేయబడినట్లయినా.
11:16 అమ్మకాలను పెంచుకోవడానికి, ఈ ఉత్పత్తుల యొక్క లేబుల్స్ పై నిర్దిష్ట చిత్రాలను కలిగి కలిగిఉన్నట్లయినా.
11:24 ఇవి తల్లులు, పిల్లలు, కార్టూన్లు, గ్రాఫిక్స్ మొదలైనవాటి యొక్క చిత్రాలు కావచ్చు.
11:33 ఒక ఆసుపత్రి గానీ, నర్సింగ్ హోమ్, కెమిస్ట్ షాప్ వారు గానీ ఏ విధంగానైనా IMS ను ప్రోత్సహించినట్లయినా.
11:41 IMS కంపెనీల ప్లకార్డులు లేదా పోస్టర్‌లను ప్రదర్శించడం ఇందులో ఉన్నాయి.
11:49 ఒకవేళ IMS ను ప్రోత్సహించడానికి ఆరోగ్య కార్యకర్తలకు లేదా వారి కుటుంబానికి డబ్బు లేదా బహుమతులు ఇచ్చినట్లయినా.
11:58 ఒక IMS సంస్థ గానీ లేదా దాని యొక్క పంపిణీదారు గానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దత్తును అందించినట్లయినా.
12:08 వీటికొరకు నిధులు ఇవ్వడం ఇందులోకి వస్తుంది, సెమినార్లు
12:11 సభలు,

సమావేశాలు

12:14 లేదా శిక్షణా తరగతులు.
12:17 ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి స్పాన్సర్‌షిప్‌లు,
12:21 పరిశోధన కొరకు గ్రాంట్లు లేదా ఫెలోషిప్‌లు.
12:25 ఆరోగ్య కార్యకర్తలు లేదా వారి సంఘాల యొక్క స్పాన్సర్షిప్ కూడా అనుమతించబడదు.
12:33 ఒకవేళ IMS అమ్మకాల యొక్క పరిమాణం అనేది అమ్మకపు కమిషన్‌ను పరిష్కరించడం కోసం ఆధారం అయినట్లయితే.
12:42 అలా చేయడం ద్వారా, IMS సంస్థ గానీ లేదా దాని ఉత్పత్తి పంపిణీదారు గానీ IMS చట్టాన్ని ఉల్లంఘించినవారు అవుతారు.
12:51 దయచేసి ఇటువంటి ఉల్లంఘనలను వెంటనే రిపోర్ట్ చేయండి.
12:56 అలా చేయడానికి, మీరు BPNI STANPAN SURAKSHA మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చు.
13:05 ఈ అప్లికేషన్‌ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటుంది.
13:11 ఒక ఉల్లంఘనను రిపోర్ట్ చేయడానికి ఇది 2 సాధారణ దశలను మాత్రమే కలిగి ఉంటుంది.
13:17 మీరు ఏదైనా ఉల్లంఘనను గుర్తించినప్పుడు, ఈ అప్లికేషన్‌ ను తెరవండి.
13:23 మెనులోని Report promotion of baby foods or feeding bottles టాబ్ క్లిక్ చేయండి.
13:32 రిపోర్టింగ్ పేజీ తెరవబడుతుంది.
13:36 నిర్దేశించిన కాలమ్స్ లో అవసరమైన సమాచారాన్ని అందించండి.
13:42 ఒకవేళ మీరు ఏదైనా ఫొటోని గానీ పత్రాన్ని గానీ కలిగిఉంటే దాన్ని అటాచ్ చేయండి.
13:48 దాన్ని సబ్మిట్ చేయండి.
13:51 గుర్తుంచుకోండి, IMS కంపెనీలు తమ ప్రకటనలలో తల్లి పాలివ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను పేర్కొనవచ్చు.
13:59 ఏదేమైనా, అలాంటి ప్రకటన ఏదైనా ఒక తల్లికి, తల్లి పాలివ్వడం కోసం ఆమె వేసుకున్న ప్రణాళికలో అనుమానాన్ని కలిగిస్తుంది.
14:07 వారి ప్రకటనలు అనేవి శిశు ఆహారాలను వీలైనంత ఎక్కువ మంది తల్లులకు విక్రయించడానికి రూపొందించబడ్డాయి.
14:14 తల్లి, తన పాలివ్వడాన్ని ఎంత త్వరగా ఆపివేస్తే, అంత ఎక్కువ ఫార్ములా అనేది కొనుగోలు చేయబడుతుంది.
14:21 ఈ కారణంగానే IMS కంపెనీలు తల్లి పాలివ్వడం అనేది అంత ముఖ్యమైనది కాదు అనిపించేలా చేస్తాయి.
14:30 కనీసం 2 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు శిశువుకు తల్లి పాలివ్వడం అనేది తప్పనిసరి.
14:38 తల్లి బిడ్డకు తగినన్నిపాలివ్వటానికి, పాలివ్వడంలో సరైన పద్దతిని తెలుసుకోవడం అనేది ముఖ్యం.
14:45 ఇదే సిరీస్‌లోని ఇతర ట్యుటోరియల్‌లలో దీని గురించి చర్చించబడింది.
14:51 ఇది ఈ ట్యుటోరియల్ చివరికి మనలను తీసుకువస్తుంది.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya