Health-and-Nutrition/C2/Protein-rich-vegetarian-recipes/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 18:12, 30 August 2020 by Simhadriudaya (Talk | contribs)
|
|
00:00 | ప్రోటీన్ సమృద్ధిగా ఉండే శాఖాహార వంటకాలపై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని గురించి నేర్చుకుంటాము: |
00:07 | ప్రోటీన్ యొక్క ప్రయోజనాలు. |
00:09 | ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న కొన్ని శాఖాహార వంటకాలు. |
00:13 | కండరాల కణజాలాల యొక్క పెరుగుదల, మరమ్మత్తు మరియు నిర్వహణకు ప్రోటీన్ సహాయపడుతుంది. |
00:19 | రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఇది బాధ్యత వహిస్తుంది. |
00:24 | ప్రోటీన్ యొక్క ప్రాముఖ్యత గురించి మరొక ట్యుటోరియల్‌లో వివరంగా వివరించబడింది. |
00:30 | ఈ ట్యుటోరియల్ కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. |
00:33 | మనం ప్రోటీన్ యొక్క శాఖాహార వనరులను చూద్దాం |
00:37 | పాలు మరియు పాల ఉత్పత్తులు, |
00:39 | పప్పులు, |
00:41 | కాయలు మరియు విత్తనాలు అనేవి ప్రోటీన్ యొక్క మంచి వనరులు. |
00:44 | ఇప్పుడు, మనం ప్రోటీన్ సమృద్ధిగా ఉండే, కొన్ని శాఖాహార వంటకాలను చూద్దాం. |
00:49 | మన మొదటి వంటకం పన్నీర్ మసాలా (కాటేజ్ చీజ్ కర్రీ) |
00:52 | ఈ రెసిపీని చేయడానికి, మనకు అవసరమైనవి: |
00:55 | 70 గ్రాములు లేదా ½ కప్పు పన్నీర్, |
00:58 | 70 గ్రాములు లేదా ½ కప్పు పెరుగు, |
01:02 | 1 టేబుల్ స్పూన్ వేయించిన శనగపిండి, |
01:06 | మనకు ఇవి కూడా అవసరం:
1 టీస్పూన్ ఎర్ర కారం పొడి |
01:11 | ½ టీస్పూన్ పసుపు పొడి |
01:15 | ½ టీస్పూన్ కరివేపాకు పొడి |
01:19 | ½ టీస్పూన్ గరం మసాలా పొడి |
01:22 | 1 టీస్పూన్ నూనె లేదా నెయ్యి |
01:25 | రుచికి సరిపడా ఉప్పు. |
01:28 | తయారీ విధానం:
ఒక గిన్నెలో పెరుగును వేసి మృదువుగా అయ్యే వరకు గిలకొట్టండి. |
01:32 | మసాలాలు, ఉప్పు, కరివేపాకు పొడి మరియు శనగపిండి అందులో వేయండి. |
01:38 | ప్రతిదీ కలిసేలా మళ్ళీ కలపండి. |
01:40 | అందులో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలపండి. |
01:45 | గిన్నెను ఒక మూతతో కప్పి 30 నిమిషాల సేపు దాన్ని అలా వదిలేయండి. |
01:51 | ఒక పాన్ లో 1 టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. |
01:54 | పన్నీర్ ను పెరుగు మిశ్రమంతో పాటు అందులో వేయండి. |
01:58 | దాంట్లో ½ గ్లాసు నీళ్లు పోయండి. |
02:01 | ఈ మిశ్రమం చిక్కబడే వరకు దాన్ని 2 నుండి 5 నిమిషాల సేపు ఉడికించండి. |
02:07 | పన్నీర్ మసాలా ఇప్పుడు సిద్ధంగా ఉంది. |
02:09 | ½ కప్పు పన్నీర్ మసాలాలో 22 గ్రాముల ప్రోటీన్ ఉంది ఉంటుంది. |
02:14 | తరువాతి వంటకం పచ్చ పెసలతో కర్రీ. |
02:18 | ఈ వంటకాన్ని చేయడానికి, మనకు అవసరమైనవి: |
02:21 | 100 గ్రాములు లేదా 3/4 వంతు కప్పు పెరుగు |
02:25 | 30 గ్రాములు లేదా 1/4 వంతు కప్పు మొలకెత్తిన పచ్చ పెసలు |
02:30 | కడిగి తరిగిన కొత్తిమీర ¼ కప్పు |
02:35 | 4 టీస్పూన్ల శనగపిండి |
02:38 | ½ టీస్పూన్ పసుపు పొడి |
02:41 | 1 టీస్పూన్ ఎర్ర కారం పొడి. |
02:44 | మనకు ఇవి కూడా కావాలి:
½ టీస్పూన్ ఆవాలు, |
02:49 | ½ టీస్పూన్ జీలకర్ర, |
02:52 | 1 పచ్చి మిరపకాయ, |
02:54 | 1 టీస్పూన్ నూనె, |
02:56 | 4 నుండి 5 కరివేపాకు ఆకులు, |
02:59 | మరియు రుచికి సరిపడా ఉప్పు. |
03:02 | ఇప్పుడు నేను తయారీ విధానాన్ని వివరిస్తాను. |
03:04 | మనం మొదట మొలకెత్తించడంతో ప్రారంభిస్తాము. |
03:07 | పచ్చ పెసలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. |
03:11 | ఉదయం వాటిలోని నీటినంతా వంపేసి |
03:13 | శుభ్రమైన మస్లిన్ వస్త్రంలో వాటిని మూట కట్టండి. |
03:16 | మొలకెత్తడం కోసం వాటిని మొలకలు కనిపించే వరకు వెచ్చని ప్రదేశంలో 1 రోజు ఉంచండి. |
03:23 | మిక్సర్ ను ఉపయోగించి మొలకలు మరియు పచ్చిమిర్చిని కొంచం ముతక పేస్ట్ గా రుబ్బుకోవాలి. |
03:28 | ఒకవేళ మిక్సర్ అందుబాటులో లేకపోతే మీరు రాతి రోలును ఉపయోగించవచ్చు. |
03:33 | ఈ పేస్ట్‌ను ఒక బౌల్ లోకి తీసుకోండి. |
03:36 | అందులో కొత్తిమీర, 2 టీస్పూన్ల శనగపిండి, ఉప్పు వేసి బాగా కలపండి. |
03:43 | ఆ పేస్ట్ తో చిన్న బాల్స్ లాగా చేయండి |
03:45 | మరియు వాటిని ఒక స్టీమింగ్ ప్లేట్లో ఉంచండి. |
03:48 | వీటిని 6 నుండి 8 నిమిషాలు స్టీమర్లో ఆవిరికి ఉడికించండి. |
03:53 | ఉడికించిన బాల్స్ ను చల్లారనివ్వండి. |
03:56 | పెరుగు కర్రీ ని చేయడానికి, ఒక గిన్నెలో పెరుగు వేసి గిలకొట్టండి. |
03:59 | అందులో 2 టీస్పూన్ల శనగ పిండి మరియు మసాలాదినుసులు వేయండి. |
04:04 | అన్నీ చక్కగా కలవడానికి దాన్నిబాగా కలపండి. |
04:08 | అందులో 1 కప్పు నీరు పోసి, మళ్ళీ కలపండి, ఈ మిశ్రమాన్ని ఒక పక్కన ఉంచండి. |
04:13 | ఒక పాన్ లో నూనెవేసి వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర వేయండి. |
04:18 | ఒకసారి అవి చిటపటలాడటం ప్రారంభించిన తర్వాత, కరివేపాకు మరియు పెరుగు మిశ్రమాన్ని వేయండి. |
04:23 | దీన్ని మీడియం మంట మీద ఉడికించండి. |
04:26 | మిశ్రమం చిక్కబడటం మొదలయ్యే వరకు మధ్యమధ్యలో దాన్ని కలుపుతూఉండండి. |
04:30 | మిశ్రమం చిక్కబడ్డాక ఆవిరిలో ఉడికించిన బాల్స్ ను వేసి 1 నిమిషం ఉడికించండి. |
04:36 | పచ్చపెసల కూర సిద్ధంగా ఉంది. |
04:39 | ఈ కూర యొక్క సగం కప్పులో సుమారు 17 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది |
04:44 | మూడవ వంటకం జొన్నలు మరియు సోయా దోశతో నువ్వుల గింజల మిశ్రమం. |
04:50 | ఈ రెసిపీని తయారుచేయడానికి, మనకు కావల్సినవి: |
04:53 | ఒకటిన్నర టేబుల్ స్పూన్లు సోయా బీన్, |
04:57 | 2 టీస్పూన్ల జొన్నలు, |
04:59 | 2 టీస్పూన్ల బద్ద మినపపప్పు, |
05:02 | మరియు 1 టీస్పూన్ మెంతి గింజలు. |
05:06 | నువ్వుల మిశ్రమాన్ని తయారుచేయడానికి మనకు కావల్సినవి: |
05:09 | 2 టీస్పూన్ల వేపిన శనగపప్పు (పుట్నాల పప్పు), |
05:12 | 2 టీస్పూన్ల బద్ద మినపపప్పు, |
05:15 | 2 టీస్పూన్ల నువ్వులు, |
05:18 | 2 ఎండు మిరపకాయలు, |
05:21 | 1 కరివేపాకు రెమ్మ, |
05:23 | మరియు రుచికి సరిపడా ఉప్పు. |
05:25 | మనకు 1 టీస్పూన్ నూనె లేదా నెయ్యి కూడా కావాలి. |
05:30 | తయారీవిధానం:
జొన్నలు, |
05:32 | బద్ద మినపపప్పు, |
05:34 | సొయా బీన్స్ ను
బాగా కడిగి వాటిని 8 గంటలసేపు నీటిలో నానబెట్టండి. |
05:39 | అలాగే మెంతి గింజలను కూడా అందులో వేసి నానబెట్టండి. |
05:43 | 8 గంటల తరువాత, వాటిని మృదువైన పేస్ట్ గా రుబ్బండి. |
05:47 | దాన్ని ఒక బౌల్ లోకి తీసుకోండి. |
05:50 | పులియబెట్టడానికి ఈ బౌల్ ను 7 నుండి 8 గంటలసేపు వెచ్చని ప్రదేశంలో ఉంచండి. |
05:57 | ఇంతలో, ఒక పాన్ వేడిచేసి ఎండు మిరపకాయలు మరియు కరివేపాకు వేసి అవి బాగా వేగేవరకు నూనెలేకుండా వేయించండి. |
06:04 | చల్లారడానికి వాటిని ఒక పక్కన పెట్టండి. |
06:06 | అదే పాన్ లో, శనగపప్పు,మినపపప్పు మరియు నువ్వులు వేసి వేయించండి. |
06:12 | అవి లేత గోధుమ రంగులోకి వచ్చే వరకు వాటిని వేయించండి. |
06:17 | చల్లారడానికి వాటిని ఒక పక్కన పెట్టండి. |
06:20 | చల్లారిన తర్వాత, వాటిని గ్రైండ్ చేసి మెత్తని పొడి చేయండి. |
06:23 | దీనిని మనము తరువాత ఉపయోగిస్తాము. |
06:25 | పిండి పులిసిన తర్వాత అందులో ఉప్పు వేసి బాగా కలపండి. |
06:30 | పాన్ లో నూనె లేదా నెయ్యివేసి వేడి చేసి పిండిని దానిపై పోసి సమానంగా పరచండి. |
06:36 | దోస కొంచం ఉడికిన తర్వాత, తయారుచేసుకున్న 2 టీస్పూన్ల పొడిని దానిపై చల్లండి. |
06:42 | మూతపెట్టి దోస ఉడికేంత వరకు ఉంచండి. |
06:45 | జొన్నలు మరియు సోయా దోస సిద్ధంగా ఉంది. |
06:48 | 2 దోసలు సుమారు 17 గ్రాముల ప్రోటీన్ ను కలిగి ఉంటాయి. |
06:53 | తరువాతి వంటకం కొమ్ముశనగల కట్లెట్స్ |
06:57 | ఈ వంటకాన్ని తయారు చేయడానికి, మనకు కావాల్సినవి: |
07:00 | 50 గ్రాముల కొమ్ముశనగల మొలకలు, |
07:03 | 40 గ్రాములు లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ పెరుగు, |
07:08 | 1 చిన్న తురిమిన క్యారెట్, |
07:10 | సన్నగా తరిగిన 1 చిన్న ఉల్లిపాయ, |
07:14 | 15 గ్రాములు లేదా 1 టేబుల్ స్పూన్ పుట్నాలపొడి (వేపిన శనగపప్పు పిండి), |
07:18 | మరియు 20 గ్రాముల నువ్వులు. |
07:22 | మనకు ఇవి కూడా కావాలి: |
07:24 | ½ టీస్పూన్ పసుపు పొడి, |
07:27 | 1 టీస్పూన్ కారం, |
07:31 | 1 టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, |
07:34 | 2 టీస్పూన్ల నూనె లేదా నెయ్యి, |
07:37 | మరియు రుచికి సరిపడా ఉప్పు. |
07:40 | తయారీవిధానం:
కొమ్ముశనగల మొలకలను 3 విజిల్స్ వచ్చేవరకు ప్రెజర్ కుక్ చేయాలి. |
07:45 | ప్రెజర్ అంతా పోయేవరకు దానిని ఒక పక్కన ఉంచండి. |
07:49 | చల్లారిన కొమ్ముశనగల మొలకలను ఒక గిన్నెలోకి తీసుకొని వాటిని బాగా మాష్ చేయండి. |
07:54 | దీనిలో ఉల్లిపాయ, క్యారెట్, పుట్నాలపొడి (వేపిన శనగపప్పు పిండి) వేసి బాగా కలపండి. |
08:01 | ఇప్పుడు, మసాలాలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పెరుగు అన్నీ వేయండి. |
08:07 | అన్నిటినీ బాగా కలపండి ఇంకా ఆ ముద్దతో 4 బాల్స్ ను తయారు చేయండి. |
08:12 | ఈ బాల్స్ ను కట్లెట్లు లాగ సమానంగా నొక్కండి. |
08:14 | ఈ కట్లెట్లను నువ్వుల గింజలతో కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. |
08:19 | ఒక పాన్ లో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి. |
08:22 | బంగారు గోధుమ రంగు వచ్చేవరకు కట్లెట్లను రెండు వైపులా షాలో ఫ్రై చేయండి. |
08:28 | కొమ్ముశనగల కట్లెట్స్ సిద్ధంగా ఉన్నాయి. |
08:31 | 4 కట్లెట్స్‌లో 17 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. |
08:35 | ధాన్యాలు మరియు పప్పుధాన్యాలు అనేవి అసంపూర్ణమైన ప్రోటీన్లను కలిగి ఉంటాయి. |
08:39 | పప్పుధాన్యాలలో మెథియోనిన్ తక్కువగా ఉంటుంది |
08:42 | మరియు ధాన్యాలులో లైసిన్ తక్కువగా ఉంటుంది. |
08:45 | అందువల్ల, ఈ వంటకాలను తయారు చేయడానికి వివిధరకాల ఆహార వర్గాలను కలిపాము. |
08:51 | వాటిని కలయికలో తినడం వలన ఆహారంలో తక్కువైన అమైనో ఆమ్లాలను పూరిస్తాయి. |
08:57 | దీనిని ప్రోటీన్ యొక్క పరిపూరకమైన చర్య అంటారు. |
09:01 | ఇది మనల్నిఈ ట్యుటోరియల్ చివరికు తీసుకువస్తుంది.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |