Health-and-Nutrition/C2/Non-vegetarian-recipes-for-lactating-mothers/Telugu
|
|
00:00 | పాలిచ్చే తల్లుల కొరకు మాంసాహార వంటకాలపై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని గురించి నేర్చుకుంటాము: తల్లిపాలు ఇస్తున్న సమయంలో పోషకాహారం యొక్క ప్రాముఖ్యత, |
00:13 | ఇటువంటి మాంసాహార వంటకాలను తయారుచేయడం - మునక్కాడలతో చికెన్ కర్రీ, |
00:20 | శనగపలుకులు వెల్లుల్లి మసాలాలో చికెన్, |
00:24 | కొబ్బరితో చేపల కూర,
మిశ్రమ కూరగాయలతో గుడ్డు కూర మరియు పాలకూర చేపల కర్రీ. |
00:31 | పాలిస్తున్న సమయంలో, ఒక తల్లికి వీటి కొరకు అదనపు పోషకాహారం అవసరం- పాల ఉత్పత్తి కోసం, |
00:38 | పెరుగుతున్న శిశువుకు తగినంత పోషకాలను అందించడానికి మరియు
తల్లి యొక్క రోజువారీ అవసరాలను తీర్చడానికి. |
00:45 | పాలిస్తున్న సమయంలో అవసరమైన ముఖ్యమైన పోషకాలు -
విటమిన్లు,(మినరళ్ళు) ఖనిజాలు, |
00:51 | ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మరియు కోలిన్. |
00:54 | పోషకాలతో పాటు, మనము గెలక్టోగాగ్స్ (Galactogogues) గురించి నేర్చుకుంటాము. |
00:59 | గెలాక్టోగోగ్స్ అనేవి పాల ఉత్పత్తికి సహాయపడే పదార్థాలు. |
01:04 | తల్లి ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా వాటిని పొందవచ్చు-
- వెల్లుల్లి, |
01:08 | మెంతి గింజలు మరియు ఆకులు, |
01:10 | సోపు గింజలు, |
01:12 | (గార్డెన్ క్రెస్ సీడ్స్) అదిత్యాలు, అడాలు,
మునగాకులు, |
01:15 | సాయకూర ఆకులు మరియు వాము. |
01:19 | దయచేసి గమనించండి:
పాలిచ్చే తల్లుల కొరకు పోషకాహారం కోసం ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది. |
01:28 | పాలిస్తున్న సమయంలో పోషకాహారం యొక్క ప్రాముఖ్యత కోసం అర్థం చేసుకున్న తరువాత, మనం వంటకాల తయారీతో ప్రారంభిస్తాము. |
01:37 | మనం మన మొదటి వంటకమైన మునక్కాడలతో చికెన్ కర్రీతో ప్రారంభిద్దాం |
01:43 | దీన్ని తయారు చేయడానికి, మనకు అవసరమైనవి - 100 గ్రాముల చికెన్, |
01:47 | 2 మునక్కాడలు,
కరివేపాకు 1 రెమ్మ, |
01:51 | 1 టీస్పూన్ నల్ల మిరియాలు,
1 తరిగిన ఉల్లిపాయ, |
01:55 | 4 వెల్లుల్లి రెబ్బలు,
రుచికి సరిపడా ఉప్పు. |
02:00 | ½ టీస్పూన్ పసుపు పొడి,
½ టీస్పూన్ కారం పొడి, |
02:05 | 1 పచ్చి మిరపకాయ,
1 గుప్పెడు కొత్తిమీర, 2 టీస్పూన్ల నూనె. |
02:11 | ఒక పాన్ లో 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి.
అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, మిరియాలు, పచ్చిమిర్చి వేయండి. |
02:19 | బంగారు రంగులోకి వచ్చేవరకు వాటిని వేయించాలి.
ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి 2-3 సెకన్ల పాటు వేయించండి. |
02:27 | వాటిని చల్లారనిచ్చి కొంచం నీళ్లు పోసి రుబ్బి పేస్ట్ తయారుచేయండి. |
02:32 | తరువాత, మునక్కాడలను ఉడికేవరకు కుక్కర్ లో లేదా బయట ఉడికించండి |
02:36 | ఒక పాన్ లో 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి.
తయారు చేసిన పేస్ట్ ను అందులో వేసి 2 నిమిషాలు ఉడికించాలి. |
02:42 | అందులో, అన్ని మసాలాలు ఇంకా చికెన్ వేయండి.
ఇప్పుడు సగం కప్పు నీరు పోసి బాగా కలపాలి కలపండి. |
02:50 | మూతపెట్టి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. |
02:53 | అందులో, బయట ఉడికించిన లేదా ప్రెజర్ కుక్ చేసిన మునక్కాడలను వేసి 2-4 నిమిషాలు ఉడికించండి. |
02:59 | మునక్కాడలతో తో చికెన్ కర్రీ సిద్ధంగా ఉంది. |
03:03 | మనం నేర్చుకునే రెండవ వంటకం వేరుశెనగలు వెల్లుల్లి మసాలాలో చికెన్. |
03:08 | దీనిని తయారుచేయడానికి, మనకు అవసరమైనవి - 100 గ్రాముల చికెన్,
2 టేబుల్ స్పూన్ల వేరుశెనగలు, |
03:14 | 5 వెల్లుల్లి రెబ్బలు,
తరిగిన టమోటా1, |
03:18 | తరిగిన ఉల్లిపాయ1,
1/2 టీస్పూన్ పసుపు, |
03:21 | రుచికి సరిపడా ఉప్పు,
1 టీస్పూన్ ఎర్ర కారం పొడి, |
03:25 | 2 టీస్పూన్ల నూనె. |
03:27 | వేరుశెనగలు వెల్లుల్లి పేస్ట్ తయారుచేయడానికి - ఒక పాన్ లో వేరుశెనగలను మీడియం మంట మీద వేయించుకోవాలి. |
03:34 | మాడిపోకుండా ఉండటానికి వాటిని ఆపకుండా కలుపుతూఉండండి.
వాటిని చల్లారనివ్వండి. |
03:39 | పైన తొక్కును తీసేయడానికి వాటిని మీ అరచేతుల మధ్య వేసి రుద్దండి. |
03:45 | ఇప్పుడు ఒక పాన్ లో1 టీస్పూన్ నూనె వేసి వేడి చేసి ఉల్లిపాయ, టమోటా, వెల్లుల్లి వేయండి.
టమోటా మృదువుగా అయ్యే వరకు వాటిని వేయించండి. |
03:54 | వాటిని చల్లారనివ్వండి.
చల్లారిన తరువాత, వీటిని వేరుశెనగలతో కలపండి. |
03:59 | కొద్దిగా నీరు వేసి రుబ్బి పేస్ట్ తయారుచేయండి. |
04:03 | ఒక పాన్ లో1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి. |
04:05 | ఇప్పుడు అందులో వేరుశెనగ వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు ఉడికించండి.
తరువాత, మసాలాలు వేసి బాగా కలపాలి |
04:15 | దాంట్లో చికెన్ వేసి ఇంకో 2 నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు కొద్దిగా నీరు పోసి బాగా కలపండి. |
04:21 | పాన్ పైన మూత పెట్టి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. |
04:25 | చికెన్ వేరుశెనగ వెల్లుల్లి మసాలా సిద్ధంగా ఉంది. |
04:28 | మూడవ వంటకం కొబ్బరితో చేపల కూర. |
04:32 | దీని కొరకు, మనం తీసుకునేవి- 100 గ్రాముల రోహు చేప,
½ కప్పు తురిమిన కొబ్బరి, 4 ఎండు మిరపకాయలు, |
04:38 | ½ టీస్పూన్ పసుపు,
రుచికి సరిపడా ఉప్పు, |
04:42 | 4 వెల్లుల్లి రెబ్బలు,
1 చిన్న నిమ్మకాయ పరిమాణంలో చింతపండు, |
04:47 | 1 తరిగిన ఉల్లిపాయ,
½ టీస్పూన్ మెంతులు, |
04:51 | ½ టీస్పూన్ జీలకర్ర,
1 టీస్పూన్ నూనె. |
04:56 | ఒకవేళ, రోహు చేప అందుబాటులో లేనట్లయితే మీరు వీటిలో దేనినైనా ఉపయోగించవచ్చు -
మాకేరెల్, పోమ్‌ఫ్రేట్ లేదా బాంబే డక్. |
05:06 | చేపలను శుభ్రం చేసి, 2 చిటికెల ఉప్పు వేసి 10 నిమిషాలు ఉంచండి. |
05:11 | ఎండు మిరపకాయలు, మెంతులు, జీలకర్ర ను రంగు మారే వరకు నూనెలేకుండా వేయించండి. |
05:17 | వేయించిన పదార్థాలను కొబ్బరి, చింతపండు, వెల్లుల్లితో కలిపి రుబ్బి పేస్ట్ చేసుకోవాలి. |
05:25 | ఒక పాన్ లో 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి. |
05:29 | ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. |
05:33 | దాంట్లో రుబ్బిన పేస్ట్ వేసి 5-6 నిమిషాలు ఉడికించాలి.
మసాలాలు కూడా వేసి బాగా కలపాలి. |
05:42 | దాంట్లో, మ్యారినేట్ చేసిన చేపముక్కలను వేసి, ఇంకో 10 నిమిషాలు ఉడికించాలి.
చేప కొబ్బరి కూర సిద్ధంగా ఉంది. |
05:49 | నాల్గవ వంటకం మిశ్రమ రకాల కూరగాయలతో ఉడికించిన గుడ్డు కూర. |
05:53 | దీన్ని తయారుచేయడానికి, మనకు అవసరమైనవి-
2 ఉడికించిన గుడ్లు, 2 ముక్కలు కాలీఫ్లవర్, |
05:59 | 1 మీడియం ఉల్లిపాయ,
తరిగిన ఫ్రెంచ్ బీన్స్ 2, |
06:02 | తరిగిన 1 మీడియం టొమాటో,
తరిగిన చిన్న క్యాప్సికమ్ లో సగం, |
06:07 | 1 టేబుల్ స్పూన్ నువ్వులు,
1 టీస్పూన్ కారం పొడి, |
06:12 | రుచికి సరిపడా ఉప్పు,
½ స్పూన్ పసుపు పొడి, |
06:16 | 1 టేబుల్ స్పూన్ గసగసాలు,
½ టేబుల్ స్పూన్ (గార్డెన్ క్రెస్ సీడ్స్ పౌడర్) అడాలా పొడి, |
06:21 | 1 టీస్పూన్ నూనె. |
06:24 | ఒక పాన్ లో నువ్వులు మరియు గసగసాలను నూనెలేకుండా వేయించుకోండి.
వాటిని చల్లారనివ్వండి. |
06:29 | తరువాత, ఒక పాన్ లో అర టీస్పూన్ నూనె వేసి టమోట ముక్కలు వేసి వేయించాలి. |
06:35 | చల్లారిన తరువాత, టమోటాలు మరియు నువ్వులు గసగసాలను మిక్సర్ లేదా రోట్లో రుబ్బుకోవాలి. |
06:41 | ఒక పాన్ లో 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి.
ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. |
06:48 | ఇప్పుడు టమోటా పేస్ట్ ను వేసి 5 నిమిషాలు ఉడికించాలి.
ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి బాగా కలపాలి. |
06:57 | అందులో, కొంచెం నీరు పోసి కూరగాయ ముక్కలు వేయండి. |
07:01 | మూతపెట్టి కూరగాయలు మెత్తబడే వరకు ఉడికించాలి. |
07:04 | ఉడికించిన గుడ్లను 2 భాగాలుగా కట్ చేసి కూరలో వేయండి.
ఒక నిమిషం ఉడికించండి. |
07:10 | మిశ్రమ రకాల కూరగాయలతో ఉడికించిన గుడ్డు కూర సిద్ధంగా ఉంది. |
07:14 | మనం చూసే చివరి వంటకం పాలకూరతో చేపల కూర- |
07:19 | దీన్నితయారు చేయడానికి, మనకు అవసరమైనవి -
సాల్మన్ చేప 2 ముక్కలు, |
07:22 | 4-5 పాలకూర ఆకులు,
రుచికి సరిపడా ఉప్పు, |
07:26 | 1 టీస్పూన్ కారం పొడి,
½ టీస్పూన్ పసుపు పొడి, |
07:31 | 1 టీస్పూన్ అవిస గింజల పొడి,
1 టీస్పూన్ నెయ్యి లేదా నూనె, |
07:36 | 1 గుప్పెడు కొత్తిమీర,
1 టీస్పూన్ నిమ్మరసం, |
07:41 | పచ్చిమిర్చి 1,
1 టీస్పూన్ గరం మసాలా పొడి. |
07:45 | చేప ముక్కలను కడగండి. వాటికి కొంచెం ఉప్పు మరియు పసుపు రాసి పక్కన ఉంచండి. |
07:52 | పాలకూరను నీటిలో బాగా కడగండి.
ఒక గిన్నెలో నీరు మరిగించి దాంట్లో పాలకూర వేసి 5 నిమిషాలు ఉడికించాలి. |
08:01 | తరువాత, నీటిని వంపేసి దాన్ని చల్లారనివ్వండి.
పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చిని రుబ్బి పేస్ట్ చేసుకోవాలి. |
08:09 | ఒక పాన్ లో 1 టీస్పూన్ నెయ్యి లేదా నూనె వేసి వేడి చేసి, చేపముక్కలను ఉడికే వరకు వేయించాలి. |
08:15 | అదే సమయంలో మరొక పాన్ లో 1 టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి. |
08:22 | అందులో పాలకూర పేస్ట్ ఇంకా కొద్దిగా నీరు వేసి 5 నిమిషాలు ఉడికించాలి.
దాంట్లో మసాలాలు అన్నీ వేసి బాగా కలపండి. |
08:30 | ఇప్పుడు, వేయించిన చేప ముక్కలు వేసి, మసాలా అంతా చేపలకు పట్టుకునే వరకు ఉడికించండి. |
08:37 | గరం మసాలా పొడి మరియు అవిసె గింజల పొడి వేసి 2 నిమిషాలు ఉడికించండి. |
08:42 | స్టవ్ ఆపేసి అందులో నిమ్మరసం వేయండి.
పాలకూరతో చేపల కూర సిద్ధంగా ఉంది. |
08:49 | పై వంటకాలన్నిటిలో ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి -
ప్రోటీన్, |
08:54 | విటమిన్ బి 12, |
08:57 | మంచి కొవ్వులు, |
09:00 | ఐరన్, |
09:02 | ఫోలేట్, |
09:04 | పొటాషియం, |
09:06 | విటమిన్ A, |
09:08 | విటమిన్ D, |
09:12 | జింక్, |
09:14 | మెగ్నీషియం. |
09:17 | ఈ పోషకాలు వీటికి సహాయపడతాయి - శిశువు యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి, |
09:22 | తల్లిలో పాల ఉత్పత్తి ఇంకా తల్లిని ఆరోగ్యంగా ఉంచడం. |
09:27 | ఇది పాలిచ్చే తల్లుల కొరకు మాంసాహార వంటకాలపై ఈ ట్యుటోరియల్ చివరికి మనల్నితీసుకువస్తుంది.
మాతో చేరినందుకు ధన్యవాదాలు. |