GChemPaint/C2/Edit-Preferences-Templates-and-Residues/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. జికెంపెయింట్ లో ఎడిట్ ప్రేఫరేన్సెస్, టెంప్లేట్స్ ఆన్డ్ రేసి డ్యుస్(Edit Preferences, Templates and Residues) ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:10 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది- |
00:13 | ప్రేఫరేన్సెస్(Preferences) ను సవరించడం. |
00:15 | టెంప్లేట్లు ను నిర్వహించండం. |
00:17 | సిద్ధంగా వున్న టెంప్లేట్లు ఎంచుకోవడం మరియు వాడడం. |
00:20 | ఒక కొత్త టెంప్లేట్ను జోడించడం. |
00:24 | ఇంకా నేర్చుకునేది, |
00:26 | రేసిడ్యుస్ యొక్క ఉపయోగాలు మరియు |
00:28 | రేసిడ్యుస్ సవరించడం. |
00:31 | ఇక్కడ, ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04, |
00:38 | జికెంపెయింట్(GChemPaint) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
00:44 | ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి, |
00:49 | జికెంపెయింట్(GChemPaint) రసాయన నిర్మాణ ఎడిటర్. |
00:53 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్సైట్ సందర్శించండి. |
00:59 | నేను ఒక కొత్త జికెంపెయింట్(GChemPaint) అప్లికేషన్ తెరిచాను. |
01:03 | ప్రేఫరేన్సస్(Preferences) సవరించడం ద్వారా ట్యుటోరియల్ని ప్రారంభిద్దాం. |
01:07 | ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళి, ప్రేఫరేన్సస్ (Preferences)పై క్లిక్ చేయండి. |
01:13 | జికెంపెయింట్ ప్రేఫరేన్సస్ (GChemPaint Preferences) విండో తెరుచుకుంటుంది. |
01:16 | ఫైళ్లను సేవ్ చేయడానికి మొదటి ఫీల్డ్, డిఫాల్ట్ కంప్రెషన్ లెవెల్ ఫర్ జికెంపెయింట్ ఫైల్స్(Default Compression Level For GChemPaint Files)వాడుతారు. |
01:24 | అప్రమేయంగా, అది సున్నా. |
01:28 | ఒకవేళ సున్నా కాకపోతే, ఫైలు gzip వాడి కంప్రెస్ చేయబడుతుంది. |
01:33 | ఇన్వర్ట్ వేడ్జ్ హషేస్(Invert wedge hashes) గురించి మరొక ట్యుటోరియల్ లో చేర్చిస్తాను. |
01:40 | జికెంపెయింట్(GchemPaint) లో ప్రతి డాక్యుమెంట్ కు, ఒక సంబంధిత థీమ్ ఉంటుంది. |
01:46 | డిఫాల్ట్ థీమ్ జికెంపెయింట్(GchemPaint)గా ఉంచుదాం. |
01:50 | ఇప్పుడు నేను, థీమ్స్(Themes) విభాగం కింద ఆరోస్(Arrows) గురించి వివరిస్తాను. |
01:58 | టూల్ బాక్స్ లో వివిధ రకాల బాణాలు గమనించండి. |
02:02 | Add an arrow for an irreversible reaction. |
02:06 | Add a pair of arrows for a reversible reaction. |
02:10 | Add an arrow for a retrosynthesis step. |
02:14 | Add a double headed arrow to represent mesomery. |
02:19 | డిస్ప్లే ప్రాంతంలో ఈ 4 బాణాలు జోడిద్దాం. |
02:24 | Add an arrow for an irreversible reaction టూల్ క్లిక్ చేయండి. |
02:28 | తర్వాత, డిస్ప్లే ఏరియా లో క్లిక్ చేయండి. |
02:31 | ఇదే విధముగా డిస్ప్లే ఏరియాకి ఇతర రకాల బాణాలు జోడిద్దాం. |
02:41 | ప్రేఫరేన్సస్(Preferences) డైలాగ్ బాక్స్ లో థీమ్స్ ఫీల్డ్ నుండి Arrows ఎంచుకోండి. |
02:47 | కాంటెక్సువల్ (Contextual) మెను తెరుచుకుంటుంది. |
02:50 | ఇక్కడ బాణాల పొడవు, వెడల్పు మరియు దూరం పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. |
02:57 | మౌస్ తో బాణం పైకి లేదా కిందికి చూపు త్రిభుజాల పై క్లిక్ చేయండి. |
03:02 | మరియు డిస్ప్లే ఏరియా లో బాణాలలో మార్పుల ను గమనించండి. |
03:10 | ఇప్పుడు ఆరో హెడ్స్ గురించి తెలుసుకుందాం. |
03:14 | A, B మరియు C యొక్క డిఫాల్ట్ విలువలు ఇక్కడ కనిపిస్తున్నాయి. |
03:21 | A, B మరియు C పెరామేటర్స్, ఆరో హెడ్స్ ఆకారమును మార్చడంలో సహాయపడుతాయి. |
03:28 | ప్రతి ఒకటి తగ్గించి లేదా పెంచి ఆరో హెడ్స్ లో మార్పులు గమనించండి. |
03:38 | విండోను మూసివేయుటకు, క్లోజ్ బటన్ పై క్లిక్ చేద్దాం. |
03:42 | డిస్ప్లే ఏరియాను క్లియర్ చేద్దాము. |
03:46 | అన్నిఅబ్జేక్ట్స్ ఎంచుకోవడానికి Ctrl + A నొక్కండి. |
03:49 | ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళి, క్లియర్ క్లిక్ చేయండి. |
03:53 | తర్వాత, టెంప్లేట్లు ఎలా మానేజ్ చేయాలో తెలుసుకుందాం. |
03:58 | యూస్ ఆర్ మానేజ్ టెంప్లేట్స్(Use or manage templates) టూల్పై క్లిక్ చేయండి. |
04:01 | ప్రాపర్టీ(property) డైలాగ్ బాక్స్, క్రింద తెరుచుకుంటుంది. |
04:05 | ప్రాపర్టీ డైలాగ్ బాక్స్ లో, టెంప్లేట్స్ డ్రాప్ డౌన్ జాబితా ఉంది. |
04:10 | జాబితా, అమైనో ఆసిడ్స్, ఆరోమటిక్ హైడ్రోకార్బన్స్, న్యూక్లియిక్ బేసెస్, న్యూ క్ల్యో సైడ్స్ మ రియు సచ్చ రైడ్స్(Amino acids, Aromatic hydrocarbons, Nucleic bases, Nucleosides, Saccharides) కలిగి వుంది. |
04:19 | ప్రతి అంశం ఒక సబ్మేనుని కలిగి వుంది. |
04:23 | ఆరోమటిక్ హైడ్రోకార్బన్స్(Aromatic Hydrocarbons) ఎంచుకొని, సబ్మేను నుండి బెంజీన్(Benzene) క్లిక్ చేయండి. |
04:31 | బెంజీన్ నిర్మాణం ప్రాపర్టీ పేజీలో కనిపిస్తుంది. |
04:35 | బెంజీన్(Benzene) నిర్మాణం, డిస్ప్లే ఏరియా పై చూపుటకు క్లిక్ చేయండి. |
04:40 | అదేవిధంగా నాఫ్తలేన్ (naphthalene) నిర్మాణం ఎంచుకొని మరియు డిస్ప్లే ఏరియా పైన క్లిక్ చేయండి. |
04:49 | ఇతర నిర్మాణాలు మీ స్వంతగా ఎంచుకొని, డిస్ప్లే ఏరియా లో ఉంచండి. |
04:55 | ఇప్పుడు ఫైల్ సేవ్ చేద్దాం. |
04:57 | టూల్బార్ నుండి Save the current file ఐకాన్ పై క్లిక్ చేయండి. |
05:01 | సేవ్ ఆస్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
05:04 | బెంజీన్ గా ఫైల్ పేరు ఇచ్చి, సేవ్ బటన్ క్లిక్ చేయండి. |
05:10 | ఇప్పుడు ఇప్పటికే వున్న టెంప్లేట్ కు ఒక కొత్త టెంప్లేట్ జోడించడo తెలుసుకుందాం. |
05:16 | టూల్బార్ నుండి ఓపెన్ అ ఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
05:20 | ఫైళ్లు మరియు ఫోల్డర్ల తో ఒక విండో తెరుచుకుంటుంది. |
05:24 | జాబితా నుండి హెక్సేన్(Hexane) అనే ఫైల్ను ఎంచుకోండి. |
05:27 | ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి. |
05:31 | టెంప్లేట్స్ ప్రాపర్టీ పేజీ లో ఆడ్ బటన్ క్లిక్ చేయండి. |
05:35 | న్యూ టెంప్లేట్ ప్రాపర్టీ పేజీ తెరుచుకుంటుంది. |
05:38 | ప్రాపర్టీ పేజీ లో రెండు విభాగాలున్నాయి- నేమ్ మరియు కేటగరీ(Name and Category). |
05:42 | కేటగరీ రంగంలో డ్రాప్ డౌన్ జాబితా ఉంది. |
05:47 | జాబితా నుండి ఎంచుకోవచ్చు లేదా మన సొంత కేటగరీ(వర్గం) జోడించవచ్చు. |
05:52 | టెక్స్ట్ ఫీల్డ్ లో హైడ్రోకార్బన్స్ టైప్ చేయడం ద్వారా, ఒక కొత్త వర్గం జోడించవచ్చు. |
05:58 | నేమ్ ఫీల్డ్ లో, హెక్సేన్(Hexane) గా సమ్మేళనం పేరుని ఇవ్వండి. |
06:03 | డిస్ప్లే ఏరియా లో హెక్సేన్ నిర్మాణం క్లిక్ చేయండి. |
06:07 | న్యూ టెంప్లేట్ ప్రాపర్టీ పేజీలో ఇది కనిపిస్తుంది. |
06:12 | ఓకే(OK) బటన్ క్లిక్ చేయండి. |
06:15 | ఇప్పుడు, టెంప్లేట్ల డ్రాప్-డౌన్ క్లిక్ చేయండి. |
06:19 | హైడ్రోకార్బన్స్ కేటగరీ ఎంచుకోండి. |
06:22 | హెక్సేన్ నిర్మాణం టెంప్లేట్ జాబితాకు జోడించబడింది. |
06:27 | మీ స్వంతంగా, హైడ్రోకార్బన్స్ వర్గానికి ఆక్టేన్ నిర్మాణం జోడించండి. |
06:32 | హెక్సేన్ ఫైల్ని మూసివేద్దాము. |
06:35 | ఫైల్(File) మెను వద్దకు వెళ్ళి, ఫైల్ ముసేయడానికి క్లోజ్(Close) ఎంచుకోండి. |
06:41 | టెమ్ప్లెట్స్ ప్రాపర్టీ పేజి మూసివేయడానికి, సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జేక్ట్స్ టూల్ (select one or more objects tool) క్లిక్ చేయండి. |
06:47 | ఇప్పుడు, రేసిడ్యుస్ (శేషాల)గురించి తెలుసుకుందాం. |
06:51 | రేసిడ్యుస్ ని, |
06:53 | కార్బన్ గొలుసుతో జతచేయబడిన ఫంక్షనల్ గ్రూప్ యొక్క స్వభావాన్ని కనుకొనడం |
06:58 | క్రియాత్మక సమూహ నిర్మాణం కనుగొనడానికి వాడుతారు. |
07:01 | డేటాబేస్ కు కొత్త ఫంక్షనల్ గ్రూప్ ని చేర్చుటకు వాడుతారు. |
07:04 | టూల్స్ మెను కి వెళ్ళీ, ఎడిట్ రేసిడ్యుస్ క్లిక్ చేయండి. |
07:09 | రేసిడ్యుస్ (శేషాల) విండో తెరుచుకుంటుంది. |
07:12 | ఇందులో, మూడు బటన్లు ఉన్నాయి- న్యూ, సేవ్ మరియు డిలీట్. |
07:18 | న్యూ బటన్ లో జాబితా డ్రాప్ డౌన్ ఉంది. |
07:21 | జాబితాలో నుండి n-Pr ఎంచుకోండి. |
07:25 | ఐడెంటిటీ(Identity) టాబ్ ఎంపిక చేసిన రేసిడ్యుస్ సింబల్ మరియు పేరుని చూపిస్తుంది. |
07:32 | ఫార్ములా(Formula) టాబ్ ఎంపిక చేసిన రేసిడ్యు యొక్క అస్థిపంజర నిర్మాణాన్ని చూపిస్తుంది. |
07:38 | అదేవిధంగా, సెకండరీ బ్యూట్య్ల్ కోసం s-Bu ఎంచుకోండి. |
07:44 | ఎంపిక చేసిన రేసిడ్యు యొక్క సింబల్, పేరు మరియు అస్థిపంజర నిర్మాణాన్ని గమనించoడి. |
07:52 | ఇప్పుడు ఒక కొత్త రేసిడ్యు- హైడ్రాక్సీ సమూహం జోడిద్దాం. |
07:57 | ఒక కొత్త రేసిడ్యు కోసం న్యూ(New) బటన్ పై క్లిక్ చేయండి. |
08:02 | సింబల్ రంగంలో O-H ఇవ్వండి. |
08:06 | హైడ్రాక్సీ గా పేరు ఇవ్వండి. |
08:09 | ఫార్ములా (Formula)టాబ్ మీద క్లిక్ చేయండి. |
08:11 | bulleted బాండ్ చూస్తారు. |
08:14 | బాండ్ సమీపంలో కర్సర్ ఉంచి, కాపిటల్ O నొక్కండి. |
08:19 | O మరియు OS తో సబ్ మెనూ తెరుచుకుంటుంది. O ఎంచుకోండి. |
08:24 | ఓ-హెచ్(O-H)సమూహం బాండ్ కు జోడించబడిoది. |
08:28 | సేవ్(Save) బటన్ క్లిక్ చేయండి. |
08:31 | ఇప్పుడు, జాబితా చూడడానికి న్యూ బటన్ క్లిక్ చేయండి. |
08:35 | ఓ-హెచ్ రేసిడ్యు జాబితాలో చేర్చబడింని గమనించండి. |
08:40 | విండోను మూసివేయుటకు, క్లోజ్ బటన్ క్లిక్ చేద్దాము. |
08:44 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం. |
08:48 | ట్యుటోరియల్ సారాంశం, |
08:50 | ఈ ట్యుటోరియల్లో, నేర్చుకున్నవి, |
08:53 | ప్రేఫరేన్సెస్ సవరించడం |
08:55 | టెంప్లేట్లు నిర్వహించడం |
08:56 | సిద్ధంగా వున్న టెంప్లేట్లు ఎంచుకోవడం మరియు వాడడం. |
08:59 | ఒక కొత్త టెంప్లేట్ జోడించడం. |
09:01 | రేసిడ్యుస్(శేషాల) యొక్క ఉపయోగాలు మరియు రేసిడ్యుస్(శేషాలు) సవరించడం. |
09:07 | ఒక అసైన్మెంట్- టెంప్లేట్ల జాబితా నుండి సచ్చరైడ్స్(Saccharides)ఎంచుకొని, వాడండి. |
09:12 | ఇతర రేసిడ్యుస్ అన్వేషించండి. |
09:16 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో చూడండి. |
09:20 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
09:24 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:29 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
09:33 | ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
09:37 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి. |
09:45 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
09:50 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:57 | ఈ మిషన్ గురించి, మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. |
10:04 | ఈ రచనకు సహాయపడిన వారు స్పోకెన్ ట్యుటోరియల్ జట్టు, మాతో చేరినందుకు ధన్యవాదములు. |