Drupal/C2/Editing-Existing-Content/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:01 | ఎడిటింగ్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ పై స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకునే విషయాలు-
సికె ఎడిటర్ ఉపయోగించి ఇన్ లైన్ ఎడిటింగ్. |
00:10 | మరియు |
00:12 | సికె ఎడిటర్ని కాన్ఫిగర చేయుట. |
00:15 | ఈ టుటోరియల్ రికార్డ్ చేయుటకు,
ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ ద్రుపల్ 8 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌసర్ ఉపయోగించాను. |
00:24 | మీరు ఏ వెబ్ బ్రౌసర్ నైనా ఉపయోగించవచ్చు. |
00:28 | మనము ఇంతకూ ముందు తయారు చేసిన వెబ్ సైట్ని తెరుద్దాం. |
00:32 | మొదట "ఇన్ లైన్ ఎడిటింగ్" గూర్చి నేర్చుకుందాం. |
00:36 | "టైటిల్" పై కర్సర్ తీసుకెళ్ళండి. కుడిచేతి వైపు “పెన్సిల్ ఐకాన్”ని చూడవచ్చు. |
00:43 | "టైటిల్" పై తీసికెళ్లినప్పుడు, అది మనల్ని బ్లాక్ని కాన్ఫిగర్ చేసేందుకు అడుగుడుంది. |
00:48 | "కాన్ఫిగర్ బ్లాక్" పై క్లిక్ చైయండి. ఈ “బ్లాక్”, “పేజ్ టైటిల్” కోసం ఒక సాధారణ బ్లాక్. |
00:54 | ఇలా మార్చినప్పుడు “పేజ్ టైటిల్”, ప్రతి నోడ్ లో కనిపించే విధానం మారుతుంది. |
00:59 | “గో బ్యాక్ టు సైట్” పై క్లిక్ చైయండి. “పెన్సిల్” పైకి వెళ్ళి “కాన్ఫిగర్ బ్లాక్” పై క్లిక్ చేయండి. |
01:06 | ఒకవేళ మీరు ట్యాబ్ లను మార్చదలిస్తే , మీరు ఇక్కడ మార్చవచ్చు. |
01:10 | నేను యథాతథంగా ఉంచుతాను. |
01:13 | “బ్యాక్ టు సైట్” పై క్లిక్ చైయండి |
01:16 | ఇప్పుడు “కంటెంట్ ఏరియా” లో ఉన్న “పెన్సిల్” పై క్లిక్ చైయండి. |
01:20 | మీకు మూడు ఎంపికలు కనిపిస్తాయి: క్విక్ ఎడిట్ , ఎడిట్ మరియు డిలీట్. |
01:25 | ఇన్ లైన్ విండో లో క్విక్ ఎడిట్ ఒక ఫ్రంట్ ఎండ్ ఎడిటర్. |
01:29 | ఎడిట్ మనల్ని మెయిన్ ఎడిటింగ్ విండో కి ఒక నోడ్ కోసం తీసుకెళ్తుంది. |
01:33 | డిలీట్ నోడ్ ని దృవీకరణ తర్వాత తొలగిస్తుంది. |
01:37 | క్విక్ ఎడిట్ పై క్లిక్ చేసి మన నోడ్ ని ఇన్ లైన్ మాదరిగా ఎడిట్ చేద్దాం. |
01:41 | కర్సర్ ఉన్న చోటునుబట్టి, మనల్ని ఒక నోడ్ యొక్క విభిన్న విభాగాలకు తీసికెళ్తుంది. |
01:47 | దానిని క్లిక్ చేస్తే మరింత కంటెంట్ ని జత చేయవచ్చు, సోర్స్ని చూడవచ్చు, మరియు టెక్స్ట్ ని బొల్డ్ చేయవచ్చు. |
01:53 | మార్పులు చేసిన తరువాత, దృపల్ సేవ్ చేసేందుకు అడుగుతుంది. సేవ్ పై క్లిక్ చేయండి. |
02:00 | ఇప్పుడు, ఆర్టికల్ నోడ్ ని మార్చుట నేర్చుకుందాం, ఉదా: వెల్ కమ్ టు ద్రుపల్ వీల్. |
02:06 | క్విక్ ఎడిట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో టైటిల్ మరియు బాడీ ని ఎడిట్ చేయగలం అని గమనించండి. |
02:14 | ఐతే ఇమేజ్ ని ఎడిట్ చేయలేము. |
02:17 | ఇమేజ్ ని సవరించేందుకు ఎడిట్ స్క్రీన్ కి వెళ్ళాలి. |
02:22 | ఇప్పుడు బాడీ లో మార్పులు చేసి సేవ్ చేయవచ్చు. |
02:26 | క్విక్ ఎడిట్ విండో లో ట్యాగ్ లను కూడా మార్చవచ్చు. |
02:30 | దృపల్ ఫ్రంట్ ఎండ్ ఎడిటర్, సరళమైన ఎడిట్ లకు అనుకూలంగా ఉంటుంది. |
02:34 | ఎడిట్ ట్యాబ్ దృపల్ లో కంటెంట్ ని అప్ డేట్ చేసేందుకు ఒక అద్భుతమైన లక్షణం. |
02:40 | ముందే చప్పినట్టు ఒక WYSIWYG ఎడిటర్ గూర్చి చాల సార్లు పేర్కొన్నాం |
02:44 | అంటే "వాట్ యు సి ఇజ్ వాట్ యు గెట్ ". |
02:48 | WYSIWYG ఎడిటర్ చాలా సహాయకరం. |
02:52 | ముందుగా టెక్స్ట్ ఫార్మ్యట్ ని ఫుల్ HTML గా మారుద్దాం. |
02:58 | దీని ద్వారా మనకు WYSIWYG ఎడిటర్ లో ఉన్న ఫర్మ్య టింగ్ ఎంపికల అవగాహన కలుగుతుంది. |
03:04 | దృపల్ లో సికె ఎడిటర్ దృపల్ కోర్ తోపాటు వస్తుంది. |
03:09 | అప్రమేయంగా ఇది ఆన్ ఉంటుంది, దీన్ని మనకనుగుణంగా మార్చవచ్చు. |
03:14 | దీన్ని త్వరితంగా వీక్షిద్దాం. "Welcome to our site" ని హైలైట్ చేద్దాం. |
03:20 | ఫార్మాట్ ని నార్మల్ నుండి హెడ్డింగ్ 2 కి మారుద్దాం. |
03:24 | తక్షణం, దృపల్ టెక్స్ట్ ఎలా కనిపిస్తుందో ఒక ప్రివ్యూ ఇస్తుంది. |
03:30 | ఇది థీమ్ మరియు థీమ్ ఇచ్చిన క్యాస్ కేడింగ్ స్టైల్ షీట్ లేదా సిఎస్‌ఎస్ పై ఆధారపడి ఉంటుంది. |
03:38 | మనం మరి కొన్ని వాక్యాలను చేర్చుదాం. “Editing Drupal nodes is really fun!”. |
03:44 | ఇప్పుడు టెక్స్ట్ ని హైలైట్ చేద్దాం. ఇటాలిక్ ని ఆఫ్ చేసి హైపర్ లింక్ సృష్టిద్దాం. |
03:52 | ఉదా: http://drupal.org సేవ్ పై క్లిక్ చేయండి. |
04:00 | దీని పై కర్సర్ తీసికెళ్తే హైపర్ లింక్ అయిందని గమనించవచ్చు. |
04:04 | హైపర్ లింక్ తొలగించేoదుకు, టెక్స్ట్ ని హైలైట్ చేసి అన్ లింక్ పై క్లిక్ చేయండి.. |
04:10 | Ctrl+Z నొక్కి మార్పులను రద్దుచేయవచ్చు. |
04:14 | బులెట్స్ మరియు నంబరింగ్ ఐకాన్ పై క్లిక్ చేసి జాబితాను ఆర్డర్డ్ లేదా అనార్దర్డ్ లా మార్చవచ్చు. |
04:21 | అన్ ఆర్డర్డ్ లిస్ట్ పై క్లిక్ చేసి ఆ పై బులెట్ లు ఒకటి, రెండు మూడు చేర్చండి . |
04:28 | తరువాత, ఆర్డర్డ్ లిస్ట్ పై క్లిక్ చేసి ఒకటి, రెండు మూడు చేర్చండి. |
04:34 | బ్లాక్ కోట్స్ వాడేందుకు టెక్స్ట్ హై లైట్ చేసి బ్లోక్ కోట్ పై క్లిక్ చేయండి. |
04:40 | మరోసారి ఫార్మాటింగ్ మన థీమ్ చే నిర్వహించబడుతుంది. |
04:46 | మనం సులభంగా ఇమేజ్ లను చేర్చవచ్చు. నేను మొదటి నోడ్ పై అప్ లోడ్ చేసిన ఫైల్ ని ఎంచుకున్నాను. |
04:56 | ఆల్టర్నేట్ టెక్స్ట్ ఫీల్డ్ లో దృపల్ లోగో టైప్ చేయండి. |
05:02 | అలైన్ క్రింద, రైట్ ఎంచుకొని, కావాలంటే క్యాప్ షన్ ఇవ్వవచ్చు. |
05:08 | చివరికి సేవ్ పై క్లిక్ చేయండి. |
05:12 | ఇప్పుడు అది బాడీ లోని నోడ్ కు చేర్చబడినది. కావాలంటే ఇమేజ్ పై క్లిక్ మరియు డ్ర్యాగ్ చేసి కొత్త చోటికి తీసుకేళ్ళండి. |
05:22 | మన ఎడిటింగ్ విండో పరిమాణం మార్చుకొని, ఇమేజ్ ని వేరే చోట తీసుకెళ్ళగలం. |
05:30 | కర్సర్ ఇమేజ్ పై తీసుకెళ్ళి, ఇమేజ్ పరిమాణం మార్చవచ్చు. |
05:36 | ద్రుపల్ నోడ్ కి ఇమేజ్ చేర్చే ముందు ఇమేజ్ పరిమాణం మరియు ఫార్మాట్ సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి. |
05:43 | ఇది నోడ్ పై కంటెంట్ ని అలైన్ చేసేందుకు చాలా సహాయ పడుతుంది. |
05:47 | మనం ఒక టేబల్ లేదా సమాంతర వరసని చేర్చవచ్చు. |
05:51 | మరియు సృష్టించిన బ్లాక్ లను కూడా చూపించవచ్చు. |
05:55 | అందుకే ఇక్కడ హెచ్ 2 బ్లాక్, బ్లాక్ కోడ్, ప్యారాగ్రాఫ్, ట్యాగ్ మొదలుగునవి ఉన్నావి. |
06:01 | మీకు HTML తెలిసిఉంటే ఈ ఐకాన్ పై క్లిక్ చేసి సోర్స్ చూడగలరు. |
06:07 | ముందుగా అన్ని ఎంపికలను క్షుణ్ణoగా పరిశీలించి ముందుకు సాగండి. |
06:12 | మనము ఫుల్ HTML ని ఆన్ చేశాం అని గుర్తుంచుకోండి. |
06:16 | బేసిక్ HTML కి మారుస్తే, మనకు ఒక హెచ్చరిక కనిస్పిస్తుంది. |
06:21 | ఈ కంటెంట్ శాశ్వతంగా కోల్పోయే లేదా తొలగించబడే ఆవకాశం ఉంది. |
06:26 | ఒక జావా స్క్రిప్ట్, ఐ ఫ్రేమ్, యూ ట్యూబ్ వీడియో లేదా గూగుల్ మ్యాప్ లేదా ఇంకేదైనా చేరుస్తే గనుక. |
06:33 | బేసిక్ హెచ్‌టిఎంఎల్ కి మర్చినప్పుడు దృపల్ ఆ కంటెంట్ ని తొలగిస్తుంది. |
06:38 | ఈ రకమైన సమస్యలను నివారించేందుకు, మీకు అత్యవసరమైనవి మాత్రమే ఉంచుకోండి. |
06:43 | సెటింగ్స్ లో మార్పులను రద్దు చేద్దాం, ఇందువల్ల మనం ఏమి కోల్పోకుండాఉంటాం. |
06:48 | ఇది దృపల్ తో వచ్చే సి కె ఎడిటర్ యొక్క ఓవర్ వ్యూ. |
06:52 | దానిని మనకనుగుణగా మలచుకోవడం నేర్చుకున్నాం. |
06:55 | ఇప్పుడు సేవ్ అండ్ పబ్లిష్ పై క్లిక్ చేయండి. |
06:58 | మార్పు చెoదిన నోడ్ కనిపిస్తుంది. |
07:01 | తరువాత సి కె ఎడిటర్ ని కాన్ఫిగర్ చేయడం నేర్చుకుందాం. |
07:05 | పైన కనిపించే కాన్ ఫిగరేషన్ పై క్లిక్ చేయండి. |
07:09 | టెక్స్ట్ ఫార్మాట్స్ అండ్ ఎడిటర్s పై క్లిక్ చేయండి. |
07:13 | బేసిక్ మరియు ఫుల్ HTMLలు సికె ఎడిటర్ నే ఉపయోగిస్తున్నాయని గమనిచండి. |
07:19 | ఇవి ప్రామాణీకరించిన యూజర్ లకు మరియు నిర్వాహకులకు మాత్రమే కేటాయించి ఉంటాయి. |
07:24 | ఇవి రెండు ప్రత్యేకమైన యూజర్ రోల్స్. |
07:27 | ద్రుపల్ లో ప్రత్యేక యూజర్ లకు విభిన్న పాత్రలు ఉంటాయి మరియు వాటికి కావల్సిన అనుమతులు ఇవ్వాలి. |
07:34 | ఈ సందర్భంలో బేసిక్ HTML ప్రామాణీకరించిన యూజర్ మరియు నిర్వాహకునిగా పరిగణించవచ్చు. |
07:41 | సి కె ఎడిటర్ ఈ రెండు పాత్రలకు కేటాయించబడినది. |
07:45 | అలాగే ఫుల్ HTMLని అడ్మినిస్ట్రేటర్ వాదగలడు. |
07:50 | ఇప్పుడు, సి కె ఎడిటర్ ని బేసిక్ HTML లో పరీక్షిద్దాం. |
07:54 | కాన్ఫిగర్ పై క్లిక్ చేయండి, ఇప్పుడు మీరు వేరే వేరే పాత్రలను అసైన్ చేయవచ్చు. |
07:59 | మీకు నచ్చిన టెక్స్ట్ ఎడిటర్ ని అసైన్ చేసి, దానికి ఉపయోగించబడే బటన్ లకు అనుమతులను ఇవ్వండి. |
08:07 | ఇది బేసిక్ హెచ్‌టిఎంఎల్ టెక్స్ట్ ఫార్మాట్ కి ప్రామాణీకరించిన అనగా Authenticated యూజర్ కి చెందిన యాక్టివ్ టూల్ బార్ అని గుర్తుంచుకోండి. |
08:15 | ఈ యాక్టివ్ టూల్ బార్ కి ఈ బటన్లలో ఒకటి జోడించడం చాలా సులభం. |
08:21 | అందుబాటులో ఉన్న బటన్ లలో నుండి పేస్ట్ ఫ్రమ్ వర్డ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
08:26 | తరువాత మౌస్ ని క్లిక్ చేసి ఐకాన్ చేర్చే చోట ఒక నీలం రంగు బాక్స్ తేరుచుకొనే వరకు లాగండి. |
08:33 | కొత్త సమూహాన్ని చేర్చాలంటే, యాడ్ గ్రూప్ ఐకాన్ పై క్లిక్ చేసి, కాపీ అండ్ పేస్ట్ అనే పేరునిచ్చి అప్ప్లై పై క్లిక్ చేయండి. |
08:41 | పేస్ట్ ఫ్రమ్ వర్డ్ ఐకాన్ పై క్లిక్ చేసి కాపీ అండ్ పేస్ట్ విభాగం వరకు లాగండి. |
08:47 | అన్నీ పేస్ట్ ఐకాన్ లను ఇక్కడ చేరుద్దాం. |
08:51 | మూడు కొత్త బటన్ లను బేసిక్ హెచ్‌టిఎంఎల్ ఫార్మాట్ బార్ కి చేర్చాము. |
08:57 | టెక్స్ట్ చాలావరకు ఫైళ్ళ నుండి కాపీ పేస్ట్ చేస్తారు కనుక, ప్రతి యొక్క టూల్ బార్ లో పేస్ట్ ఐకాన్ అత్యవసరం. |
09:04 | ఇన్ లైన్ ఇమేజ్ లను కూడా అప్ లోడ్ చేయవచ్చు. గరిష్టముగా 32 ఎంబి ఇమేజ్ ఫైల్ ని అప్ లోడ్ చేయగలం. వెడల్పు మరియు పొడువు ఎంతైనాఉండవచ్చు. |
09:14 | మీ ఇంస్టాల్లే షన్ లో గరిష్ట పరిమాణం వేరే ఉండవచ్చు. |
09:18 | ఈ సెట్టింగ్ లను మన ప్రాధాన్యత ప్రకారం మార్చుకోవచ్చు. |
09:23 | ఉదా: మ్యానువల్ లింక్ చేసే బదలు ఒక యుఆరెఎల్ ని లింక్ గా మార్చాలనుకుంటాం. |
09:29 | దీనిని కన్వర్ట్ యూఆర్ఎల్s ఇంటూ లింక్s ఎంపిక పై క్లిక్ చేసి మార్చగలము. |
09:34 | ఇక్కడ ఫిల్టర్ సెట్టింగ్లు కూడా ఉన్నాయి. లిమిట్ అల్లౌడ్ హెచ్‌టిఎంఎల్ ట్యాగ్స్ పై క్లిక్ చేద్దాం. |
09:41 | మనము ఉపయోగించే హెచ్‌టిఎంఎల్ ట్యాగ్ లను సోర్స్ ని బట్టి చేర్చవచ్చు. |
09:47 | అందుకే ఇది అత్యంత శక్తిగల WYSIWYG ఎడిటర్ మరియు దాని కాన్ఫిగరేషన్ క్షేత్రం. |
09:54 | మార్పులు చేసినతరువాత సేవ్ కాన్ఫిగరేషన్ బటన్ పై క్లిక్ చేయండి. |
09:59 | మన కంటెంట్ ని చూద్దాం. |
10:02 | వెల్కం టు ద్రుపల్ విల్ నోడ్ లోని ఎడిట్ ఎంపిక పై క్లిక్ చేయండి. |
10:07 | ఫుల్ హెచ్‌టిఎంఎల్ ఆన్ ఉందికనుక ఏ మార్పు జరగలేదని గమనించండి. |
10:12 | ఇప్పుడు బేసిక్ హెచ్‌టిఎంఎల్ కు మారుద్దాం. అన్ని మార్పులు అలాగే అమలులో ఉన్నాయి. |
10:18 | నా బ్లాక్ లు కనపించక పోయినా, పేస్ట్ ఐకాన్లు కనిపిస్తయి |
10:23 | ఈ ఇమేజ్ ఇక్కడ వద్దనుకొంటే, ఇమేజ్ పై క్లిక్ చేసి, కి బోర్డ్ పై బ్యాక్ స్పేస్ లేదా డిలీట్ కీ నొక్కి తొలగించవచ్చు. |
10:32 | సేవ్ అండ్ పబ్లిష్డ్ పై క్లిక్ చేయండి. |
10:35 | మరల, కన్ఫిగరేషన్ పై క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి టెక్స్ట్ ఫార్మాట్ మరియు ఎడిటర్ పై క్లిక్ చేయండి. |
10:43 | ఇప్పుడు ఫుల్ హెచ్‌టిఎంఎల్ టూల్ బార్ కన్ఫిగర్ చేద్దాం. |
10:47 | ఇక్కడ ఇంకొన్ని బటన్ లున్నాయి ఐతే పేస్ట్ ఐకాన్ లు లేవని గమనించండి |
10:52 | షో గ్రూప్ నేమ్స్ పై క్లిక్ చేసి ఈ సారి రెండవ వరస పై యాడ్ గ్రూప్ ని క్లిక్ చేయండి . |
10:57 | దీనికి కాపీ అండ్ పేస్ట్ అనే పేరునివ్వండి . ఇప్పుడు వీటిని మన కాపీ అండ్ పేస్ట్ విభాగం లో క్లిక్ చేసి డ్ర్యాగ్ చేయగలం. |
11:05 | అలాగే ఇక్కడ కింద, ఈ అన్నీ ఎంపికలు ఉన్నాయి. ఇప్పటికీ సేవ్ కన్ఫిగరేషన్ పై క్లిక్ చేయండి. |
11:13 | మన వెల్ కమ్ టు ద్రుపల్ విల్ కి మరలా వచ్చి దానిని ఫుల్ హెచ్‌టిఎంఎల్ కి మారుద్దాం. |
11:18 | కంటిన్యూ పై క్లిక్ చేస్తే, రెండు వరస ల బటన్లు కనిపిస్తుంది. |
11:23 | అంటే మన ఎడిటర్ సిద్దం అని అర్థం. |
11:26 | సి కె ఎడిటర్ పై కొంత సేపు పని చేసి దీనిని ఉపయోగించుట సరిగ్గా అర్థం చేసుకోండీ. |
11:32 | ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. సారాంశం చూద్దాం. |
11:37 | ఈ టుటోరియల్ లో మనం
ఇన్ లైన్ ఎడిటింగ్ సి కె ఎడిటర్ ఉపయోగించుట మరియు సి కె ఎడిటర్ ని కన్ఫిగర్ చేయుట నేర్చుకున్నాం. |
11:50 | ఈ వీడియో అక్క్వ అండ్ ఓఎస్ ట్రెయింగ్ ( Acquia and OS Training ) నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే, వీరు రివైస్ చేశారు. |
11:59 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. దయచేసి, దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
12:06 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ వర్క్ షాప్ నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
12:13 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
12:25 | ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు. |