Drupal/C2/Editing-Existing-Content/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 ఎడిటింగ్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ పై స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకునే విషయాలు- సికె ఎడిటర్ ఉపయోగించి ఇన్ లైన్ ఎడిటింగ్.
00:10 మరియు
00:12 సికె ఎడిటర్ని కాన్ఫిగర చేయుట.
00:15 ఈ టుటోరియల్ రికార్డ్ చేయుటకు, ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్, ద్రుపల్ 8 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌసర్ ఉపయోగించాను.
00:24 మీరు ఏ వెబ్ బ్రౌసర్ నైనా ఉపయోగించవచ్చు.
00:28 మనము ఇంతకూ ముందు తయారు చేసిన వెబ్ సైట్ని తెరుద్దాం.
00:32 మొదట "ఇన్ లైన్ ఎడిటింగ్" గూర్చి నేర్చుకుందాం.
00:36 "టైటిల్" పై కర్సర్ తీసుకెళ్ళండి. కుడిచేతి వైపు 'పెన్సిల్ ఐకాన్'ని చూడవచ్చు.
00:43 "టైటిల్" పై తీసికెళ్లినప్పుడు, అది మనల్ని బ్లాక్ని కాన్ఫిగర్ చేసేందుకు అడుగుడుంది.
00:48 "కాన్ఫిగర్ బ్లాక్" పై క్లిక్ చైయండి. ఈ బ్లాక్, పేజ్ టైటిల్ కోసం ఒక సాధారణ బ్లాక్.
00:54 ఇలా మార్చినప్పుడు పేజ్ టైటిల్, ప్రతి నోడ్ లో కనిపించే విధానం మారుతుంది.
00:59 గో బ్యాక్ టు సైట్ పై క్లిక్ చైయండి. పెన్సిల్ పైకి వెళ్ళి కాన్ఫిగర్ బ్లాక్ పై క్లిక్ చేయండి.
01:06 ఒకవేళ మీరు ట్యాబ్ లను మార్చదలిస్తే , మీరు ఇక్కడ మార్చవచ్చు.
01:10 నేను యథాతథంగా ఉంచుతాను.
01:13 బ్యాక్ టు సైట్ పై క్లిక్ చేయండి.
01:16 ఇప్పుడు కంటెంట్ ఏరియా లో ఉన్న పెన్సిల్ పై క్లిక్ చైయండి.
01:20 మీకు మూడు ఎంపికలు కనిపిస్తాయి: క్విక్ ఎడిట్, ఎడిట్ మరియు డిలీట్.
01:25 ఇన్ లైన్ విండో లో క్విక్ ఎడిట్ ఒక ఫ్రంట్ ఎండ్ ఎడిటర్.
01:29 ఎడిట్ మనల్ని మెయిన్ ఎడిటింగ్ విండో కి ఒక నోడ్ కోసం తీసుకెళ్తుంది.
01:33 డిలీట్ నోడ్ ని దృవీకరణ తర్వాత తొలగిస్తుంది.
01:37 క్విక్ ఎడిట్ పై క్లిక్ చేసి మన నోడ్ ని ఇన్ లైన్ మాదరిగా ఎడిట్ చేద్దాం.
01:41 కర్సర్ ఉన్న చోటునుబట్టి, మనల్ని ఒక నోడ్ యొక్క విభిన్న విభాగాలకు తీసికెళ్తుంది.
01:47 దానిని క్లిక్ చేస్తే మరింత కంటెంట్ ని జత చేయవచ్చు, సోర్స్ని చూడవచ్చు, మరియు టెక్స్ట్ ని బొల్డ్ చేయవచ్చు.
01:53 మార్పులు చేసిన తరువాత, దృపల్ సేవ్ చేసేందుకు అడుగుతుంది. సేవ్ పై క్లిక్ చేయండి.
02:00 ఇప్పుడు, ఆర్టికల్ నోడ్ ని మార్చుట నేర్చుకుందాం, ఉదా- వెల్ కమ్ టు ద్రుపల్ వీల్.
02:06 క్విక్ ఎడిట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో టైటిల్ మరియు బాడీ ని ఎడిట్ చేయగలం అని గమనించండి.
02:14 ఐతే ఇమేజ్ ని ఎడిట్ చేయలేము.
02:17 ఇమేజ్ ని సవరించేందుకు ఎడిట్ స్క్రీన్ కి వెళ్ళాలి.
02:22 ఇప్పుడు బాడీ లో మార్పులు చేసి సేవ్ చేయవచ్చు.
02:26 క్విక్ ఎడిట్ విండో లో ట్యాగ్ లను కూడా మార్చవచ్చు.
02:30 దృపల్ ఫ్రంట్ ఎండ్ ఎడిటర్, సరళమైన ఎడిట్ లకు అనుకూలంగా ఉంటుంది.
02:34 ఎడిట్ ట్యాబ్ దృపల్ లో కంటెంట్ ని అప్ డేట్ చేసేందుకు ఒక అద్భుతమైన లక్షణం.
02:40 ముందే చప్పినట్టు ఒక WYSIWYG ఎడిటర్ గూర్చి చాల సార్లు పేర్కొన్నాం
02:44 అంటే "వాట్ యు సి ఇజ్ వాట్ యు గెట్ ".
02:48 WYSIWYG ఎడిటర్ చాలా సహాయకరం.
02:52 ముందుగా టెక్స్ట్ ఫార్మ్యట్ ని ఫుల్ HTML గా మారుద్దాం.
02:58 దీని ద్వారా మనకు WYSIWYG ఎడిటర్ లో ఉన్న ఫర్మ్యటింగ్ ఎంపికల అవగాహన కలుగుతుంది.
03:04 దృపల్ లో సికె ఎడిటర్ దృపల్ కోర్ తోపాటు వస్తుంది.
03:09 అప్రమేయంగా ఇది ఆన్ ఉంటుంది, దీన్ని మనకనుగుణంగా మార్చవచ్చు.
03:14 దీన్ని త్వరితంగా వీక్షిద్దాం. "Welcome to our site" ని హైలైట్ చేద్దాం.
03:20 ఫార్మాట్ ని నార్మల్ నుండి హెడ్డింగ్ 2 కి మారుద్దాం.
03:24 తక్షణం, దృపల్ టెక్స్ట్ ఎలా కనిపిస్తుందో ఒక ప్రివ్యూ ఇస్తుంది.
03:30 ఇది థీమ్ మరియు థీమ్ ఇచ్చిన క్యాస్ కేడింగ్ స్టైల్ షీట్ లేదా సి‌ఎస్‌ఎస్ పై ఆధారపడి ఉంటుంది.
03:38 మనం మరి కొన్ని వాక్యాలను చేర్చుదాం. Editing Drupal nodes is really fun!.
03:44 ఇప్పుడు టెక్స్ట్ ని హైలైట్ చేద్దాం. ఇటాలిక్ ని ఆఫ్ చేసి హైపర్ లింక్ సృష్టిద్దాం.
03:52 ఉదా: http://drupal.org సేవ్ పై క్లిక్ చేయండి.
04:00 దీని పై కర్సర్ తీసికెళ్తే హైపర్ లింక్ అయిందని గమనించవచ్చు.
04:04 హైపర్ లింక్ తొలగించేoదుకు, టెక్స్ట్ ని హైలైట్ చేసి అన్ లింక్ పై క్లిక్ చేయండి..
04:10 Ctrl+Z నొక్కి మార్పులను రద్దుచేయవచ్చు.
04:14 బులెట్స్ మరియు నంబరింగ్ ఐకాన్ పై క్లిక్ చేసి జాబితాను ఆర్డర్డ్ లేదా అనార్దర్డ్ లా మార్చవచ్చు.
04:21 అన్ ఆర్డర్డ్ లిస్ట్ పై క్లిక్ చేసి ఆ పై బులెట్ లు ఒకటి, రెండు మూడు చేర్చండి.
04:28 తరువాత, ఆర్డర్డ్ లిస్ట్ పై క్లిక్ చేసి ఒకటి, రెండు మూడు చేర్చండి.
04:34 బ్లాక్ కోట్స్ వాడేందుకు టెక్స్ట్ హై లైట్ చేసి బ్లోక్ కోట్ పై క్లిక్ చేయండి.
04:40 మరోసారి ఫార్మాటింగ్ మన థీమ్ చే నిర్వహించబడుతుంది.
04:46 మనం సులభంగా ఇమేజ్ లను చేర్చవచ్చు. నేను మొదటి నోడ్ పై అప్ లోడ్ చేసిన ఫైల్ ని ఎంచుకున్నాను.
04:56 ఆల్టర్నేట్ టెక్స్ట్ ఫీల్డ్ లో దృపల్ లోగో టైప్ చేయండి.
05:02 అలైన్ క్రింద, రైట్ ఎంచుకొని, కావాలంటే క్యాప్ షన్ ఇవ్వవచ్చు.
05:08 చివరికి సేవ్ పై క్లిక్ చేయండి.
05:12 ఇప్పుడు అది బాడీ లోని నోడ్ కు చేర్చబడినది. కావాలంటే ఇమేజ్ పై క్లిక్ మరియు డ్ర్యాగ్ చేసి కొత్త చోటికి తీసుకేళ్ళండి.
05:22 మన ఎడిటింగ్ విండో పరిమాణం మార్చుకొని, ఇమేజ్ ని వేరే చోట తీసుకెళ్ళగలం.
05:30 కర్సర్ ఇమేజ్ పై తీసుకెళ్ళి, ఇమేజ్ పరిమాణం మార్చవచ్చు.
05:36 ద్రుపల్ నోడ్ కి ఇమేజ్ చేర్చే ముందు ఇమేజ్ పరిమాణం మరియు ఫార్మాట్ సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి.
05:43 ఇది నోడ్ పై కంటెంట్ ని అలైన్ చేసేందుకు చాలా సహాయ పడుతుంది.
05:47 మనం ఒక టేబల్ లేదా సమాంతర వరసని చేర్చవచ్చు.
05:51 మరియు సృష్టించిన బ్లాక్ లను కూడా చూపించవచ్చు.
05:55 అందుకే ఇక్కడ హెచ్ 2 బ్లాక్, బ్లాక్ కోడ్, ప్యారాగ్రాఫ్, ట్యాగ్ మొదలుగునవి ఉన్నావి.
06:01 మీకు HTML తెలిసిఉంటే ఈ ఐకాన్ పై క్లిక్ చేసి సోర్స్ చూడగలరు.
06:07 ముందుగా అన్ని ఎంపికలను క్షుణ్ణoగా పరిశీలించి ముందుకు సాగండి.
06:12 మనము ఫుల్ HTML ని ఆన్ చేశాం అని గుర్తుంచుకోండి.
06:16 బేసిక్ HTML కి మారుస్తే, మనకు ఒక హెచ్చరిక కనిస్పిస్తుంది.
06:21 ఈ కంటెంట్ శాశ్వతంగా కోల్పోయే లేదా తొలగించబడే ఆవకాశం ఉంది.
06:26 ఒక జావా స్క్రిప్ట్, ఐ ఫ్రేమ్, యూ ట్యూబ్ వీడియో లేదా గూగుల్ మ్యాప్ లేదా ఇంకేదైనా చేరుస్తే గనుక.
06:33 బేసిక్ హెచ్‌టి‌ఎం‌ఎల్ కి మర్చినప్పుడు దృపల్ ఆ కంటెంట్ ని తొలగిస్తుంది.
06:38 ఈ రకమైన సమస్యలను నివారించేందుకు, మీకు అత్యవసరమైనైయి మాత్రమే ఉంచుకోండి.
06:43 సెటింగ్స్ లో మార్పులను రద్దు చేద్దాం, ఇందువల్ల మనం ఏమి కోల్పోకుండాఉంటాం.
06:48 ఇది దృపల్ తో వచ్చే సి కె ఎడిటర్ యొక్క ఓవర్ వ్యూ.
06:52 దానిని మనకనుగుణగా మలచుకోవడం నేర్చుకున్నాం.
06:55 ఇప్పుడు సేవ్ అండ్ పబ్లిష్ పై క్లిక్ చేయండి.
06:58 మార్పు చెoదిన నోడ్ కనిపిస్తుంది.
07:01 తరువాత సి కె ఎడిటర్ ని కాన్ఫిగర్ చేయడం నేర్చుకుందాం.
07:05 పైన కనిపించే కాన్ ఫిగరేషన్ పై క్లిక్ చేయండి.
07:09 టెక్స్ట్ ఫార్మాట్స్ అండ్ ఎడిటర్స్ పై క్లిక్ చేయండి.
07:13 బేసిక్ మరియు ఫుల్ HTMLలు సికె ఎడిటర్ నే ఉపయోగిస్తున్నాయని గమనిచండి.
07:19 ఇవి ప్రామాణీకరించిన యూజర్ లకు మరియు నిర్వాహకులకు మాత్రమే కేటాయించి ఉంటాయి.
07:24 ఇవి రెండు ప్రత్యేకమైన యూజర్ రోల్స్.
07:27 ద్రుపల్ లో ప్రత్యేక యూజర్ లకు విభిన్న పాత్రలు ఉంటాయి మరియు వాటికి కావల్సిన అనుమతులు ఇవ్వాలి.
07:34 ఈ సందర్భంలో బేసిక్ HTML ప్రామాణీకరించిన యూజర్ మరియు నిర్వాహకునిగా పరిగణించవచ్చు.
07:41 సి కె ఎడిటర్ ఈ రెండు పాత్రలకు కేటాయించబడినది.
07:45 అలాగే ఫుల్ HTMLని అడ్మినిస్ట్రేటర్ వాదగలడు.
07:50 ఇప్పుడు, సి కె ఎడిటర్ ని బేసిక్ HTML లో పరీక్షిద్దాం.
07:54 కాన్ఫిగర్ పై క్లిక్ చేయండి, ఇప్పుడు మీరు వేరే వేరే పాత్రలను అసైన్ చేయవచ్చు.
07:59 మీకు నచ్చిన టెక్స్ట్ ఎడిటర్ ని అసైన్ చేసి, దానికి ఉపయోగించబడే బటన్ లకు అనుమతులను ఇవ్వండి.
08:07 ఇది బేసిక్ హెచ్‌టి‌ఎం‌ఎల్ టెక్స్ట్ ఫార్మాట్ కి ప్రామాణీకరించిన అనగా Authenticated యూజర్ కి చెందిన యాక్టివ్ టూల్ బార్ అని గుర్తుంచుకోండి.
08:15 ఈ యాక్టివ్ టూల్ బార్ కి ఈ బటన్లలో ఒకటి జోడించడం చాలా సులభం.
08:21 అందుబాటులో ఉన్న బటన్ లలో నుండి పేస్ట్ ఫ్రమ్ వర్డ్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
08:26 తరువాత మౌస్ ని క్లిక్ చేసి ఐకాన్ చేర్చే చోట ఒక నీలం రంగు బాక్స్ తేరుచుకొనే వరకు లాగండి.
08:33 కొత్త సమూహాన్ని చేర్చాలంటే, యాడ్ గ్రూప్ ఐకాన్ పై క్లిక్ చేసి, కాపీ అండ్ పేస్ట్ అనే పేరునిచ్చి అప్ప్లై పై క్లిక్ చేయండి.
08:41 పేస్ట్ ఫ్రమ్ వర్డ్ ఐకాన్ పై క్లిక్ చేసి కాపీ అండ్ పేస్ట్ విభాగం వరకు లాగండి.
08:47 అన్నీ పేస్ట్ ఐకాన్ లను ఇక్కడ చేరుద్దాం.
08:51 మూడు కొత్త బటన్ లను బేసిక్ హెచ్‌టి‌ఎం‌ఎల్ ఫార్మాట్ బార్ కి చేర్చాము.
08:57 టెక్స్ట్ చాలావరకు ఫైళ్ళ నుండి కాపీ పేస్ట్ చేస్తారు కనుక, ప్రతి ఒక్క టూల్ బార్ లో పేస్ట్ ఐకాన్ అత్యవసరం.
09:04 ఇన్ లైన్ ఇమేజ్ లను కూడా అప్ లోడ్ చేయవచ్చు. గరిష్టముగా 32 ఎంబి ఇమేజ్ ఫైల్ ని అప్ లోడ్ చేయగలం. వెడల్పు మరియు పొడువు ఎంతైనా ఉండవచ్చు.
09:14 మీ ఇంస్టాల్లే షన్ లో గరిష్ట పరిమాణం వేరే ఉండవచ్చు.
09:18 ఈ సెట్టింగ్ లను మన ప్రాధాన్యత ప్రకారం మార్చుకోవచ్చు.
09:23 ఉదా: మ్యానువల్ లింక్ చేసే బదలు ఒక యుఆరెఎల్ ని లింక్ గా మార్చాలనుకుంటాం.
09:29 దీనిని కన్వర్ట్ యూఆర్ఎల్s ఇంటూ లింక్స్ ఎంపిక పై క్లిక్ చేసి మార్చగలము.
09:34 ఇక్కడ ఫిల్టర్ సెట్టింగ్లు కూడా ఉన్నాయి. లిమిట్ అల్లౌడ్ హెచ్‌టి‌ఎం‌ఎల్ ట్యాగ్స్ పై క్లిక్ చేద్దాం.
09:41 మనము ఉపయోగించే హెచ్‌టి‌ఎం‌ఎల్ ట్యాగ్ లను సోర్స్ ని బట్టి చేర్చవచ్చు.
09:47 అందుకే ఇది అత్యంత శక్తిగల WYSIWYG ఎడిటర్ మరియు దాని కాన్ఫిగరేషన్ క్షేత్రం.
09:54 మార్పులు చేసినతరువాత సేవ్ కాన్ఫిగరేషన్ బటన్ పై క్లిక్ చేయండి.
09:59 మన కంటెంట్ ని చూద్దాం.
10:02 వెల్కం టు ద్రుపల్ విల్ నోడ్ లోని ఎడిట్ ఎంపిక పై క్లిక్ చేయండి.
10:07 ఫుల్ హెచ్‌టి‌ఎం‌ఎల్ ఆన్ ఉందికనుక ఏ మార్పు జరగలేదని గమనించండి.
10:12 ఇప్పుడు బేసిక్ హెచ్‌టి‌ఎం‌ఎల్ కు మారుద్దాం. అన్ని మార్పులు అలాగే అమలులో ఉన్నాయి.
10:18 నా బ్లాక్ లు కనపించక పోయినా, పేస్ట్ ఐకాన్లు కనిపిస్తయి.
10:23 ఈ ఇమేజ్ ఇక్కడ వద్దనుకొంటే, ఇమేజ్ పై క్లిక్ చేసి, కి బోర్డ్ పై బ్యాక్ స్పేస్ లేదా డిలీట్ కీ నొక్కి తొలగించవచ్చు.
10:32 సేవ్ అండ్ పబ్లిష్డ్ పై క్లిక్ చేయండి.
10:35 మరల, కన్ఫిగరేషన్ పై క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి టెక్స్ట్ ఫార్మాట్ మరియు ఎడిటర్ పై క్లిక్ చేయండి.
10:43 ఇప్పుడు ఫుల్ హెచ్‌టి‌ఎం‌ఎల్ టూల్ బార్ కన్ఫిగర్ చేద్దాం.
10:47 ఇక్కడ ఇంకొన్ని బటన్ లున్నాయి ఐతే పేస్ట్ ఐకాన్ లు లేవని గమనించండి
10:52 షో గ్రూప్ నేమ్స్ పై క్లిక్ చేసి ఈ సారి రెండవ వరస పై యాడ్ గ్రూప్ ని క్లిక్ చేయండి .
10:57 దీనికి కాపీ అండ్ పేస్ట్ అనే పేరునివ్వండి. ఇప్పుడు వీటిని మన కాపీ అండ్ పేస్ట్ విభాగం లో క్లిక్ చేసి డ్ర్యాగ్ చేయగలం.
11:05 అలాగే ఇక్కడ కింద, ఈ అన్నీ ఎంపికలు ఉన్నాయి. ఇప్పటికీ సేవ్ కన్ఫిగరేషన్ పై క్లిక్ చేయండి.
11:13 మన వెల్ కమ్ టు ద్రుపల్ విల్ కి మరలా వచ్చి దానిని ఫుల్ హెచ్‌టి‌ఎం‌ఎల్ కి మారుద్దాం.
11:18 కంటిన్యూ పై క్లిక్ చేస్తే, రెండు వరస ల బటన్లు కనిపిస్తుంది.
11:23 అంటే మన ఎడిటర్ సిద్దం అని అర్థం.
11:26 సి కె ఎడిటర్ పై కొంత సేపు పని చేసి దీనిని ఉపయోగించుట సరిగ్గా అర్థం చేసుకోండీ.
11:32 ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. సారాంశం చూద్దాం.
11:37 ఈ టుటోరియల్ లో మనం- ఇన్ లైన్ ఎడిటింగ్, సి కె ఎడిటర్ ఉపయోగించుట మరియు సి కె ఎడిటర్ ని కన్ఫిగర్ చేయుట నేర్చుకున్నాం.
11:50 ఈ వీడియో అక్వియా మరియు ఓఎస్ ట్రెయింగ్ ( Acquia and OS Training) నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే, వీరు రివైస్ చేశారు.
11:59 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
12:06 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ వర్క్ షాప్ నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
12:13 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
12:25 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig