LibreOffice-Suite-Calc/C3/Using-Charts-and-Graphs/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
0:00 | లిబ్రే ఆఫీస్ Calc-ఇన్సర్టింగ్ చార్ట్స్ ఇన్ స్ప్రెడ్ షీట్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం |
0:07 | ఈ ట్యుటోరియల్ లో మీరు ఈ క్రింది వాటిని నేర్చుకుంటారు: |
0:11 | చార్ట్ లను సృష్టించడము, ఎడిట్ చేయడము మరియు ఫార్మాట్ చేయడము |
0:14 | చార్ట్ లను రీసైజింగ్ చేయడము మరియు కదిలించడము |
0:18 | ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము. |
0:27 | లిబ్రే ఆఫీస్ Calc లో ఉన్న వివిధ వ్యూ ఆప్షన్స్ గురించి నేర్చుకోవడం మొదలుపెడదాము. |
0:32 | చదివేవారికి సమాచారమును తెలియజేయుటకు చార్ట్స్ శక్తివంతమైన మార్గాలు కావచ్చు. |
0:37 | లిబ్రే ఆఫీస్ Calc మీ డేటా కొరకు అనేక రకములైన చార్ట్ ఫార్మాట్లను అందిస్తుంది. |
0:43 | Calc ఉపయోగిస్తూ, మీరు చార్ట్ లను తగిన పరిధి వరకు కస్టమైజ్ చేయవచ్చు. |
0:48 | మనము 'personal finance tracker.ods' షీట్ ను ఓపెన్ చేద్దాము. |
0:53 | మరియు షీట్ లో జాబితా చేయబడిన ప్రతి ఐటెం పైన ఖర్చు చేయబడిన మొత్తాన్ని నింపుదాము. |
0:59 | "E3" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేస్తాము మరియు మొత్తాన్ని "6500" అని టైప్ చేస్తాము. |
1:06 | ఇప్పుడు వరుస వెంబడి వెళుతూ, మనము మొత్తాన్ని "1000", "625", "310" మరియు "2700" అని వరుసగా "E4", "E5", "E6" మరియు "E7" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ లో టైప్ చేస్తాము. |
1:26 | తరువాత, షీట్ లో జాబితా చేయబడిన ప్రతి ఐటెం పై అందుకొన్న మొత్తాలను నింపుతాము. |
1:31 | కాబట్టి, "F3" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు మొత్తాన్ని "500" అని టైప్ చేయండి. |
1:37 | ఇప్పుడు ఈ వరుస వెంబడి వెళుతూ, మనము మొత్తాలను "200", "75", "10" మరియు "700" అని వరుసగా "F4", "F5", "F6" మరియు "F7" గా రిఫరెన్స్ చేయబడిన సెల్స్ లో టైప్ చేస్తాము. |
1:54 | ఈ టేబుల్ కొరకు మనము ఒక చార్ట్ ఎలా సృష్టించాలో ఇప్పుడు నేర్చుకుందాము. |
1:58 | ఒక చార్ట్ సృష్టించుటకు, ముందుగా ఆ చార్ట్ లో చేర్చవలసిన డేటాను ఎంచుకోవాలి. |
2:04 | కాబట్టి, "SN" అనే సెల్ పై క్లిక్ చేయండి మరియు మౌస్ బటన్ రిలీజ్ చేయకుండా, కర్సర్ ను "700" అని ఉన్న చివరి సెల్ వరకు లాగండి. |
2:14 | ఇప్పుడు, మెనూబార్ లో ఉన్న "Insert" ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత "Chart" ఆప్షన్ పై క్లిక్ చేయండి. |
2:21 | వర్క్ షీట్ లో తేదీతో సహా డీఫాల్ట్ చార్ట్ ఇన్సర్ట్ అయిందని మీరు చూడవచ్చు. |
2:27 | అదే సమయములో, "Chart Wizard" డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. |
2:32 | డీఫాల్ట్ చార్ట్ సెలెక్ట్ అయిందని "Chart Wizard" చూపుతుంది. |
2:36 | మీరు Chart Wizard లో చేసే మార్పులను చూపుటకు ఈ డీఫాల్ట్ చార్ట్ అప్ డేట్ అవుతుంది. |
2:42 | "Chart Wizard" డైలాగ్ బాక్స్ లో మూడు భాగాలు ఉంటాయి. చార్ట్ ను ఏర్పాటు చేయుటకు దశలు, చార్ట్ రకాల ఎంపిక, మరియు ప్రతి చార్ట్ రకానికి ఆప్షన్స్. |
2:55 | "3D Look" ఆప్షన్ చెక్ చేయడము ద్వారా చార్ట్ డిస్ప్లే త్రీ డైమెన్షన్ లో వస్తుంది. |
3:03 | ఈ ఆప్షన్లను మనము ప్రయత్నిద్దాము. |
3:05 | మనము "Choose a chart type" ఫీల్డ్ క్రింద "Bar" ఆప్షన్ పై క్లిక్ చేస్తాము. |
3:11 | "Bar" ఫార్మాట్ లో ఉన్న టేబిల్ లోని డేటా రిప్రసెంటేషన్ ను సాంపిల్ చార్ట్ చూపిస్తుందని గమనించండి. |
3:19 | అలాగే, మీరు "Pie", "Area", "Bubble" వంటి ఇతర ఆప్షన్ల పై క్లిక్ చేయవచ్చు. |
3:28 | మరియు "Choose a chart type field" క్రింద మరెన్నో ఆప్షన్లను క్లిక్ చేయవచ్చు మరియు కావలసిన చార్ట్ రకాన్ని పొందవచ్చు. |
3:35 | "Steps" ఆప్షన్ క్రింద, మనకు "Data Range" అనే మరొక ఆప్షన్ ఉంటుంది. |
3:40 | ఈ ఆప్షన్ ఉపయోగిస్తూ, మీరు చార్ట్ లో చూపించాలని అనుకుంటున్న డేటా రేంజ్ ను మాన్యువల్ గా ఎడిట్ చేయవచ్చు. |
3:48 | "Data series in columns" అనేది డేటా ప్లాటింగ్ యొక్క డీఫాల్ట్ ఆప్షన్. |
3:54 | "Data series in rows" ఉపయోగిస్తూ కూడా, మనము డేటా ను ప్లాట్ చేయాలనుకునే విధానమును మార్చవచ్చు. |
4:02 | మీరు మీ డేటా ను డిస్ప్లే చేయుటకు "Column" వంటి చార్ట్ రకాన్ని ఉపయోగిస్తే, ఇది ఉపయోగకరముగా ఉంటుంది. |
4:10 | చివరిగా, మీరు "First row as label"
ఉపయోగించాలని అనుకుంటున్నారా లేదా అని ఎంచుకోవచ్చు. |
4:24 | లేదా "First column as label", |
4:28 | లేదా చార్ట్ యొక్క యాక్సిస్ పై రెండింటినీ లేబిల్స్ గా ఉపయోగించవచ్చు. |
4:34 | తరువాత తిరిగి కాలం లో డేటా సీరీస్ పై క్లిక్ చేయండి. |
4:38 | ఇప్పుడు, మన సాంపిల్ చార్ట్ లో, "Received" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటా ను తొలగించాలని అనుకుంటే, ముందుగా "Data range" ఫీల్డ్ లో క్లిక్ చేయడము ద్వారా దానిని తొలగించవచ్చు. |
4:49 | ఆ తరువాత రేంజ్ ను “$A$1 is to $F$7” నుండి “$A$1 is to $D$7” కు ఎడిట్ చేయడము ద్వారా |
5:03 | "Received" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటా చార్ట్ లో మరి కనిపించదని గమనించండి. |
5:11 | తరువాత, "Data Series" ఏమి చేస్తుందో చూద్దాము. |
5:15 | ఇక్కడ మనం స్ప్రెడ్ షీట్ లో ఉన్న మొత్తము డేటా రోస్ ను సూచిస్తూ, 5 రోస్ ఉన్నాయని గమనించండి. |
5:21 | చార్ట్ నుండి డేటా రోస్ ను తొలగించుటకు "Add" మరియు "Remove" బటన్లు ఉపయోగపడతాయి. |
5:29 | మనము "Up" మరియు "Down" బటన్స్ ఉపయోగించి డేటాను రీ-ఆర్డర్ కూడా చేయవచ్చు. |
5:34 | కాబట్టి, చార్ట్ లో డేటాను సూచించుటకు ఏమి సెలెక్ట్ చేయాలి మరియు ఎలా సెలెక్ట్ చేయాలి అని చూసిన తరువాత, డైలాగ్ బాక్స్ లో "Finish" బటన్ పై క్లిక్ చేయండి. |
5:43 | చార్ట్ స్ప్రెడ్ షీట్ లోకి ఇన్సర్ట్ చేయబడిందని మీరు చూడవచ్చు. |
5:47 | ఒక స్ప్రెడ్ షీట్ లో చార్ట్ ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకున్న తరువాత, |
5:51 | ఇప్పుడు మనము లిబ్రే ఆఫీస్ Calc లో చార్ట్ లను ఎలా ఫార్మాట్ చేయాలో నేర్చుకుందాము. |
5:56 | "Format" మెనూలో ఫార్మాటింగ్ కొరకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. |
6:00 | మరియు చార్ట్స్ యొక్క ఆకృతిని ఫైన్-ట్యూనింగ్ చెయ్యటానికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. |
6:04 | మనము స్ప్రెడ్ షీట్ లోకి ఇన్సర్ట్ చేసిన చార్ట్ ను ఫార్మాట్ చేద్దాము. |
6:08 | చార్ట్ చుట్టూ ఒక గ్రే బార్డర్ వచ్చేందుకు చార్ట్ పై డబల్ క్లిక్ చేయండి. |
6:13 | చార్ట్ "Edit" మోడ్ లో ఉందని ఇది సూచిస్తుంది. |
6:18 | ఇప్పుడు మెయిన్ మెనూలో "Format" ఆప్షన్ పై క్లిక్ చేయండి. |
6:22 | డ్రాప్ డౌన్ మెనూలో అనేక ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయని మీరు చూడగలరు. అవి “Format Selection”, “Position and Size”, “Arrangement”, “Chart Wall” , “Chart Area” మరియు ఇంకా ఎన్నో ఉన్నాయి. |
6:37 | ఇవి చార్ట్ ను పొసిషన్ చేయుటకు, బ్యాక్ గ్రౌండ్ మరియు చార్ట్ యొక్క టైటిల్ లను ఏర్పాటు చేయుటకు మరియు ఫార్మాట్ చేయుటకు ఉపయోగపడతాయి. |
6:44 | తరచుగా ఉపయోగించబడే ఫార్మాటింగ్ ఆప్షన్ల గురించి ఒకదాని తరువాత ఒకటిగా మనము నేర్చుకుందాము. |
6:49 | "Format Selection" ఆప్షన్ తో "Chart Area" అనే ఒక హెడ్డింగ్ తో ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. |
6:56 | ఇక్కడ 3 ట్యాబ్స్ ఉన్నాయని గమనించండి - “Borders”, “Area” మరియు “Transparency”. |
7:03 | డీఫాల్ట్ గా "Borders" ట్యాబ్ సెలెక్ట్ చేయబడుతుంది. |
7:07 | మనము చార్ట్ బార్డర్ యొక్క స్టైల్ మరియు రంగును మారుద్దాము. |
7:11 | ఇలా చేయుటకు, "Style" ఫీల్డ్ పై క్లిక్ చేయండి మరియు "Continuous" ను ఎంచుకోండి. |
7:16 | తరువాత అలాగే "Color" ఫీల్డ్ లో "Green" పై క్లిక్ చేయండి. |
7:21 | ఇప్పుడు "OK" బటన్ పై క్లిక్ చేయండి. |
7:26 | చార్ట్ బార్డర్ యొక్క స్టైల్ మరియు రంగు తగిన విధంగా మారాయని గమనించండి. |
7:31 | "Title" ఆప్షన్ చార్ట్ మరియు దాని యాక్సిస్ ల టైటిల్ ను ఫార్మాట్ చేస్తుంది. |
7:36 | "Axis" ఆప్షన్ చార్ట్ ను సృష్టించే లైన్లను ఫార్మాట్ చేస్తుంది. |
7:41 | మరియు X మరియు Y యాక్సెస్ పై కనిపించే టెక్స్ట్ యొక్క ఫాంట్ ను కూడా ఫార్మాట్ చేస్తుంది. |
7:46 | ఈ ఆప్షన్లు ఏమి చేస్తాయి అని తెలుసుకొనుటకు వీటి గురించి తరువాత మీరు సొంతంగా కనుగొనండి. |
7:53 | చార్ట్ ఏరియా యొక్క బ్యాక్ గ్రౌండ్ ను మార్చుటకు కూడా Calc ఒక ఆప్షన్ ను అందిస్తుంది. |
7:58 | చార్ట్ ఏరియా అంటే ప్రధాన టైటిల్ మరియు కీ లతో సహా చార్ట్ గ్రాఫిక్ చుట్టూ ఉన్న ప్రదేశము. |
8:05 | చార్ట్ ఏరియాను ఫార్మాట్ చేయుటకు, "Format" ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు "Chart Wall" ను సెలెక్ట్ చేసుకోండి. |
8:12 | "Chart Wall" అనే హెడ్డింగ్ తో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
8:17 | "Style" ఫీల్డ్ మనము చివరిగా ఎంచుకున్న "Continuous" ను డిస్ప్లే చేస్తుంది. |
8:22 | "Color" ఫీల్డ్ లో, మనము "Red" పై క్లిక్ చేద్దాము. |
8:26 | మనము సైజ్ ను కూడా 0.20 cm కు మారుద్దాము. |
8:31 | ఇప్పుడు "OK" బటన్ పై క్లిక్ చేయండి. |
8:35 | చార్ట్ ఏరియా యొక్క స్టైల్ మరియు రంగులు మారడము మీరు చూడవచ్చు. <pause> |
8:41 | తరువాత మనము చార్ట్ లో అంశాలను రీసైజ్ చేయుట మరియు కదిలించుట గురించి నేర్చుకుందాము. |
8:46 | ఒక చార్ట్ ను రీసైజ్ చేయుటకు, సాంపిల్ చార్ట్ పై క్లిక్ చేయండి. |
8:51 | చార్ట్ చుట్టూ ఆకుపచ్చని హ్యాండిల్స్ కనిపించడము మీరు చూడవచ్చు. |
8:54 | చార్ట్ యొక్క సైజ్ ను పెంచుటకు లేదా తగ్గించుటకు, చార్ట్ యొక్క నాలుగు మూలలలో ఒకదానిలో ఉన్న మార్కర్ పై క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. |
9:03 | ఒక చార్ట్ ను కదిలించుటకు, ముందుగా చార్ట్ పై క్లిక్ చేయండి. |
9:07 | ఇప్పుడు కర్సర్ ను చార్ట్ పై అటు ఇటు కదిలించండి. |
9:11 | కర్సర్ ఒక చేతి గుర్తుగా మారుతుంది. |
9:14 | క్లిక్ చేసి చార్ట్ ను కావలసిన చోటికి కదిలించండి. ఇప్పుడు, మౌస్ బటన్ ను రిలీస్ చేయండి. |
9:20 | మీరు చార్ట్ ను కదిలించారు! |
9:24 | తరువాత మనము "Position and Size" డైలాగ్ బాక్స్ ఉపయోగించి చార్ట్ లను రీసైజ్ చేయడము నేర్చుకుందాము. |
9:30 | మళ్ళీ చార్ట్ పై క్లిక్ చేయండి. |
9:33 | ఇప్పుడు చార్ట్ పై రైట్ క్లిక్ చేయండి మరియు కాంటెక్స్ట్ మెనూ నుండి "Position and Size" ను సెలెక్ట్ చేయండి. |
9:40 | "Position and Size" డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
9:44 | ఇందులో చార్ట్ యొక్క X మరియు Y స్థానములను మరియు చార్ట్ యొక్క పొడవు మరియు వెడల్పును ఏర్పాటు చేయుటకు అనేక ఫీల్డ్స్ ఉంటాయి. |
9:52 | మన చార్ట్ కొరకు మనము X కోఆర్డినేట్ ను "1.00" కు మరియు "Y" కోఆర్డినేట్ ను "0.83" కు ఏర్పాటు చేద్దాము. |
10:02 | "OK" బటన్ పై క్లిక్ చేయండి. |
10:04 | చార్ట్ ఏరియాలో ఏర్పాటు చేసిన విలువల ప్రకారము చార్ట్ తనకు తాను మారుతుందని మనము చూడవచ్చు. |
10:12 | దీనితో మనము ఈ స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
10:16 | సంక్షిప్తంగా, మనము నేర్చుకున్నది: చార్ట్ లను సృష్టించడము, ఎడిట్ చేయడము మరియు వాటిని ఫార్మాట్ చేయడము. |
10:21 | అంతే కాకుండా మనము ఒక స్ప్రెడ్ షీట్ లోపల చార్ట్ లను రీసైజ్ చేయుట మరియు కదిలించుటను కూడా నేర్చుకున్నాము. |
10:27 | సమగ్ర అభ్యాసము |
10:29 | "practice.ods" అనే మీ స్ప్రెడ్ షీట్ ను ఓపెన్ చేయండి. |
10:34 | డేటా కోసం ఒక "Pie Chart" ను ఇన్సర్ట్ చేయండి. |
10:37 | చార్ట్ ను రీసైజ్ చేసి షీట్ యొక్క దిగువన కుడి మూలకు కదిలించండి. |
10:42 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి |
10:46 | అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును అందిస్తుంది. |
10:50 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకుంటే, మీరు దానిని డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు |
10:54 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం |
10:56 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
11:00 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తుంది |
11:04 | మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
11:11 | స్పొకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము |
11:15 | దీనికి ఐసీటీ, యం హెచ్ ఆర్ డీ, భారత ప్రభుత్వము వారిచే నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారము అందిస్తోంది |
11:23 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము |
11:26 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro వద్ద అందుబాటులో ఉంది. |
11:34 | ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే అందించబడింది. పాల్గొన్నందుకు ధన్యవాదములు |
ఈ స్క్రిప్ట్ ను అనువదించినవారు భరద్వాజ్ మరియు నిఖిల |