Firefox/C2/Searching-and-Auto-complete/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | మొజిల్లా ఫైర్ఫాక్స్ - సెర్చ్ మరియు ఆటో-కంప్లీట్ ఫీచర్స్ మీద స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో మనము సెర్చ్ ఎలా ఉపయోగించాలో, సెర్చ్ ఇంజన్స్ ఎలా మానేజ్ చేయాలో, ఇంకా ఫైండ్ బార్‌ను ఎలా ఉపయోగించాలో, |
00:15 | అడ్రెస్ బార్లో ఆటో-కంప్లీట్ ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము. |
00:18 | ఈ ట్యుటోరియల్‌లో, Ubuntu 10.04 మీద మనం ఫైర్ఫాక్స్ వర్షన్ 7.0 ఉపయోగిస్తాము |
00:26 | ఇంటర్నెట్ మీద మనుషులు చేసే అత్యంత సాధారణమైన పని సమాచారం కోసం సెర్చ్ చేయడం. |
00:31 | ఎవరయినా ఒక నిర్దిష్టమైన వెబ్సైట్ కోసం లేదా కొంత ఇతర సమాచారం కోసం సెర్చ్ చేయగలరు. |
0:37 | ఇంటర్నెట్ మీద సమాచారం సెర్చ్ సులభతరం చేయడానికి మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌కి అనేక ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. |
00:44 | మనం వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాము. |
00:47 | సెర్చ్ చేయడములో ఒక పధ్ధతి ఇతర వెబ్‌సైట్స్‌ను విజిట్ చేయడం. |
00:50 | ఎందుకంటే సెర్చ్ ఇంజన్లు కూడా వెబ్‌సైట్సే కాబట్టి! |
00:54 | URL బార్లో, 'www.google.com' అని టైప్ చేయండి. |
00:59 | గూగుల్ హోమ్ పేజ్ కనపడుతుంది. |
01:01 | గూగుల్ హోమ్ పేజ్ మధ్యలో మెయిన్ సెర్చ్ బాక్స్‌లో, 'email' అని టైప్ చేసి >> సెర్చ్ క్లిక్ చేయండి. |
01:07 | సెర్చ్ ఇంజన్ అన్ని ఫలితాలను చూపుతుంది. |
01:10 | మనం అన్నిటికన్నా పైన ఉన్న ఫలితం gmail, అంటే గూగుల్ యొక్క email అయి ఉండడం చూడగలము. |
01:16 | కానీ మొజిల్లా ఫైర్ఫాక్స్తో అదే పని చేయడానికి మరింత సులభతరమైన పధ్ధతి ఉంది. |
01:20 | నావిగేషన్ టూల్బార్ యొక్క URL బార్‌కు ప్రక్కన, ఒక సెర్చ్ బార్ ఫీల్డ్ ఉంటుంది. |
01:26 | ప్రత్యామ్నాయంగా, మీరు సెర్చ్ బార్ ఫీల్డ్‌లోకి నేరుగా వెళ్ళడానికి CTRL+k నొక్కగలరు. |
01:33 | సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి తర్వాత 'email' అని టైప్ చేయండి. |
01:36 | దాని ప్రక్కన ఉన్న మాగ్నిఫయింగ్ గ్లాస్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. |
01:40 | కంటెంట్స్ ఏరియాలో మనం సెర్చ్ యొక్క ఫలితాలను చూస్తాము. |
01:44 | మనం అన్నిటికన్నా పైన ఉన్న ఫలితం gmail, అంటే గూగుల్ యొక్క email అయి ఉండడం చూడగలము. |
01:50 | సెర్చ్ బార్ యొక్క ఎడమ వైపున, ఫలితాలను ప్రదర్శించడానికి ఉపయోగించిన సెర్చ్ ఇంజన్ యొక్క లోగో కనపడుతుంది. |
01:58 | మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో ఉపయోగించే డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్ 'google'. |
02:02 | మనం మన ఛాయిస్‌కి అనుగుణముగా సెర్చ్ ఇంజన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. |
02:08 | సెర్చ్ బార్ లోపల గూగుల్ యొక్క సెర్చ్ ఇంజన్ లోగో మీద క్లిక్ చేయండి. |
02:12 | మనము అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజన్స్ యొక్క లోగోస్, "Yahoo" మరియు "Bing"తో సహా ఒక డ్రాప్ డౌన్ బాక్స్ కనపడడం చూడగలము. |
02:21 | డ్రాప్ డౌన్ బాక్స్ నుండి "Yahoo" ఎంపిక చేసుకోండి. |
02:24 | మనము సెర్చ్ బార్ యొక్క ఎడమ వైపు ఉన్న లోగో ఇప్పుడు "Yahoo" లోగోగా మారడం పరిశీలించగలము. |
02:30 | ఇప్పుడు మనం మరల సెర్చ్ బార్లో 'email' అని టైప్ చేసి మాగ్నిఫయింగ్ గ్లాస్‌ను క్లిక్ చేద్దాము. |
02:36 | ఈ సారి మనము కంటెంట్స్ ఏరియాలో కనపడే ఫలితాలు "Yahoo" సెర్చ్ ఇంజన్ నుండి అయి ఉండడం చూడగలము. |
02:42 | ఫలితాలు మునుపటి సారి కంటే కొద్దిగా భిన్నంగా ఉండడం పరిశీలించండి. |
02:46 | అన్నిటికన్నా పైన ఉన్న ఫలితం gmail కాదు. దాని బదులు పైన ఉన్న ఫలితం "Yahoo" మెయిల్‌గా కనపడుతుంది. |
02:53 | సెర్చ్ బార్‌లోపల సెర్చ్ ఇంజన్ లోగోను మరల క్లిక్ చేయండి. |
02:57 | డ్రాప్ డౌన్ బాక్స్‌లో, 'Manage Search Engines'ను ఎంపిక చేయండి. |
03:07 | ఇది 'Manage Search Engines' లిస్ట్ అనే పేరుగల డయలాగ్ బాక్స్ తెరుస్తుంది. |
03:07 | లిస్టులోని చివరి ఐటమ్ మీద క్లిక్ చేయండి. |
03:10 | కుడి వైపున ఉన్న బటన్స్ ఇప్పుడు ఎనేబుల్ అవుతాయి. 'Remove' బటన్ మీద క్లిక్ చేయండి. |
03:16 | మనం ఎంపిక చేసుకున్న ఐటమ్ లిస్ట్ మీద లేకపోవడం చూస్తాము. |
03:21 | డయలాగ్ బాక్స్ క్లోస్ చేయడానికి OK మీద క్లిక్ చేయండి. |
03:24 | సెర్చ్ బార్ లోపల సెర్చ్ ఇంజన్ లోగో మీద క్లిక్ చేయండి. |
03:29 | "Manage Search Engines" మీద క్లిక్ చేయండి. |
03:32 | "Manage Search Engines" లిస్ట్ డయలాగ్ బాక్స్ పాపప్ అవుతుంది. |
03:37 | డయలాగ్ క్రింద 'Get more search engines...' అనే ఒక లింకు కనపడుతుంది. |
03:42 | దాని మీద క్లిక్ చేయండి. |
03:43 | ఒక క్రొత్త బ్రౌజర్ టాబ్ ఓపెన్ అవుతుంది. |
03:46 | అది మనం సెర్చ్ బార్‌కు ఆడ్ చేయగలిగిన సెర్చ్ ఇంజన్ల యొక్క సంఖ్య డిస్ప్లే చేస్తుంది. |
03:51 | మీరు మీ ఆవశ్యకతకు అనుగుణముగా ఎన్ని సెర్చ్ ఇంజన్లనయినా ఆడ్ చేసుకోవచ్చు. |
03:55 | మనము టాబ్ యొక్క మూలన ఉన్న x మీద క్లిక్ చేసి ఈ టాబ్‌ను క్లోస్ చేద్దాము. |
04:00 | మనము "Find bar" సహాయముతో కంటెంట్స్ ఏరియాలో ఉండే స్పెసిఫిక్ టెక్స్ట్‌ను కనుగొనగలము. |
04:07 | URL బార్లో, 'www.gmail.com' టైప్ చేసి ఎంటర్ టైప్ చేయండి. |
04:13 | gmail హోమ్ పేజ్ లోడ్ అయినపుడు, 'Edit' మీద క్లిక్ చేసి తర్వాత 'Find' మీద క్లిక్ చేయండి. |
04:19 | బ్రౌజర్ విండో క్రింద ఒక "Find bar" కనపడుతుంది. |
04:22 | "Find bar" యొక్క టెక్స్ట్ బాక్స్‌లో, 'gmail' అని టైప్ చేయండి. |
04:28 | మనం టైప్ చేస్తుండగా, కంటెంట్స్ ఏరియాలో ఆ టెక్స్ట్ యొక్క ఫస్ట్ఇన్స్టన్స్ హైలైట్ అవ్వడం చూస్తాము. |
04:36 | 'Next' మీద క్లిక్ చేయడం పదం యొక్క తరువాతి ఇన్‌స్టన్స్ మీదకు ఫోకస్‌ను మూవ్ చేస్తుంది. |
04:41 | 'Previous' మీద క్లిక్ చేయడం పదం యొక్క మునుపటి ఇన్‌స్టన్స్ మీదకు ఫోకస్‌ను మూవ్ చేస్తుంది. |
04:46 | 'Highlight all' ఆప్షన్ మీద క్లిక్ చేయండి. |
04:49 | మనం కంటెంట్స్ ఏరియాలో సెర్చ్ టెక్స్ట్ యొక్క అన్ని ఇన్స్టన్సెస్ హైలైట్ చేసి ఉండడం చూస్తాము. |
04:56 | తన ఆటో-కంప్లీట్ ఫంక్షన్‌తో మొజిల్లా ఫైర్ఫాక్స్ URLలో వెబ్ అడ్రెసెస్ టైప్ చేయడం సులభతరం చేస్తుంది. |
05:04 | మనం అడ్రెస్ బార్లో మొత్తం వెబ్ అడ్రెస్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. |
05:08 | ఇది ప్రయత్నించండి: అడ్రెస్ బార్లో 'gma' అని టైప్ చేయండి. |
05:12 | మొజిల్లా ఫైర్ఫాక్స్ మనం టైప్ చేస్తోన్న పదాన్ని ఆటో-కంప్లీట్ చేయడానికి ప్రయత్నించడం చూస్తాము. |
05:17 | అది 'gma'తో మొదలయ్యే వెబ్‌సైట్స్‌కు సంబంధించిన డ్రాప్ డౌన్ లిస్ట్ చూపిస్తుంది. |
05:23 | డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి 'gmail' లింక్ ఎంపిక చేసుకోండి. |
05:27 | కంటెంట్స్ ఏరియాలో 'gmail' వెబ్‌పేజ్ లోడ్ అవుతుంది. |
05:30 | మనం ఈ ఫీచర్ ఇష్టపడకపోతే, మనం దానిని టర్న్ ఆఫ్ చేయవచ్చు. |
05:34 | "Edit' మీద క్లిక్ చేసి తర్వాత "Preferences" మీద క్లిక్ చేయండి. |
05:37 | విండోస్ యూజర్లు మొదట "Tools" మీద తర్వాత "Options" మీద క్లిక్ చేయవచ్చు. |
05:41 | మెయిన్ మెను టాబ్స్ యొక్క లిస్ట్లోనుండి "Privacy" టాబ్ ఎంపిక చేసుకోండి. |
05:46 | డయలాగ్ బాక్స్ యొక్క క్రింది భాగమున, 'When using location bar, suggest' అనే ఆప్షన్ ఉంటుంది. |
05:53 | డ్రాప్ డౌన్ లిస్ట్ యొక్క arrow మీద దానిని ఎక్స్పాండ్ చేయడానికి క్లిక్ చేయండి. |
05:56 | లిస్ట్ నుండి 'Nothing' ఎంపిక చేయండి. |
05:59 | డయలాగ్ బాక్స్ క్లోస్ చేయడానికి 'Close' మీద క్లిక్ చేయండి. |
06:03 | మనం అడ్రెస్ బార్కి మరల వెళ్ళి 'gma' అని టైప్ చేద్దాము. ఏ సజెషన్స్ రాకపోవడం గమనించండి. |
06:09 | ఇది మొజిల్లా ఫైర్ఫాక్స్ - సర్చింగ్ మరియు ఆటో-కంప్లీట్ ఫీచర్స్ మీద ట్యుటోరియల్ సమాప్తం చేస్తుంది. |
06:16 | ఈ ట్యుటోరియల్‌లో మనము సెర్చ్ ఎలా ఉపయోగించాలో, సెర్చ్ ఇంజన్ ఎలా మానేజ్ చేయాలో, ఫైండ్ బార్, ఆటో కంప్లీట్ మరియు అడ్రెస్ బార్లను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము. |
06:27 | ఈ కాంప్రిహెన్షన్ టెస్ట్ అసైన్మెంట్ ప్రయత్నించండి. |
06:30 | సెర్చ్ బార్‌లోని సెర్చ్ ఇంజన్‌ను "Yahoo"కు మార్చండి. |
06:34 | 'spoken tutorial' కొరకు సెర్చ్ చేయండి. |
06:36 | మొదటి ఫలితం మీద క్లిక్ చేయండి. |
06:40 | "video" అన్న పదం ఎన్ని సార్లు కనపడుతుందో కనుగొనండి. |
06:44 | పదము "video" యొక్క అన్ని ఇన్స్టన్సెస్ వెబ్‌పేజ్‌లో హైలైట్ చేయడం కోసం 'Highlight all' మీద క్లిక్ చేయండి. |
06:51 | http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorialలో అందుబాటులో ఉన్న వీడియో చూడండి. |
06:54 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ను సంగ్రహపరుస్తుంది. |
06:58 | మీకు మంచి బాండ్విడ్త్ లేని పక్షములో, మీరు దానిని డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. |
07:02 | స్పోకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంది. |
07:08 | ఆన్లైన్ టెస్ట్ పాస్ అయినవారికి యోగ్యతాపత్రాలను ఇస్తుంది. |
07:11 | మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.orgకి వ్రాయండి. |
07:18 | స్పోకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగము. |
07:22 | అది నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్, ICT, MHRD, భారత ప్రభుత్వము చేత సహకరించబడుతోంది. |
07:30 | ఈ మిషన్ మీద మరింత సమాచారం spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Introలో అందుబాటులో ఉంది. |
07:41 | ఈ ట్యుటోరియల్ DesiCrew Solutions Pvt. Ltd. చేత కాంట్రిబ్యూట్ చేయబడుతోంది. |
07:46 | చేరినందుకు ధన్యవాదములు. |