Jmol-Application/C2/Modify-Display-and-View/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 18:23, 28 May 2018 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Jmol Application లో Modify Display and View అను ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి,
00:11 స్క్రీన్ పైన నమూనాను రొటేట్(తిప్పటం), జూమ్(పెద్దది చేయడం), మూవ్(కదిలించడం)మరియు స్పిన్ చేయడం(గుండ్రంగా తిప్పటం),
00:17 వ్యూని సవరించడం,
00:19 (డిస్ప్లే)ప్రదర్శన యొక్క శైలిని మార్చడం,
00:22 పరమాణువుల మరియు బంధాల యొక్క రంగు మరియు పరిమాణం మార్చడం,
00:26 Axes మరియు Bound box తో నమూనాను ప్రదర్శించడం
00:30 వివిధరకాల file format లలో చిత్రాన్నిభద్రపరచడం.
00:34 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు,
00:37 Jmol Application విండో పై అవగాహన ఉండాలి మరియు
00:40 modelkit function ఉపయోగించి నమూనాలను సృష్టించడం ఇంకా సవరించడం తెలిసుండాలి.
00:45 ఒకవేళ, అవగాహన లేకపోతే, కింది లింక్ లో అందుబాటులో ఉన్న ట్యుటోరియల్స్ ను చూడండి.
00:51 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను,
00:53 Ubuntu OS వర్షన్ 12.04
00:58 Jmol వర్షన్ 12.2.2 మరియు
01:02 Java వర్షన్ 7 లను ఉపయోగిస్తున్నాను.
01:05 Panel పైన నేను 2-chloro-1-propanol యొక్క నమూనాతో ఒక కొత్త Jmol విండో ను తెరిచాను.
01:12 నిర్మాణం యొక్క మంచి దృక్పథాన్ని పొందడానికి మనం నమూనాను తిప్పవచ్చు ఇంకా పెద్దది చేయవచ్చు.
01:18 నమూనాను ను త్రిప్పడానికి టూల్ బార్ పైన Rotate molecule ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:24 మోడల్ పై క్లిక్ చేసి గమనించండి, కర్సర్ ఒక చేయి(హ్యాండ్)చిహ్నానికి మారుతుంది.
01:29 మౌస్ బటన్ ను పట్టుకుని, panel పైన మౌస్ ను లాగండి.
01:34 మోడల్ తిరుగుతుంది అని మీరు చూడవచ్చు.
01:37 జూమ్-ఇన్ మరియు జూమ్ -అవుట్ చేయటానికి, కర్సర్ ను ప్యానెల్ పై ఉంచండి.
01:42 Mouse wheelను జూమ్ -అవుట్ చేయటానికి పైకి మరియు జూమ్-ఇన్ చేయటానికి క్రిందికి కదిలించండి.
01:49 Panel పైన నమూనాను కదిలించడానికి, కర్సర్ ను మోడల్ పైన ఉంచండి.
01:54 కీబోర్డ్ పైన Shift బటన్ ను పట్టుకుని ఉంచండి.
01:57 డబల్ -క్లిక్ చేసి mouse ని లాగండి.
02:00 వివరణాత్మక వర్ణన కోసం Pop-up-menu లో అందించిన Mouse Manual ను చూడండి.
02:06 Pop-up-మెనూ ని తెరిచి, About వరకు స్క్రోల్ చేయండి.

తరువాత Jmol 12.2.2ను ఎంచుకుని Mouse Manual పై క్లిక్ చేయండి.

02:17 ఒకవేళ, మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయినట్లయితే,
02:19 Mouse manual తో ఒక వెబ్ పేజీ తెరపై(స్క్రీన్ పై)కనిపిస్తుంది.
02:24 పాప్-అప్ మెనూ ను నిష్క్రమించడానికి ప్యానెల్ పై క్లిక్ చేయండి.
02:28 ప్యానెల్ పైన అణువును స్వయంచాలకంగా spin చేయడానికి, పాప్-అప్ మెనూ ని తెరవండి.
02:34 Spin వరకు స్క్రోల్ చేసి On ఎంపికపై క్లిక్ చేయండి.
02:40 Panel పైన నమూనా స్పిన్నింగ్ అవుతుందని మనం చూడవచ్చు.
02:44 స్పిన్ ను ఆపివేయటానికి, మళ్ళీ పాప్ -అప్ -మెనూ ని తెరవండి.
02:49 Spin వరకు స్క్రోల్ చేసి Off పై క్లిక్ చేయండి.
02:54 ఒక అసైన్మెంట్ గా-
02:56 2-chloro-3-Iodo-pentane యొక్క ఒక నమూనాను సృష్టించండి.
03:00 పాప్ -అప్ మెనూ లో Spin ఎంపికను అన్వేషించండి.
03:04 స్పిన్ యొక్క దిశను Z-axis కు మరియు స్పిన్ రేట్ ను 40 కు మార్చండి.
03:10 ఒక సూచనగా, పాప్-అప్ మెనూలోని Set Z Rate ఎంపికను ఉపయోగించండి.
03:16 మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
03:22 ఇప్పుడు View మెనూ గురించి నేర్చుకుందాం.
03:25 మెనూ బార్ పైన ఉన్న View మెనూ, వివిధ కోణాల నుండి నమూనాను వీక్షించడానికి ఎంపికలను కలిగి ఉంది.
03:31 View మెనూ పై క్లిక్ చేయండి.
03:33 మెనూ ని స్క్రోల్ చేసి అందించబడిన వివిధ ఎంపికల నుండి ఎంచుకోండి.
03:38 ఉదాహరణకు, నేను Top వ్యూ ను ఎంచుకుంటాను.
03:42 Top ఎంపిక పై క్లిక్ చేయండి.
03:45 స్క్రీన్ పైన image పై నుండి అణువు చూడటానికి ఎలా కనిపిస్తుందో ఆలా చూపిస్తుంది.
03:50 మనం ఈ view ను వివిధ ఫైల్ ఫార్మాట్లలో ఇమేజ్(చిత్రం)గా save చేయవచ్చు.
03:55 Save current view as an image ఐకాన్ పై క్లిక్ చేయండి.
03:59 ఒక Save డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
04:03 ఫైల్ ఫార్మాట్ ను ఎంచుకోవడానికి, Image Type పైన ఎంపికలను స్క్రోల్ చేయండి.
04:09 నేను JPEG ఫార్మాట్ ను ఎంచుకుంటాను.
04:13 మీరు ఫైల్ ను భద్రపరచదలిచిన ఫోల్డర్ ను తెరవండి.
04:17 ఇది నాకు Desktop పై కావాలి.
04:19 Desktop ను ఎంచుకుని Open బటన్ పై క్లిక్ చేయండి.
04:24 File Name టెక్స్ట్ -బాక్స్ లో, 2-chloro-1-propanol అని టైప్ చేయండి.
04:30 Files of Type కి వెళ్ళి jpg ను ఎంచుకోండి.
04:35 Save బటన్ పై క్లిక్ చేయండి.
04:38 ఇమేజ్(చిత్రం)ఇప్పుడు JPEG ఫార్మాట్ లో Desktop పై భద్రపరచబడుతుంది.
04:44 Molecular model యొక్క ప్రదర్శనాశైలి అనేది వివిధ మార్గాల్లో సవరించబడుతుంది.
04:50 ఒకవేళ అవసరమైతే, ఈ అణువులోని పరమాణువుల మరియు బంధాల యొక్క పరిమాణము మరియు రంగులను మార్చవచ్చు.
04:57 మనము అణువులోని అన్ని పరమాణువులను లేదా ఎంపిక చేసిన ఒక సమితిని సవరించడానికి ఒక ఎంపికను కలిగి ఉంటాము.
05:03 ప్యానెల్ పైన నమూనా యొక్క అప్రమేయ ప్రదర్శన అనేది ball and stick.
05:09 ప్రదర్శనను CPK Space fill కు మార్చడానికి, పాప్ -అప్ -మెనూ ని తెరవండి.
05:15 పూర్తి అణువును సవరించడానికి Select కు వెళ్ళి All పై క్లిక్ చేయండి.
05:22 మళ్ళి పాప్-అప్ మెనూ ని తెరవండి.
05:25 Style వరకు స్క్రోల్ చేసి, సబ్ -మెనూ నుండి Scheme ను ఎంచుకోండి.
05:30 CPK Spacefill ఎంపికపై క్లిక్ చేయండి.
05:35 స్క్రీన్(తెర)పైన నమూనా CPK Spacefill నమూనాకు మార్చబడుతుంది.
05:40 ఇప్పుడు మనం దానిని మళ్ళీ ball and stick నమూనాగా మార్చుదాం.
05:44 ఇంతకు ముందులా అవే సోపానాలను అనుసరిద్దాం.
05:48 పాప్ -అప్ -మెనూ ని తెరవండి.
05:50 Style వరకు స్క్రోల్ చేసి, Scheme ను ఎంచుకుని Ball and Stick ఎంపికపై క్లిక్ చేయండి.
05:56 నమూనా ఇప్పుడు ball and stick శైలి ప్రదర్శనగా మార్చబడుతుంది.
06:01 బంధాల యొక్క పరిమాణాన్ని పాప్ -అప్ మెనూ ని ఉపయోగించి మార్చవచ్చు, అలాగే మెనూ బార్ పైన Display మెనూ ని ఉపయోగించి కూడా మార్చవచ్చు.
06:08 Display మెనూ పై క్లిక్ చేసి Bond ను ఎంచుకోండి.
06:12 సబ్-మెనూ వేర్వేరు పరిమాణ వ్యాసంలో, angstrom units లో బంధాల యొక్క ఎంపికలను కలిగి ఉంది.
06:19 ఉదాహరణకు, నేను 0.1 Angstrom ను ఎంచుకుని దానిపై క్లిక్ చేస్తాను.
06:26 బంధాల యొక్క మందంలోని మార్పును గమనించండి.
06:30 మనం పరమాణువుల మరియు బంధాల యొక్క రంగును కూడా మార్చవచ్చు.
06:34 నేను నమూనాలోని మొత్తం Carbon పరమాణువుల యొక్క రంగును పసుపురంగుకి మార్చాలి అనుకుంటున్నాను.
06:39 ఇది చేయటానికి, పాప్ -అప్ మెనూ ని తెరిచి Select కు వెళ్ళండి.
06:44 Element వరకు స్క్రోల్ చేసి Carbon పై క్లిక్ చేయండి.
06:48 పాప్ -అప్ మెనూ ని మళ్ళీ తెరిచి Color ను ఎంచుకోండి.
06:52 తరువాత Atoms ను ఎంచుకుని Yellow ఎంపికపై క్లిక్ చేయండి.
06:57 నమూనాలోని అన్ని Carbons, ఇప్పుడు పసుపు రంగులో కనిపిస్తాయి.
07:02 బంధాల యొక్క రంగును ఎలా మార్చాలో చూద్దాం.
07:06 పాప్ -అప్ -మెనూ ని తెరిచి All ను ఎంచుకోండి.
07:10 పాప్ -అప్-మెనూ ని మళ్ళీ తెరవండి.
07:12 Color వరకు స్క్రోల్ చేసి, సబ్ -మెనూ నుండి Bonds ను ఎంచుకోండి.
07:16 స్క్రోల్ చేసి Blue ఎంపికపై క్లిక్ చేయండి.
07:20 ఇప్పుడు అన్ని బంధాలు నీలంరంగులో ఉంటాయి.
07:23 మనం స్క్రీన్(తెర)పై నమూనాను X, Y మరియు Z అక్షాలతో మరియు ఒక బౌండింగ్ బాక్స్ లోపల ప్రదర్శించవచ్చు.
07:31 పాప్ -అప్ -మెనూ ని తెరిచి Style ను ఎంచుకోండి.
07:34 Axes ఎంపిక వరకు స్క్రోల్ చేయండి.
07:37 సబ్-మెనూ నుండి Pixel Width ను ఎంచుకోండి.
07:40 పిక్సెల్ విడ్త్ గా నేను 3 px ను ఎంచుకుంటాను.
07:44 మనం ఇప్పుడు అన్ని మార్పులతో నమూనాను స్క్రీన్(తెర)పై కలిగిఉన్నాము.
07:49 ఇమేజ్(చిత్రం)చుట్టూ ఒక bound box ను గీయడానికి, పాప్ -అప్ -మెనూ ని తెరవండి.
07:54 Style వరకు స్క్రోల్ చేసి ఎంపికల నుండి Boundbox ను ఎంచుకోండి.
07:59 Pixel width ను ఎంచుకుని పిక్సెల్ విడ్త్ 3 px పై క్లిక్ చేయండి.
08:05 స్క్రీన్(తెర)పై, మనం Axes తో Boundbox లోపల 2-chloro-1-propanol యొక్క నమూనాను కలిగి ఉన్నాము.
08:12 Boundbox ను స్పష్టంగా వీక్షించడానికి, మనం జూమ్ -ఇన్ లేదా జూమ్ అవుట్ చేయవలసి ఉండొచ్చు.
08:17 image ను Save చేసి ప్రోగ్రామ్ నుండి నిష్క్రమించండి.
08:21 మనము నేర్చుకున్న విషయాల సారాంశం చూద్దాం.
08:23 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి,
08:26 రొటేట్(తిప్పటం), జూమ్(పెద్దది చేయడం), మూవ్(కదిలించడం)మరియు స్క్రీన్(తెర పైన నమూనాను స్పిన్ చేయడం.
08:31 విభిన్న కోణాల నుండి నమూనాను వీక్షించడం.
08:34 ప్రదర్శన యొక్క శైలిని మార్చడం.
08:36 పరమాణువులు మరియు బంధాల యొక్క రంగును మార్చడం.
08:39 మనం ఇవి కూడా నేర్చుకున్నాం,
08:41 ఇమేజ్ (చిత్రాన్ని)ను ఆక్సస్ మరియు బౌండ్ బాక్స్ తో ప్రదర్శించడం.
08:44 వివిధ రకాల ఫైల్ ఫార్మట్స్ లో ఇమేజ్ (చిత్రాన్ని)భద్రపరచడం.
08:48 అసైన్మెంట్ కొరకు-
08:50 3-amino-1-propanol యొక్క నమూనాను సృష్టించండి.
08:53 ప్రదర్శనను Sticks కు మార్చండి.
08:56 నమూనాలోని హైడ్రోజెన్స్ యొక్క రంగును ఆకుపచ్చకు మార్చండి.
09:00 అన్ని బంధాల యొక్క రంగును పసుపుకి మార్చండి.
09:04 మీ పూర్తియైన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
09:12 క్రింది లింక్ వద్ద అందుబాటులో గల వీడియో చూడండి.
09:15 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని వివరిస్తుంది.
09:19 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
09:24 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
09:26 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
09:29 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
09:34 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:contact@spoken-tutorial.org
09:41 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
09:44 దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
09:51 ఈ మిషన్ గురించి మరింత సమాచాmరం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
09:57 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya