Jmol-Application/C2/Modify-Display-and-View/Telugu
From Script | Spoken-Tutorial
| Time | Narration |
| 00:01 | Jmol Application లో Modify Display and View అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
| 00:08 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి, |
| 00:11 | స్క్రీన్ పైన నమూనాను రొటేట్(తిప్పటం), జూమ్(పెద్దది చేయడం), మూవ్(కదిలించడం)మరియు స్పిన్ చేయడం(గుండ్రంగా తిప్పటం), |
| 00:17 | వ్యూని సవరించడం, |
| 00:19 | (డిస్ప్లే)ప్రదర్శన యొక్క శైలిని మార్చడం, |
| 00:22 | పరమాణువుల మరియు బంధాల యొక్క రంగు మరియు పరిమాణం మార్చడం, |
| 00:26 | Axes మరియు Bound box తో నమూనాను ప్రదర్శించడం |
| 00:30 | వివిధరకాల file format లలో చిత్రాన్నిభద్రపరచడం. |
| 00:34 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు, |
| 00:37 | Jmol Application విండో పై అవగాహన ఉండాలి మరియు |
| 00:40 | modelkit function ఉపయోగించి నమూనాలను సృష్టించడం ఇంకా సవరించడం తెలిసుండాలి. |
| 00:45 | ఒకవేళ, అవగాహన లేకపోతే, కింది లింక్ లో అందుబాటులో ఉన్న ట్యుటోరియల్స్ ను చూడండి. |
| 00:51 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను, |
| 00:53 | Ubuntu OS వర్షన్ 12.04 |
| 00:58 | Jmol వర్షన్ 12.2.2 మరియు |
| 01:02 | Java వర్షన్ 7 లను ఉపయోగిస్తున్నాను. |
| 01:05 | Panel పైన నేను 2-chloro-1-propanol యొక్క నమూనాతో ఒక కొత్త Jmol విండో ను తెరిచాను. |
| 01:12 | నిర్మాణం యొక్క మంచి దృక్పథాన్ని పొందడానికి మనం నమూనాను తిప్పవచ్చు ఇంకా పెద్దది చేయవచ్చు. |
| 01:18 | నమూనాను ను త్రిప్పడానికి టూల్ బార్ పైన Rotate molecule ఐకాన్ పై క్లిక్ చేయండి. |
| 01:24 | మోడల్ పై క్లిక్ చేసి గమనించండి, కర్సర్ ఒక చేయి(హ్యాండ్)చిహ్నానికి మారుతుంది. |
| 01:29 | మౌస్ బటన్ ను పట్టుకుని, panel పైన మౌస్ ను లాగండి. |
| 01:34 | మోడల్ తిరుగుతుంది అని మీరు చూడవచ్చు. |
| 01:37 | జూమ్-ఇన్ మరియు జూమ్ -అవుట్ చేయటానికి, కర్సర్ ను ప్యానెల్ పై ఉంచండి. |
| 01:42 | Mouse wheelను జూమ్ -అవుట్ చేయటానికి పైకి మరియు జూమ్-ఇన్ చేయటానికి క్రిందికి కదిలించండి. |
| 01:49 | Panel పైన నమూనాను కదిలించడానికి, కర్సర్ ను మోడల్ పైన ఉంచండి. |
| 01:54 | కీబోర్డ్ పైన Shift బటన్ ను పట్టుకుని ఉంచండి. |
| 01:57 | డబల్ -క్లిక్ చేసి mouse ని లాగండి. |
| 02:00 | వివరణాత్మక వర్ణన కోసం Pop-up-menu లో అందించిన Mouse Manual ను చూడండి. |
| 02:06 | Pop-up-మెనూ ని తెరిచి, About వరకు స్క్రోల్ చేయండి.
తరువాత Jmol 12.2.2ను ఎంచుకుని Mouse Manual పై క్లిక్ చేయండి. |
| 02:17 | ఒకవేళ, మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయినట్లయితే, |
| 02:19 | Mouse manual తో ఒక వెబ్ పేజీ తెరపై(స్క్రీన్ పై)కనిపిస్తుంది. |
| 02:24 | పాప్-అప్ మెనూ ను నిష్క్రమించడానికి ప్యానెల్ పై క్లిక్ చేయండి. |
| 02:28 | ప్యానెల్ పైన అణువును స్వయంచాలకంగా spin చేయడానికి, పాప్-అప్ మెనూ ని తెరవండి. |
| 02:34 | Spin వరకు స్క్రోల్ చేసి On ఎంపికపై క్లిక్ చేయండి. |
| 02:40 | Panel పైన నమూనా స్పిన్నింగ్ అవుతుందని మనం చూడవచ్చు. |
| 02:44 | స్పిన్ ను ఆపివేయటానికి, మళ్ళీ పాప్ -అప్ -మెనూ ని తెరవండి. |
| 02:49 | Spin వరకు స్క్రోల్ చేసి Off పై క్లిక్ చేయండి. |
| 02:54 | ఒక అసైన్మెంట్ గా- |
| 02:56 | 2-chloro-3-Iodo-pentane యొక్క ఒక నమూనాను సృష్టించండి. |
| 03:00 | పాప్ -అప్ మెనూ లో Spin ఎంపికను అన్వేషించండి. |
| 03:04 | స్పిన్ యొక్క దిశను Z-axis కు మరియు స్పిన్ రేట్ ను 40 కు మార్చండి. |
| 03:10 | ఒక సూచనగా, పాప్-అప్ మెనూలోని Set Z Rate ఎంపికను ఉపయోగించండి. |
| 03:16 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
| 03:22 | ఇప్పుడు View మెనూ గురించి నేర్చుకుందాం. |
| 03:25 | మెనూ బార్ పైన ఉన్న View మెనూ, వివిధ కోణాల నుండి నమూనాను వీక్షించడానికి ఎంపికలను కలిగి ఉంది. |
| 03:31 | View మెనూ పై క్లిక్ చేయండి. |
| 03:33 | మెనూ ని స్క్రోల్ చేసి అందించబడిన వివిధ ఎంపికల నుండి ఎంచుకోండి. |
| 03:38 | ఉదాహరణకు, నేను Top వ్యూ ను ఎంచుకుంటాను. |
| 03:42 | Top ఎంపిక పై క్లిక్ చేయండి. |
| 03:45 | స్క్రీన్ పైన image పై నుండి అణువు చూడటానికి ఎలా కనిపిస్తుందో ఆలా చూపిస్తుంది. |
| 03:50 | మనం ఈ view ను వివిధ ఫైల్ ఫార్మాట్లలో ఇమేజ్(చిత్రం)గా save చేయవచ్చు. |
| 03:55 | Save current view as an image ఐకాన్ పై క్లిక్ చేయండి. |
| 03:59 | ఒక Save డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
| 04:03 | ఫైల్ ఫార్మాట్ ను ఎంచుకోవడానికి, Image Type పైన ఎంపికలను స్క్రోల్ చేయండి. |
| 04:09 | నేను JPEG ఫార్మాట్ ను ఎంచుకుంటాను. |
| 04:13 | మీరు ఫైల్ ను భద్రపరచదలిచిన ఫోల్డర్ ను తెరవండి. |
| 04:17 | ఇది నాకు Desktop పై కావాలి. |
| 04:19 | Desktop ను ఎంచుకుని Open బటన్ పై క్లిక్ చేయండి. |
| 04:24 | File Name టెక్స్ట్ -బాక్స్ లో, 2-chloro-1-propanol అని టైప్ చేయండి. |
| 04:30 | Files of Type కి వెళ్ళి jpg ను ఎంచుకోండి. |
| 04:35 | Save బటన్ పై క్లిక్ చేయండి. |
| 04:38 | ఇమేజ్(చిత్రం)ఇప్పుడు JPEG ఫార్మాట్ లో Desktop పై భద్రపరచబడుతుంది. |
| 04:44 | Molecular model యొక్క ప్రదర్శనాశైలి అనేది వివిధ మార్గాల్లో సవరించబడుతుంది. |
| 04:50 | ఒకవేళ అవసరమైతే, ఈ అణువులోని పరమాణువుల మరియు బంధాల యొక్క పరిమాణము మరియు రంగులను మార్చవచ్చు. |
| 04:57 | మనము అణువులోని అన్ని పరమాణువులను లేదా ఎంపిక చేసిన ఒక సమితిని సవరించడానికి ఒక ఎంపికను కలిగి ఉంటాము. |
| 05:03 | ప్యానెల్ పైన నమూనా యొక్క అప్రమేయ ప్రదర్శన అనేది ball and stick. |
| 05:09 | ప్రదర్శనను CPK Space fill కు మార్చడానికి, పాప్ -అప్ -మెనూ ని తెరవండి. |
| 05:15 | పూర్తి అణువును సవరించడానికి Select కు వెళ్ళి All పై క్లిక్ చేయండి. |
| 05:22 | మళ్ళి పాప్-అప్ మెనూ ని తెరవండి. |
| 05:25 | Style వరకు స్క్రోల్ చేసి, సబ్ -మెనూ నుండి Scheme ను ఎంచుకోండి. |
| 05:30 | CPK Spacefill ఎంపికపై క్లిక్ చేయండి. |
| 05:35 | స్క్రీన్(తెర)పైన నమూనా CPK Spacefill నమూనాకు మార్చబడుతుంది. |
| 05:40 | ఇప్పుడు మనం దానిని మళ్ళీ ball and stick నమూనాగా మార్చుదాం. |
| 05:44 | ఇంతకు ముందులా అవే సోపానాలను అనుసరిద్దాం. |
| 05:48 | పాప్ -అప్ -మెనూ ని తెరవండి. |
| 05:50 | Style వరకు స్క్రోల్ చేసి, Scheme ను ఎంచుకుని Ball and Stick ఎంపికపై క్లిక్ చేయండి. |
| 05:56 | నమూనా ఇప్పుడు ball and stick శైలి ప్రదర్శనగా మార్చబడుతుంది. |
| 06:01 | బంధాల యొక్క పరిమాణాన్ని పాప్ -అప్ మెనూ ని ఉపయోగించి మార్చవచ్చు, అలాగే మెనూ బార్ పైన Display మెనూ ని ఉపయోగించి కూడా మార్చవచ్చు. |
| 06:08 | Display మెనూ పై క్లిక్ చేసి Bond ను ఎంచుకోండి. |
| 06:12 | సబ్-మెనూ వేర్వేరు పరిమాణ వ్యాసంలో, angstrom units లో బంధాల యొక్క ఎంపికలను కలిగి ఉంది. |
| 06:19 | ఉదాహరణకు, నేను 0.1 Angstrom ను ఎంచుకుని దానిపై క్లిక్ చేస్తాను. |
| 06:26 | బంధాల యొక్క మందంలోని మార్పును గమనించండి. |
| 06:30 | మనం పరమాణువుల మరియు బంధాల యొక్క రంగును కూడా మార్చవచ్చు. |
| 06:34 | నేను నమూనాలోని మొత్తం Carbon పరమాణువుల యొక్క రంగును పసుపురంగుకి మార్చాలి అనుకుంటున్నాను. |
| 06:39 | ఇది చేయటానికి, పాప్ -అప్ మెనూ ని తెరిచి Select కు వెళ్ళండి. |
| 06:44 | Element వరకు స్క్రోల్ చేసి Carbon పై క్లిక్ చేయండి. |
| 06:48 | పాప్ -అప్ మెనూ ని మళ్ళీ తెరిచి Color ను ఎంచుకోండి. |
| 06:52 | తరువాత Atoms ను ఎంచుకుని Yellow ఎంపికపై క్లిక్ చేయండి. |
| 06:57 | నమూనాలోని అన్ని Carbons, ఇప్పుడు పసుపు రంగులో కనిపిస్తాయి. |
| 07:02 | బంధాల యొక్క రంగును ఎలా మార్చాలో చూద్దాం. |
| 07:06 | పాప్ -అప్ -మెనూ ని తెరిచి All ను ఎంచుకోండి. |
| 07:10 | పాప్ -అప్-మెనూ ని మళ్ళీ తెరవండి. |
| 07:12 | Color వరకు స్క్రోల్ చేసి, సబ్ -మెనూ నుండి Bonds ను ఎంచుకోండి. |
| 07:16 | స్క్రోల్ చేసి Blue ఎంపికపై క్లిక్ చేయండి. |
| 07:20 | ఇప్పుడు అన్ని బంధాలు నీలంరంగులో ఉంటాయి. |
| 07:23 | మనం స్క్రీన్(తెర)పై నమూనాను X, Y మరియు Z అక్షాలతో మరియు ఒక బౌండింగ్ బాక్స్ లోపల ప్రదర్శించవచ్చు. |
| 07:31 | పాప్ -అప్ -మెనూ ని తెరిచి Style ను ఎంచుకోండి. |
| 07:34 | Axes ఎంపిక వరకు స్క్రోల్ చేయండి. |
| 07:37 | సబ్-మెనూ నుండి Pixel Width ను ఎంచుకోండి. |
| 07:40 | పిక్సెల్ విడ్త్ గా నేను 3 px ను ఎంచుకుంటాను. |
| 07:44 | మనం ఇప్పుడు అన్ని మార్పులతో నమూనాను స్క్రీన్(తెర)పై కలిగిఉన్నాము. |
| 07:49 | ఇమేజ్(చిత్రం)చుట్టూ ఒక bound box ను గీయడానికి, పాప్ -అప్ -మెనూ ని తెరవండి. |
| 07:54 | Style వరకు స్క్రోల్ చేసి ఎంపికల నుండి Boundbox ను ఎంచుకోండి. |
| 07:59 | Pixel width ను ఎంచుకుని పిక్సెల్ విడ్త్ 3 px పై క్లిక్ చేయండి. |
| 08:05 | స్క్రీన్(తెర)పై, మనం Axes తో Boundbox లోపల 2-chloro-1-propanol యొక్క నమూనాను కలిగి ఉన్నాము. |
| 08:12 | Boundbox ను స్పష్టంగా వీక్షించడానికి, మనం జూమ్ -ఇన్ లేదా జూమ్ అవుట్ చేయవలసి ఉండొచ్చు. |
| 08:17 | image ను Save చేసి ప్రోగ్రామ్ నుండి నిష్క్రమించండి. |
| 08:21 | మనము నేర్చుకున్న విషయాల సారాంశం చూద్దాం. |
| 08:23 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి, |
| 08:26 | రొటేట్(తిప్పటం), జూమ్(పెద్దది చేయడం), మూవ్(కదిలించడం)మరియు స్క్రీన్(తెర పైన నమూనాను స్పిన్ చేయడం. |
| 08:31 | విభిన్న కోణాల నుండి నమూనాను వీక్షించడం. |
| 08:34 | ప్రదర్శన యొక్క శైలిని మార్చడం. |
| 08:36 | పరమాణువులు మరియు బంధాల యొక్క రంగును మార్చడం. |
| 08:39 | మనం ఇవి కూడా నేర్చుకున్నాం, |
| 08:41 | ఇమేజ్ (చిత్రాన్ని)ను ఆక్సస్ మరియు బౌండ్ బాక్స్ తో ప్రదర్శించడం. |
| 08:44 | వివిధ రకాల ఫైల్ ఫార్మట్స్ లో ఇమేజ్ (చిత్రాన్ని)భద్రపరచడం. |
| 08:48 | అసైన్మెంట్ కొరకు- |
| 08:50 | 3-amino-1-propanol యొక్క నమూనాను సృష్టించండి. |
| 08:53 | ప్రదర్శనను Sticks కు మార్చండి. |
| 08:56 | నమూనాలోని హైడ్రోజెన్స్ యొక్క రంగును ఆకుపచ్చకు మార్చండి. |
| 09:00 | అన్ని బంధాల యొక్క రంగును పసుపుకి మార్చండి. |
| 09:04 | మీ పూర్తియైన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
| 09:12 | క్రింది లింక్ వద్ద అందుబాటులో గల వీడియో చూడండి. |
| 09:15 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని వివరిస్తుంది. |
| 09:19 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
| 09:24 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
| 09:26 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
| 09:29 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
| 09:34 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:contact@spoken-tutorial.org |
| 09:41 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
| 09:44 | దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
| 09:51 | ఈ మిషన్ గురించి మరింత సమాచాmరం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
| 09:57 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |