BASH/C2/Conditional-Loops/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, BASH లోని loops పై spoken tutorialకు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్లో మనము, |
00:09 | for loop, |
00:11 | while loop లను కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకుంటాము. |
00:15 | ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను, |
00:18 | Ubuntu Linux 12.04 Operating System |
00:22 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
00:26 | GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షలను అభ్యాసానికి ఉపయోగిస్తున్నాను. |
00:34 | loops యొక్క పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:37 | Loops అనేవి statements సమూహాన్ని మళ్ళీ మళ్ళీ execute చేయడానికి ఉపయోగిస్తారు. |
00:43 | సింటాక్స్ చూద్దాం. |
00:45 | for expression 1, 2, 3 |
00:49 | statement 1, 2, 3. |
00:51 | ఇది for loop యొక్క ముగింపు. |
00:55 | for loop కు ప్రత్యామ్నాయ సింటాక్స్ |
00:58 | for variable in sequence/range |
01:03 | statement 1, 2, 3 |
01:06 | for loop యొక్క ముగింపు. |
01:09 | for loop యొక్క ఉదాహరణను మొదటి సింటాక్స్ ఉపయోగించి చూద్దాం. |
01:14 | ఈ ప్రోగ్రాంలో, మనం మొదటి n సంఖ్యల యొక్క మొత్తాన్ని లెక్కిస్తాము. |
01:20 | మన ఫైల్ పేరు for.sh అని గుర్తుంచుకొనండి. |
01:25 | ఇది మన shebang line. |
01:28 | number వేరియబుల్, యూజర్ చే ఇవ్వబడిన value ను నిల్వ చేస్తుంది. |
01:34 | ఇక్కడ ఆ విలువ ఒక పూర్ణాంకం. |
01:37 | ఇప్పుడు, మనం variable sum కు జీరో ను ప్రారంభ విలువగా ఇచ్చాము. |
01:42 | ఇక్కడ మనం for loop ని ప్రారంభించాం. |
01:45 | మొదట, మనం i కు 1 ను అసైన్ చేద్దాం. |
01:48 | తరువాత మనం i విలువ number కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం. |
01:54 | ఇక్కడ మనం sum ను sum plus i గా లెక్కిద్దాం. |
02:00 | తరువాత దానిని ముద్రిద్దాం. |
02:03 | దీని తరువాత i యొక్క value ని 1 కి పెంచుదాం. |
02:08 | తరువాత condition False అయ్యేంతవరకు ఆ condition ను తనిఖీ చేద్దాం. |
02:14 | for loop నుండి బయటకు వచ్చి ఈ సందేశం ను ముద్రిస్తుంది. |
02:19 | ప్రోగ్రాం ను execute చేసి, ఏమి జరుగుతుందో గమనిద్దాం. |
02:24 | terminal పై chmod +x for.sh అని టైప్ చేయండి. |
02:31 | తరువాత ./for.sh అని టైప్ చేయండి |
02:36 | నేను 5 ను input సంఖ్య గా ఎంటర్ చేస్తాను. |
02:40 | i యొక్క ప్రతీ విలువకు, లెక్కించిన sum విలువ ప్రదర్శింపబడుతుంది. |
02:46 | దాని తరువాత, output నందు గల చివరి లైన్ ప్రదర్శింపబడుతుంది. |
02:50 | "Sum of first n numbers is 15" . |
02:54 | ఇప్పుడు, మనం, ప్రోగ్రాం యొక్క పనితీరును చూద్దాం. |
02:57 | నేను windows ని పునఃపరిమాణం చేస్తాను. |
03:00 | మొదట, మనం i విలువ 1 గా కలిగిఉన్నాం. |
03:04 | తరువాత మనం 1, 5కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం. |
03:10 | ఈ కండిషన్ True కాబట్టి, మనం sum ను 0 + 1 గా లెక్కిద్దాం. |
03:16 | ఇప్పుడు మన sum విలువ 1 గా ఉంది. |
03:20 | తరువాత మనం sum విలువ అంటే 1 ని ముద్రిస్తాము. |
03:24 | తరువాత, i విలువ ను 1 పెంచుదాం. i యొక్క కొత్త విలువ 2. |
03:31 | తరువాత మనం 2, 5 కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం. |
03:36 | ఈ condition True కాబట్టి ఇప్పుడు sum విలువ 1 + 2 అంటే 3. |
03:44 | తరువాత, i ను 1 పెంచుదాం. కాబట్టి i యొక్క కొత్త విలువ 3. |
03:51 | అదేవిధంగా మనం sum ను 6 గా పొందుతాము. |
03:55 | i యొక్క తరువాత విలువను sum లోని, మునపటి విలువకు జోడిస్తూ, script కొనసాగింపబడుతుంది. |
04:02 | ఇది i<=5 False అయ్యేంతవరకు కొనసాగింపబడుతుంది. |
04:09 | for loop నుండి బయటకు వచ్చి, చివరి సందేశం ముద్రిస్తుంది. |
04:14 | మనం for loop రెండవ సింటాక్స్ ఉపయోగించి మరొక ఉదాహరణను చూద్దాం. |
04:20 | ఈ ఫైల్ లో నేను code వ్రాసి, దానికి for-loop.sh గా పేరు ఇచ్చాను. |
04:27 | ఈ సాధారణ ప్రోగ్రాం, డైరెక్టరీ లోని ఫైల్ లను లిస్ట్ చేస్తుంది. |
04:32 | ఇది shebang line. |
04:35 | తరువాత మనము for లూప్ ను కలిగి ఉన్నాము. |
04:37 | ls command డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది. |
04:41 | -1 (hyphen one) లైన్ కి ఒక ఫైల్ చొప్పున లిస్ట్ చేస్తుంది. |
04:46 | ఇది మీ home directory లో ఉన్న అన్ని ఫైళ్ళను లిస్ట్ చేస్తుంది. |
04:51 | ఇది for loop యొక్క ముగింపు. |
04:53 | terminal పై |
04:58 | chmod +x for-loop.sh |
05:04 | ./for-loop.sh అని టైప్ చేయడం ద్వారా script ను execute చేద్దాం. |
05:09 | ఇది Home డైరెక్టరీ లో ఉన్న అన్ని ఫైళ్ళను ప్రదర్శిస్తుంది. |
05:14 | ఇప్పుడు మనం while loop గురించి నేర్చుకుందాం. |
05:18 | మొదట మనం సింటాక్స్ ని అర్ధంచేసుకుందాం. |
05:21 | while condition statement 1, 2, 3 while loop ముగింపు. |
05:27 | దీని అర్ధం while లూప్ అనేది, condition True అయ్యేంతసేపు ఎగ్జిక్యూట్ అవుతుంది. |
05:34 | while loop కు ఒక ఉదాహరణను చూద్దాం. |
05:37 | ఇక్కడ, నేను దీనికి while.sh గా పేరు ఇచ్చాను. |
05:42 | ఈ ప్రోగ్రాంలో, మనం ఇచ్చిన శ్రేణిలోని సరి సంఖ్యల మొత్తాన్ని లెక్కిస్తాము. |
05:49 | మనం code ను చూద్దాం. |
05:52 | ఇక్కడ, మనం యూజర్ నుండి ఒక సంఖ్యను అంగీకరించి, దానిని number వేరియబుల్ లో నిల్వ చేద్దాము. |
05:59 | తరువాత, మనం i మరియు sum వేరియబుల్స్ ను డిక్లేర్ చేసి, వాటిని 0 (సున్నా) తో ఇనిష్యలైజ్ చేద్దాము. |
06:06 | ఇప్పుడు, ఇది while condition. |
06:08 | ఇక్కడ, మనం i అనేది యూజర్ ద్వారా ఇవ్వబడిన number యొక్క విలువ కంటే less than or equal అవునా అని తనిఖీ చేద్దాం. |
06:17 | తరువాత మనం sum యొక్క విలువకు i విలువను కలుపుదాం. |
06:24 | తరువాత, మనం i విలువను 2 పెంచుదాం. |
06:28 | ఇది మనం సరి సంఖ్యలను మాత్రమే కలిపేలా చేస్తుంది. |
06:33 | while loop అనేది i యొక్క విలువ number యొక్క విలువ కంటే ఎక్కువయ్యేంత వరకు రిపీట్ అవుతుంది. |
06:40 | మనం while loop నుండి ఎగ్జిట్ అయ్యి, ఇచ్చిన శ్రేణిలోని సరి సంఖ్యల మొత్తని మనం ముద్రిస్తాము. |
06:47 | ప్రోగ్రాం ని execute చేద్దాం. |
06:50 | terminal పై టైప్ చేయండి. |
06:52 | chmod +x while.sh |
06:56 | ./while.sh |
07:00 | నేను ఇన్పుట్ గా 15 ను ఇస్తాను. |
07:04 | అవుట్ పుట్ నందు చివరి లైన్: |
07:06 | "Sum of even numbers within the given range is 56". |
07:11 | నేను ఇప్పుడు window ను పునఃపరిమాణం చేసి, output ను వివరిస్తాను. |
07:14 | మొదట మనం i విలువ అంటే 0 number విలువ అంటే 15 కంటే తక్కువ లేదా సమానమా అని తనిఖీ చేద్దాం. |
07:24 | condition అనేది True. కాబట్టి sum విలువ 0+0 అంటే 0. |
07:31 | ఇప్పుడు i విలువ 2 పెరిగి, కొత్త విలువ 2 అయినది. |
07:37 | తరువాత మనం 2, 15 కంటే తక్కువ లేదా సమానమా అని తనిఖీ చేస్తాం. |
07:43 | కండిషన్ మళ్ళీ True కాబట్టి, మనం 0+2 ను కలుపుదాం. |
07:49 | ఇప్పుడు sum విలువ 2 ను కలిగి ఉంది. |
07:52 | మళ్ళీ i విలువ 2 పెరుగుతుంది. |
07:56 | కాబట్టి, ఇప్పుడు i విలువ 2+2 అంటే 4. |
08:03 | తరువాత sum విలువ 4+2 అంటే 6. |
08:09 | అదేవిధంగా, i యొక్క మునుపటి విలువకు 2ను కలుపుతూ దాని విలువ 15 కంటే ఎక్కువ అయ్యేవరకు script కొనసాగుతుంది. |
08:18 | మనకి sum లోని మొత్తం విలువ 56 గా వస్తోంది. |
08:24 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
08:27 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం for loop యొక్క రెండు వేర్వేరు సింటాక్స్ లను మరియు while loop గురించి నేర్చుకున్నాం. |
08:37 | ఒక అసైన్మెంట్ గా మొదటి "n" ప్రధాన సంఖ్యల మొత్తాన్ని కనుక్కోండి. |
08:43 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
08:46 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
08:50 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
08:54 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
08:56 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
09:00 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:04 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
09:11 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
09:14 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
09:22 | మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
09:28 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
09:34 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మరియు నేను ఉదయలక్ష్మి. |
09:38 | మీకు ధన్యవాదాలు. |