BASH/C2/Conditional-Loops/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లోని loops పై spoken tutorialకు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో మనము,
00:09 for loop,
00:11 while loop లను కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకుంటాము.
00:15 ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను,
00:18 Ubuntu Linux 12.04 Operating System
00:22 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:26 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షలను అభ్యాసానికి ఉపయోగిస్తున్నాను.
00:34 loops యొక్క పరిచయంతో ప్రారంభిద్దాం.
00:37 Loops అనేవి statements సమూహాన్ని మళ్ళీ మళ్ళీ execute చేయడానికి ఉపయోగిస్తారు.
00:43 సింటాక్స్ చూద్దాం.
00:45 for expression 1, 2, 3
00:49 statement 1, 2, 3.
00:51 ఇది for loop యొక్క ముగింపు.
00:55 for loop కు ప్రత్యామ్నాయ సింటాక్స్
00:58 for variable in sequence/range
01:03 statement 1, 2, 3
01:06 for loop యొక్క ముగింపు.
01:09 for loop యొక్క ఉదాహరణను మొదటి సింటాక్స్ ఉపయోగించి చూద్దాం.
01:14 ఈ ప్రోగ్రాంలో, మనం మొదటి n సంఖ్యల యొక్క మొత్తాన్ని లెక్కిస్తాము.
01:20 మన ఫైల్ పేరు for.sh అని గుర్తుంచుకొనండి.
01:25 ఇది మన shebang line.
01:28 number వేరియబుల్, యూజర్ చే ఇవ్వబడిన value ను నిల్వ చేస్తుంది.
01:34 ఇక్కడ ఆ విలువ ఒక పూర్ణాంకం.
01:37 ఇప్పుడు, మనం variable sum కు జీరో ను ప్రారంభ విలువగా ఇచ్చాము.
01:42 ఇక్కడ మనం for loop ని ప్రారంభించాం.
01:45 మొదట, మనం i కు 1 ను అసైన్ చేద్దాం.
01:48 తరువాత మనం i విలువ number కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం.
01:54 ఇక్కడ మనం sum ను sum plus i గా లెక్కిద్దాం.
02:00 తరువాత దానిని ముద్రిద్దాం.
02:03 దీని తరువాత i యొక్క value ని 1 కి పెంచుదాం.
02:08 తరువాత condition False అయ్యేంతవరకు ఆ condition ను తనిఖీ చేద్దాం.
02:14 for loop నుండి బయటకు వచ్చి ఈ సందేశం ను ముద్రిస్తుంది.
02:19 ప్రోగ్రాం ను execute చేసి, ఏమి జరుగుతుందో గమనిద్దాం.
02:24 terminal పై chmod +x for.sh అని టైప్ చేయండి.
02:31 తరువాత ./for.sh అని టైప్ చేయండి
02:36 నేను 5 ను input సంఖ్య గా ఎంటర్ చేస్తాను.
02:40 i యొక్క ప్రతీ విలువకు, లెక్కించిన sum విలువ ప్రదర్శింపబడుతుంది.
02:46 దాని తరువాత, output నందు గల చివరి లైన్ ప్రదర్శింపబడుతుంది.
02:50 "Sum of first n numbers is 15" .
02:54 ఇప్పుడు, మనం, ప్రోగ్రాం యొక్క పనితీరును చూద్దాం.
02:57 నేను windows ని పునఃపరిమాణం చేస్తాను.
03:00 మొదట, మనం i విలువ 1 గా కలిగిఉన్నాం.
03:04 తరువాత మనం 1, 5కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం.
03:10 ఈ కండిషన్ True కాబట్టి, మనం sum ను 0 + 1 గా లెక్కిద్దాం.
03:16 ఇప్పుడు మన sum విలువ 1 గా ఉంది.
03:20 తరువాత మనం sum విలువ అంటే 1 ని ముద్రిస్తాము.
03:24 తరువాత, i విలువ ను 1 పెంచుదాం. i యొక్క కొత్త విలువ 2.
03:31 తరువాత మనం 2, 5 కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం.
03:36 ఈ condition True కాబట్టి ఇప్పుడు sum విలువ 1 + 2 అంటే 3.
03:44 తరువాత, i ను 1 పెంచుదాం. కాబట్టి i యొక్క కొత్త విలువ 3.
03:51 అదేవిధంగా మనం sum ను 6 గా పొందుతాము.
03:55 i యొక్క తరువాత విలువను sum లోని, మునపటి విలువకు జోడిస్తూ, script కొనసాగింపబడుతుంది.
04:02 ఇది i<=5 False అయ్యేంతవరకు కొనసాగింపబడుతుంది.
04:09 for loop నుండి బయటకు వచ్చి, చివరి సందేశం ముద్రిస్తుంది.
04:14 మనం for loop రెండవ సింటాక్స్ ఉపయోగించి మరొక ఉదాహరణను చూద్దాం.
04:20 ఈ ఫైల్ లో నేను code వ్రాసి, దానికి for-loop.sh గా పేరు ఇచ్చాను.
04:27 ఈ సాధారణ ప్రోగ్రాం, డైరెక్టరీ లోని ఫైల్ లను లిస్ట్ చేస్తుంది.
04:32 ఇది shebang line.
04:35 తరువాత మనము for లూప్ ను కలిగి ఉన్నాము.
04:37 ls command డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది.
04:41 -1 (hyphen one) లైన్ కి ఒక ఫైల్ చొప్పున లిస్ట్ చేస్తుంది.
04:46 ఇది మీ home directory లో ఉన్న అన్ని ఫైళ్ళను లిస్ట్ చేస్తుంది.
04:51 ఇది for loop యొక్క ముగింపు.
04:53 terminal పై
04:58 chmod +x for-loop.sh
05:04 ./for-loop.sh అని టైప్ చేయడం ద్వారా script ను execute చేద్దాం.
05:09 ఇది Home డైరెక్టరీ లో ఉన్న అన్ని ఫైళ్ళను ప్రదర్శిస్తుంది.
05:14 ఇప్పుడు మనం while loop గురించి నేర్చుకుందాం.
05:18 మొదట మనం సింటాక్స్ ని అర్ధంచేసుకుందాం.
05:21 while condition
statement 1, 2, 3
while loop ముగింపు.
05:27 దీని అర్ధం while లూప్ అనేది, condition True అయ్యేంతసేపు ఎగ్జిక్యూట్ అవుతుంది.
05:34 while loop కు ఒక ఉదాహరణను చూద్దాం.
05:37 ఇక్కడ, నేను దీనికి while.sh గా పేరు ఇచ్చాను.
05:42 ఈ ప్రోగ్రాంలో, మనం ఇచ్చిన శ్రేణిలోని సరి సంఖ్యల మొత్తాన్ని లెక్కిస్తాము.
05:49 మనం code ను చూద్దాం.
05:52 ఇక్కడ, మనం యూజర్ నుండి ఒక సంఖ్యను అంగీకరించి, దానిని number వేరియబుల్ లో నిల్వ చేద్దాము.
05:59 తరువాత, మనం i మరియు sum వేరియబుల్స్ ను డిక్లేర్ చేసి, వాటిని 0 (సున్నా) తో ఇనిష్యలైజ్ చేద్దాము.
06:06 ఇప్పుడు, ఇది while condition.
06:08 ఇక్కడ, మనం i అనేది యూజర్ ద్వారా ఇవ్వబడిన number యొక్క విలువ కంటే less than or equal అవునా అని తనిఖీ చేద్దాం.
06:17 తరువాత మనం sum యొక్క విలువకు i విలువను కలుపుదాం.
06:24 తరువాత, మనం i విలువను 2 పెంచుదాం.
06:28 ఇది మనం సరి సంఖ్యలను మాత్రమే కలిపేలా చేస్తుంది.
06:33 while loop అనేది i యొక్క విలువ number యొక్క విలువ కంటే ఎక్కువయ్యేంత వరకు రిపీట్ అవుతుంది.
06:40 మనం while loop నుండి ఎగ్జిట్ అయ్యి, ఇచ్చిన శ్రేణిలోని సరి సంఖ్యల మొత్తని మనం ముద్రిస్తాము.
06:47 ప్రోగ్రాం ని execute చేద్దాం.
06:50 terminal పై టైప్ చేయండి.
06:52 chmod +x while.sh
06:56 ./while.sh
07:00 నేను ఇన్పుట్ గా 15 ను ఇస్తాను.
07:04 అవుట్ పుట్ నందు చివరి లైన్:
07:06 "Sum of even numbers within the given range is 56".
07:11 నేను ఇప్పుడు window ను పునఃపరిమాణం చేసి, output ను వివరిస్తాను.
07:14 మొదట మనం i విలువ అంటే 0 number విలువ అంటే 15 కంటే తక్కువ లేదా సమానమా అని తనిఖీ చేద్దాం.
07:24 condition అనేది True. కాబట్టి sum విలువ 0+0 అంటే 0.
07:31 ఇప్పుడు i విలువ 2 పెరిగి, కొత్త విలువ 2 అయినది.
07:37 తరువాత మనం 2, 15 కంటే తక్కువ లేదా సమానమా అని తనిఖీ చేస్తాం.
07:43 కండిషన్ మళ్ళీ True కాబట్టి, మనం 0+2 ను కలుపుదాం.
07:49 ఇప్పుడు sum విలువ 2 ను కలిగి ఉంది.
07:52 మళ్ళీ i విలువ 2 పెరుగుతుంది.
07:56 కాబట్టి, ఇప్పుడు i విలువ 2+2 అంటే 4.
08:03 తరువాత sum విలువ 4+2 అంటే 6.
08:09 అదేవిధంగా, i యొక్క మునుపటి విలువకు 2ను కలుపుతూ దాని విలువ 15 కంటే ఎక్కువ అయ్యేవరకు script కొనసాగుతుంది.
08:18 మనకి sum లోని మొత్తం విలువ 56 గా వస్తోంది.
08:24 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
08:27 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం for loop యొక్క రెండు వేర్వేరు సింటాక్స్ లను మరియు while loop గురించి నేర్చుకున్నాం.
08:37 ఒక అసైన్మెంట్ గా మొదటి "n" ప్రధాన సంఖ్యల మొత్తాన్ని కనుక్కోండి.
08:43 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
08:46 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
08:50 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:54 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
08:56 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:00 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:04 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
09:11 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
09:14 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
09:22 మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
09:28 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
09:34 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మరియు నేను ఉదయలక్ష్మి.
09:38 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india