Blender/C2/3D-Cursor/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 12:08, 10 October 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:03 | Blender Tutorials సిరీస్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో 3D Cursor గురించి చెబుతుంది. |
00:15 | ఈ లిపిని Chirag Raman అందించారు మరియు ఇది Monisha Banerjee చే సవరించబడింది. |
00:25 | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము 3D cursor అంటే ఏమిటి? |
00:32 | Blender లో 3D cursor మరియు snapping ఎంపికల ను ఉపయోగించి 3D view కు కొత్త objectలు ఎలా జతచేస్తారో నేర్చుకొంటాం. |
00:46 | మీ కంప్యూటరులో Blender ను ఇన్స్టాల్ చేయటం మీకు ఇప్పటికే తెలుసు అని నేను అనుకుంటాను. |
00:51 | తెలియకపోతే, దయచేసి మా పూర్వపు ట్యుటోరియల్ Installing Blender ను చూడండి. |
00:57 | 3D Cursor ఎరుపు మరియు తెలుపు రింగ్ క్రాస్-హెయిర్ తో ఉండి, మీకు Blender screen మధ్యలో కనిపిస్తుంది. |
01:06 | Blender లో 3D cursor ను చూద్దాము. అలా చేయుటకు, బ్లెండర్ ను తెరవాలి. |
01:12 | Blender ను తెరవడానికి రెండు మార్గాలున్నాయి. |
01:15 | మొదటిది, డెస్క్టాప్ లో Blender icon కి వెళ్ళి, దానిపై రైట్ -క్లిక్ చేసి, Open పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . |
01:27 | బ్లెండర్ ను తెరవడానికి రెండవ మరియు సులువైన మార్గం, డెస్క్టాప్ లో Blender icon పై డబుల్-క్లిక్ చేయడం. |
01:42 | ఇది Blender 2.59. ఇక్కడ చూపిన స్క్రీన్ రిజల్యూషన్ 1024 బై 768 pixels అని గుర్తుంచుకోండి. |
01:54 | Blender interface లో font size పెంచాము. తద్వారా మీరు, ఇచ్చిన అన్ని ఎంపికలను అర్థం చేసుకోవచ్చు. |
02:01 | Interface ఫాంట్ పరిమాణాన్ని ఎలా పెంచాలో, తెలుసుకోవడానికి, దయచేసి User Preferences ట్యుటోరియల్ ను చూడండి. |
02:12 | దీనిని స్వాగత పుట లేదా splash screen అని అంటారు. ఇది బ్లెండర్ గురించి తెలుసుకునేందుకు కొన్ని ఉపయోగకరమైన reference links ను చూపిస్తుంది. |
02:20 | స్ప్లాష్ స్క్రీన్ ను తొలగించడానికి, మీ కీబోర్డ్ లో ESC ను నొక్కండి లేదా |
02:25 | స్ప్లాష్ స్క్రీన్ మీద తప్ప మిగిలిన Blender interface పై ఎక్కడైనా mouse తో లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
02:32 | ఇప్పుడు మీరు default Blender workspace ను చూడవచ్చు. |
02:37 | 3D cursor, స్క్రీన్ మధ్య భాగం లో, cube చే చుట్టబడియున్నది. |
02:43 | మనము కర్సర్ ను సరిగా చూడలేము, కాబట్టి మనము cube ను తొలగించాలి. |
02:48 | డిఫాల్ట్ గా, క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడింది. |
02:51 | దానిని తొలగించడానికి, కీబోర్డ్ లోని Delete బటన్ ను నొక్కండి. Delete పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
02:58 | అక్కడ మీరు 3D cursor ను బాగుగా చూడవచ్చు. |
03:04 | 3D Cursor యొక్క ప్రాథమిక ప్రయోజనం, 3D సన్నివేశానికి జోడించిన కొత్త వస్తువు స్థానాన్ని పేర్కొనడమే. |
03:15 | ADD>> Mesh కు వెళ్ళి , Cube పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . |
03:19 | మీరు 3D view కు కొత్త వస్తువులను చేర్చడానికి కీబోర్డు నుండి సత్వరమార్గం (షార్ట్-కట్) shift & A ను ఉపయోగించవచ్చు. |
03:27 | 3D view కు ఒక కొత్త cube జోడించబడింది. |
03:30 | మీరు గమనిస్తే, కొత్త cube కూడా 3D cursor స్థానంలోనే కనిపిస్తుంది. |
03:38 | ఇప్పుడు, ఒక క్రొత్త స్థానానికి, ఒక క్రొత్త objectను ఎలా చేర్చవచ్చో చూద్దాం. |
03:44 | ముందుగా, మనము 3D cursor ను ఒక క్రొత్త స్థానానికి కదిలించవలిసి ఉంటుంది. |
03:48 | దీన్ని చేయడానికి, 3D space లోని ఏదైనా స్థానంపై లెఫ్ట్ -క్లిక్ చేయండి. |
03:53 | నేను క్యూబ్ కు ఎడమ వైపుకు క్లిక్ చేస్తున్నాను. |
03:59 | ఒక క్రొత్త వస్తువును చేర్చడానికి Shift & A నొక్కి, Mesh తరువాత UV sphere పై లెఫ్ట్ -క్లిక్ చేయండి. |
04:10 | UV sphere, 3D కర్సర్ యొక్క కొత్త ప్రదేశంలో కనిపిస్తుంది. |
04:15 | ఇప్పుడు, మనం 3D cursor కోసం స్నాప్పింగ్ ఎంపికలను చూస్తాము. |
04:22 | Object కు వెళ్ళి, Snap కు వెళ్ళండి. ఇది Snap మెనూ. |
04:29 | ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి. |
04:31 | మీరు కీబోర్డ్ నుండి సత్వరమార్గం Shift & S కూడా ఉపయోగించవచ్చు. |
04:38 | Selection to cursor ఎంపిక, ఎంచుకున్న అంశాన్ని 3D కర్సర్ కు స్నాప్ చేస్తుంది. |
04:45 | ఉదాహరణకు, మనం cube ను 3D కర్సర్ కు snap చేద్దాం . |
04:50 | cube పై రైట్ క్లిక్ చేసి, snap menu పొందడానికి Shift & S నొక్కండి. |
04:58 | selection to cursor పై లెఫ్ట్ క్లిక్ చేస్తే, cube, 3D కర్సర్ ను స్నాప్ చేస్తుంది. |
05:06 | ఇప్పుడు క్యూబ్ ను కుడివైపుకు తరలించండి. దానికై green handle పై లెఫ్ట్ క్లిక్ చేసి, మౌస్ ను నొక్కి పట్టుకొని కుడివైపుకు లాగండి. |
05:17 | కీబోర్డ్ నుండి సత్వరమార్గం కోసం G & Y ను నొక్కండి |
05:23 | 3D view లో కదిలే objectల గురించి మరింత తెలుసుకోవడానికి, Basic description of Blender interface ట్యుటోరియల్ ను చూడండి. |
05:35 | స్నాప్ మెను కోసం Shift & S నొక్కి, Cursor to Selected పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
05:43 | 3D కర్సర్, cube యొక్క కేంద్రాన్ని క్రొత్త స్థానంలో స్నాప్ చేస్తుంది. |
05:50 | మీరు ఒకవేళ 1 కంటే ఎక్కువ objectను ఎంచుకున్నట్లయితే, ఇక్కడ cube మరియు UV sphere అనుకోండి. |
05:59 | Cursor to selected 3D కర్సర్ ను ఎంచుకున్న రెండు objectల మధ్యలో స్నాప్ చేస్తుంది. |
06:07 | నేను ఇప్పుడు దానిని ప్రదర్శిస్తాను. క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడి ఉండుట మీరు చూడవచ్చు. |
06:12 | UV sphere ఎంచుకోవడానికి Shift plus right క్లిక్ చేయండి. కాబట్టి ఇప్పుడు, మీరు ఒకే సమయంలో రెండు objectలను ఎంచుకొన్నారు. |
06:22 | Shift & S నొక్కి, స్నాప్ మెనూను పొందండి. Cursor to selected పై క్లిక్ చేయండి. |
06:30 | 3D కర్సర్ ఎంచుకున్న రెండు objectల కేంద్రం వద్ద స్నాప్ చేస్తుంది. |
06:36 | ఇప్పుడు, Shift నొక్కి, lamp పై right క్లిక్ చేయండి. snap menu పొందుటకు,Shift & S నొక్కండి. |
06:47 | Cursor to Selected ను క్లిక్ చేస్తే, 3D కర్సర్ ఎంచుకున్న 3 objectల కేంద్రం వద్ద స్నాప్ చేస్తుంది. |
06:58 | 3D కర్సర్ ను తరలించడానికి 3D view లో ఏదైనా పాయింట్ వద్ద క్లిక్ చేయండి. నేను దిగువ కుడివైపున క్లిక్ చేస్తున్నాను. |
07:07 | Shift & S నొక్కి snap మెనును పొందండి. |
07:12 | Cursor to Center పై క్లిక్ చేస్తే, 3D cursor, 3D view ను స్నాప్ చేస్తోంది. |
07:22 | objectలను deselect చెయ్యడానికి కీబోర్డు నుండి A ను ప్రెస్ చెయ్యండి . |
07:28 | ఇప్పుడు, UV sphere ను రైట్ -క్లిక్ చేసి, ఎంపికను తీసివేయడానికి A ప్రెస్ చెయ్యండి. |
07:39 | Shift & S నొక్కి snap మెనూను పొందండి. |
07:44 | Cursor to active పై క్లిక్ చేయండి. |
07:47 | 3D కర్సర్ చివరి క్రియాశీల ఎంపిక అయిన UV sphere ను స్నాప్ చేస్తుంది . |
07:56 | modeling సమయంలో 3D cursor ను పైవట్ పాయింట్ గా ఉపయోగించినప్పుడు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. |
08:03 | కానీ మనము దాని గురించి తరువాత ట్యుటోరియల్స్ లో చూద్దాం. |
08:08 | ఇప్పుడు, 3D cursor ను ఉపయోగించి వేర్వేరు ప్రాంతాల్లో 3D view కు కొత్త object లను చేర్చడానికి ప్రయత్నించండి. |
08:16 | ఆ తరువాత, snap మెనూలో స్నాప్పింగ్ ఐచ్చికాలను అన్వేషించండి. అంతా మంచి జరుగుగాక! |
08:26 | కాబట్టి, మనం బ్లెండర్ లో 3D Cursor పై ట్యుటోరియల్ ను ముగిద్దాం. |
08:31 | ఈ ట్యుటోరియల్ ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో Project Oscar చే సృష్టించబడింది. |
08:40 | దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
09:00 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: |
09:02 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది. |
09:06 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:11 | మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact @ spoken spoken tutorial.org |
09:17 | మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. |
09:19 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి. |