Blender/C2/3D-Cursor/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:03 Blender Tutorials సిరీస్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో 3D Cursor గురించి చెబుతుంది.
00:15 ఈ లిపిని Chirag Raman అందించారు మరియు ఇది Monisha Banerjee చే సవరించబడింది.
00:25 ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము 3D cursor అంటే ఏమిటి?
00:32 Blender లో 3D కర్సర్ ను ఉపయోగించి 3D view కు క్రొత్త object లు జతచేయడం మరియు Blender లో 3D కర్సర్ కొరకు స్నాప్పింగ్ ఎంపికలను నేర్చుకుంటాము.
00:46 మీ కంప్యూటరులో Blender ను ఇన్స్టాల్ చేయటం మీకు ఇప్పటికే తెలుసు అని నేను అనుకుంటాను.
00:51 తెలియకపోతే, దయచేసి Installing Blender పై మా పూర్వపు ట్యుటోరియల్స్ ను చూడండి.
00:57 3D Cursor ఎరుపు మరియు తెలుపు రింగ్ క్రాస్-హెయిర్ తో ఉండి, మీకు Blender screen మధ్యలో కనిపిస్తుంది.
01:06 Blender లో 3D cursor ను చూద్దాము. అలా చేయుటకు, బ్లెండర్ ను తెరవాలి.
01:12 Blender ను తెరవడానికి రెండు మార్గాలున్నాయి.
01:15 మొదటిది, డెస్క్టాప్ లో Blender icon కి వెళ్ళి, Blender icon పై రైట్-క్లిక్ చేసి, Open పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
01:27 బ్లెండర్ ను తెరవడానికి, రెండవ మరియు సులువైన మార్గం, డెస్క్టాప్ లో Blender icon పై లెఫ్ట్ డబుల్-క్లిక్ చేయడం.
01:42 ఇది Blender 2.59. ఇక్కడ చూపిన స్క్రీన్ రిజల్యూషన్ 1024 బై 768 pixels అని గుర్తుంచుకోండి.
01:54 Blender interface లో font size పెంచాము. తద్వారా మీరు, ఇచ్చిన అన్ని ఎంపికలను అర్థం చేసుకోవచ్చు.
02:01 Interface ఫాంట్ పరిమాణాన్ని ఎలా పెంచాలో, తెలుసుకోవడానికి, దయచేసి User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
02:12 దీనిని స్వాగత పుట లేదా splash screen అని అంటారు. ఇది బ్లెండర్ గురించి తెలుసుకునేందుకు కొన్ని ఉపయోగకరమైన reference links ను చూపిస్తుంది.
02:20 స్ప్లాష్ స్క్రీన్ ను తొలగించడానికి, మీ కీబోర్డ్ లో Escape ను నొక్కండి లేదా, Shift & S నొక్కి, స్నాప్ మెనూను పొందండి.
02:25 స్ప్లాష్ స్క్రీన్ మీద తప్ప మిగిలిన Blender interface పై ఎక్కడైనా mouse తో లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
02:32 ఇప్పుడు మీరు default Blender workspace ను చూడవచ్చు.
02:37 3D cursor, స్క్రీన్ మధ్య భాగం లో, cube చే చుట్టబడియున్నది.
02:43 మనము కర్సర్ ను సరిగా చూడలేము, కాబట్టి మనము cube ను తొలగించాలి.
02:48 డిఫాల్ట్ గా, క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడింది.
02:51 దానిని తొలగించడానికి, కీబోర్డ్ లోని Delete బటన్ ను నొక్కండి. Delete పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
02:58 అక్కడ మీరు 3D cursor ను బాగుగా చూడవచ్చు.
03:04 3D Cursor యొక్క ప్రాథమిక ప్రయోజనం, 3D సన్నివేశానికి జోడించిన కొత్త object స్థానాన్ని పేర్కొనడమే.
03:15 ADD >> Mesh కు వెళ్ళి, Cube పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
03:19 మీరు 3D view కు కొత్త objectలను చేర్చడానికి కీబోర్డు నుండి సత్వరమార్గం (షార్ట్-కట్) shift & A ను ఉపయోగించవచ్చు.
03:27 3D view కు ఒక కొత్త cube జోడించబడింది.
03:30 మీరు గమనిస్తే, కొత్త cube కూడా 3D cursor స్థానంలోనే కనిపిస్తుంది.
03:38 ఇప్పుడు, ఒక క్రొత్త స్థానానికి, ఒక క్రొత్త objectను ఎలా చేర్చవచ్చో చూద్దాం.
03:44 ముందుగా, మనము 3D cursor ను ఒక క్రొత్త స్థానానికి కదిలించవలిసి ఉంటుంది.
03:48 దీన్ని చేయడానికి, 3D space లోని ఏదైనా స్థానంపై లెఫ్ట్ -క్లిక్ చేయండి.
03:53 నేను క్యూబ్ కు ఎడమ వైపుకు క్లిక్ చేస్తున్నాను.
03:59 ఒక క్రొత్త objectను చేర్చడానికి Shift & A నొక్కి, Mesh తరువాత UV sphere పై లెఫ్ట్-క్లిక్ చేయండి.
04:10 UV sphere, 3D కర్సర్ యొక్క కొత్త ప్రదేశంలో కనిపిస్తుంది.
04:15 ఇప్పుడు, మనం 3D cursor కోసం స్నాప్పింగ్ ఎంపికలను చూస్తాము.
04:22 Object కు వెళ్ళి, Snap కు వెళ్ళండి. ఇది Snap మెనూ.
04:29 ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి.
04:31 మీరు కీబోర్డ్ నుండి సత్వరమార్గం Shift & S కూడా ఉపయోగించవచ్చు.
04:38 Selection to cursor ఎంపిక, ఎంచుకున్న అంశాన్ని 3D కర్సర్ కు స్నాప్ చేస్తుంది.
04:45 ఉదాహరణకు, మనం cube ను 3D కర్సర్ కు snap చేద్దాం.
04:50 cube పై రైట్-క్లిక్ చేసి, snap menu పొందడానికి Shift & S నొక్కండి.
04:58 selection to cursor పై లెఫ్ట్ క్లిక్ చేస్తే, cube, 3D కర్సర్ ను స్నాప్ చేస్తుంది.
05:06 ఇప్పుడు క్యూబ్ ను కుడివైపుకు తరలించండి. దానికై green handle పై లెఫ్ట్ క్లిక్ చేసి, మౌస్ ను నొక్కి పట్టుకొని కుడివైపుకు లాగండి.
05:17 కీబోర్డ్ నుండి సత్వరమార్గం కోసం G & Y ను నొక్కండి.
05:23 3D view లో కదిలే objectల గురించి మరింత తెలుసుకోవడానికి, Basic description of Blender interface ట్యుటోరియల్ ను చూడండి.
05:35 స్నాప్ మెను కోసం, Shift & S నొక్కి, Cursor to Selected పై లెఫ్ట్-క్లిక్ చెయ్యండి.
05:43 3D కర్సర్, cube యొక్క కేంద్రాన్ని క్రొత్త స్థానంలో స్నాప్ చేస్తుంది.
05:50 ఒకవేళ, మీరు 1 కంటే ఎక్కువ objectలను ఒకే సమయంలో ఎంచుకున్నట్లయితే, ఇక్కడ cube మరియు UV sphere అనుకోండి.
05:59 Cursor to selected 3D కర్సర్ ను ఎంచుకున్న రెండు objectల మధ్యలో స్నాప్ చేస్తుంది.
06:07 నేను ఇప్పుడు దానిని ప్రదర్శిస్తాను. క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడి ఉండుట మీరు చూడవచ్చు.
06:12 UV sphere ను ఎంచుకోవడానికి Shift plus right క్లిక్ చేయండి. కాబట్టి ఇప్పుడు, మీరు ఒకే సమయంలో రెండు objectలను ఎంచుకొన్నారు.
06:22 Shift & S నొక్కి, స్నాప్ మెనూను పొందండి. Cursor to selected పై క్లిక్ చేయండి.
06:30 3D కర్సర్ ఎంచుకున్న రెండు objectల కేంద్రం వద్ద స్నాప్ చేస్తుంది.
06:36 ఇప్పుడు, lamp పై Shift ప్లస్, రైట్-క్లిక్ చేయండి. snap menu పొందుటకు, Shift & S నొక్కండి.
06:47 Cursor to Selected ను క్లిక్ చేస్తే, 3D కర్సర్ ఎంచుకున్న 3 objectల కేంద్రం వద్ద స్నాప్ చేస్తుంది.
06:58 3D కర్సర్ ను తరలించడానికి 3D view లో ఏదైనా పాయింట్ వద్ద క్లిక్ చేయండి. నేను దిగువ కుడివైపున క్లిక్ చేస్తున్నాను.
07:07 Shift & S నొక్కి snap మెనును పొందండి.
07:12 Cursor to Center పై క్లిక్ చేస్తే, 3D cursor, 3D view ను స్నాప్ చేస్తోంది.
07:22 objectలను de-select చెయ్యడానికి కీబోర్డు నుండి Aను ప్రెస్ చెయ్యండి .
07:28 ఇప్పుడు, UV sphere ను రైట్-క్లిక్ చేసి, ఎంపికను తీసివేయడానికి A ప్రెస్ చెయ్యండి.
07:39 Shift & S నొక్కి snap మెనూను పొందండి.
07:44 Cursor to active పై క్లిక్ చేయండి.
07:47 3D కర్సర్ చివరి క్రియాశీల ఎంపిక అయిన UV sphere ను స్నాప్ చేస్తుంది.
07:56 modeling సమయంలో 3D cursor ను పైవట్ పాయింట్ గా ఉపయోగించినప్పుడు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.
08:03 కానీ మనము దాని గురించి తరువాత ట్యుటోరియల్స్ లో చూద్దాం.
08:08 ఇప్పుడు, 3D cursor ను ఉపయోగించి వేర్వేరు ప్రాంతాల్లో 3D view కు కొత్త object లను చేర్చడానికి ప్రయత్నించండి.
08:16 ఆ తరువాత, snap మెనూలో స్నాప్పింగ్ ఐచ్చికాలను అన్వేషించండి. అంతా మంచి జరుగుగాక!
08:26 కాబట్టి, మనం బ్లెండర్ లో 3D Cursor పై ట్యుటోరియల్ ను ముగిద్దాం.
08:31 ఈ ట్యుటోరియల్ ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో Project Oscar చే సృష్టించబడింది.
08:40 దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
09:00 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:
09:02 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది.
09:06 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:11 మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact@spoken spoken-tutorial.org
09:17 మాకు సహకరించినందుకు ధన్యవాదాలు.
09:19 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారుright నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india