Git/C2/Branching-in-Git/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 12:39, 12 September 2017 by Yogananda.india (Talk | contribs)
|
|
00:01 | Branching in Git పై spoken tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్‌లో, మనము Branching, ఒక branch ను సృష్టించడము మరియు branches మధ్య స్విచ్చింగ్ గురించి నేర్చుకుంటాము |
00:15 | ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను. |
00:25 | మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.. |
00:29 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal ఫై పని చేసే లినక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి |
00:36 | లేకపోతే, సంబంధిత లినక్స్ ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:42 | ఇప్పుడు మనము branching గురించి తెలుసుకుందాం. |
00:44 | సాధారణంగా, branches ను కొత్త modules అభివృద్ధి పరచడంలోనూ లేదా bug ఫిక్స్ చేయడంలోనూ ఉపయోగిస్తారు. |
00:52 | ఇది ప్రధాన ప్రాజెక్ట్ కు అంతరాయం లేకుండా ఒక ప్రాజెక్ట్ యొక్క కొత్త modules తో పని చేయడానికి సహాయపడుతుంది |
00:58 | Gitయొక్క డిఫాల్ట్ branch master. |
01:02 | మనం క్రొత్త మాడ్యూల్లను అభివృద్ధి చేయడానికి వివిధ branches ను ఉపయోగిస్తాము మరియు |
01:06 | అది తరువాత master branch తో విలీనం చేయబడుతుంది. |
01:11 | ఉదాహరణకు, ఈ రేఖాచిత్రం ఒక రిపోజిటరీను master మరియు new-module branches లతో చూపిస్తుంది . |
01:18 | master branch లో C1, C2 మరియు C3 అనే పేరు గల కొన్ని commits ఉన్నాయి. |
01:25 | తరువాత C3 commit లో ఒక branch 'new-module' సృష్టించబడుతుంది. |
01:30 | C4, C5 మరియు C8 అనేవి new-module branchయొక్క commits |
01:36 | అదే సమయంలో, master branch లో C6 మరియు C7 అను commit లనుతయారు చేశారు. |
01:43 | ఇక్కడ, మీరు new-module branch master branch కు అంతరాయం కలిగించ లేదని చూడవచ్చు. |
01:49 | new-module సిద్ధంగా ఉన్న తర్వాత, దానిని master branch తో విలీనం చేస్తాము. |
01:55 | ఈ ట్యుటోరియల్‌లో, branch ఎలా పనిచేస్తుందో నేను ప్రదర్శిస్తాను. Merging గురించి తదుపరి ట్యుటోరియల్‌లో నేర్చుకొంటాము. |
02:03 | Terminal ను తెరవడానికి Ctrl+Alt+T లను నొక్కండి. |
02:07 | మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage ను తెరుద్దాము. . |
02:13 | cd space mywebpage అని టైప్ చేసి మరియు Enter నొక్కండి. |
02:19 | నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను. మీకు ఇష్టమైన ఏదైనా ఫైల్ రకాన్ని మీరు ఉపయోగించవచ్చు. |
02:28 | Git log ను తనిఖీ చేయుటకు , git space log space hyphen hyphen oneline ను టైప్ చేసి మరియు Enter నొక్కండి. |
02:37 | మొదటగా మనము repository లో ఏదైనా branch ఉందా అని తనిఖీ చేద్దాము. |
02:43 | git space branch అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
02:48 | ముందుగా చెప్పినట్లు ఇది డిఫాల్ట్ branch 'master' ను చూపుతుంది. |
02:53 | ఇప్పుడు నేను "new-chapter" అనే branch సృష్టించాలని అనుకుంటున్నాను. |
02:57 | git space branch space new-chapter అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
03:04 | branch list చూడడానికి git space branch అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
03:12 | ఇక్కడ మనము లిస్టులో branch "new-chapter" ను చూస్తాము. |
03:16 | master branch తో ఒక నక్షత్ర( asterisk) గుర్తును కూడా చూడవచ్చు. |
03:20 | ప్రస్తుతం మనము master branch లో పనిచేస్తున్నామని ఇది సూచిస్తుంది. |
03:25 | "new-chapter" branch లోకి వెళ్ళడానికి git space checkout space new-chapter అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
03:36 | Branch పేరును తనిఖీ చేయడానికి git space branchఅని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
03:42 | ఆస్ట్రిస్క్(asterisk) గుర్తును చూసి, మనము "new-chapter" branchలో ఉన్నాము అని అర్థం చేసుకొనవచ్చు. |
03:49 | తరువాత, నేను story.html అను ఒక html ఫైల్ క్రియేట్ చేస్తాను మరియు ప్రదర్శన కోసం దీనిని commit చేద్దాము |
03:57 | gedit space story.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
04:05 | నేను ముందుగా సేవ్ చేసిన నా Writer డాక్యుమెంట్ నుండి కొంచెం కోడ్ ను copy sచేసి ఈ ఫైల్ లో paste చేస్తాను. |
04:12 | ఫైల్ ను Save చేసి మూసివేయండి. |
04:15 | మనం ఏ ఫైల్ ను అయినా జోడించినా లేదా తొలగించినా మనం commit చేయవలసి ఉంటుంది అని గుర్తుంచుకోండి |
04:21 | staging area కు ఫైల్ ను జోడించడానికి git space add space story.html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
04:31 | మన పని commit చేయుట కొరకు git space commit space hyphen m space డబుల్ కోట్స్ లోపల “Added story.html in new-chapter branch” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
04:47 | "new-chapter" branch యొక్కGit log తనిఖీ కొరకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
04:57 | ఇక్కడ మనము , మన చివరి commit “Added story.html in new-chapter branch” ను చూడవచ్చు. |
05:04 | ఇప్పుడు మనము కొంత పని చేయడానికి మన master branch కి తిరిగి వెళ్ళాలి అనుకొందాం. |
05:10 | అందుకు మనము git space checkout space master అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
05:18 | Git log తనిఖీ కొరకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
05:27 | ఇక్కడ మనము “Added story.html in new-chapter branch”అనే commit ను చూడలేము. |
05:34 | ఇది ఎందుకంటే, ఈ commit "new-chapter" branch కు మాత్రమే చెందినది. |
05:39 | ఫోల్డర్ కంటెంట్ ను చెక్ చేయడానికి ls అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:45 | ఇక్కడ, మనము story.html ఫైల్ కూడా చూడలేము. |
05:49 | ఇప్పుడు, మనము history.html ఫైల్ లో కొన్ని మార్పులు చేద్దాము. |
05:55 | ఫైల్ ను తెరవటానికి gedit space history.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
06:05 | కొన్ని లైన్ లను జత చేయండి |
06:08 | Save చేసి ఫైల్ ను మూసివేయండి. |
06:10 | ఇక్కడ మన పనిని commit చేయడానికి git space commit space hyphen am space “Added chapter two in history.html” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
06:26 | ఇప్పటివరకు మనము master branch తో పని చేసాము. |
06:30 | ఇప్పుడు, ఈ commit , new-chapter branch లో ప్రతిబింబిస్తుందో లేదో చూద్దాం. |
06:36 | new-chapter branch కు వెళ్ళడానికి git space checkout space new-chapter అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
06:46 | Git log తనిఖీ కొరకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
06:55 | మనము master branch లో ఉన్నాము కనుక, ఇక్కడ మనము “Added chapter two in history.html” అనే commit ను చూడలేము |
07:04 | మన story.html ఫైల్ కు కొన్ని లైన్ లను జత చేయడానికి, gedit space story.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
07:16 | నేను నా Writer డాక్యుమెంట్ నుండి కొన్ని లైన్ లను జత చేస్తున్నాను. |
07:20 | ఫైల్ ను Save చేసి మూసివేయండి |
07:22 | Git status ను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
07:29 | మనము ఈ దశలో మన పనిని commit చేయలేదని గమనించండి. |
07:33 | మనము commit చేయకుండా branch కు మారడానికి ప్రయత్నించినట్లైతే ఏమి జరుగునని అనుకొంటున్నారు? అది ఒక error కి దారి తీస్తుంది. |
07:41 | master branch కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. git space checkout space master అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
07:51 | మార్పులను commitచేయకుండా మనము ఇతర branches కు మారలేమని ఈ error చూపిస్తుంది. |
07:59 | కానీ, ఈ దశలో మార్పులు ముఖ్యమైనవి కానందున నేను మార్పులను commit చేయకూడదనుకుంటే ఏమి చేయాలి? ఇది stashing ఉపయోగించి చేయవచ్చు. |
08:08 | Stashing గురించి మనము తరువాతి ట్యుటోరియల్ లో నేర్చుకుంటాము. |
08:13 | ఇప్పటికి మనము hyphen hyphen force flag ను ఉపయోగించి branch లోనుండి బలవంతంగా బయటకు వద్దాం. |
08:19 | git space checkout space hyphen hyphen force space master అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
08:28 | మరోసారి మనము మార్పులను విస్మరించామో లేదో తనిఖీ చేయడానికి new-chapter branch కు వెళ్దాం. |
08:36 | git space checkout space new-chapter అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
08:42 | story.html ఫైల్ ను తెరుచుటకు gedit space story.html space ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
08:54 | ఇక్కడ మనం మార్పులను విస్మరించినట్లు చూడవచ్చు.మనం gedit ని క్లోజ్ చేద్దాం |
09:01 | మనము తరువాత ట్యుటోరియల్ లో new-chapter branch ను master branch తో విలీనం చేయడం గురించి నేర్చుకొంటాము. |
09:07 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
09:11 | ఈ ట్యుటోరియల్ లో మనము branch ను క్రియేట్ చేసే Branching గురించి మరియు new branch , master branch ల మధ్య తేడాల గురించి తెలుసుకున్నాము. |
09:23 | అస్సైన్మెంట్ గా "chapter-two" పేరుతో ఒక branch ను సృష్టించండి. |
09:28 | chapter-two branch కువెళ్ళండి. |
09:31 | కొన్ని commits చేయండి. |
09:33 | master branchకి తిరిగి వెళ్ళండి. |
09:36 | Git log ను తనిఖీ చేయడం ద్వారా , master branch లో "branch chapter-two" యొక్క commits ను మీరు చూడలేరు అని అర్ధంచేసుకొనండి. |
09:44 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది . దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
09:52 | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:59 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి |
10:03 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
10:15 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు |