Difference between revisions of "Jmol-Application/C3/Structures-from-Database/Telugu"
From Script | Spoken-Tutorial
Line 338: | Line 338: | ||
|- | |- | ||
|08:57 | |08:57 | ||
− | | | + | |ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది స్వామి, మరియు నేను ఉదయలక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదములు. |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 03:55, 13 March 2019
Time | Narration |
00:01 | Jmol లో Structures from Database పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము, |
00:10 | PubChem డేటాబేస్ నుండి రసాయన నిర్మాణాలు Load చేయడం మరియు |
00:14 | Jmol లో GChemPaint లో డ్రా అయిన 2D నిర్మాణాలను 3D నమూనాలు గా మార్చడం నేర్చుకుంటాము. |
00:21 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Jmol Application window గురించి తెలిసి ఉండాలి. |
00:27 | లేకపోతే, మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న ట్యుటోరియల్స్ చూడండి. |
00:33 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు, నేను |
00:35 | ఉబుంటు OS వర్షన్ 12.04 |
00:40 | Jmol వర్షన్ 12.2.2 |
00:44 | Java వర్షన్ 7 |
00:46 | GChemPaint వర్షన్ 0.12.10 |
00:51 | Mozilla Firefox browser 22.0 ను ఉపయోగిస్తున్నాను. |
00:56 | నేను ఒక క్రొత్త Jmol Application విండోని తెరిచాను. |
01:00 | Jmol, ఒక డేటాబేస్ లో జాబితా చేయబడిన కంపోనెంట్స్ యొక్క structures లను load చేయగల ఒక లక్షణాన్ని కలిగి ఉంది. |
01:07 | మెనూ బార్లో File మెను, Get MOL అనే ఒక ఎంపికను కలిగి ఉంది. |
01:12 | ఇది రసాయన నిర్మాణం డేటాబేస్ అయిన PubChem నుండి అణువులను లోడ్ చేస్తుంది. |
01:17 | ఇది Protein Data Bank నుండి protein నిర్మాణాలను లోడ్ చేయడానికి మరొక ఎంపిక Get PDB ను కలిగి ఉన్నది. |
01:26 | ఈ ఫీచర్ మరొక ట్యుటోరియల్ లో వివరంగా వివరించబడుతుంది. |
01:31 | ప్యానెల్ పై ఒక రసాయన నిర్మాణం, load చేయుటకు Get Mol పై క్లిక్ చేయండి. |
01:36 | screen పై Input డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
01:40 | డేటాబేస్లో జాబితా చేయబడిన ఏదైనా అణువును, టెక్స్ట్ బాక్స్లో కింది విధంగా టైప్ చేయడం ద్వారా లోడ్ చేయవచ్చు: |
01:48 | సాధారణ పేరు లేదా IUPAC name, |
01:51 | CAS number, |
01:54 | CID number, |
01:56 | InChi identifier లేదా |
01:58 | SMILES identifier. |
02:01 | దయచేసి ఒక ప్రత్యేక రసాయనం యొక్క గుర్తింపు సంఖ్యలపై సమాచారం కోసం Pubchem డేటాబేస్ వెబ్సైట్ ను సందర్శించండి. |
02:09 | స్క్రీన్ పై phenol ను ప్రదర్శిద్దాం. |
02:13 | కాబట్టి, Input టెక్స్ట్-బాక్స్ లో phenol అని టైప్ చేయండి. |
02:16 | OK బటన్ పై క్లిక్ చేయండి. |
02:20 | ఫినాల్ యొక్క నమూనా ప్యానెల్లో ప్రదర్శించబడుతుంది. |
02:24 | వివిధ రకాల రెండరింగ్ ఎంపికలు ఉపయోగించి, phenol యొక్క ప్రదర్శనను మనము మార్చవచ్చు. |
02:30 | ఈ ఎంపికలు మెనూ బార్ మరియు పాప్-అప్ మెనులో ఇవ్వబడ్డాయి. |
02:36 | మనము ఫినాల్ యొక్క benzene ring కు ప్రత్యామ్నాయాలను జోడించవచ్చు. |
02:41 | ముందుగా, మనము model లోని అణువులకు లేబుల్ ఇద్దాం. |
02:45 | Display మెనుపై క్లిక్ చేసి, Label ఎంచుకోండి. Number ఎంపికపై క్లిక్ చేయండి. |
02:52 | ఇప్పుడు నెంబర్ 4 వద్ద ఉన్న carbon కు జోడించబడి ఉన్న నెంబర్ 10 వద్ద hydrogen ను amino group తో బదలీ చేద్దాం. |
03:00 | modelkit మెనుని తెరచి, ఎంపికల జాబితా నుండి nitrogen ను ఎంచుకోండి. |
03:06 | నెంబర్ 10 hydrogen పై క్లిక్ చేయండి. |
03:09 | ఇది panel పై Para-Amino Phenol యొక్క మరొక అణువు. |
03:14 | మనం డిస్ప్లేను Sticks display గా మారుస్తాము. |
03:18 | modelkit మెనూ నుండి నిష్క్రమించండి. |
03:21 | పాప్-అప్ మెనుని తెరిచి, Style వరకు స్క్రోల్ చేసి, Scheme ఎంచుకుని Sticks ఎంపికల పై క్లిక్ చేయండి. |
03:30 | ప్యానెల్ పై, మనం sticks display లో Para-Amino-phenol యొక్క నమూనాను కలిగి ఉన్నాము. |
03:36 | సృష్టించడానికి కష్టం అయిన సంక్లిష్ట నిర్మాణాలు, ప్యానెల్ లో సులభంగా లోడ్ చేయవచ్చు. |
03:42 | ఉదాహరణకు: cholesterol. |
03:45 | File మెనూ పై క్లిక్ చేయండి. |
03:47 | Get Mol ఎంపికపై క్లిక్ చేయండి. టెక్స్ట్ బాక్స్లో, Cholesterol అని టైప్ చేయండి. |
03:54 | OK బటన్ పై క్లిక్ చేయండి. |
03:57 | Cholesterol యొక్క అణువు ప్యానెల్లో ప్రదర్శించబడుతుంది. |
04:02 | మనం మొలిక్యూల్ లో double-bond మరియు side-chain వంటి లక్షణాలను హైలైట్ చేయవచ్చు. |
04:08 | ద్వి-బంధాన్ని హైలైట్ చేయడానికి, మనం మొదట ద్వి-బంధం యొక్క carbon అణువుల రంగును మార్చుదాం. |
04:15 | సాధన పట్టీలో Select atoms ఐకాన్ పై క్లిక్ చేయండి. |
04:19 | తరువాత ద్వి-బంధం లో ఉన్న carbon అణువులపై క్లిక్ చేయండి. |
04:24 | అణువుల చుట్టూ ఒక పసుపు వలయం కనిపిస్తుంది. |
04:28 | పాప్-అప్-మెనుని తెరవండి. |
04:30 | Color వద్దకు స్క్రోల్ చేసి, Atoms ఎంచుకుని, Orange ఎంపికపై క్లిక్ చేయండి. |
04:37 | ఇప్పుడు టూల్బార్ లోని Rotate molecule ఎంపికపై క్లిక్ చేయండి. |
04:42 | Cholesterol నమూనా లోని ద్వి-బంధం నారింజ రంగులో ఉంది. |
04:49 | అదేవిధంగా, మనము సైడ్-చైన్ లో గల carbons ను హైలైట్ చేయవచ్చు. |
04:54 | పాప్-అప్ మెనుని ఉపయోగించి, రంగును ఉదారంగుగా మార్చండి. |
04:59 | ప్యానెల్ పై, Cholesterol యొక్క మోడల్ ముఖ్యమైన లక్షణాలతో హైలైట్ చేయబడింది. |
05:06 | ఒక అసైన్మెంట్ గా, |
05:08 | Pubchem డేటాబేస్ నుండి caffeine నిర్మాణంను Load చేయండి. |
05:11 | అణువులోని ముఖ్య లక్షణాలను హైలైట్ చేయండి. |
05:15 | ప్రదర్శనను wireframe గా మార్చండి. |
05:19 | ఇప్పుడు నేను Jmol యొక్క మరొక ముఖ్యమైన లక్షణం గురించి చర్చిస్తాను. |
05:24 | మనము ఏదైనా సాఫ్ట్వేర్ లో డ్రా అయిన, 2D structures అణువులను, 3D models గా మార్చగలము. |
05:31 | నా వద్ద ఇక్కడ, ప్యానెల్లో amino acid Alanine యొక్క నమూనా ఉంది. |
05:36 | ఈ అణువు యొక్క 2D structure GChemPaint అని పిలువబడే ఒక software లో చిత్రీకరించబడింది. |
05:42 | నిర్మాణం .mol ఫైల్ గా సేవ్ చేయబడింది. |
05:46 | GchemPaint అనేది 2D రసాయన నిర్మాణాలను గీయడానికి ఉపయోగపడు ఒక Open source software. |
05:51 | GChemPaint పై ట్యుటోరియల్స్ ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్నాయి. |
05:56 | స్ట్రక్చర్లను చిత్రీకరించి, మరియు .mol ఫార్మాట్ లో సేవ్ చేయడానికి Analysis of Compounds ట్యుటోరియల్ ను చూడండి. |
06:05 | ఈ Gchempaint ప్రదర్శన ప్రదేశంలో చూపబడినది, |
06:10 | Amino acid -Alanine |
06:12 | Nuclioside -Adenosine మరియు |
06:14 | Saccharide -Alpha-D glucopyranose యొక్క 2D చిత్రాలు. |
06:19 | నేను వాటిని నా Desktop. లో .mol ఫార్మాట్ లో సేవ్ చేసాను. |
06:24 | ముందుగా Alanine యొక్క 2D ఆకృతిని Jmol అప్లికేషన్ లో, 3D నమూనాగా చూద్దాం. |
06:32 | కాబట్టి, నేను ఒక క్రొత్త Jmol విండోని తెరుస్తాను. |
06:36 | టూల్బార్లో Open a file ఐకాన్ పై క్లిక్ చేయండి. |
06:40 | నేను Desktop ఫోల్డర్ ను ఎంచుకుని, Open పై క్లిక్ చేస్తా. Alanine.mol ఫైల్ ను ఎంచుకొని, Open బటన్ పై క్లిక్ చేయండి. |
06:51 | తెరపై, Alanine యొక్క 3D model తెరుచుకుంటుంది. |
06:55 | modelkit మెనూని తెరచి, fix hydrogens and minimize ఐచ్ఛికం పై క్లిక్ చేయండి. |
07:03 | Hydrogens నిర్మాణంకు జోడించబడతాయి మరియు శక్తి తగ్గిపోతుంది. |
07:08 | ఏదైనా .mol ఫైల్ తో, మనము మెనూ బార్ ను మరియు పాప్-అప్ మెనూ ను కూడా ఉపయోగించి ప్రదర్శనను మార్చవచ్చు. |
07:15 | ఇది Jmol. లో Adenosine.mol యొక్క 3D నమూనా మరియు |
07:19 | ఇది Jmol. లో Alpha-D-glucopyranose.mol యొక్క 3D నమూనా. |
07:25 | సారాంశం చూద్దాం. |
07:27 | ఈ ట్యుటోరియల్ లో మనము |
07:32 | PubChem డేటాబేస్ నుండి రసాయన నిర్మాణాలు Load చేయడం, |
07:34 | Phenol మరియు Cholesterol ల యొక్క ప్రదర్శనను సవరించడం, |
07:38 | Jmol లో GChemPaint లో డ్రా అయిన 2D నిర్మాణాలను 3D నమూనాలు గా మార్చడం |
07:44 | Alanine, Adenosine మరియు Alpha-D-glucopyranose ల యొక్ 2-D నిర్మాణాలను 3-D నమూనాలకు మార్చడం నేర్చుకున్నాము: |
07:53 | ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్, |
07:56 | GChemPaint లో ఈ క్రింది Amino acids యొక్క 2D నిర్మాణాలు గీయండి. |
08:01 | Cysteine |
08:03 | Histidine Phenylalanine |
08:06 | .mol గా ఫైళ్ళన సేవ్ చేయండి. |
08:09 | Jmol లో ఫైళ్ళను తెరచి ప్రదర్శనని మార్చండి. |
08:12 | ఈ URL లో అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
08:16 | ఈ వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ సారాంశాన్ని ఇస్తుంది. |
08:19 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
08:23 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్: |
08:26 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
08:29 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
08:33 | దయచేసి మమ్మల్ని సంప్రదించండి. contact@spoken-tutorial.org |
08:40 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
08:45 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు భారతదేశం ప్రభుత్వం యొక్క NMEICT-MHRD నిధులు సమకూరుస్తుంది. |
08:52 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro. |
08:57 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది స్వామి, మరియు నేను ఉదయలక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదములు. |