Ubuntu-Linux-on-Virtual-Box/C2/Installing-VirtualBox-on-Ubuntu-Linux-OS/Telugu
From Script | Spoken-Tutorial
|
|
00:01 | Installing VirtualBox on Ubuntu Linux OS అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ లో మనము Ubuntu Linux 16.04 Operating System పై VirtualBox ని ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంటాం. |
00:18 | ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, Ubuntu Linux 16.04 OS, |
00:25 | VirtualBox వర్షన్ 5.2, |
00:29 | gedit text editor ను ఉపయోగిస్తున్నాను. |
00:32 | ఏమైనా, మీరు మీకు నచ్చిన ఏ ఇతర text editor ని అయినా ఉపయోగించవచ్చు. |
00:37 | మనం ప్రారంభించడానికి ముందు, మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉన్నారని నిర్దారించుకోండి. |
00:43 | VirtualBox అంటే ఏమిటి? VirtualBox అనేది Virtualization కొరకు ఒక ఉచిత మరియు open source software. |
00:50 | ఇది బేస్ మెషిన్ అనగా (హోస్ట్) లో మనం బహుళ OS లను ఇన్స్టాల్ చేసి, ఉపయోగించడానికి అనుమతిస్తుంది. |
00:57 | బేస్ మెషిన్ లో విండోస్, లినక్స్ లేదా MacOS ఏదయినా వుండవచ్చు. |
01:03 | VirtualBox లోపల OS ని ఇన్స్టాల్ చేయడానికి, బేస్ మెషిన్ ఈ కింది ఆకృతీకరణను కలిగివుండాలి. |
01:11 | i3 ప్రాసెసర్ లేదా అంతకంటే ఎక్కువ, |
01:14 | RAM 4GB లేదా అంతకంటే ఎక్కువ, |
01:17 | హార్డ్ డిస్క్ ఖాళీ స్థలం 50GB లేదా అంతకంటే ఎక్కువ మరియు |
01:22 | BIOS లో Virtualization ఎనేబుల్ చేయబడివుండాలి. |
01:27 | ఇది VirtualBox సజావుగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది. |
01:32 | ఒకవేళ బేస్ మెషిన్ Ubuntu Linux OS ని కలిగి ఉన్నట్లయితే, అది తప్పకుండా ఈ కింది వర్షన్స్ లో ఎదో ఒకటి అయివుండాలి. |
01:40 | Ubuntu Linux 14.04, Ubuntu Linux 16.04 లేదా Ubuntu Linux 18.04. |
01:50 | ఇన్స్టాలేషన్ ను ప్రారంభిద్దాం. |
01:53 | ఈ ట్యుటోరియల్ లో ఉపయోగించిన కమాండ్లు, ప్లేయర్ కు దిగువన ఉన్న కోడ్ ఫైల్స్ లింక్ లో అందుబాటులో ఉన్నాయి. |
02:00 | నా మెషిన్ లో నేను ఈ ఫైల్ ను gedit text editor లో తెరిచాను. |
02:05 | ప్రదర్శన సమయంలో కమాండ్లను కాపీ పేస్ట్ చేయడానికి నేను అదే ఫైల్ ను ఉపయోగిస్తాను. |
02:11 | ముఖ్యమైన గమనిక: VirtualBox ను ఇన్స్టాల్ చేయడానికి ముందు, మన మెషిన్ పై Virtualization ఎనేబుల్ చేయబడింది అని నిర్దారించుకోవాలి. |
02:21 | Virtualization ఎనేబుల్ అయిందా లేదా అనేది సరిచూసుకుందాం. |
02:26 | మీ కీబోర్డ్ పై Ctrl, Alt మరియు T కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా టెర్మినల్ ను తెరవండి. |
02:35 | కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి, టెర్మినల్ పై పేస్ట్ చేయండి. అమలు చేయడానికి ఎంటర్ నొక్కండి. |
02:43 | ఒకవేళ ఔట్పుట్ లో vmx flags అయినట్లయితే, ఈ కంప్యూటర్ పై Virtualization ఎనేబుల్ చేయబడినట్లు. |
02:50 | ఒకవేళ ఇది ఎనేబుల్ చేయబడకపోతే, BIOS సెట్టింగ్స్ లో దానిని ఎనేబుల్ చేయండి. |
02:55 | BIOS సెట్టింగ్స్ కంప్యూటర్ నుండి కంప్యూటర్ కు మారుతూ ఉంటాయి కనుక, దాని డెమోని చూపించలేము. |
03:02 | ఒకవేళ మీరు ఒక సాంకేతిక వ్యక్తి కాకపోతే, దయచేసి దీన్ని సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సహాయంతో చేయండి. |
03:09 | ఒకవేళ BIOS లో Virtualization ఎంపిక లేకపోతే, ఆ మెషిన్ లో మనం VirtualBox ను ఇన్స్టాల్ చేయలేము. |
03:17 | నా కేస్ లో ఇది ఇప్పటికే ఎనేబుల్ చేయబడిఉంది. |
03:21 | మొదట, క్రింది కమాండ్ యొక్క సహాయంతో బేస్ మెషిన్ ను అప్ డేట్ చేద్దాం |
03:27 | దాని కొరకు, టెర్మినల్ పై, sudo <space> apt-get <space> update అని టైప్ చేయండి. తరువాత ఎంటర్ నొక్కండి. |
03:38 | మీరు మీ system password ను ఎంటర్ చేయమని ప్రాంప్ట్ చేయబడవచ్చు. పాస్ వర్డ్ ని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:46 | ఇప్పటి నుండి, ఈ ఇన్స్టాలేషన్ సమయంలో ప్రాంప్ట్ చేయబడినపుడల్లా system password ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:55 | తరువాత VirtualBox ను ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు మనం Ubuntu source list కు VirtualBox repository ని జోడించాలి. |
04:04 | ఆలా చేయడానికి, ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి తరువాత ఎంటర్ నొక్కండి. |
04:11 | ఆపై apt source కు VirtualBox repository key ను జోడించాలి. |
04:17 | ఆలా చేయడానికి, ఈ రెండు కమాండ్స్ ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి, టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:32 | ఇప్పుడు, మనం repository list ను అప్ డేట్ చేయాలి. |
04:36 | దాని కొరకు, టెర్మినల్ పై sudo <space> apt-get <space> update అని టైప్ చేసి, ఎంటర్ నొక్కాలి. |
04:50 | తరువాత sudo space apt-get space install space virtualbox-5.2 అని టైప్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి. |
05:04 | టెర్మినల్ ఇన్స్టాల్ చేయవలసిన ప్యాకేజెస్ యొక్క జాబితాను ప్రదర్శిస్తుంది. |
05:09 | ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేయవలసిన file size మరియు ఇన్స్టాలేషన్ తరువాత disk space వాడుక. |
05:17 | Do you want to continue? అని అడిగినపుడు Y అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:23 | మీ ఇంటర్నెట్ వేగంపై ఆధారపడి ఇన్స్టాలేషన్ కొంత సమయం తీసుకుంటుంది. |
05:31 | ఇన్స్టాలేషన్ ఇపుడు పూర్తయింది. |
05:34 | ఇప్పుడు, Dash home కి వెళ్ళి search bar లో Virtualbox ని టైప్ చేయండి. |
05:42 | Oracle VM VirtualBox ఐకాన్ పై డబల్- క్లిక్ చేయండి. |
05:47 | VirtualBox అప్లికేషన్ తెరుచుకుంటుంది. ఇది ఇన్స్టలేషన్ విజయవంతమైందని సూచిస్తుంది. |
05:54 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం. |
05:59 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి: Virtualization ఎనేబుల్ చేయబడిందా లేదా అని చెక్ చేయడం మరియు Ubuntu Linux 16.04 OS లో VirtualBox ను ఇన్స్టాల్ చేయడం. |
06:11 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
06:19 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. |
06:27 | మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
06:31 | దయచేసి ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
06:35 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
06:47 | ఈ ట్యుటోరియల్ కొరకు స్క్రిప్ట్ మరియు వీడియో NVLI మరియు స్పోకన్ ట్యుటోరియల్ టీం చే అందించబడ్డాయి. నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |