Ubuntu-Linux-on-Virtual-Box/C2/Installing-VirtualBox-in-Windows-OS/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 Windows Operating System లో Installing VirtualBox అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనము VirtualBox ని ఎలా డౌన్లోడ్ చేయాలి మరియు Windows OS పై దానిని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుంటాము.
00:18 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, Windows OS వర్షన్ 10,
00:24 VirtualBox వర్షన్ 5.2.18,
00:29 Firefox వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను.
00:32 ఏమైనా, మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
00:38 మనం ప్రారంభించడానికి ముందు, మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉన్నారని నిర్దారించుకోండి.
00:44 VirtualBox అంటే ఏమిటి? VirtualBox అనేది Virtualization కొరకు ఒక ఉచిత మరియు open source software.
00:52 ఇది మనకు బేస్ మెషిన్ అనగా (హోస్ట్) లో బహుళ OSలను ఇన్స్టాల్ చేసి, ఉపయోగించడానికి అనుమతిస్తుంది.
01:00 బేస్ మెషిన్ లో విడోస్, లినక్స్ లేదా MacOS ఏదయినా వుండవచ్చు.
01:07 VirtualBox లోపల OS ని ఇన్స్టాల్ చేయడానికి, బేస్ మెషిన్ ఈ కింది ఆకృతీకరణను కలిగివుండాలి.
01:15 i3 ప్రాసెసర్ లేదా అంతకంటే ఎక్కువ,
01:19 RAM 4GB లేదా అంతకంటే ఎక్కువ,
01:23 హార్డ్ డిస్క్ ఖాళీ స్థలం 50GB లేదా అంతకంటే ఎక్కువ మరియు BIOS లో Virtualization ఎనేబుల్ చేయబడివుండాలి.
01:34 ఇది VirtualBox సజావుగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది.
01:40 ఒకవేళ బేస్ మెషిన్ Windows OS ని కలిగి ఉన్నట్లయితే, అపుడు అది తప్పకుండా ఈ కింది వర్షన్స్ లో ఎదో ఒకటి అయివుండాలి.
01:47 Windows 7,
01:49 Windows 8 లేదా Windows 10.
01:53 ఇన్స్టాలేషన్ ను ప్రారంభిద్దాం.
01:56 VirtualBox యొక్క తాజా సంస్కరణను డౌన్లోడ్ చేయడానికి, వెబ్ బ్రౌజర్లో క్రింది లింకుకు వెళ్ళండి. www dot virtualbox dot org slash wiki slash Downloads
02:14 నేను ఇప్పటికే నా మెషిన్ పై Firefox వెబ్ బ్రౌజర్ లో ఈ url ను తెరిచాను.
02:21 బహుళ హోస్ట్ ల కోసం VirtualBox యొక్క తాజా సంస్కరణను డౌన్లోడ్ చేయడానికి, ఈ పేజీ లింక్ ని ప్రదర్శిస్తుంది.
02:30 ఈ రికార్డింగ్ చేసే సమయంలో, VirtualBox యొక్క తాజా సంస్కరణ 5.2.18.
02:39 భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా ఈ ట్యుటోరియల్ని చూసినప్పుడు ఇది భిన్నంగా ఉండవచ్చు.
02:44 ఇప్పుడు Windows hosts లింక్ పై క్లిక్ చేయండి.
02:48 ఇది విండోస్ OS కోసం VirtualBox ను డౌన్ లోడ్ చేస్తుంది.
02:53 మీ ఇంటర్నెట్ వేగం ఆధారంగా డౌన్లోడ్కి కొంత సమయం పట్టవచ్చు.
02:58 ముఖ్యమైన గమనిక: VirtualBox ను ఇన్స్టాల్ చేయడానికి ముందు, మన మెషిన్ పై Virtualization ఎనేబుల్ చేయబడింది అని మనం నిర్దారించుకోవాలి.
03:08 Windows 8 లేదా 10 మెషిన్ లో Virtualization ఎనేబుల్ అయిందా లేదా అనేది సరిచూసుకుందాం.
03:16 విండో యొక్క దిగువ ఎడమన ఉన్న Taskbar కు వెళ్ళండి. దాని పై రైట్ క్లిక్ చేసి Task Managerని ఎంచుకోండి.
03:25 Task Manager విండో తెరుచుకుంటుంది.
03:29 ఒకవేళ మీరు దీన్ని మొదటిసారిగా తెరుస్తున్నట్లయితే, ఈ విండో దిగువభాగం వద్ద ఉన్న More details పై క్లిక్ చేయండి. తరువాత Performance ట్యాబ్ పై క్లిక్ చేయండి.
03:40 Performance ట్యాబ్ లో దిగువ కుడి వైపు Virtualization ను గుర్తించండి.
03:46 ఇది మన మెషిన్ లో Virtualization ఎనేబుల్ చెయ్యబడిందా లేదా అనేది మనకు చేప్తుంది.
03:53 ఒకవేళ ఇది ఎనేబుల్ చేయబడకపోతే, దయచేసి BIOS సెట్టింగ్స్ లో దానిని ఎనేబుల్ చేయండి.
03:59 BIOS సెట్టింగ్స్ కంప్యూటర్ నుండి కంప్యూటర్ కు మారుతూ ఉంటాయి కనుక, దాని డెమోని చూపించలేము.
04:06 ఒకవేళ మీరు ఒక సాంకేతిక వ్యక్తి కాకపోతే, దయచేసి దీన్ని సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సహాయంతో చేయండి.
04:13 ఒకవేళ BIOS లో Virtualization ఎంపిక అందుబాటులో లేకపోతే, ఆ మెషిన్ లో మనం VirtualBox ను ఇన్స్టాల్ చేయలేము.
04:22 నా కేస్ లో ఇది ఇప్పటికే ఎనేబుల్ చేయబడింది.
04:26 ఇప్పుడు, కుడి ఎగువ మూలలో ఉన్న x ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా టాస్క్ బార్ని మూసివేయండి.
04:33 ఇప్పుడు VirtualBox ను ఇన్స్టాల్ చేద్దాము.
04:37 మనము VirtualBox.exe ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకున్న ఫోల్డర్ కు వెళ్దాం.
04:43 ఫైల్ పై రైట్-క్లిక్ చేసి, Run as Administratorను ఎంచుకోండి.
04:49 కనిపించే User Account Control డైలాగ్ బాక్స్ లో Yes క్లిక్ చేయండి.
04:56 Oracle VM VirtualBox 5.2.18 సెటప్ విండో ఒక స్వాగత సందేశముతో కనిపిస్తుంది.
05:06 ముందుకు సాగటానికి విండో యొక్క దిగువన ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
05:12 తరువాతి స్క్రీన్ Custom Setup.
05:16 ఒకవేళ ఇన్స్టాలేషన్ యొక్క స్థానాన్ని మార్చాలి అనుకుంటే, మనము అలా చేయవచ్చు.
05:22 Browse బటన్ పై క్లిక్ చేసి, ఆపై ఇన్స్టాలేషన్ కోసం కావలసిన స్థానాన్ని ఎంచుకోండి.
05:29 నేను దీన్ని డిఫాల్ట్ స్థానంలో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను, కనుక నేను దీన్ని వదిలివేస్తాను.
05:35 కొనసాగడానికి విండో యొక్క దిగువన ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
05:40 తరువాతి Custom Setup స్క్రీన్ లో, మన అవసరానికి తగినట్టు మనం కొన్ని ఫీచర్స్ ను ఎంచుకోవచ్చు. అప్రమేయంగా, అన్ని ఎంపికలు ఎంచుకోబడతాయి.
05:52 విండో యొక్క దిగువన ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
05:56 తరువాతి విండో Network గురించి కొంత హెచ్చరిక సందేశాన్ని చూపిస్తుంది.
06:01 ఈ సందేశం ఇన్స్టాలేషన్ సమయంలో ఇంటర్నెట్ తాత్కాలికంగా డిస్కనెక్ట్ చేయబడుతుంది అని చెప్తుంది.
06:09 విండో యొక్క దిగువన ఉన్న Yes బటన్ పై క్లిక్ చేయండి.
06:13 ఇప్పుడు మనం Ready to Install స్క్రీన్ కు మళ్ళించబడుతున్నాము.
06:18 ఇన్స్టాలేషన్ ను ప్రారంభించడానికి Install బటన్ పై క్లిక్ చేయండి.
06:22 ఈ ఇన్స్టాలేషన్ కొంత సమయం తీసుకుంటుంది.
06:25 మీరు Windows Security అనే పేరుతో ఒక పాప్-అప్ విండోని చూడవచ్చు.
06:30 ఇది మీరు ఈ సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. Install బటన్ పై క్లిక్ చేయండి.
06:39 ఒకసారి పూర్తయిన తరువాత, Oracle VM VirtualBox installation is complete అనే సందేశాన్ని చూడవచ్చు.
06:47 ఈ స్క్రీన్ లో Start Oracle VM VirtualBox after installation అనే ఎంపిక ఉంది. అప్రమేయంగా, అది ఎంచుకోబడుతుంది.
06:58 నేను VM ను వెంటనే ప్రారంభించదలచుకోలేదు, కనుక దాని ఎంపికను తీసివేస్తాను.
07:03 చివరగా, Finish బటన్ పై క్లిక్ చేయండి.
07:08 ఇప్పుడు, Desktop పై, VirtualBox కొరకు shortcut ఐకాన్ ను మనం చూడవచ్చు.
07:16 అప్లికేషన్ ను లాంచ్ చెయ్యడానికి VirtualBox ఐకాన్ పై డబల్- క్లిక్ చేయండి.
07:21 VirtualBox అప్లికేషన్ తెరుచుకుంటుంది. ఇది ఇన్స్టలేషన్ విజయవంతమైందని సూచిస్తుంది.
07:28 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం.
07:34 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి: Virtualization ఎనేబుల్ చేయబడిందా లేదా అని చెక్ చేయడం మరియు
07:41 Windows 10 మెషిన్ లో VirtualBox ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడం.
07:46 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
07:54 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
08:02 మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
08:06 మీరు ఈ స్పోకన్ ట్యుటోరియల్ పై ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా? దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.
08:12 మీకు ఎక్కడైతే సందేహం ఉందో ఆ నిమిషం మరియు ఆ క్షణంని ఎంచుకోండి. మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం నుండి ఎవరో ఒకరు వాటికీ సమాధానాలు ఇస్తారు.
08:23 ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్ ఉంది.
08:29 దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు.
08:34 ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు.
08:43 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
08:55 ఈ ట్యుటోరియల్ కొరకు స్క్రిప్ట్ మరియు వీడియో NVLI మరియు స్పోకన్ ట్యుటోరియల్ టీం చే అందించబడ్డాయి. నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey, Simhadriudaya