Ubuntu-Linux-on-Virtual-Box/C2/Installing-Ubuntu-Linux-OS-in-a-VirtualBox/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 ఒక VirtualBox లో Ubuntu Linux OS ని ఇన్స్టాల్ చేసే, spoken tutorial కు స్వాగతం
00:08 ఈ ట్యుటోరియల్ లో మనము Windows base machine పై VirtualBox లో Ubuntu Linux 16.04 ను ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుంటాము.
00:18 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, Windows OS వర్షన్ 10,
00:23 VirtualBox వర్షన్ 5.2.18,
00:27 Ubuntu Linux 16.04 OS ను ఉపయోగిస్తున్నాను.
00:31 మనం ప్రారంభించడానికి ముందు, మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉన్నారని నిర్దారించుకోండి.
00:36 VirtualBox లోపల OS ని ఇన్స్టాల్ చేయడానికి, బేస్ మెషిన్ ఈ కింది ఆకృతీకరణను కలిగివుండాలి.
00:43 i3 ప్రాసెసర్ లేదా అంతకంటే ఎక్కువ,
00:46 RAM 4GB లేదా అంతకంటే ఎక్కువ,
00:49 హార్డ్ డిస్క్ ఖాళీ స్థలం 50GB లేదా అంతకంటే ఎక్కువ మరియు
00:54 BIOS లో Virtualization ఎనేబుల్ చేయబడివుండాలి.
00:58 ఇది VirtualBox సజావుగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది.
01:03 మనం ఇన్స్టాల్ ప్రారంభించడానికి ముందు, సిస్టమ్ టైప్ 32-bit లేదా 64-bit అనేది చెక్ చేయండి.
01:12 ఆలా చేయడానికి, Start మెనూ పక్కన ఉన్న సెర్చ్ బాక్స్ కి వెళ్ళి About your PC అని టైప్ చేయండి.
01:22 About your PC ని ఎంచుకోండి.
01:25 System type కింద, మనం నడుపుతున్న windows యొక్క వర్షన్ 32-bit లేదా 64-bit అనేది మనం చూడవచ్చు
01:34 ఇక్కడ, నా కేస్ లో ఇది 64-bit Windows.
01:39 మీ సిస్టమ్ టైప్ ఆధారంగా దానికి సరిపోయే Ubuntu Linux 16.04 ISO ను ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేయండి.

http colon double slash releases dot ubuntu dot com slash 16.04

01:59 32-bit కొరకు అయితే ఇది:

ubuntu hyphen 16.04.5 hyphen desktop hyphen i386 dot iso

02:12 64-bit కొరకు అయితే ఇది:

ubuntu hyphen 16.04.5 hyphen desktop hyphen amd64 dot iso

02:26 ముందు చెప్పినట్లుగా, నా Windows System type 64-bit.
02:31 అందువల్ల, ఈ ప్రదర్శన కోసం నేను ubuntu hyphen 16.04.5 hyphen desktop hyphen amd64.iso file ను డౌన్లోడ్ చేశాను.
02:45 ముందుగా, మనం VirtualBox లోపల virtual machine ఎలా సృష్టించాలో నేర్చుకుంటాం
02:52 ప్రారంభించడానికి Desktop పైన VirtualBox ఐకాన్ పై double-click చేయండి.
02:59 VirtualBox విండో ఎగువభాగం వద్ద నీలం రంగు New ఐకాన్ ను కనుగొని, దానిపై క్లిక్ చేయండి
03:06 తెరుచుకున్న Create Virtual Machine విండో లో మనం Name and Operating system పేజీని చూడవచ్చు.
03:14 Name టెక్స్ట్ బాక్స్ కింద, మీరు ఇవ్వాలనుకునే పేరును టైప్ చేయండి.

నేను Ubuntu అని టైప్ చేస్తాను.

03:22 తరువాత డ్రాప్- డౌన్ కింద Type నుండి Linux ఎంచుకోండి.
03:27 డ్రాప్- డౌన్ వర్షన్ నుండి నేను Ubuntu (64-bit) ను ఎంచుకుంటాను
03:33 ఒకవేళ మీ base machine 32-bit అయితే, అప్పుడు మీరు డ్రాప్- డౌన్ నుండి Ubuntu (32-bit) ను ఎంచుకోండి.
03:40 విండో దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
03:44 తరువాత పేజీ Memory size.

ఇక్కడ, మనం virtual machine కోసం RAM యొక్క సైజ్ ను కేటాయిస్తాము.

03:52 RAM కొరకు సైజ్ ను కేటాయించడానికి slider లేదా text-box ను ఉపయోగించండి.
03:58 యూనిట్ MB లో ఉంది కనుక, నేను text-box లో 4048 అని టైప్ చేస్తాను
04:05 ఇది ఈ virtual machine కు 4GB RAM ను కేటాయిస్తుంది.
04:11 ఒకవేళ base machine యొక్క system memory 4GB అయితే, అపుడు virtual machine కొరకు 2GB ని కేటాయిచండి.
04:19 ఇపుడు, window యొక్క దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
04:24 Hard disk పేజిపైన, మనం virtual hard disk యొక్క ఏ రకాన్ని ఉపయోగించబోతున్నామో నిర్ణయించుకోవాలి.
04:32 నేను ఒక కొత్త virtual machine ను సృష్టిస్తున్నాను, కనుక నేను Create a virtual hard disk now ను ఎంచుకుంటాను.
04:39 ఈ ఎంపిక మీకోసం ఇప్పటికే default చేత ఎంచుకోబడిఉంటుంది.
04:44 దిగువభాగం వద్ద ఉన్న Create బటన్ పై క్లిక్ చేయండి
04:48 Hard disk file type లో VDI (Virtual Disk Image) ను ఎంచుకోండి.

ఇపుడు, window యొక్క దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.

04:59 తరువాత పేజీ Storage on physical hard disk లో, మన hard disk storage ఎలావుండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి.

ఇక్కడ రెండు ఎంపికలు ఉన్నాయి.

05:11 Dynamically allocated ఎంపిక, వినియోగం ఆధారంగా hard disk storage ను expand చేస్తుంది.
05:19 Fixed Size మనం నిర్ణయించిన సైజ్ ను కేటాయిస్తుంది.

Fixed size ఎంచుకుంటాను.

05:27 ఇప్పుడు కొనసాగటానికి Next బటన్ పై క్లిక్ చేయండి.
05:31 తరువాత పేజీ File location and size, ఇది hard disk size ను కేటాయించడానికి.
05:38 ఇక్కడ మీరు మనం ముందు ఇచ్చిన Ubuntu అనే పేరును చూడవచ్చు.
05:44 అలాగే, కుడివైపున folder ఐకాన్ ని చూడవచ్చు.
05:48 ఒకవేళ మీరు ఈ Virtual Disk Image ను వేరొక ప్రదేశంలో save చేయాలనుకుంటే, ఈ ఐకాన్ పై క్లిక్ చేసి ముందుకు సాగండి.

ఈ ప్రదర్శన కొరకు నేను ఈ భాగాన్ని వదిలివేస్తున్నాను.

06:02 తరువాత hard disk size ను కేటాయించడానికి స్లయిడర్ లేదా టెక్స్ట్ బాక్స్ ను ఉపయోగించండి.
06:09 సిఫారసు చేయబడిన సైజ్ 10GB కానీ దానిని నేను 20GB కు మార్చుతాను
06:16 తరువాత, దిగువభాగం వద్ద ఉన్న Create బటన్ పై క్లిక్ చేయండి
06:20 ఇది ఇంతవరకు మనం అందించిన వివరాలతో ఒక కొత్త Virtual Machine base ను సృష్టిస్తుంది.

ఇది సృష్టించడానికి కొంత సమయం తీసుకుంటుంది.

06:31 ఒకసారి Virtual Machine సృష్టించబడితే, ఎడమభాగం పై మనం దానిని చూడవచ్చు.
06:37 మనం ఇపుడే సృష్టించిన Virtual Machine, Ubuntu ఇక్కడ ఉంది.
06:42 ఇది మనం VM అనే Virtual Machine ను విజయవంతంగా సృష్టించామని సూచిస్తుంది.
06:49 తరువాత, దానిపై Ubuntu Linux 16.04 ను ఇన్స్టాల్ చేద్దాం.
06:55 అప్రమేయంగా, Virtual Machine, Power off మోడ్ లో ఉంటుంది.
07:00 Virtual Machine, Ubuntu ను ఎంచుకోండి.

తరువాత ఎగువభాగం వద్ద, పచ్చరంగు బాణంతో ఉన్న Start బటన్ పై క్లిక్ చేయండి.

07:09 ఒక కొత్త విండో పాప్ అప్ అయ్యి virtual optical disk లేదా ఒక physical optical drive ని ఎంచుకోమని మనల్ని అడుగుతుంది.

folder icon ను కనుగొని దానిపై క్లిక్ చేయండి.

07:22 ఇప్పుడు మనం ముందు డౌన్లోడ్ చేసిన ubuntu hyphen 16.04.5 hyphen desktop hyphen amd64.iso ఫైన్ ను బ్రౌజ్ చేసి దానిని ఎంచుకోండి.
07:37 దిగువభాగం వద్ద ఉన్న Open బటన్ పై క్లిక్ చేయండి.
07:41 ఇప్పుడు మనం వెనుకటి screen కి మళ్ళించబడుతున్నాము.

ఇప్పుడు ubuntu hyphen 16.04.5 hyphen desktop hyphen amd64.iso ఎంచుకోబడింది అని గమనించండి.

07:56 ఇన్స్టాలేషన్ ను ప్రారంభించడానికి దిగువభాగం వద్ద ఉన్న Start బటన్ పై క్లిక్ చేయండి.
08:02 Ubuntu Linux లోడ్ అవుతుంది అని మనం ఇక్కడ చూడవచ్చు.
08:07 మనం మొదట చూస్తున్న స్క్రీన్ మూడు ఎంపికలను కలిగిఉంది.
08:11 ఎడమవైపున మనం భాషల జాబితాను చూడవచ్చు.

మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.

08:18 అప్రమేయంగా, English ఎంచుకోబడింది నేను ఈ ఎంపికను అలాగే వదిలివేస్తాను.
08:25 మధ్యభాగం లో Try Ubuntu మరియు Install Ubuntu అనే రెండు ఎంపికలను మనంచూడవచ్చు.
08:31 ఒకవేళ మీరు Ubuntu యొక్క లుక్ మరియు ఫీల్ ను ప్రయత్నించాలి అనుకుంటే ఇంస్టాల్ చేయడానికి ముందు Try Ubuntu పై క్లిక్ చేయండి.
08:38 లేదంటే, నేరుగా Install Ubuntu పై క్లిక్ చేయండి.

నేను Install Ubuntu ఎంపికపై క్లిక్ చేస్తాను.

08:47 తరువాత పేజీ రెండు ఎంపికలను చూపిస్తుంది.

Downloading update while installing Ubuntu మరియు, ఇన్స్టాలేషన్ సమయంలో ఏదో ఒక third-party softwareను ఇన్స్టాల్ చేయుట.

09:00 నేను వీటిని వదిలివేసి, దిగివభాగం వద్ద ఉన్న Continue బటన్ పై క్లిక్ చేస్తాను
09:05 మూడవ పేజీ Ubuntu Linux ఇన్స్టాలేషన్ సమయంలో ముఖ్యమైన దశలలో ఒకటి.

ఇక్కడ, మనం Ubuntu Linux ను ఎక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నామో నిర్ణయించుకోవాలి.

09:18 Something else.

ఒకవేళ మనం మనం మెషిన్ పై VirtualBox లేకుండా డైరెక్ట్ గా Ubuntu ను ఇన్స్టాల్ చేస్తే, ఇది ఒక మంచి ఎంపిక.

09:28 ఈ ఎంపికతో మనం మన base machine లో ఒక dual boot OS ను కలిగివుంటాము.
09:34 నేను VirtualBox పై పనిచేస్తున్నను కనుక, Erase disk and install Ubuntu ను ఎంచుకుంటాను.
09:41 ఈ ఎంపిక, మొత్తం Virtual hard disk ని ఎరేస్ చేసి, Ubuntu OS ను ఒకే విభజన గా ఇనస్టాల్ చేస్తుంది.
09:49 తరువాత దిగువభాగం వద్ద ఉన్న Install Now బటన్ పై క్లిక్ చేయండి.
09:53 ఒక pop-up విండో Write the changes to the disks? తెరుచుకుంటుంది.
09:59 ఇక్కడ, Continue బటన్ పై క్లిక్ చేయండి.
10:03 తరువాత Where are you? అనే పేజీ వస్తుంది.

నేను India లో ఉన్నాను, కనుక నేను India పై క్లిక్ చేస్తాను.

10:11 దిగువన ఉన్న text-box లో, ఇది Kolkata అని చూపుతుంది.

మీ ఎంపిక ఆధారంగా, ఇది టైమ్ జోన్ ను సెట్ చేస్తుంది.

10:21 దిగువభాగం వద్ద ఉన్న Continue బటన్ పై క్లిక్ చేయండి.
10:24 ఇప్పుడు, మనం Keyboard layout ను ఎంచుకోవాలి.
10:28 అప్రమేయంగా, రెడువైపుల English (US) ఎంచుకోబడుతుంది.
10:34 ఒకవేళ మీరు భాషని మార్చాలి అనుకుంటే, మీకు నచ్చిన ఎంపికను ఎంచుకోండి.

నేను English (US) తో కొనసాగుతాను.

10:42 దిగువభాగం వద్ద ఉన్న Continue బటన్ పై క్లిక్ చేయండి.
10:46 చివరి దశ లాగిన్ వివరాలను ఇవ్వడం.

నేను Your name ఫీల్డ్ ను spoken గా నింపుతాను.

10:55 వెంటనే, Computer’s name మరియు Pick a username ఫీల్డ్స్ మీ ఇన్పుట్ పై ఆధారపడి నింపబడతాయి.

కావాలంటే మీరు ఈ విలువలను మార్చుకోవచ్చు.

11:07 తరువాత,Choose a password టెక్స్ట్ బాక్స్ లో మీ Ubuntu Linux OS కొరకు password ను టైప్ చేయండి.

నేను spoken అని టైప్ చేస్తాను.

11:18 Confirm your password టెక్స్ట్ బాక్స్ లో మళ్ళీ అదే password ను టైప్ చేయండి.
11:24 ఈ Ubuntu Linux OS కొరకు ఇది admin password గా ఉంది కనుక దీనిని నోట్ చేసుకోండి(రాసి పెట్టుకోండి ).
11:32 password టెక్స్ట్ బాక్స్ కిందన, మనం మరికొన్నిఎంపికలను చూడవచ్చు.

నేను Require my password to login ను ఎంచుకొంటాను.

11:42 ఇది user అతను / ఆమె లాగిన్ అయిన ప్రతిసారీ password ను ఎంటర్ చేయాలి అని నొక్కి చెప్తుంది.
11:49 ఇన్స్టాలేషన్ లో ముందుకు సాగటానికి Continue పై క్లిక్ చేయండి.
11:53 ఇన్స్టాలేషన్ పూర్తి కావటానికి కొంత సమయం తీసుకుంటుంది.
11:58 ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత, Installation Complete అని చెప్పే ఒక dialog-box ను మనం చూడవచ్చు.
12:06 ఆ dialog-box లో Restart Now బటన్ పై క్లిక్ చేయండి.
12:11 Ubuntu లోడ్ అవుతుంది అని చెప్తూ ఒక స్క్రీన్ కనిపిస్తుంది.

ఇది installation medium ను తొలగించడానికి Enter నొక్కమని మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది.

12:20 ఉదాహరణకు CD/USB Stick మొదలైనవి.

మీ కీబోర్డ్ పై Enter నొక్కండి.

12:28 ఇది Virtual Machine ను ప్రారంభిస్తుంది మరియు మనల్ని login page కు తీసుకువెళ్తుంది.
12:34 ఇన్స్టాలేషన్ సమయంలో మనం ఇచ్చిన వివరాలతో లాగిన్ అవ్వండి.
12:39 మనం Ubuntu 16.04 Desktop కు తీసుకెళ్ళబడతాము.

ఇది మనం ఇన్స్టాలేషన్ ను విజయవంతంగా పూర్తిచేసుకున్నాము అని సూచిస్తుంది.

12:49 Ubuntu ను shut down చేయడానికి, ఎగువకుడి మూలలో ఉన్న power icon పై క్లిక్ చేయండి.

మరియు, Shut Down ఎంపికను ఎంచుకోండి.

12:58 కనిపిస్తున్న popup లో, పెద్ద Shut Down బటన్ పై క్లిక్ చేయండి.
13:04 వెంటనే, Ubuntu విండో మూసివేయబడుతుంది మరియు మనం VirtualBox manager కు మళ్ళించబడ్తాము.
13:11 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.

సారాంశం చూద్దాం.

13:16 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి: ఒక VirtualBox లో ఒక Virtual Machine ను సృష్టించడం.
13:24 Virtual Machine పై Ubuntu Linux 16.04 ను ఇన్స్టాల్ చేయడం.
13:30 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

13:38 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

13:50 దయచేసి ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
13:54 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

14:06 ఈ ట్యుటోరియల్ కొరకు స్క్రిప్ట్ మరియు వీడియో NVLI మరియు స్పోకన్ ట్యుటోరియల్ టీం చే అందించబడ్డాయి.

నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey, Simhadriudaya