Synfig/C2/Overview-of-Synfig/Telugu
Time | Narration |
00:01 | Overview and Installation of Synfig అను Spoken Tutorial కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని గురించి నేర్చుకుంటాము: Synfig యొక్క ఇంటర్ఫేస్ |
00:13 | Synfig లో డ్రాయింగ్ మరియు యానిమేటింగ్ ఇంకా వివిధ ట్యుటోరియల్‌లలో లభించే కంటెంట్ |
00:22 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను: Ubuntu Linux OS వర్షన్ 16 .04 |
00:30 | Synfig వర్షన్ 1.0.2 |
00:35 | ఈ ట్యుటోరియల్‌ను అనుసరించడానికి, మీకు Inkscape యొక్క పరిజ్ఞానం |
00:40 | మరియు యానిమేషన్ యొక్క ప్రిన్సిపుల్స్ పై అవగాహన ఉండాలి |
00:43 | మొదట, Synfig గురించి తెలుసుకుందాం. |
00:46 | Synfig అనేది 2D యానిమేషన్ సాఫ్ట్‌వేర్. ఇది ఒక ఉచిత ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్. |
00:53 | తరువాత, మనం సిన్ఫిగ్ యొక్క కొన్ని ఫ్రీచర్స్ ను నేర్చుకుందాం. |
00:57 | ఇది Linux, Windows మరియుMac ఆపరేటింగ్ సిస్టమ్‌లలో పనిచేస్తుంది |
01:02 | ఇది వివిధ రకాల ఆకారాలను గీయగలదు మరియు టెక్స్ట్ యానిమేషన్‌ను సృష్టించగలదు |
01:07 | ఇది png ఇమేజెస్ ను ఇంపోర్ట్ చేసుకొని ఆ ఇమేజెస్ ను యానిమేట్ చేయగలదు |
01:12 | ఇది Cutout యానిమేషన్‌ను సృష్టిస్తుంది |
01:16 | ఇది Character walk cycle ను కూడా సృష్టిస్తుంది
అవుట్‌పుట్‌ను gif, avi మరియు అనేక ఇతర ఫార్మాట్లలో ఇవ్వగలదు. |
01:26 | Synfig ను 2D యానిమేటర్లు |
01:30 | యానిమేషన్ పట్ల ఆసక్తి ఉన్న పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. |
01:34 | తరువాత మనం Ubuntu OS పై Synfigను ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. |
01:39 | ఇన్స్టాలేషన్ విధానాన్ని అనుసరించడానికి, మీరు Internet కు కనెక్ట్ అయి ఉండాలి. |
01:44 | Ctrl + Alt + T కీలను కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరవండి. |
01:50 | ఇప్పుడు terminal లో sudo space apt hyphen get install synfigstudio అని టైప్ చేసి Enter ను నొక్కండి.
ఒకవేళ అవసరమైతే system password ను Enter చేయండి. |
02:07 | ఎంత డిస్క్ స్పేస్ ని ఆక్రమిస్తుంది అనే సందేశాన్నిఇది ప్రదర్శిస్తుంది. |
02:13 | దీన్ని ధృవీకరించడానికి Y అని టైప్ చేసి, Enter నొక్కండి.
ఇది Synfig ను ఇన్‌స్టాల్ చేస్తుంది. |
02:18 | మనం Synfig విజయవంతంగా ఇన్‌స్టాల్ చేయబడిందో లేదో అని తనిఖీచేద్దాం. |
02:22 | terminal లో, synfigstudio అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:28 | Synfig console తెరుచుకోవడాన్ని మనం చూడవచ్చు. |
02:31 | ఇప్పుడు మనం Windows ఆపరేటింగ్ సిస్టమ్ పై Synfig యొక్క ఇన్‌స్టాలేషన్ నేర్చుకుందాం. |
02:37 | ఇన్స్టాలేషన్ విధానాన్ని అనుసరించడానికి, మీరు Internet కు కనెక్ట్ అయి ఉండాలి.
మీ డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్‌ను తెరవండి. |
02:45 | address bar లో, ఈ url : https://www.synfig.org/download-stable
ను టైప్ చేసి Enter నొక్కండి. |
03:02 | Choose your OS డ్రాప్ డౌన్ బాక్స్ లో, మీ OS వివరాలను ఎంచుకోండి -Windows 64bit / Windows 32bit.
నేను Windows 64bit ను ఎంచుకుంటాను. |
03:15 | Name a fair price ఫీల్డ్‌లో, 0 (సున్నా) అని టైప్ చేసి, GET SYNFIG ని నొక్కండి.
ఒక పాపప్ విండో కనిపిస్తుంది. |
03:23 | చూపిన విధంగా మీ ఇమెయిల్-ఐడిని టైప్ చేయండి. Continue పై క్లిక్ చేయండి |
03:29 | తరువాత, డ్రాప్‌డౌన్ బాక్స్‌లో మీ స్థానాన్ని ఎంచుకుని, Continue ని నొక్కండి.
Complete Checkout పై క్లిక్ చేయండి. |
03:37 | మీకు Paddle help@paddle.com నుండి ఒక ఇమెయిల్ వస్తుంది.
మీ ఇమెయిల్‌ను తనిఖీ చేసి, మెయిల్‌లోని Download బటన్ పై క్లిక్ చేయండి. |
03:47 | ఒక పాపప్ విండో కనిపిస్తుంది. Saveపై క్లిక్ చెయ్యండి. |
03:51 | Downloads folder కు వెళ్లి, Synfig యొక్క .exe ఫైల్ పై డబుల్ క్లిక్ చెయ్యండి. |
03:57 | ఒక పాప్ అప్ విండో కనిపిస్తుంది. Run బటన్ పై క్లిక్ చేయండి.
Synfig Studio Setup విండో కనిపిస్తుంది. |
04:04 | License Agreement సెక్షన్ లో, I Agree ను ఎంచుకోండి.
Next పై క్లిక్ చేసి, ఆపై Install పై క్లిక్ చేయండి. |
04:14 | Close పై క్లిక్ చేయండి. Synfig ఇప్పుడు విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడింది. |
04:20 | తనిఖీ చేయడానికి, Windows బటన్ పై క్లిక్ చేసి, Synfig అని టైప్ చేయండి.
Synfig తెరుచుకుంటుంది మీరు చూడవచ్చు. |
04:28 | ఇప్పుడు, మనం ఈ సిరీస్‌లోని ప్రత్యేకమైన ట్యుటోరియల్‌ల ద్వారా క్లుప్తంగా వెళ్తాము. |
04:33 | ఈ సిరీస్ లోని మొదటి ట్యుటోరియల్ Bouncing ball animation. |
04:38 | ఇక్కడ మనం Synfig interface ను ఉపయోగించడం
Synfig లో ఒక బాల్ ని గీయడం నేర్చుకుంటాము. |
04:45 | keyframes మరియు waypoints జోడించడం |
04:48 | squash ఎఫెక్ట్ తో ఒక బాల్ ని యానిమేషన్ చేయడం. gif ఫార్మాట్ లో ఆ యానిమేషన్ ను Render చేయడం నేర్చుకుంటాము. |
04:54 | ఇక్కడ ఈ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది. |
04:56 | canvas పై ఉన్న బాల్ ని ఎంచుకోండి. బాల్ మధ్యలో ఉన్న ఒక ఆకుపచ్చ బిందువును గమనించండి. బాల్ ని canvas యొక్క దిగువ భాగానికి తరలించడానికి ఈ ఆకుపచ్చ బిందువును లాగండి. |
05:03 | తరువాతి ట్యుటోరియల్ E-card animation. |
05:08 | Png ఇమేజెస్ ను ఇంపోర్ట్ చేసుకోవడానికి,
ఇమేజెస్ ను యానిమేట్ చేయడానికి, టెక్స్ట్ యానిమేషన్ చేయడానికి ఇది మనకు సహాయపడుతుంది. |
05:17 | అలాగే మనం యానిమేషన్‌ను ప్రివ్యూ చేయడం మరియు యానిమేషన్‌ను avi ఫార్మాట్‌లో రెండర్ చేయడం నేర్చుకుంటాము. |
05:24 | నన్ను ఈ ట్యుటోరియల్ ని ప్లే చేయనివ్వండి. |
05:26 | ఇప్పుడు, ఫోల్డర్‌లోని Cake ఇమేజ్ ను ఎంచుకుని, Import పై క్లిక్ చెయ్యండి. మనం మన canvas పైన Cake ఇమేజ్ ను పొందుతాము. |
05:34 | తరువాతి ట్యుటోరియల్ Create a Star animation |
05:38 | ఈ ట్యుటోరియల్‌లో, మనం గ్రేడియంట్ కలర్ యానిమేషన్, గ్రూప్ లేయర్స్ మరియు స్టార్ యానిమేషన్‌ను సృష్టించడం నేర్చుకుంటాము |
05:48 | ఇక్కడ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది. |
05:51 | కనుక, Layers panel కు వెళ్లండి. Lower layer బటన్ పై రెండుసార్లు క్లిక్ చేయండి. తరువాత మనం నక్షత్రాల యొక్క ఆల్ఫా విలువను యానిమేట్ చేద్దాం. కనుక, Stars group layer ను ఎంచుకోండి. |
06:00 | తదుపరి ట్యుటోరియల్ Draw a toy train |
06:04 | ఈ ట్యుటోరియల్‌లో, మనం ప్రాథమిక ఆకృతులను గీయడం,
షేప్స్ కు రంగు వేయడం |
06:11 | ఆబ్జెక్ట్స్ ను గ్రూప్ & డూప్లికేట్ చేయడం మరియు Guideline ను ఉపయోగించి ఆకారాలను అలైన్ చేయడం నేర్చుకుంటాము. |
06:17 | మనం ఈ ట్యుటోరియల్ చూద్దాం. |
06:19 | Shift key ని ఉపయోగించి handle యొక్క మధ్య ఆకుపచ్చరంగు బిందువును లాగండి. Compartment-1 గ్రూప్ లేయర్ కొరకు కూడా ఇదేవిధంగా చెయ్యండి. |
06:28 | తరువాతి ట్యుటోరియల్ Animate a toy train. |
06:33 | ఈ ట్యుటోరియల్‌లో మనం మునుపటి ట్యుటోరియల్‌లో సృష్టించిన టాయ్ ట్రైన్ ను యానిమేట్ చేయడం నేర్చుకుంటాము. |
06:40 | ఇక్కడ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది. |
06:44 | Time cursor సున్నా ఫ్రేమ్‌లో ఉందని నిర్ధారించుకోండి. Shift కీని ఉపయోగించి, ట్రైన్ ను canvas కు బయట కుడి వైపుకు లాగండి. |
06:55 | తరువాతి ట్యుటోరియల్ Plant animation |
07:00 | ఇక్కడ మనం వీటిని నేర్చుకుంటాము- Insert item ను ఉపయోగించి ఒక వెర్టెక్స్ ను జోడించడం |
07:05 | Split tangent ఎంపికను ఉపయోగించడం
Mark active point as off option ను ఉపయోగించడం |
07:12 | షేప్స్ ను యానిమేట్ చేయడం |
07:14 | ఇక్కడ ఈ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది. |
07:17 | canvas యొక్క దిగువభాగం వద్ద ఉన్న Seek to begin పై క్లిక్ చేయండి. Play ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా యానిమేషన్‌ను ప్లే చేయండి. |
07:24 | తరువాతి ట్యుటోరియల్ Logo animation |
07:28 | ఈ ట్యుటోరియల్‌లో మనం వీటిని నేర్చుకుంటాము- Mirror tool ను ఉపయోగించడం |
07:32 | లోగోను యానిమేట్ చేయడం, Spherize ఎఫెక్ట్ ను సృష్టించడం |
07:38 | మనం ఈ ట్యుటోరియల్ ను చూద్దాం |
07:41 | మళ్ళీ, logo.png layeను ఎంచుకోండి. ఇప్పుడు 60th ఫ్రేమ్ కు వెళ్ళండి. ప్రదర్శించినట్లుగా logo ను కొద్దిగా పైకి తరలించండి. |
07:51 | తరువాతి ట్యుటోరియల్ Basic bone animation |
07:55 | ఇక్కడ, మనం వీటిని నేర్చుకుంటాము కేరక్టర్ కు బోన్స్ నుజోడించడం మరియు అతికించడం |
07:59 | Skeleton ఎంపికను ఉపయోగించి కేరక్టర్ ను యానిమేట్ చేయడం |
08:03 | ఇక్కడ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది. |
08:07 | కుడి చేతి యొక్క దిగువ మోచేయి భాగంలో ఉన్నbone యొక్క నీలంరంగు బిందువును ఎంచుకోండి.
ప్రదర్శించిన విధంగా బ్లూ డాట్ ను కదిలించడం ద్వారా దిగువ మోచేయి ఎముకను కదపండి. |
08:18 | తరువాతి ట్యుటోరియల్ Cutout animation. |
08:22 | ఈ ట్యుటోరియల్‌లో మనం ఒక ఇమేజ్ పై Cutout tool ని ఉపయోగించడం
కటౌట్ షేప్స్ ను యానిమేట్ చేయడం నేర్చుకుంటాము |
08:30 | ఇక్కడ ఈ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది. |
08:34 | Cursor ను 70 వ ఫ్రేమ్‌కు తరలించి, Amount విలువను 0 నుండి -6.14 కు మార్చండి. |
08:43 | తరువాతి ట్యుటోరియల్ Rocket animation.
ఈ ట్యుటోరియల్‌లో మనం ఫైర్ ఎఫెక్ట్, నాయిస్ గ్రేడియంట్ మరియు ఫెదర్ ఎఫెక్ట్‌ను సృష్టించడం నేర్చుకుంటాము |
08:56 | ఇక్కడ ఈ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది. |
09:00 | Parameters panel లో, Origin పై క్లిక్ చేయండి. Convert పై క్లిక్ చేసి, ఆపై Linear పై చెయ్యండి. Origin యొక్క డ్రాప్ డౌన్ లిస్ట్ పై క్లిక్ చేయండి. |
09:12 | తరువాతి ట్యుటోరియల్ అనేది Underwater animation ను సృష్టించడం. |
09:17 | ఈ ట్యుటోరియల్ లో మనం వీటిని నేర్చుకుంటాము PNGs మరియు SVGs లను ఇంపోర్ట్ చేయడం |
09:23 | Distortion effect ను ఉపయోగించి ఇమేజ్ ను యానిమేట్ చేయడం |
09:27 | Noise gradient ను జోడించడం ర్యాండమ్ యానిమేషన్ కొరకు Random option ను ఉపయోగించడం |
09:32 | అలాగే పై వాటన్నిటిని ఉపయోగించి, మనం ఒక underwater animation ను సృష్టించడం నేర్చుకుంటాము. |
09:36 | ఇక్కడ ఈ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది. |
09:39 | Canvas కు తిరిగి రండి.
అన్ని ఇమేజెస్ ను స్కేల్ చేయండి మరియు ఇక్కడ చూపిన విధంగా అండర్ వాటర్ సీన్ ని ఏర్పాటు చేయండి. |
09:47 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. సారాంశం చూద్దాం. |
09:52 | ఈ ట్యుటోరియల్‌లో, మనం Synfig గురించి తెలుసుకున్నాము మరియు ఈ సిరీస్ లోని ట్యుటోరియల్‌ల యొక్క గ్లింప్సెస్ (సంగ్రహావలోకనాలను) చూశాము. |
10:00 | కింది లింక్‌లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి. |
10:06 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాల కొరకు దయచేసి మాకు రాయండి. |
10:14 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌లో మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా?
దయచేసి ఈ సైట్‌ను సందర్శించండి. |
10:19 | మీకు ఎక్కడ సందేహం ఉందో ఆ నిమిషం మరియు క్షణాన్ని ఎంచుకోండి.
మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం లోని వారు ఎవరైనా వాటికి సమాధానాలు ఇస్తారు. |
10:28 | ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్. |
10:33 | దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు. |
10:37 | ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు. |
10:45 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
10:56 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |