STEMI-2017/C2/Introduction-to-Kallows-Device/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
NARRATION
00:01 నమస్కారము, Kallows స్టెమీ కిట్ పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది-

ఇసిజి లీడ్స్, బి పి కఫ్ మరియు SpO2లను స్థానాపరుచుట. ఒక ECGని తీసుకొనుట. రక్త పోటు మరియు SpO2లను తనిఖీ చేయుట.

00:22 ఈ ట్యుటోరియల్ ని సాధన చేయడానికి మీకు Kallows స్టెమీ కిట్ అవసరం.
00:28 స్టెమీ కిట్ లో-

ఒక మెటల్ కేసింగ్ లో అన్రొఇడ్ ట్యాబ్ Mobmon పరికర 12.0 బ్లూటూత్ రక్తపోటు మానిటర్.

00:39 ఇసిజి ఎలక్ట్రోడ్ లు- SPO2 ప్రోబ్, వైఫై ప్రింటర్ మరియు

పవర్ స్ట్రిప్ ఉన్నవి.

00:48 ఇది Mobmon పరికరం.
00:52 దీని ఎడమ వైపున ఒక ఛార్జింగ్ పోర్ట్ తో పాటు ఒక పవర్ బటన్ కూడా ఉంది.
00:58 దానికి వెనుక వైపు SpO2 మరియు ECG పోర్ట్ లు ఉన్నవి.
01:03 కేబుల్ హెడ్ ని Mobmon పరికరం పై ఉన్న ECG పోర్ట్ లో కి ఇన్సర్ట్ చేయాలి.
01:10 కనెక్షన్ చేసిన తరవా త, దాని ఇరువైపుల అందించిన స్క్రూ లతో కనెక్షన్ని సురక్షితమ్ చేయండి.
01:17 తదుపరి SpO2 ప్రోబ్ గురించి నేర్చుకుందాం.
01:21 ఈ ప్రోబ్ క్రింది భాగాలతో తయారు చేయబడింది-

1. ఆక్సిమెట్రీ ప్రోబ్ లేదా కేబుల్ మరియు 2. సెన్సార్.

01:29 SpO2 ప్రోబ్ ని ఎలా స్థాన పర్చాలో చూద్దాం.
01:34 Mobmon పరికరం పై ఉన్న ఆక్సిమెట్రీ ప్రోబ్ లేదా కేబుల్ని SpO2 కనెక్టర్కు జోడించండి.
01:41 కనెక్ట్ అయినా తరవాత అది ఇలా కనిపించాలి.
01:45 చిత్రం లో చూపిన విధంగా రోగి యొక్క వేలు సెన్సర్ చివర వరకు చేర్చబడాలి.
01:54 ఒక సెన్సర్ సైట్ని ఎంచుకునే సమయోలో, శరీరం యొక్క చివరి భాగానికి ప్రాధాన్యత ఇవ్వాలి దేనికైతే arterial catheter, రక్తపోటు కఫ్ లేదా intravascular infusion లైన్ జోడించి లేదు.
02:09 ఆక్సిమెట్రి ప్రోబ్ కనెక్షన్ల కోసం విలక్షణ ప్రదేశాలు లేదా సైట్ లు - పెద్దలు లేదా పీడియాట్రిక్స్ కోసం : వేలు, కాలి వేలు , చెవి బయటభాగము లేదా చెవి తమ్మే.

శిశువుల కోసం: పాదం లేదా అరచెయ్యి మరియు కాలిపెద్దవేలు లేదా బొటన వేలు.

02:23 శిశువుల కోసం: పాదం లేదా అరచెయ్యి మరియు కాలిపెద్దవేలు లేదా బొటన వేలు.
02:31 దయ చేసి గమనించండి:

పునర్వినియోగ సెన్సార్లు అదే సైట్ లో 4 గంటలు గరిష్టంగా కలం లోనే వాడవచ్చు. చర్మ ఆరోగ్యం కొరకు సైట్ని నిత్యపరిపాటిగా తనిఖీ చేయుట నిర్ధారించుకోండి.

02:47 తడి లేదా దెబ్బతిన్న సెన్సార్లు వాడకండి. విద్యుత్ శస్త్రచికిత్స సమయంలో లేదా ఇతర విద్యుత్ పరికరంను ఉపయోగించినప్పుడు వాటి వలన కాలిన గాయాలు కావచ్చు.
03:00 SpO2 సెన్సర్ ని సరిగ్గా అమర్చక పొతే లేదా ఉపయోగించక పొతే జీవకణాలు దెబ్బతినవచ్చు లేదా మంట పుట్ట వచ్చు.
03:08 సెన్సర్ని ఉపయోగించేటప్పుడు, జోడించేటప్పుడు, తొలగించేటప్పుడు లేదా నిలువ చేసేటప్పుడు అనవసరంగా అధిక శక్తిని వాడి మెలి పెట్టకండి.
03:20 సెన్సర్ గనక చాల గట్టిగా అమర్చబడితే లేదా కాంతి మూలాలు అనగా శస్త్రచికిత్స దీపం, ఒక బిలిరుబిన్ దీపం లేదా సూర్యకాంతి నుండి అధిక ప్రకాశం వస్తే నాడి సంకేతాలు తగ్గవచ్చు.
03:37 తదుపరి రక్త పోటు కుఫ్ ని ఎలా స్థాన పర్చాలో నేర్చుకుందాం.
03:42 కఫ్ కనెక్టర్ ని బ్లూటూత్ పరికరం యొక్క NIBP కనెక్టర్ కి జోడించండి.
03:49 రోగి యొక్క బాహు లేదా భుజం కొలతను బట్టి సరైన కఫ్ పరిమాణం ఎంచుకోండి. ఒక సాధారణ నియమం ప్రకారం కఫ్ వెడల్పు, రోగి, అతని మోచేయి మరియు భుజం మధ్య దూరం సుమారు మూడిటికి రెండు వంతుల పరిధిలో ఉండాలి.
04:04 చిత్రంలో చూపిన విధంగా NIBP కఫ్ ని రోగి యొక్క ఎడమ చేయి,(చేతికి సంబంధిత ధమని అనగా brachial artery )పై చుట్టండి.
04:14 మరియు సరైన నిర్వహణ కోసం NIBP కఫ్ ని రోగి యొక్క భుజానికి గట్టిగా చుట్టలి.
04:21 బ్లూటూత్ బిపి మానిటర్ సక్రియం చేయుటకు స్టార్ట్ బటన్ నొక్కండి.
04:26 దయచేసి గమనించండి:

కఫ్ ని సరిగ్గా అమర్చక పొతే లేదా వాడక పొతే ఖచ్చితమైన కొలతలు రాకపోవడం సంభవించవచ్చు అనగా- కఫ్ ని రోగి చేతి పై వదులుగా కట్టడం తప్పు కఫ్ పరిమాణం ఉపయోగించడం కఫ్ ని గుండె ఉన్న స్థాయి లో అమర్చ క పోవడం కారుతున్న కఫ్ లేదా ట్యూబ్ రోగి యొక్క మితిమీరిన కదలిక.

04:52 రోగి యొక్క ఒకే చెయ్యికి SpO2 సెన్సర్ మరియు రక్త పోటు కఫ్ ని జోగించకండి.

ఇది పీడ అలారంలను నివారించడానికి.

05:03 NIBP కొలిచే సమయంలో, కఫ్ యొక్క ట్యూబ్ నిరోధించబడి లేదా అల్లుకుని లేదని నిర్ధారించుకోండి.
05:12 చివరిగా ECG లీడ్స్ ఎలా స్థానపర్చాలో చూదాం.
05:18 నాణ్యత గల ECG రిథమ్, మంచి చర్మం తయారీ మరియు సరైన ఎలక్ట్రోడ్ ల ప్లేస్ మెంట్ తో పొందవచ్చు.
05:27 ECGకోసం రోగి యొక్క సరైన తయారీ ఈ విధంగా చేయాలి-

ఎలక్ట్రోడ్ సైట్ ని శుభ్రపర్చుట మరియు ఛాతీ నుండి ఉపరితల జుట్టుని తొలగించుట.

05:37 చర్మం యొక్క బాహ్య పొరను తొలగించుటకు స్పిరిట్ తో చర్మం పై మెల్లగా రుద్దండి, దాని వలన చర్మం కొద్దిగా ఎర్రగా మారుతుంది.

ఎలక్ట్రోడ్ సైట్ పొడిగా అయ్యే వరకు ఆగండి.

05:50 ఎలక్ట్రోడ్ ఉపరితలం పై ఏదైనా పొడి జెల్ ఉంటే, దానిని తొలగించండి.

చదరమైన కండరాలు లేని మరియు వెంట్రుకలు లేని ప్రదేశాల పై ఎలక్ట్రోడ్లను అమర్చండి.

06:01 మంచి నాణ్యత గల (ఉదా. అత్యంత వాహక శక్తి గల) తాజా జెల్ని ఉపయోగించండి.

సరైన కాంటాక్ట్ ఏర్పర్చుటకు ఎలక్ట్రోడ్ ఉపరితలం పై జెల్ని తగినంత పరిమాణంలో పూయండి.

06:15 గమనిక:

ఎలక్ట్రోడ్లు, లీడ్స్ మరియు కేబుల్ల వాహక భాగాలు ఏ ఇతర కండక్టివ్ భాగాలతో కాంటాక్ట్ చెయ్యబడ కుండా నిర్ధారించుకోండి.

06:27 దెబ్బతిన్న ఎలక్ట్రోడ్ లీడ్స్ ని వాడకండి.
06:31 ఎలక్ట్రోడ్లను మరీ వదులు గా అమర్చకండి. దీని వలన ఆర్టిఫాక్ట్స్ కనిపించవచ్చు మరియు గుండే రిథమ్ అలారమ్ లు మొగవచ్చు , ఇది చాలా అసౌకర్యంగా ఉంటుంది
06:43 ఎలక్ట్రోడ్లను ఇలా అమర్చాలి.

RA : కుడి intraclavicular ప్రాంతంలో LA  : ఎడమ intraclavicular ప్రాంతంలో

06:56 V1 : నాలుగోవ intercostal space sternum యొక్క కుడి సరిహద్దు వద్ద.

V2 : నాలుగోవ intercostal space sternum యొక్క ఎడుమ సరిహద్దు వద్ద.

07:10 V3 : V2 మరియు V4 మధ్య ఐదవ రిబ్ వద్ద.

V4: ఐదవ intercostal space పై ఎడుమ midclavicular line వద్ద.

07:22 V5: ఐద వ intercostal ఎడమ anterior axillary line వద్ద.

V6: ఐదవ intercostal ఎడమ midaxillary line వద్ద.

07:36 RL : కుడి దిగువ ఉదరం క్వాడ్రంట్ inguinal ligament పైన.

LL: ఎడమ దిగువ ఉదరం క్వాడ్రంట్ inguinal ligament పైన.

07:53 పవర్ కార్డ్ మరియు రోగి కేబుల్ క్రాస్ అవ్వకుండా ఉండేలా నిర్ధారించుకోండి.
07:59 పక్కన ఉన్న పవర్ on/ off బటాన్ సహాయం తో Mobmon పరికరం ఆన్ చేయండి.
08:05 ఇసిజి ప్రత్యక్ష ప్రసారం పేజీ లో, ఇసిజిని వీక్షించడానికి స్టెమీ పరికరంలో ఇసిజి టాబ్ ఎంచుకోండి.
08:15 ట్యుటోరియల్ సారాంశం.
08:16 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది-

ఇసిజి లీడ్స్ రక్త పోటు కఫ్ మరియు SpO2 ప్రోబ్ ని ఎలా స్థాన పర్చాలి. ECGని ఎలా తీసుకోవాలి రక్త పోటు మరియు SpO2 లను ఎలా తనిఖీ చెయ్యాలి.

08:31 స్టేమీ ఇండియా

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

08:45 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది

మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి.

09:00 ఈ ట్యుటోరియల్ స్టెమీ ఇండియా మరియు స్పోకెన్ ట్యుటోరియ ల్ ప్రాజెక్ట్, ఐఐటి బొంబాయి ద్వారా అందించబడింది.

ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya