QGIS/C2/Installation-of-QGIS/Telugu
From Script | Spoken-Tutorial
TIme | Narration |
00:01 | QGIS యొక్క ఇన్స్టాలేషన్ పై స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో మనం QGIS ను వీటిపై ఇన్‌స్టాల్ చేయడం నేర్చుకుంటాము,
ఉబుంటు లైనక్స్ |
00:15 | విండోస్ మరియు మాక్ ఆపరేటింగ్ సిస్టమ్. |
00:20 | ఇన్స్టాలేషన్ కొరకు, నేను ఉపయోగిస్తున్నాను,
Ubuntu Linux వర్షన్ 16.04 |
00:28 | Windows 10 |
00:30 | Mac OS X 10.10 మరియు |
00:33 | పని చేస్తున్న ఒక ఇంటర్నెట్ కనెక్షన్. |
00:36 | Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరవండి. |
00:43 | ప్రాంప్ట్ వద్ద, sudo స్పేస్ su అని టైప్ చేసి, Enter నొక్కండి. |
00:52 | మీ system password ని ఎంటర్ చేయమని మిమ్మల్ని ప్రాంప్ట్ చేసే ఒక సందేశం కనిపిస్తుంది. |
00:58 | password టైప్ చేసి, Enter ను నొక్కండి. |
01:02 | ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ కొరకు కొన్నిcommands ను అమలు చేయవల్సిఉంటుంది. |
01:08 | ఇక్కడ నేను అవసరమైన commands యొక్క లిస్ట్ తో ఒక ఫైల్ ను కలిగి ఉన్నాను. |
01:13 | ఈ ఫైల్ QGIS Installation Repositories అనే పేరుతో Code files link లో అందించబడింది. |
01:21 | ఇప్పుడు మనం QGIS repositories ను sources.list ఫైల్‌కు జోడిద్దాం. |
01:28 | కింది command ను కాపీ చేయండి. కాపీ చేయడానికి Ctrl C ను ఉపయోగించండి. |
01:34 | terminal prompt వద్ద, రైట్ క్లిక్ చేసి పేస్ట్ ను ఎంచుకోండి.
మరియు Enter ను నొక్కండి. |
01:43 | source.list ఫైల్‌తో Gedit editor తెరవబడుతుంది. |
01:48 | QGIS Installation Repositories ఫైల్‌కు తిరిగి వెళ్ళండి. |
01:53 | ఇప్పుడు, ఇక్కడ హైలైట్ చేయబడిన రెండు లైన్స్ ను sources.list ఫైల్ యొక్క చివరిన జోడించండి. |
02:00 | ఇక్కడ చూపబడిన రెండు లైన్ లను కాపీ చేయండి. |
02:04 | వాటిని Sources.list ఫైల్ చివరిన అతికించండి. |
02:09 | ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl S ను నొక్కండి. |
02:13 | ఇప్పుడు మీ విండో యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న క్రాస్ పై క్లిక్ చేసి ఈ ఫైల్ ని మూసివేయండి. |
02:20 | terminal prompt వద్ద, sudo స్పేస్ apt-get స్పేస్ update అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:32 | ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఈ అప్ డేట్ అనేది ఇప్పుడు పూర్తయింది. |
02:39 | ఈ సమయంలో మనం మరికొన్నిcommands ను అమలు చేయాల్సి ఉంటుంది. |
02:44 | మనం QGIS Installation Repositories ఫైల్‌కు తిరిగి వెళ్దాం. |
02:49 | ఈ కింది మూడు commands అనేవి ఇక్కడ చూపించబడ్డాయి. |
02:53 | మనం వాటిని ఒకదాని తర్వాత ఒకటి అమలు చేయాలి. |
02:57 | ఒకసారికి ఒక command ను కాపీ చేసి, దానిని terminal లో పేస్ట్ చెయ్యండి. |
03:03 | ప్రతి command ను prompt వద్ద పేస్ట్ చేసిన తర్వాత Enter ను నొక్కండి. |
03:27 | మూడవ command ను అమలు చేసిన తరువాత, మీరు OK అనే సందేశాన్ని చూస్తారు. |
03:32 | ఇప్పుడు QGIS Installation Repositories file నుండి చివరి command ను అమలు చేయండి.
కింది command ను కాపీ చేయండి. |
03:41 | దాన్ని terminal prompt వద్ద పేస్ట్ చేసి Enter నొక్కండి. |
03:47 | కొనసాగడానికి Y ను ప్రెస్ చేయండి మరియు Enter ను నొక్కండి. |
03:53 | ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. |
03:57 | ఇన్స్టాలేషన్ ఇప్పుడు పూర్తయింది. |
04:01 | మీ కీబోర్డ్ పైన Windows కీని నొక్కండి మరియు Search bar లో QGIS అని టైప్ చేయండి. |
04:09 | మీరు QGIS Desktop Application ను చూడగలుగుతారు.
QGIS ను తెరవడానికి దానిపై క్లిక్ చేయండి. |
04:18 | ఇది QGIS interface. |
04:22 | ఇప్పుడు మనం Windows పై QGIS ఇన్‌స్టాలేషన్‌కు వెళ్దాం. |
04:27 | QGIS Installation Repositories ఫైల్ కు తిరిగి వెళ్ళండి. కింది లింక్‌ను కాపీ చేయండి. |
04:35 | మీ సిస్టమ్‌లో ఏదైనా వెబ్ బ్రౌజర్‌ని తెరవండి. నేను Chrome ను తెరుస్తున్నాను. |
04:42 | కాపీ చేసిన లింక్‌ను ఒక వెబ్ బ్రౌజర్‌లోపల పేస్ట్ చేసి, Enter ను నొక్కండి. |
04:49 | ఈ ఎర్రర్ మెసేజ్ ను విస్మరించి, OK పై క్లిక్ చేయండి. |
04:55 | Long term release repository most stable సెక్షన్ కు స్క్రోల్ చేయండి. |
05:01 | మీ సిస్టమ్ ప్రకారం 64 బిట్ లేదా 32 బిట్ ల మధ్య తగిన సెటప్‌ను ఎంచుకోండి. |
05:09 | సంబంధిత setup ఫైల్ యొక్క ఎడమ భాగంపైన ఇవ్వబడిన Download icon పై క్లిక్ చేయండి. |
05:16 | మీ Internet వేగాన్ని బట్టి installer ఫైల్ ను డౌన్‌లోడ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. |
05:23 | నేను ఇప్పటికే ఈ setup ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్నిDownloads folder లో సేవ్ చేసాను. |
05:30 | ఇప్పుడు మనం Downloads folder కు నావిగేట్ చేద్దాం. |
05:34 | task bar పైన అందుబాటులో ఉన్న search బాక్స్‌లో, downloads అని టైప్ చేయండి. |
05:40 | Downloads ఎంపికపై క్లిక్ చేయండి. |
05:43 | Downloads ఫోల్డర్ తెరుచుకుంటుంది. |
05:46 | QGIS installer file ను కనుగొనండి. |
05:50 | ఇన్స్టాలేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి దానిపై డబుల్ క్లిక్ చేయండి. |
05:55 | మీ సిస్టమ్‌లో ఒక డైలాగ్ బాక్స్ తెరవబడుతుంది.
కొనసాగడానికి Yes ను క్లిక్ చేయండి. |
06:02 | Installation Wizard తెరుచుకుంటుంది. |
06:05 | సూచనలను చదివి Next బటన్ పై క్లిక్ చేయండి. |
06:10 | software license agreement పేజీలో, I Agree బటన్ పై క్లిక్ చేయండి. |
06:16 | software ను ఎక్కడ ఇన్‌స్టాల్ చేయాలో ఎంచుకోండి, ఒకవేళ ఖచ్చితంగా తెలియకపోతే డిఫాల్ట్ స్థానాన్నేవదిలివేయండి. |
06:24 | మీరు ఇన్స్టాలేషన్ కొరకు అదనపు భాగాలను ఎంచుకోవాల్సిన అవసరం లేదు, QGIS తో కొనసాగండి. |
06:32 | Install బటన్ పై క్లిక్ చేయండి. |
06:35 | ఇన్స్టాలేషన్ కు కొంత సమయం పడుతుంది. |
06:40 | ఒకసారి పూర్తయిన తర్వాత, ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేయడానికి Finish బటన్ పై క్లిక్ చేయండి.
QGIS ఇప్పుడు మీ సిస్టమ్స్‌లో ఇన్‌స్టాల్ చేయబడుతుంది. |
06:51 | taskbar పైన అందుబాటులో ఉన్న search బాక్స్‌లో, QGIS అని టైప్ చేయండి. |
06:57 | లిస్ట్ లో, మీరు QGIS Desktop Application ను చూడగలుగుతారు. |
07:04 | QGIS ను తెరవడానికి దానిపై క్లిక్ చేయండి. |
07:09 | ఇది QGIS interface. |
07:13 | ఇప్పుడు మనం Mac OS పైన QGIS ఇన్స్టాలేషన్ కు వెళ్దాం. |
07:19 | మనం ఇంతకు ముందు తెరిచిన QGIS డౌన్‌లోడ్ వెబ్ పేజీకి తిరిగి వెళ్ళండి. |
07:25 | Mac OS X టాబ్ కొరకు Download ను తెరవండి. |
07:29 | Long term release most stable సెక్షన్ కు స్క్రోల్ చెయ్యండి. |
07:34 | సంబంధిత setup ఫైల్ యొక్క ఎడమ భాగంపైన ఇచ్చిన download icon పై క్లిక్ చేయండి. |
07:40 | ఓక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
07:43 | డిఫాల్ట్ ఫైల్ పేరును మనం మార్చవద్దు. |
07:47 | ఈ ఫైల్‌ను సేవ్ చేయడానికి Downloads ఫోల్డర్‌ను లొకేషన్ గా ఎంచుకోండి. |
07:52 | Save బటన్ పై క్లిక్ చేయండి. |
07:55 | మీ Internet వేగాన్ని బట్టి ఇన్‌స్టాలర్ ఫైల్ యొక్క డౌన్‌లోడ్ అనేది కొంత సమయాన్ని తీసుకుంటుంది. |
08:02 | నేను ఇప్పటికే ఈ సెటప్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని Downloads ఫోల్డర్‌లో సేవ్ చేసాను. |
08:08 | ఇప్పుడు మనం Downloads ఫోల్డర్‌కు నావిగేట్ చేద్దాం. |
08:12 | స్క్రీన్ యొక్క ఎగువ కుడి మూలలో ఉన్నsearch ఐకాన్ పై క్లిక్ చేయండి. |
08:18 | Downloads అని టైప్ చేయండి, Downloads ఫోల్డర్ ఎంపికపై డబల్ క్లిక్ చేయండి. |
08:25 | QGIS Installer ఫైల్‌ను కనుగొనండి, ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి దానిపై క్లిక్ చేయండి. |
08:33 | చాలా ఫైళ్లతో ఉన్న ఒక సెటప్ ఫోల్డర్ తెరుచుకుంటుంది. |
08:37 | అక్కడ నాలుగు packages ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఒక సంఖ్యతో మొదలవుతుంది. |
08:42 | packages ను ఇన్‌స్టాల్ చేయాల్సిన క్రమాన్ని ఇది మీకు చెబుతుంది. |
08:46 | నాన్ ఆపిల్ డెవలపర్ చే గుర్తించబడిన సాఫ్ట్‌వేర్ యొక్క ఇన్స్టాలేషన్ ను అనుమతించడానికి,
మొదట మీ Mac Security Preferences ను Allow apps downloaded from: Anywhere కు మార్చండి. |
08:58 | స్క్రీన్‌పైన ఎగువ కుడి మూలలో ఉన్న search icon పై క్లిక్ చేయండి. System Preferences అని టైప్ చేసి, Enter ను నొక్కండి. |
09:09 | system preferences తో కూడిన ఒక విండో తెరవబడుతుంది. |
09:13 | Security & Privacy పై క్లిక్ చేయండి. |
09:17 | మార్పులను అనుమతించడానికి Security & Privacy విండో నుండి, General టాబ్‌లో దిగువ-ఎడమ మూలలో ఉన్న లాక్ ఐకాన్ ను క్లిక్ చేయండి. |
09:28 | డైలాగ్ బాక్స్‌లో మీ system password ను ఎంటర్ చేయండి. |
09:32 | తర్వాత Unlock బటన్ పై క్లిక్ చేయండి. |
09:35 | Allow apps downloaded from సెక్షన్ లో, Anywhere రేడియో బటన్ పై క్లిక్ చేయండి. |
09:42 | ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది, Allow from anywhere బటన్ పై క్లిక్ చేయండి. |
09:49 | సెట్ట్టింగ్స్ ను లాక్ చేయడానికి దిగువ-ఎడమ మూలలో తెరిచిఉన్నలాక్ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
09:55 | ఆ విండో ను మూసివేయండి. |
09:57 | ఇప్పుడు సెటప్ ఫోల్డర్‌కు వెళ్లి ప్యాకేజ్ నంబర్ 1 పై డబల్ క్లిక్ చేయండి. |
10:03 | ఈ Installation wizard లోని సూచనలను అనుసరించి package ను ఇన్స్టాల్ చేయండి. |
10:09 | Continueపై క్లిక్ చేయండి. |
10:12 | ఇవ్వబడిన ముఖ్యమైన సూచనలను చదివి, Continue పై క్లిక్ చేయండి. |
10:17 | license agreement ను చదివి, Continue పై క్లిక్ చేయండి. |
10:22 | తెరుచుకున్న డైలాగ్ బాక్స్‌లో Agree బటన్ పై క్లిక్ చేయడం ద్వారా software license agreement ను అంగీకరించండి. |
10:30 | install పై క్లిక్ చేయండి. |
10:33 | తెరుచుకున్న డైలాగ్ బాక్స్‌లో system password ని టైప్ చేయండి. |
10:38 | ఇంకా Install Software బటన్ పై క్లిక్ చేయండి. |
10:45 | ఒకసారి ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత, Close బటన్ పై క్లిక్ చేయండి. |
10:50 | ప్యాకేజ్ సంఖ్యలు 2, 3 మరియు 4 కొరకు కూడా ఈ విధానాన్ని పునరావృతం చేయండి. |
11:19 | ఒకసారి మొత్తం నాలుగు package ల కొరకు ఇన్స్టాలేషన్ లు పూర్తయిన తర్వాత, QGIS మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేయబడుతుంది. |
11:27 | సర్చ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. QGIS అని టైప్ చేయండి. |
11:33 | QGIS ను ప్రారంభించడానికి QGIS అప్లికేషన్‌పై డబల్ క్లిక్ చేయండి. |
11:39 | ఇక్కడ QGIS ఇంటర్ఫేస్ ఉంది. |
11:43 | రాబోయే ట్యుటోరియల్స్ లో interface మరియు ఫీచర్స్ ను గురించి మరింత సమాచారం కవర్ చేయబడుతుంది. |
11:51 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకున్నాము: |
11:57 | Ubuntu Linux వర్షన్ 16.04, Windows 10 మరియు Mac OS X 10.10 లపై QGIS వర్షన్ 2.18 యొక్క ఇన్స్టాలేషన్. |
12:11 | ఒక అసైన్మెంట్ గా,
మీ మెషీన్ పై QGIS ని ఇన్‌స్టాల్ చేయండి. |
12:17 | QGIS ఇంటర్ఫేస్ ను తెరిచి అన్వేషించండి. |
12:21 | మెనూలు మరియు టూల్‌బార్ల ద్వారా వెళ్ళండి. |
12:25 | కింది లింక్‌లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి. |
12:34 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: వర్కుషాప్స్ ను నిర్వహించి ఆన్ లైన్ పరీక్షల్లో పాసైన వారికి సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాల కొరకు దయచేసి మాకు రాయండి. |
12:48 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌లో మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా?
దయచేసి ఈ వెబ్ సైట్‌ను సందర్శించండి. |
12:55 | మీకు ఎక్కడ సందేహం ఉందో ఆ నిమిషం మరియు క్షణాన్ని ఎంచుకోండి.
మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం లోని వారు ఎవరైనా వాటికి సమాధానాలు ఇస్తారు. |
13:07 | ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్ ఉంది. |
13:13 | దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు.
ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. |
13:21 | తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు. |
13:27 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ గురించిన వివరాల కోసం, చూపిన లింక్‌ను సందర్శించండి. |
13:40 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |