Python-3.4.3/C3/Accessing-parts-of-arrays/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 Accessing parts of arrays అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం, single dimensional మరియు multi-dimensional arrays యొక్క వ్యక్తిగత ఎలిమెంట్స్ ను.
00:17 arrays యొక్క Rows మరియు columns ను,
00:20 slicing మరియు striding లను ఉపయోగించి ఒక array యొక్క ఎలిమెంట్స్ ను

యాక్సెస్ చేయడం మరియు మార్చడం లను నేర్చుకుంటాము.

00:25 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux 16.04 ఆపరేటింగ్ సిస్టమ్,

00:33 Python 3.4.3 మరియు IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.
00:40 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు ipython console పై బేసిక్ Python కమాండ్స్ ను రన్ చేయడం,
00:49 arrays ను ఉపయోగించడం తెలిసి ఉండాలి.
00:51 ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి.
00:57 ఒక ఉదాహరణ సహాయంతో ప్రారంభిద్దాం.
01:01 A మరియు C అనే రెండు arrays ను తీసుకుందాం.

మనం ఈ ట్యుటోరియల్ అంతటా ఈ arrays నే ఉపయోగిస్తాము.

01:09 ipython ను ప్రారంభిద్దాం

Terminal ను తెరవండి.

01:15 ipython3 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
01:21 Terminal లో మనం ఆ రెండు arrays ను సృష్టిద్దాం.

దీని కొరకు, మనం numpy library ను దిగుమతి చేసుకోవాలి

01:29 import numpy as np అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
01:36 ఇక్కడ నుండి, terminal పై ప్రతి కమాండ్ ను టైప్ చేసిన తర్వాత Enter కీ ని నొక్కాలని దయచేసి గుర్తుపెట్టుకోండి.
01:43 A is equal to np dot arange పరన్తసిస్ ల లోపల 1 కామా6 అని టైప్ చేయండి.
01:51 C is equal to np dot arange పరన్తసిస్ ల లోపల 1 కామా 26 dot reshape పరన్తసిస్ ల లోపల 5 కామా 5 అని టైప్ చేయండి.
02:03 మనం ఇప్పటికే మునుపటి ట్యుటోరియల్‌లో arange మరియు reshape methods లగురించి నేర్చుకున్నాము.
02:09 ఇప్పుడు, మనం A మరియు C యొక్క కంటెంట్స్ ను చూద్దాం.

A టైప్ చేయండి.

02:16 C టైప్ చేయండి.
02:19 A లో మనం, 1 నుండి 6 వరకు గల ఎలిమెంట్స్ తో ఒకే ఒక రో ను కలిగిఉన్నాము.

A అనేది ఒక one dimensional array.

02:28 C లో మనం, 1 నుండి 26 వరకు గల ఎలిమెంట్స్ ను 5 రోస్ మరియు 5 కాలమ్స్ తో ఒక matrix యొక్క రూపం లో కలిగిఉన్నాము.

కనుక C అనేది ఒక two dimensional array.

02:40 తరువాత, మనం అర్రే లోని వ్యక్తిగత ఎలిమెంట్స్ ను యాక్సెస్ చేయడం గురించి చూద్దాం.
02:45 array A లోని ఎలిమెంట్ 3 ను యాక్సెస్ చేయడానికి, A of 2 అని అంటాము.
02:51 A పరన్తసిస్ ల లోపల 2 అని టైప్ చేయండి.
02:56 Python లో, arrays అనేవి zero-indexed.

ఎలిమెంట్స్ యొక్క స్థానం 1 కు బదులుగా 0 తో మొదలవుతుంది అని దీని అర్ధం.

03:06 ఇప్పుడు, మనం array C నుండి element 14 ను యాక్సెస్ చేద్దాం.
03:11 14 అనేది మూడవ row మరియు నాల్గవ column లో ఉంది.

దీన్ని చేయటానికి మనం C of 2,3 అని అంటాము.

03:19 C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 2 కామా 3 అని టైప్ చేయండి.
03:24 తరువాత మనం ఒక array యొక్క విలువను ఎలా మార్చాలో నేర్చుకుంటాము.
03:29 ఇప్పుడు మనం A లో 3 ను -3కు మరియు C లో 14 ను -14కు మారుద్దాం.
03:37 దీని కొరకు మనం ఎలిమెంట్ ను యాక్సెస్ చేసిన తర్వాత క్రొత్త విలువను కేటాయిస్తాము.
03:43 A స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 2 is equal to minus 3 అని టైప్ చేయండి.
03:50 C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 2 కామా3 is equal to minus 14 అని టైప్ చేయండి.
03:57 మన కార్యకలాపాలను తనిఖీ చేద్దాం.

A టైప్ చేయండి.

04:03 C టైప్ చేయండి.

ఇప్పుడు ఎలిమెంట్స్ మార్చబడినట్లు మీరు చూడవచ్చు.

04:10 అదేవిధంగా మీరు ఒక అర్రే లోని ప్రతి ఒక్క ఎలిమెంట్ ను మార్చవచ్చు.
04:15 తరువాత మనం ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ను మార్చడం నేర్చుకుందాం.

మొదట rows తో, ఆ తరువాత columns తో.

04:24 మనం C యొక్క ఒక row ను యాక్సెస్ చేద్దాం, అనగా మూడవ row.
04:29 C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 2 అని టైప్ చేయండి.
04:34 array యొక్క మూడవ రో ఇప్పుడు ప్రదర్శించబడిందని మనం చూడవచ్చు.
04:40 arrays యొక్క negative indexing కు Python programming మద్దతు ఇస్తుంది.
04:45 దీని అర్థం -1 యొక్క సూచిక విలువ అనేది చివరి మూలకాన్ని ఇస్తుంది మరియు -2 అనేది ఒక అర్రే యొక్క చివరి నుండి రెండవ ఎలిమెంట్ ను ఇస్తుంది.
04:56 మనం C యొక్క చివరి రో ను 2 విధాలుగా యాక్సెస్ చేయవచ్చు.
05:01 C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 4 అని టైప్ చేయటం.
05:06 లేదా negative indexing తో, C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మైనస్ 1 అని టైప్ చేయటం ద్వారా.

రెండు అవుట్‌పుట్‌లు ఒకేలా ఉన్నాయని గమనించండి.

05:17 ఇప్పుడు, మనం చివరి రో ను అన్ని సున్నాల లోనికి మార్చడం నేర్చుకుంటాము.
05:22 C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మైనస్ 1 is equal to స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 0 కామా 0 కామా 0 కామా 0 కామా 0 అని టైప్ చేయండి.
05:34 C టైప్ చేయండి.

array C యొక్క చివరి వరుసలో సున్నాలు ప్రదర్శించబడతాయని గమనించండి.

05:42 మనం C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల minus 1 is equal to 2 అని కూడా టైప్ చేయవచ్చు.
05:50 C టైప్ చేయండి.

మరియు చేసిన మార్పులతో తనిఖీ చేయండి.

05:57 ఇప్పుడు మనం ఒక అర్రే ను slice చేయడం నేర్చుకుందాం.
06:00 ఒక అర్రే యొక్క భాగాలను యాక్సెస్ చేయడానికి అర్రే యొక్క Slicing చేస్తారు.
06:05 Slicing కు సింటాక్స్ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల start colon stop.
06:11 Striding అనేది ఒక అర్రే లోని ఎలిమెంట్ ల మధ్య దాటడానికి step వేల్యూ ను ఉపయోగిస్తుంది.
06:17 Striding కు సింటాక్స్ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల start colon stop colon step.
06:25 టెర్మినల్ కు తిరిగి మారండి.
06:28 C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 0 colon 3 కామా 2 అని టైప్ చేయండి.
06:34 రో slicing కొరకు 0 మరియు 3 అనేవి ప్రారంభ మరియు ముగింపుకు సంబంధించిన విలువలు మరియు 2 అనేది కాలమ్ ఇండెక్స్ కు సంబంధించినది.
06:44 మనము 0 నుండి 2 వరకు ఇండెక్స్ చేయబడిన రోస్ యొక్క ఎలిమెంట్స్ ను మరియు 2 చేత ఇండెక్స్ చేయబడిన కాలమ్ ను పొందుతాము.

అందువల్ల మనం అర్రే ను స్లైస్(ముక్కలు) చేసాము.

06:54 ఇప్పుడు మనం రో యొక్క ఎలిమెంట్స్ ను ఇండెక్స్ 2 తో, మరియు మొదటి 2 కాలమ్స్ ను యాక్సెస్ చేస్తాము.
07:01 C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 2 కామా 0 colon 3 అని టైప్ చేయండి.

2 అనేది రో ఇండెక్స్ కు సంభందించి ఉంటుంది ఇంకా 0 మరియు 3 అనేవి కాలమ్ స్లైసింగ్ కొరకు ప్రారంభ మరియు ముగింపు విలువలకు సంభందించి ఉంటాయి.

07:17 వీడియోను పాజ్ చేయండి. క్రింది అభ్యాసాన్నిప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి.
07:23 array C నుండి కింది ఎలిమెంట్స్ ను ఒక్కొక్కటిగా పొందండి.
07:28 పరిష్కారం కొరకు టర్మినల్ కు మారండి.
07:32 C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 1 కామా 1 colon 3 అని టైప్ చేయండి.
07:39 మనం ఎలిమెంట్స్ 7 మరియు 8 లను పొందుతాము.
07:43 C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 0 colon 4 కామా 0 అని టైప్ చేయండి.
07:50 మనం ఎలిమెంట్స్ 1, 6, 11 మరియు 16 లను పొందుతాము.
07:55 C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 1 colon 5 కామా 0 అని టైప్ చేయండి.
08:02 మనం ఎలిమెంట్స్ 6, 11, 16 మరియు 2 లను పొందుతాము.
08:07 C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 1 colon comma 0 అని టైప్ చేయడం ద్వారా కూడా మనం అవే ఎలిమెంట్స్ ను పొందవచ్చు.
08:16 వీడియోను పాజ్ చేయండి. క్రింది అభ్యాసాన్నిప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి.
08:22 array C నుండి [[8, 9], [13, -14]] ఎలిమెంట్స్ ను పొందండి.
08:28 పరిష్కారం కొరకు టర్మినల్ కు మారండి.
08:31 C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 1 colon 3 కామా 2 colon 4 అని టైప్ చేయండి.
08:39 మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ను పొందాము.
08:42 తరువాత మనం చిన్న array C ను ఉపయోగించి striding ఉపాయాన్ని నేర్చుకుంటాము.
08:47 మనము బేసిసంఖ్య లోని రోస్ మరియు కాలమ్స్ అనగా

మొదటి, మూడవ మరియు అయిదు లను మాత్రమే యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తాము.

08:54 C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 0 colon 5 colon 2 కామా 0 colon 5 colon2 అని టైప్ చేయండి.
09:04 మనం C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల colon colon 2 comma colon colon2 అని కూడా టైప్ చేయవచ్చు.
09:13 బేసి సంఖ్యతో ఉన్న రోస్ మరియు కాలమ్స్ మాత్రమే ప్రదర్శించబడ్డాయని చూడవచ్చు.
09:18 step 2 అనేది ఎలిమెంట్స్ మధ్య జంప్ (దూకటాన్ని)ను నిర్దేశిస్తుంది.

దీనిని striding అని అంటారు.

09:26 ఒకవేళ ఏ step ను పేర్కొనకపోతే, 1 యొక్క డిఫాల్ట్ విలువ అనేది తీసుకోబడుతుంది.
09:32 C స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 1 colon colon 2 కామా colon colon 2 అని టైప్ చేయండి.
09:41 చూపిన విధంగా మనం ఎలిమెంట్స్ ను పొందుతాము.
09:44 వీడియో ను పాజ్ చేయండి.కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
09:50 array C నుండి కింది ఎలిమెంట్స్ ను పొందండి.
09:54 పరిష్కారం మీ స్క్రీన్ పైన ఉంది.
09:57 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.

ఈ ట్యుటోరియల్ లో మనం, సింగిల్ మరియు మల్టీ dimensional అర్రేస్ లను మానిప్యులేట్ చేయడం.

10:08 వ్యక్తిగత ఎలిమెంట్స్ ను వాటి యొక్క index numbers ను ఉపయోగించి యాక్సెస్ చేయడం మరియు మార్చడం.
10:14 రోస్ మరియు కాలమ్ సంఖ్యలను పేర్కొనడం ద్వారా అర్రేస్ యొక్క రోస్ మరియు కాలమ్స్ లను యాక్సెస్ చేయడం మరియు మార్చడం.
10:21 అర్రేస్ పై Slice మరియు stride లను చేయడం నేర్చుకున్నాము.
10:24 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు ఉన్నాయి.
10:28 ఇచ్చిన అర్రే A నుండి ఎలిమెంట్ 18ని ఎలా యాక్సెస్ చేయాలి?
10:33 ఇచ్చిన అర్రే B నుండి ఎలిమెంట్స్ [[[21, 22], [31, 32]] లను మనం ఎలా పొందగలం?
10:4 మరియు సమాధానాలు,

మొదటిది. array A లో 18 వ ఎలిమెంట్ అనేది సూచిక సంఖ్య 2 ను కలిగి ఉంది. అందువల్ల, మనం దానిని A of 2 గా యాక్సెస్ చేయవచ్చు.

10:50 రెండవది array B లో మధ్య లోని నాలుగు సంఖ్యలను పొందటానికి, మనం B స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 1 colon 3 కామా 1 colon 3 ను తీసుకుంటాం.
11:01 దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
11:05 దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
11:1 FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది.
11:14 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

మరిన్ని వివరాల కొరకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి.

11:24 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya