Python-3.4.3/C2/Using-plot-command-interactively/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, IPython లో plot command interactively అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు,

mathematical functions యొక్క సాధారణ plots ను సృష్టించడం. plotsను బాగా అధ్యయనం చేయడానికి Plot విండో ను ఉపయోగించడం చేయగలుగుతారు.

00:20 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ Python 3.4.3 IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.

00:34 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి ముందస్తు-అవసరాలు-

మీకు ipython console పై బేసిక్ (ప్రాధమిక) Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో తెలిసి ఉండాలి.

00:44 ఒకవేళ లేకపోతే, Python ట్యుటోరియల్స్ కొరకు, దయచేసి ఈ వెబ్సైట్ ను సందర్శించండి.
00:50 ముందుగా Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
00:58 ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
01:05 మనము pylab package ను ప్రారంభిద్దాం. percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి.
01:16 ముందుగా మనం Pylab అంటే ఏమిటి అనేది అర్థం చేసుకుందాం.
01:20 Pylab అనేది ఒక అనుకూలమైన Python module-

ఇది plotting కార్యాచరణను అందిస్తుంది మరియు mathematical ఇంకా scientific functions ను కలిగి ఉంటుంది.

01:32 percentage pylab ను రన్ చేసిన తరువాత i Python console లో మీరు-

Using matplotlib backend: TkAgg అనే ఒక సందేశాన్ని చూస్తారు.

01:41 matplotlib రన్ అవుతుంది అని దీని అర్ధం.
01:45 కానీ కొన్నిసార్లు ImportError: No module named matplotlib అని చెప్పే ఒక ఎర్రర్ ను మీరు పొందవచ్చు.
01:55 అటువంటి సందర్భాలలో, మీరు matplotlib ను ఇన్స్టాల్ చేసి, మరలా ఈ command ను రన్ చేయాలి.
02:02 మనం ipython console కు తిరిగి వద్దాం. ipython console లో ఒక కొశ్చన్ మార్క్ చేత అనుసరించబడే linspace ను టైప్ చేసి Enter నొక్కండి.
02:14 దయచేసి గమనించండి command అనేది linspace, linespace కాదు.
02:20 ప్రదర్శించబడిన సమాచారం

linspace return evenly spaced numbers అని చెప్తుంది, అవి start మరియు stop విరామంపైన లెక్కించబడతాయి.

02:34 డాక్యుమెంటేషన్ నుండి నిష్క్రమించి console కు తిరిగి రావటానికి q ని నొక్కండి.
02:41 మనం 1 నుంచి 100 వరకు గల 100 పాయింట్లు ఉత్పత్తి చేయటానికి ప్రయత్నిద్దాం. linspace brackets 1 comma 100 comma 100 అని టైప్ చేయండి.
02:58 ఇక్కడ, 1 అనేది start, 100 అనేది stop మరియు తరువాతి 100 అనేది పాయింట్ల యొక్క సంఖ్య. ఇప్పుడు, Enter నొక్కండి.
03:09 మీరు చుస్తున్నట్లుగా, 1 నుండి 100 వరకు ఉండే సంఖ్యల యొక్క శ్రేణి ప్రదర్శించబడుతుంది.
03:15 ఇప్పుడు మనం 0 మరియు 1 మధ్య 200 పాయింట్లును ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిద్దాం.
03:21 మనం దానిని linspace brackets 0 comma 1 comma 200 అని టైప్ చేసి ఎంటర్ నొక్కడం ద్వారా చేస్తాము.
03:36 ఇక్కడ ఆశించిన సంఖ్యల యొక్క శ్రేణి ఉంది.
03:40 linspace లో, start మరియు stop పాయింట్స్ అనేవి integers, decimals లేదా constants ఏవయినా కావొచ్చు.
03:48 ఇప్పుడు మనం len ఫంక్షన్ గురించి నేర్చుకుందాం.
03:52 మొదట మనము minus pi మరియు pi మధ్య 100 పాయింట్లను ఉత్పత్తి చేస్తాము.
03:58 కనుక linspace brackets minus pi comma pi comma 100 అని టైప్ చేసి Enter నొక్కండి.
04:10 ఇక్కడ pi అనేది pylab చేత నిర్వచించబడిన ఒక స్థిరాంకము.
04:15 ఇప్పుడు, మనం దీన్ని t అనబడే ఒక వేరియబుల్ కు సేవ్ చేద్దాము, Enter నొక్కండి.
04:22 ఇప్పుడు ఒకవేళ మనం len bracket t అని టైప్ చేసి Enter నొక్కితే, మనము minus pi మరియు pi ల మధ్య పాయింట్ల యొక్క సంఖ్యను పొందుతాము.
04:32 len ఫంక్షన్ ఇచ్చిన శ్రేణి లో ప్రస్తుతం ఉన్న మూలకాల యొక్క సంఖ్యను ఇస్తుంది.
04:37 తరువాత, మనం minus pi మరియు piల మధ్య ఒక cosine curve ను ప్రయత్నించి ప్లాట్ చేద్దాం.
04:43 దీని కొరకు, మనం plot కమాండ్ ను ఉపయోగిస్తాము. plot brackets t comma cos(t) అని టైప్ చేసి Enter నొక్కండి.
04:59 మీరు cosine plot నుండి చూస్తున్నట్లుగా, పాయింట్ t కు సంబందించిన ప్రతి పాయింట్ వద్ద cos(t) అనేది cosine విలువను పొందుతుంది.
05:09 మనం cos(t) యొక్క విలువను ఒక వేరియబుల్ cosine కు cosine equals to cos(t) అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా కూడా కేటాయించవచ్చు.
05:21 తరువాత plot(t comma cosine) అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా plot చేయవచ్చు.
05:31 plot ను క్లియర్ చేయడానికి, clf() ఫంక్షన్ ను ఉపయోగించాలి. ఇది పాత plots పైన కొత్త plots యొక్క అతివ్యాప్తిని తప్పిస్తుంది.
05:42 console లో, clf() అని టైప్ చేసి Enter నొక్కండి. మునుపటి plot క్లియర్ చేయబడి ఒక ఖాళీ plot window ప్రదర్శించబడుతుంది.
05:56 ఇప్పుడు, మనం ఒక sine plot ను ప్లాట్ చేయడానికి ప్రయత్నిద్దాం.
06:00 plot brackets t comma sin(t) అని టైప్ చేసి Enter నొక్కండి. ఒక sine plot ప్రదర్శించబడుతుంది.
06:14 Plot window పై plot ను బాగా అధ్యయనం చేయడానికి, దానిపై అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలను మనం ఉపయోగించవచ్చు

మనం ఈ ఎంపికలను చూద్దాం.

06:25 plot వెంట మౌస్ పాయింటర్ను కడుపుతుంటే, అది మనకు plot పై ప్రతి point యొక్క లొకేషన్ ను ఇస్తుంది.
06:33 ఇక్కడ గమనించండి. విండో యొక్క దిగువభాగం వద్ద ఎడమవైపు, కొన్ని బటన్లు ఉన్నాయి.
06:39 వాటిలో నుండి అన్నిటికంటే కుడిపక్కన ఉన్నది ఫైల్ ను సేవ్ చేయడం కొరకు, దానిపై క్లిక్ చేసి file name ను టైప్ చేయండి.
06:47 మనం plot ను sin underscore curve అనే పేరుతో pdf format లో సేవ్ చేద్దాము.
06:54 ఇక్కడ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి. మీరు చూస్తున్నట్లుగా, file ను సేవ్ చేయటానికి ఇక్కడ అనేక ఫార్మాట్లు ఉన్నాయి.

Png, eps, pdf మరియు ps వంటి ఫార్మాట్లు అందుబాటులో ఉన్నాయి.

07:08 మనము సేవ్ చేసే సమయంలో మనము ఇష్టపడే ఫార్మాట్ను పేర్కొనాల్సి ఉంటుంది.
07:14 save బటన్ యొక్క ఎడమ వైపున, slider button ఉంది. ఈ button ను ఉపయోగించి, మనము plot window యొక్క అంచులను నిర్ణయించవచ్చు.
07:24 slider button యొక్క ఎడమవైపున zoom బటన్ ఉంది. ఇది plot ని zoom చేయడానికి ఉపయోగించబడుతుంది.

zoom చేయడానికి ఒక ప్రాంతాన్ని పేర్కొనండి.

07:37 zoom యొక్క ఎడమవైపున ఉన్న బటన్ plot యొక్క axes ను కదిలించడానికి ఉపయోగించబడవచ్చు.
07:41 ఎడమ మరియు కుడి బాణం చిహ్నాలతో తదుపరి రెండు బటన్లు, plot యొక్క స్థితిని మార్చుతాయి.
07:48 ఇది plot యొక్క మునుపటి లేదా తదుపరి స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది. ఇది ఒక బ్రౌజర్లో వెనుక మరియు ముందుకు బటన్ వలె పనిచేస్తుంది.
07:57 చివరిది home ఇది ప్రారంభ plot ను సూచిస్తుంది.
08:03 ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
08:09 (sin(x) multiplied by sin(x)) divided by x ను ప్లాట్ చేయండి.

1.plot ను sinsquarebyx dot pdf గా సేవ్ చేయండి. 2.Zoom చేసి maxima ను కనుగొనండి. 3.దానిని ప్రారంభ స్థానానికి తిరిగి తీసుకురండి.

08:26 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,

pylab తో IPython ను ప్రారంభించడం. ఒక ప్రాంతంలో సమానంగా ఖాళీలు(అంతరాలు) ఇవ్వబడిన పాయింట్లు ను సృష్టించడానికి linspace ఫంక్షన్ ను ఉపయోగించడం.

08:42 len ఫంక్షన్ ను ఉపయోగించి వరుసల యొక్క పొడవును కనుగొనడం.

plot ను ఉపయోగించి గణిత విధులు ప్లాట్ చేయడం. clf ను ఉపయోగించి డ్రాయింగ్ ప్రాంతాన్ని క్లియర్ చేయడం

08:53 ప్లాట్ విండో యొక్క UI లో- సేవ్, జూమ్, మూవ్ ఆక్సిస్, బ్యాక్ మరియు ఫార్వర్డ్ ఇంకా హోమ్ వంటి బటన్స్ యొక్క వాడుక.
09:04 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు-

1. minus pi by 2 మరియు pi by 2 ల మధ్య 100 సమాన ఖాళీలుగల ప్లాట్ లను సృష్టించండి.

09:15 2. ఒక వరుస యొక్క పొడవును మనము ఎలా కనుగొంటాము?
09:19 3. linspace(minus pi comma pi comma 100) అనే కమాండ్ ఏమి చేస్తుంది?
09:26 మరియు సమాధానాలు,

మనము minus pi by 2 మరియు pi by 2 ల మధ్య 100 సమాన ఖాళీలుగల ప్లాట్ లను సృష్టించడానికి linspace(minus pi by 2 comma pi by 2 comma 100) కమాండ్ ను ఉపయోగిస్తాము.

09:43 ఒక వరుస యొక్క పొడవును కనుగొనడానికి len(sequence underscore name) అనే ఫంక్షన్ ఉపయోగించబడుతుంది.
09:50 linspace(minus pi comma pi comma 100) అనే కమాండ్- pi నుండి pi వరకు గల, minus pi మరియు pi తో కలిపి 100 సమాన ఖాళీలు చేయబడిన నమూనాలను తిరిగి ఇస్తుంది.
10:06 కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దానిని డౌన్లోడ్ చేసి, చూడవచ్చు.
10:16 మేము వర్క్ షాప్స్ ను నిర్వహిస్తాము. సర్టిఫికెట్లు ఇస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
10:24 మీరు ఈ Spoken Tutorial లో ఏవైనా సందేహాలను కలిగి ఉన్నారా ?
10:27 మీరు ఎక్కడైతే సందేహాన్ని కలిగిఉన్నారో ఆ సమయాన్ని ఎంచుకోండి. మీ సందేహాన్ని క్లుప్తంగా వివరించండి. FOSSEE టీం నుండి ఎవరైనా వాటికీ సమాధానాలు ఇస్తారు. దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.
10:39 మీరు లో ఏవైనా సాధారణ / సాంకేతిక ప్రశ్నలు కలిగి ఉన్నారా? దయచేసి కింది లింక్ లోను ఫోరమ్ ను సందర్శించండి.
10:46 FOSSEE టీం ప్రసిద్ధ పుస్తకాల నుండి పరిష్కరించబడిన అనేక ఉదాహరణల యొక్క కోడింగ్ ను సమన్వయం చేస్తుంది.
10:51 ఎవరైతే వీటిని చేస్తారో వారికి మేము ధృవీకరణపత్రాలను మరియు పారితోషకాన్ని అందజేస్తాము. మరిన్ని వివరాల కొరకు, దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.
11:00 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
11:07 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya