Python-3.4.3/C2/Other-Types-Of-Plots/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Other types of plots అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు,

scatter plot ను సృష్టించడం log-log plots ను సృష్టించడం చేయగలుగుతారు.

00:15 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ Python 3.4.3, IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.

00:29 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు

ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను రన్ చేయడం files మరియు Plot data నుండి data ను లోడ్ చేయడం ఎలా చేయాలో తెలిసి ఉండాలి.

00:41 ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి.
00:46 ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.

ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.

00:58 మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం. percent pylab అని టైప్ చేసి Enter నొక్కండి.
01:08 ఒక scatter plot లో డేటా అనేది పాయింట్స్ యొక్క సేకరణగా ప్రదర్శించబడుతుంది.
01:13 ప్రతీ పాయింట్ x మరియు y ఆక్సిస్ పైన దానియొక్క స్థానాన్ని నిర్ణయిస్తుంది.
01:18 2000 సంవత్సరం నుండి 2010 సంవత్సరం వరకు ఒక సంస్థ యొక్క లాభం శాతాన్ని చూపిస్తున్న ఒక scatter plot ను ప్లాట్ చేయండి.
01:27 దాని కోసం డేటా company hyphen a hyphen data dot txt ఫైల్ లో అందుబాటులో ఉంది.
01:35 company hyphen a hyphen data dot txt ఫైల్ ఈ ట్యుటోరియల్ యొక్క కోడ్ ఫైల్ లింక్ లో అందుబాటులో ఉంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి ఉపయోగించండి.

01:45 మనం company hyphen a hyphen data dot txt ఫైల్ యొక్క కంటెంట్ ను చూద్దాము.
01:52 కనుక cat company hyphen a hyphen data dot txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:00 ఈ డేటా ఫైల్, రెండు కాలమ్స్ లో ప్రతీ కాలమ్ లోని విలువల యొక్క ఒక జతతో ఉంది.
02:06 మొదటి కాలమ్ సంవత్సరాలను సూచిస్తుంది. మరియు రెండవ కాలమ్ లాభం శాతాన్ని సూచిస్తుంది.
02:15 ఒక స్కాటర్ ప్లాట్ ను ఉత్పత్తి చేయడానికి, మనం ముందుగా loadtxt కమాండ్ ను ఉపయోగించి ఫైల్ నుండి డాట్ ను లోడ్ చేయాలి.
02:22 కనుక

year కామా profit equal to loadtxt పరాంతసిస్ లోపల సింగల్ కోట్ లోపల company hyphen a hyphen data dot txt సింగల్ కోట్ తరువాత కామా unpack equal to True అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.

02:45 Unpack equal to True అనేది data యొక్క transposed array ను తిరిగి ఇస్తుంది.
02:51 scatter() function అనేది scatter graph ను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది.
02:56 సింటాక్స్: scatter పరాంతసిస్ లోపల x కామా y

x అనేది డేటా యొక్క ఒక శ్రేణి. Y అనేది x యొక్క అదే పొడవు కలిగిన డేటా యొక్క ఒక శ్రేణి.

03:11 year మరియు profit లో భద్రపరచబడిన డేటా కొరకు scatter graph ను ప్లాట్ చేయడానికి మనం scatter function ను ఉపయోగిద్దాం.
03:20 కనుక scatter పరాంతసిస్ లోపల year కామా profit అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:31 scatter() function కు మనం రెండు ఆర్గుమెంట్స్ ను పంపించామని గమనించండి.
03:36 మొదటిది x- కోఆర్డినేట్ లోని విలువలు అనగా year, రెండవది y- కోఆర్డినేట్ లోని విలువలు అనగా profit percentages.
03:48 ఇక్కడ వీడియోను పాజ్ చేసి, కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. scatter యొక్క డాక్యుమెంటేషన్ ను చదవండి.
03:58 company hyphen a hyphen data dot txt లోని అదే డేటాతో ఉన్న ఒక స్కెటర్ ప్లాట్ ను ఎరుపు వజ్రం గుర్తులతో(రెడ్ డైమండ్ మార్కర్స్) ప్లాట్ చేయండి.
04:08 అభ్యాసానికి పరిష్కారం. plot window ను క్లియర్ చేయడానికి clf పరాంతసిస్ అని టైప్ చేసి ఎంటర్. నొక్కండి.
04:20 తరువాత

Scatter పరాంతసిస్ లోపల year కామా profit కామా color equal to సింగల్ కోట్ లోపల r కామా marker equal to సింగల్ కోట్ లోపల d అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.

04:43 దానివల్ల, మనము ఒక స్కెటర్ ప్లాట్ ను పొందాము, ఇప్పుడు మనం ప్లాట్ యొక్క వేరొక రకాన్ని చూద్దాం.
04:51 ఒక log-log plot అనేది సంఖ్యా డేటా యొక్క ద్వి-మితీయ గ్రాఫ్.
04:57 ఇది రెండు axesల పైన logarithmic scales ను ఉపయోగిస్తుంది.
05:02 నాన్-లీనియర్ స్కేలింగ్ కారణంగా గ్రాఫ్ ఒక సరళ రేఖ వలె కనిపిస్తుంది.
05:08 Syntax:

Loglog పరాంతసిస్ల లోపల x కామా y. x అనేది డేటా యొక్క ఒక శ్రేణి. y అనేది x అంతే పొడవును ఉన్న ఒక డేటా యొక్క ఒక శ్రేణి.

05:24 y equal to 5 times x cube కోసం x విలువ 1 నుండి 20 వరకు ఉండే ఒక log-log chart ను ప్లాట్ చేయండి.
05:33 ఆ ప్లాట్ ని గీసే ముందు, దానికోసం అవసరమయ్యే పాయింట్స్ ను మనం లెక్కిద్దాం.
05:39 X equal to linspace పరాంతసిస్ల లోపల 1 కామా 20 కామా 100 టైప్ చేసి Enter నొక్కండి.
05:54 తరువాత, y equal to 5 into x raised to 3 టైప్ చేసి Enter నొక్కండి.
06:06 plot window ను క్లియర్ చేయడానికి clf పరాంతసిస్ అని టైప్ చేసి Enter నొక్కండి.
06:14 Loglog పరాంతసిస్ల లోపల x కామా y అని టైప్ చేసి Enter నొక్కండి.
06:24 మనం కావలిసిన ప్లాట్ ను చూస్తాము.
06:27 దీనితో మనం ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నవి,

scatter() ఫంక్షన్ ను ఉపయోగించి ఒక scatter plot ను ప్లాట్ చేయడం. loglog()ఫంక్షన్ ను ఉపయోగించి ఒక log-log graph ను ప్లాట్ చేయడం.

06:42 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు.
06:46 Scatter పరాంతసిస్ల లోపల x కామా y కామా color equal to సింగల్ కోట్స్ లోపల blue కామా marker equal to సింగల్ కోట్స్ లోపల d.
06:59 మరియు plot పరాంతసిస్ లోపల x కామా y కామా color equal to సింగల్ కోట్స్ లోపల b కామా marker equal to సింగల్ కోట్స్ లోపల d.
07:11 సరిగ్గా అదే చేస్తుందా?

తప్పా లేక ఒప్పా

07:17 మరియు సమాధానం, తప్పు రెండు ఫంక్షన్స్ ప్లాట్ యొక్క ఒకే రకాన్ని ఉత్పత్తి చేయవు.
07:25 దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
07:25 దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
07:29 FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది.
07:33 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాల కొరకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి.
07:42 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya