Python-3.4.3/C2/Additional-features-of-IPython/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Additional Features of IPython అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు,

మీ IPython history ను తిరిగిపొండడం

00:14 History యొక్క ఒక భాగమును చూడడం
00:17 ఒక ఫైల్ కు history యొక్క ఒక భాగాన్ని సేవ్ చేయడం.
00:21 IPython లోపల నుండి ఒక స్క్రిప్ట్ ను అమలు చేయడంలను చేయగలుగుతారు.
00:25 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
00:32 Python 3.4.3,

IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.

00:38 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు

ప్లాట్స్ ను ఇంటరెక్టివ్గా ఉపయోగించడం మరియు ఎంబెల్లిష్ (అలంకరించడం) చేయడం ఎలా చేయాలో తెలిసి ఉండాలి.

00:48 ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి.
00:54 ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
01:01 ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
01:07 మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం. percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి.
01:14 ప్లాటింగ్ ను ప్రారంభించడానికి, x is equal to linspace బ్రాకెట్స్ లోపల మైనస్ 2pi కామా 2pi కామా 100 మరియు Enter నొక్కండి.
01:31 తరువాత plot బ్రాకెట్స్ లోపల x కామా xsin(x) అని టైప్ చేసి Enter నొక్కండి.
01:42 మనం xsin అనేది నిర్వచించబడలేదు అని చెప్పే ఒక ఎర్రర్ ని పొందుతాము.

ఇది ఎందువలనంటే, వాస్తవానికి xsin(x) అనేది x multiplied by sin(x)

01:54 ఇక్కడ గుణకారం గుర్తు అనేది మిస్సయింది. కనుక మనం ఇప్పుడు దానిని టైప్ చేద్దాం.

Plot బ్రాకెట్స్ లోపల x కామా x multiplied by sin(x) మరియు Enter నొక్కండి.

02:13 తరువాత మనం x మరియు y axes రెండింటికీ టైటిల్ మరియు లేబుల్స్ ను చేర్చుదాము.
02:19 Xlabel బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల dollar sign లోపల x అని టైప్ చేసి Enter నొక్కండి.
02:31 Ylabel బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల dollar sign లోపల f(x)
02:43 Title బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల dollar sign లోపల x మరియు xsin(x).
02:57 మనము ఇప్పుడు లేబుల్ చేయబడిన plot ను చూడవచ్చు.
03:01 టైప్ చేసిన commands యొక్క హిస్టరీ ను percentage history command ద్వారా తిరిగి పొందవచ్చు.
03:07 percentage history అని టైప్ చేసి Enter నొక్కండి.
03:13 percentage history అనేది కూడా ఒక command మరియు ఇది ఇటీవల command గా ప్రదర్శించబడుతుంది.
03:20 మనము terminal లో అమలుచేసింది ఏదయినా హిస్టరీ గా భద్రపరచబడుతుంది.
03:25 ఒకవేళ మనం ఐదవ command ఏమిటో చూడాలనుకుంటే, percentage history command కు 5 ను ఒక argument గా పంపాలి.
03:33 percentage history space 5 అని టైప్ చేసి Enter నొక్కండి.

ఇది మనము టైప్ చేసిన ఐదవ command ను ప్రదర్శిస్తుంది.

03:43 ఇక్కడ వీడియోను పాజ్ చేసి, కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
03:49 5 మరియు 10 మధ్య ఇటీవలి commands ను ఎలా జాబితా చేయాలి అని తెలుసుకోండి.
03:55 terminal కు తిరిగి మారండి.
03:58 మనం పరిష్కారాన్ని చూద్దాం.
04:00 clf()అని టైప్ చేసి Enter నొక్కండి.

percentage history question mark అని టైప్ చేయండి.

04:08 percentage history command యొక్క సమాచారాన్ని చదవండి.
04:13 percentage history hyphen n 4 hyphen 6, 4 నుండి 6 వరకు గల commands ను ప్రదర్శిస్తుంది అని మనం చూడవచ్చు
04:24 ఇక్కడ hyphen n అనేది ఒక ఐచ్ఛిక argument ఇది వరుస సంఖ్యలను ముద్రిస్తుంది.

డాక్యుమెంటేషన్ ను నిష్క్రమించడానికి q ని టైప్ చేయండి.

04:37 ఇప్పుడు percentage history space 5 hyphen 10 అని టైప్ చేసి Enter నొక్కండి.
04:46 history ను సేవ్ చేయడానికి, మనము percentage save command ను ఉపయోగిస్తాము.
04:51 మనం దానిని చేసేముందు, ముందుగా history ను చూసి మనకు ఏ రకమైన కోడ్ యొక్క లైన్స్ కావాలో గుర్తిద్దాం.
04:58 percentage history అని టైప్ చేసి Enter నొక్కండి.
05:03 రెండవ command, linspace.

కానీ మూడవ command అనేది మనకు ఎర్రర్ ను ఇచ్చే ఒక command.

05:10 అందువల్ల మనకు ఇది అవసరం లేదు.
05:13 నాలుగు నుండి ఏడు వరకు ఉన్న commands మనకు అవసరం.
05:16 కనుక మన ప్రోగ్రాం కొరకు రెండవ command ఆపై నాలుగు నుండి ఏడు వరకు commands అవసరం.
05:22 మనం మన ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీలో దానిని సేవ్ చేద్దాము. అందుకు దానికోసం సింటాక్స్,

percentage save space plot underscore script.py space 2 space 4 hyphen 7 అవుతుంది. Enter నొక్కండి.

05:47 percentage save command లో మొదటి argument అనేది కమాండ్స్ సేవ్ చేయబడిన ఫైల్ యొక్క పేరు.
05:56 రెండవ argument అనేది స్పేసేస్ చేత వేరు చేయబడిన కమాండ్స్ యొక్క సంఖ్యను ఇస్తుంది.
06:04 ఇప్పుడు మనం plot underscore script.py ఫైల్ ను తెరిచి విషయాలను(కాంటెంట్స్) చూద్దాం.
06:13 మనం ఆ ఫైల్ ను ఒక python script గా ఎలా రన్ చేయాలో నేర్చుకుందాం.

దీనిని చేయడానికి మనం command percentage run ను ఉపయోగిస్తాము.

06:22 percentage run space hyphen i space plot underscore script.py అని టైప్ చేసి Enter నొక్కండి.
06:38 ఇక్కడ, hyphen i పారామితి టెక్స్ట్ ఎడిటర్ లో వ్రాయబడిన కోడ్ ను రన్ చేస్తుంది.

ఈ కోడ్ ప్రస్తుత ipython సెషన్ లో అమలు అవుతుంది.

06:50 ఇది ipython సెషన్ లో ఇంటరాక్టీవ్గా నిర్వచించబడిన variables ను ఉపయోగిస్తుంది.
06:56 స్క్రిప్ట్ రన్ అవుతుంది కానీ మనము plot ను చూడలేము.
07:01 ఇది ఎందుకంటే మనము ఒక స్క్రిప్ట్ నురన్ అవుతున్నప్పుడు, ఇంటరాక్టివ్ మోడ్ లో లేము.
07:07 plot ను వీక్షించడానికి, మీ terminal పై show() అని టైప్ చేసి Enter నొక్కండి.
07:15 ఇక్కడ వీడియోను పాజ్ చేసి, కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
07:21 show() ఫంక్షన్ ను దానిలో కలిగిఉన్న ఒక స్క్రిప్ట్ ను సృష్టించడానికి percentage history మరియు percentage save లను ఉపయోగించండి.
07:30 plot ను ఉత్పత్తి చేయడానికి మరియు దానినే ప్రదర్శించడానికి script ను రన్ చేయండి.
07:35 మనం పరిష్కారాన్ని చూద్దాం.

మొదట మనం the percentage history hyphen n కమాండ్ ను ఉపయోగించి history ను చూద్దాం.

07:44 percentage history space hyphen n అని టైప్ చేసి Enter నొక్కండి.
07:54 మనం ప్లాట్ విండో ను క్లియర్ చేద్దాం.

clf()అని టైప్ చేసి Enter నొక్కండి.

08:01 ఇప్పుడు మనం percentage save కమాండ్ ను ఉపయోగించి ఈ script ను సేవ్ చేద్దాము.
08:07 మనకు 2, తరువాత 4 నుండి 7 మరియు 16 వరుసలు అవసరం.
08:20 percentage save space show underscore included.py space 2 space 4 hyphen 7 space 16 అని టైప్ చేసి Enter నొక్కండి.
08:41 స్క్రిప్ట్ ను రన్ చేయడానికి

percentage run space hyphen i space show underscore included.py అని టైప్ చేసి Enter నొక్కండి.

08:57 మనము కావలసిన ప్లాట్ ను పొందుతాము.
09:01 మునుపటి command కు వెళ్లండి.

command లో hyphen i ను తొలగించండం ద్వారా percentage run space show included.py కు సవరించి Enter నొక్కండి.

09:16 ఇది linspace అనే పేరు నిర్వచించబడలేదు అని చెప్పే ఒక NameError ను చూపుతుందని మనము చూస్తాము.

ఇది ఎందుకంటే, మనము ఈ స్క్రిప్ట్ ను ఇంటరాక్టివ్ గా రన్ చేయలేదు కనుక.

09:30 దీనితో మనం ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,

percentage history command ను ఉపయోగించి history ను తిరిగిపొండడం

09:41 percentage history command కు ఒక ఆర్గుమెంట్ ను పంపడం ద్వారా history యొక్క ఒక భాగాన్ని మాత్రమే వీక్షించడం.
09:48 percentage save command ను ఉపయోగించి అవసరమైన లైన్స్ యొక్క కోడ్ లను అవసరమైన క్రమంలో సేవ్ చేయడం.
09:55 సేవ్ చేయబడిన స్క్రిప్ట్ ను రన్ చేయడానికి percentage run space hyphen i ను ఉపయోగించడం లను నేర్చుకున్నాము.
10:04 ఇక్కడ కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు.
10:08 కమాండ్ లైన్స్ 2 3 4 5 7 9 10 మరియు 11 ను మీరు ఎలా సేవ్ చేస్తారు?
10:17 percentage save filename 2-5 7 9 hyphen 11
10:25 percentage save filename 2 hyphen 11
10:30 percentage save filename

percentage save 2 hyphen 5 7 9 10 మరియు 11.

10:40 స్క్రిప్ట్ ను అమలు చేయడానికి కమాండ్ ఏది?

Percentage execute the script name

10:46 percentage run hyphen i script name

percentage run script name

10:53 percentage execute hyphen i script name
10:58 మరియు సమాధానాలు,

మనము 2 3 4 5 7 9 10 11కమాండ్స్ ను సేవ్ చేయడానికి, మనము percentage save filename 2 hyphen 5 space 7 space 9 hyphen 11 కమాండ్ ను జారీచేస్తాము.

11:18 స్క్రిప్ట్ ను రన్ చేయడానికి మనం percentage run space hyphen i space scriptname ను ఉపయోగిస్తాము.
11:27 దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
11:32 దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
11:37 FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది.
11:41 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాలకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి.
11:52 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya