PHP-and-MySQL/C4/Sending-Email-Part-1/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 హలో మరియు స్వాగతము. ఈ రోజు మీకు ఒక email స్క్రిప్ట్ ను ఎలా క్రియేట్ చేయాలో నేర్పుతాను, ముఖ్యముగా ఒక వెబ్ సైట్ పైన ఒక యూజర్ ను రిజిస్టర్ చేసేటప్పుడు ఎలా చేయాలో నేర్పుతాను.
0:12 అవి రిజిస్టర్ అయ్యాయి అని ధ్రువీకరిస్తూ ఒక ఈ మెయిల్ ను ఎలా పంపుస్తారు. మేము దానిని Send me an email అనే ఒక స్క్రిప్ట్ ను క్రియేట్ చేయడము ద్వారా చేస్తాము.
0:24 ఇది ఒక HTML form గా ఉంటుంది, ఇందులో మీరు ఒక సబ్జెక్ట్ ను ఒక మెసేజ్ ను వ్రాయవచ్చు మరియు స్పెసిఫై చేసిన అడ్రస్ కు దానిని పంపవచ్చు.
0:34 కాబట్టి మనము ఒక అడ్రస్ వేరియబుల్ ను క్రియేట్ చేద్దాము.
0:39 నేను ఇక్కడ నా hotmail అడ్రస్ ను క్రియేట్ చేస్తాను.
0:48 నేను ప్రస్తుతము నా కరెంట్ hotmail page ను ఓపెన్ అప్ చేసి Inbox పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నా నుంచి ఏమీ ఈ మెయిల్ లు లేవు అని మీరు చూడవచ్చు.
0:55 ప్రస్తుతము అక్కడ ఏమీ క్రొత్త ఈ మెయిల్ లు లేవు.
1:05 కాబట్టి ఇది నా address variable లో ఒక అడ్రస్, నేను నా వేరియబుల్ ను దానికి బదులుగా to అని రీనేమ్ చేస్తాను.
1:13 దీనిని బయటకు పంపడము కొరకు నేను mail ఫంక్షన్ ను వాడతాను.
1:17 ఇక్కడ మనకు from మరియు subject లు ఉంటాయి.
1:21 Email from PHPAcademy అని చెప్పే ఒక స్టాండర్డ్ సబ్జెక్ట్ మనము ఉంటుంది.
1:32 ఆ తరువాత మనకు సబ్మిట్ చేయడము కొరకు ఒక HTML ఫామ్ కావాలి. నేను ఇక్కడ ఒక సెల్ఫ్ సబ్మిషన్ చేసేది క్రియేట్ చేస్తాను.
1:39 కాబట్టి ఇందులో కొంత html code ను పెడదాము. ఇక్కడ నా వద్ద ఒక ఫామ్ ఉన్నది, అది send me an email dot php. అనే పేజ్ కు సబ్మిట్ చేయబడుతుంది.
1:54 మెథడ్ POST గా ఉండబోతున్నది.
1:59 ఇక్కడి నుంచి మనము మన form ను పూర్తి చేస్తాము.
2:02 అక్కడ స్పేసిఫై చేయబడిన ఈ మెయిల్ అడ్రస్ కు యూజర్ తాను ఏమి కావాలంటే అది టైప్ చేసే పంపించవచ్చు.
2:10 మీరు దీనిని తప్పకుండా ఎకౌంట్ లోకి తీసుకోవచ్చు. ఒక ఫామ్ ను క్రియేట్ చేస్తున్నప్పుడు, మీరు ఈ ప్రత్యేకమైన అడ్రస్ కు పంపించాలి అని తెలపాలి.
2:18 ఇది కేవలము send me an email స్క్రిప్ట్ గా ఉంటుంది - మీ వెబ్ సైట్ లలో ఒకదానిలో మీరు ఇన్క్లూడ్ చేయాలి అని అనుకున్న email గా ఉంటుంది.
2:27 ఇప్పుడు మనకు ఒక text ఇన్ పుట్ ఉంటుంది.
2:31 ఇది నాకు email ను పంపిస్తున్న వ్యక్తి యొక్క పేరుగా ఉంటుంది.
2:34 కాబట్టి మీరు text అని ఎవరి పేరు name అని టైప్ చేయాలి.
2:39 ప్రస్తుతము మనకు max length 20 కు సమానము అవుతుంది.
2:45 క్రింద మనము ఒక టెక్స్ట్ ఏరియా ను క్రియేట్ చేస్తాము.
2:49 కనుక నేను textarea అని టైప్ చేస్తాను మరియు దానిని అలాగే ఎండ్ చేస్తాను.
2:53 ఆ తరువాత మనము దానిని message అని టైప్ చేస్తాము.
2:59 ఇక్కడ మనము ఒక పేరాగ్రాఫ్ బిగినింగ్ ను మరియు ఒక పేరాగ్రాఫ్ ఎండింగ్ ను పెడతాము.
3:04 మరియు ఇక్కడ క్రింద మనము వాల్యూ Send కు సమానము అయిన ఒక submit button ను క్రియేట్ చేస్తాము.
3:14 లేదా ... Send me this అని పేరు పెడతాము, ఓకే?
3:17 కాబట్టి మీరు నా పేజ్ కు వచ్చి మరియు ఈ పేజ్ ను ఎంచుకుంటే.
3:21 పేరు కొరకు ఇది స్పేస్ గా ఉంటుంది మరియు మెసేజ్ కు ఇది స్పేస్ గా ఉంటుంది.
3:25 కాబట్టి నన్ను కేవలము Name: అని ఇక్కడ పెట్టనివాంది మరియు ఇక్కడ Message: అని పెట్టనివ్వండి.
3:31 మరియు ఇది ఇప్పుడు చాలా చక్కగా కనిపిస్తున్నది. మన వద్ద మన name box మరియు మన message box లు ఉన్నాయి.
3:38 మరియు మనము ఈ బటన్ ను క్లిక్ చేసినప్పుడు email పంపబడుతుంది.
3:44 ఓకే, ముందుగా మన php code లో మనము submit button ప్రెస్ చేయబడి ఉన్నదా లేదా అని చెక్ చేయాలి.
3:53 దాని కొరకు మనకు ఇక్కడ బ్రాకెట్ లలో మన if స్టేట్మెంట్ ఉన్నది మరియు మన బ్రాకెట్ లలో ఉన్న మన if కండీషన్ విలువ TRUE అవుతుంది.
4:01 కండిషన్ బ్రాకెట్ ల లోపల ఉంటుంది.
4:05 ఆ కండీషన్ submit బటన్ యొక్క పోస్ట్ వేరియబుల్ గా ఉంటుంది.
4:15 సబ్మిట్ బటన్ కు వాల్యూ ఉన్నంత సేపు ....ఒక స్పెల్లింగ్ మిస్టేక్...
4:19 కాబట్టి సబ్మిట్ బటన్ ప్రెస్ చేసి ఉన్నంత సేపు, దీనికి ఒక వాల్యూ ఉంటుంది మరియు ఆ వాల్యూ Send me this గా ఉంటుంది.
4:30 అంటే బటన్ ప్రెస్ చేయబడింది కాబట్టి ఫామ్ సబ్మిట్ చేయబడింది అని దాని అర్ధము.
4:37 కాబట్టి ఇకక్డ మనము ముందుగా ఫామ్ నుంచి డేటా ను తీసుకోవలసి ఉంటుంది.
4:44 మరియు అది ఈ ఫామ్ ను సబ్మిట్ చేయడము ద్వారా email ను సబ్మిట్ చేస్తున్న వ్యక్తి యొక్క పేరుగా ఉన్నది.
4:49 మరియు అతని పేరు ఈ ఫామ్ లోపల ఉన్నది- ఇక్కడ ఉన్న ఫీల్డ్ ను nameఅని అంటారు.
4:56 అలాగే మనకు ఒక మెసేజ్ ఉన్నది, కాబట్టి మనము ఈ వేరియబుల్ స్ట్రక్చర్ ను తేలికగా డుప్లికేట్ చేయవచ్చు మరియు అక్కడ మెసేజ్ ను కూడా చెప్పవచ్చు.
5:08 దీనిని టెస్ట్ చేయడము కొరకు నేను echo name అని చెపుతాను.
5:12 మరియు మెసేజ్ ను నేను అందులోకి కంకాటినేట్ చేస్తాను.
5:17 ఇప్పుడు దీనిని టెస్ట్ చేద్దాము. ఇక్కడ నేను Alex అని టైప్ చేస్తాను.
5:21 మరియు ఇక్కడ నేను Hi there! అని టైప్ చేస్తాను.
5:23 Send me this పైన క్లిక్ చేయండి మరియు మనకు Alex మరియు Hi there! up there అనే మెసేజ్ వస్తుంది.
5:28 కాబట్టి మనకు ఆ ఫామ్ డేటా సరిగ్గా సబ్మిట్ చేయబడింది అని తెలుస్తుంది.
5:33 వీడియో లోని తరువాతి భాగములో మనము దీనిని ఎలా వాలిడేట్ చేయాలి మరియు ఆ తరువాత ఇక్కడ తెలిపిన email-id లోని యూజర్ కు మెయిల్ ఎలా పంపాలి వంటివి నేర్చుకుందాము.
5:42 కాబట్టి తరువాతి భాగములో నన్ను కలవండి. ప్రస్తుతమునకు బై.
5:45 నేను స్వాతి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను.

Contributors and Content Editors

Sneha, Yogananda.india