PHP-and-MySQL/C2/XAMPP-in-Windows/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search


Time Narration
00:00 హలో, PHP అకాడెమీకి స్వాగతం
00:03 ఈ మొదటి ప్రాధమిక ట్యుటోరియల్లో నేను మీకు వెబ్సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవడము, మనము ఉపయోగించే ప్యాకేజీతో వచ్చే PHPను మరియు mysql ను ఇన్స్టాల్ చేయడము గురించి తెలుపుతాను.
00:22 మనము XAMPP అనే దానిని ఉపయోగించబోతున్నాము. దానిని మీరు ZAMP అని కూడా అనవచ్చు. నిజానికి దానిని ఇలాగే పలకాలి - అయినప్పటికీ నేను దానిని XAMPP అనే ప్రస్తావిస్తాను.
00:34 PHP ఇన్స్టలేషన్ మరియు మీ యొక్క mysql డేటాబేస్తో మీ సర్వర్ను మొదలుపెట్టి మరియు రన్ చేయాలంటే, మీరు ఇక్కడ ఉన్న వెబ్సైట్ను సందర్శించాలి.
00:46 apachefriends.org కు వెళ్ళండి లేక XAMPP కొరకు గూగుల్లో వెతకండి.
00:51 ఇక్కడ దానిని ఇలా పలుకుతారు: X-A-M and double P
00:56 దానిని విండోలకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, విండోస్ ఇన్స్టలేషన్ కొరకు ప్రతి ఒక్కటి ఎలా ఉపయోగించాలో మరియు ఎలా రన్ చేయాలో నేను మీకు చూపిస్తాను.
01:06 Linux లేక మరే ఆపరేటింగ్ సిస్టం కొరకు అయినా మీకు మరే ఇతర సహాయము కావాలన్నా,నాకు తెలపండి. నేను ఒక ట్యుటోరియల్ చేయుటకు సంతోషిస్తాను.
01:14 మనము ఇప్పుడు వెబ్సైట్కు వచ్చాము మరియు ఇక్కడ ఈ ఇన్స్టాలర్ ఎంచుకోవాలి.
01:19 అది ఈ పేజ్ను ఓపెన్ చేస్తుంది మరియు చివరికి ఇలాంటి ఒక ఫైల్ ఒక వర్షన్ నంబరుతో డౌన్లోడ్ చేయడముతో ముగుస్తుంది.
01:29 ముందుగా దాని కొరకు ఇన్స్టాలర్ ఎంచుకోండి.
01:32 ఇన్స్టాల్ చేసుకొనుటకు డబల్ క్లిక్ చేయండి మరియు రన్ చేయండి మరియు మీ లాంగ్వేజ్ను ఎంచుకోండి.
01:37 మీకు ఈ సందేశము రావచ్చు --నేను Windows Vista ఉపయోగిస్తున్నాను కాబట్టి, అది ఇలా అంటుంది Windows Vista Account is deactivated on your system.
01:47 మనము ఉపయోగిస్తున్నదానికి ఇది అవసరము లేదు. కాబట్టి మీకు ఈ సందేశము వస్తే ఇగ్నోర్ చేయండి.
01:52 మీరు ఇక్కడ మీ ఇన్స్టలేషన్తో ముందుకు సాగవచ్చు.
01:56 మీరు, విషయములను సులభముగా ఉంచుటకు ఒక ఫోల్డర్ కలిగిన మీ సొంత లోకల్ డ్రైవ్ ఎంచుకుంటారని నిర్ధారించుకోండి. దానిని ప్రోగ్రాం ఫైల్స్లో వేయాలని అనుకోకండి.
02:04 ఈ ఆప్షన్లు నిజానికి ఐచ్చికములు. నేను Create a XAMPP desktop ఆప్షన్ చెక్ చేస్తాను. కాని నేను దీనిని ఎంచుకోను.
02:15 మీరు Install Apache as a service మరియు Install MySQL as a service అనేవి ఎంచుకోవాలి.
02:23 ఇది దానిని సిస్టం సర్వీస్గా చేరుస్తాయి మరియు మీరు మీ కంప్యూటర్ రన్ చేసిన ప్రతిసారి అది రన్ అవుతుంది.
02:30 వీటిని చెక్ చేయకుండా ఉంచవచ్చు. సులభముగా ఉపయోగించుటకు నేను వాటిని చెక్ చేస్తాను.
02:35 ఇది ఇప్పుడు ఇన్స్టల్ అవుతుంది. నేను ఇప్పుడు దానిని అలా వదిలేస్తాను, వీడియోకు విరామము ఇస్తాను మరియు అంతా ఇన్స్టాల్ అయిన తరువాత తిరిగి వస్తాను.
02:46 తరువాత PHP ఇన్స్టలేషన్ యొక్క సెట్టింగ్లో మిగతా వాటి గురించి తెలుపుతాను.
02:53 దీనిని ఇన్స్టాల్ చేసే ముందు, ఇక్కడ నాకు ఒక బ్లాంక్ బ్రౌజర్ ఉంటే మరియు నేను లోకల్ హోస్ట్ను యాక్సెస్ చేయాలని ప్రయత్నిస్తే,
03:00 ఇది లోకల్ వెబ్సర్వర్ యొక్క హోస్ట్
03:05 మీకు సాధారణంగా google dot com వంటి వెబ్ అడ్రెస్ ఉంటుంది. కాని దీనిని మనము localhost అని అడ్రెస్ చేస్తున్నాము.
03:12 మనకు Failed to connect అనే ఎర్రర్ మెసేజ్ వచ్చిందని మీరు చూడవచ్చు.
03:16 కాని మనము Xampp ఇన్స్టాల్ చేసుకొని తిరిగి ఈ localhost ఆప్షన్ ఎంచుకుంటే,మనము నేరుగా మన సర్వర్కు కనెక్ట్ అవుతాము.
03:25 http వెబ్సర్వర్ అయిన Apache ఇన్స్టాల్ చేసుకోవడము Xampp సులభము చేస్తుంది మరియు దానిపైన php మాడ్యూల్ ఇన్స్టాల్ చేస్తుంది మరియు ఆ తరువాత సర్వర్పై mysql డేటాబేస్ను కూడా ఇన్స్టాల్ చేస్తుంది.
03:39 కాబట్టి మనము ఇన్స్టాల్ చేసుకున్న తరువాత తిరిగి దీని వద్దకు వస్తే, localhost రన్ చేయడము పని చేయాలి.
03:46 localhost డైరెక్టరీలోనికి ఫైల్స్ ఎలా వేయాలో నేను మీకు చూపుతాను.
03:51 దానిని లోకల్హోస్ట్ అని అనరు కాని మన వెబ్సర్వర్పై మన రూట్ సర్వర్ను ఇలా అడ్రెస్ చేస్తాము సారీ మన వెబ్సర్వర్పై ఒక రూట్ ఫోల్డర్.
04:00 కాబట్టి, అది ఇన్స్టాల్ అవడము పూర్తి అయితే, నేను వీడియోకు తిరిగి వస్తాను, మనము ముందుకు సాగుదాము.
03:56 సరే, మనము ఇన్స్టాలింగ్ పూర్తి చేసాము మరియు ఇప్పుడే వచ్చిన కొన్ని మెసేజ్లు ఉన్నాయి.
04:11 ముందుకు వెళ్ళి Finish అని క్లిక్ చేయండి.
04:13 ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా, మనము అవసరమైన పోర్ట్ల కొరకు వెతుకుతున్నాము.
04:22 అంటే, అది పోర్ట్ 80 మరియు mysql వెతుకుతోందని నేను అనుకుంటున్నాను.
04:15 అయినప్పటికీ, ఇక్కడ ఎటువంటి ఎర్రర్స్ లేనంత వరకు, అంతా బాగా ఉన్నట్లే.
04:32 ఇక్కడ Apache 2.2 సెట్ అప్ అయ్యిందని మీరు చూడవచ్చు.
04:36 మరియు సర్వర్ మొదలౌతున్నట్టు మరియు mysql సర్వీస్ మొదలౌతున్నట్టు కనిపిస్తుంది.
04:42 మన ఇన్స్టలేషన్ పూర్తి అయినట్లు మనకు ఒక మెసేజ్ కనిపిస్తుంది...
04:45 ఇప్పుడు మీరు XAMP కంట్రోల్ ప్యానెల్ను మొదలుపెట్టవచ్చు. మీరు Yes అని క్లిక్ చేస్తారు మరియు దానిని మనము ఇక్కడికి తేవచ్చు.
04:52 మన Apache సర్వర్ మరియు మన Mysql సర్వర్ రన్ అవుతున్నాయని మీరు చూడవచ్చు.
04:58 PHP మన వెబ్సర్వర్లో మరియు Apacheలో ఒక భాగము కావడము చేత ఇక్కడ PHP కనపడదు. అది ఒక సెపరేట్ మాడ్యూల్గా ఇన్స్టాల్ అయ్యింది మరియు ఒక సర్వీస్ లాగా రన్ అవదు. అది మన వెబ్సర్వర్కు ఒక మాడ్యూల్ అడిషన్.
05:14 మనము మన పేజ్ను ఇక్కడ లోడ్ చేద్దాము.
05:18 తిరిగి localhost పై ఎంటర్ ప్రెస్ చేయగానే, మీరు ఊహించినట్టుగా మనము XAMPP కు కనెక్ట్ అయ్యాము అని మీరు చూడవచ్చు.
05:25 ఎప్పటిలాగానే మనము మన వెబ్సర్వర్లో ఒక నిర్దిష్ట డైరెక్టరీలోనికి చూడవచ్చు.
05:31 ఇప్పటికి ముందుకు సాగండి మరియు English అని క్లిక్ చేయండి.
05:33 మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ XAMPP సెట్-అప్ అయ్యింది.
05:37 ఇప్పుడు నేను నా C డ్రైవ్ను ఇక్కడ ఓపెన్ చేస్తాను మరియు మీరు దానిని ఇక్కడ లోపల చూడవచ్చు.
05:44 నేను XAMPP పై డబల్ క్లిక్ చేస్తాను. ఇది మనము ఇన్స్టాల్ చేసిన ఇన్స్టలేషన్ డైరెక్టరీ.
05:49 ఇక్కడ మనకు కొన్ని ఫైల్స్ ఉన్నాయి కాని ముఖ్యంగా చూడవలసినది htdocs. ఇందులో మీరు మీ వెబ్సర్వర్ రన్ చేయవలసిన మరియు php లో ప్రాసెస్ చేయబడవలసిన ఫైల్స్ను వేస్తారు.
06:01 కాబట్టి, దీనిపై మీరు డబల్ క్లిక్ చేస్తే, మనకు వివిధ ఫైల్స్ ఉన్నాయని మీరు చూడవచ్చు.
06:06 ఇక్కడ మీరు చూస్తున్నది index.html ఫైల్. ఇది ఇప్పటికి index.php, అది ఇక్కడ ఉంది.
06:15 ఆటోమాటిక్గా మొదలైన ఈ ఫైల్లో ఉన్న దేనికైనా డాట్ అనే ఇండెక్స్ ఇవ్వండి.
06:20 మీరు దీనిని మార్చవచ్చు కాని ఇప్పటికి దానిని అలాగే ఉంచండి.
06:25 ఇక్కడ నా వద్ద phpacademy అనే ఒక ఫోల్డర్ ఉంది.
06:29 నేను ఏమి చేస్తానంటే, ఒక కొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను... నిజానికి చాలా సులభము కాబట్టి నేను దీనిని నా కాంటెక్స్ట్ ఎడిటర్లో చేస్తాను.
06:37 దీనిని మనము తొలగిద్దాము. సరే, నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను.
06:43 నేను దానిని సేవ్ చేస్తాను మరియు అది నా htdocs ఫోల్డర్లో సేవ్ అయ్యింది మరియు నేను దానిని dot php అని కాకుండా phpinfo అని సేవ్ చేస్తాను.
06:53 ఇక్కడ నేను php కోడ్ టైప్ చేస్తాను.
06:59 అది php underscore info మరియు మీకు 2 బ్రాకెట్లు కావాలి తరువాత మీకు ఒక లైన్ టర్మినేటర్ కావాలి.
07:05 మీకు ఇది ఏమిటో అర్థం కాకుంటే, మీరు దానిని నేర్చుకోనవసరము లేదు. అది మీకు ప్రతి రోజు వాడుకకు ఉపయోగపడే ఒక ప్రామాణికమైనది కాదు.
07:14 ఇది కేవలము మనము మన PHP సర్వర్ లేక మన వెబ్సర్వర్ php ఇన్స్టలేషన్ గురించి కొంత సమాచారము ఇస్తుంది.
07:20 కాబట్టి మీరు వెనక్కు ఇక్కడికి రావచ్చు మరియు ఇక్కడ మనము దీనిని అడ్రెస్ చేస్తాము. కాబట్టి మీకు localhost కావాలి.
07:26 మరియు మీరు htdocs అని కాని అలాంటిది మరేదైనా కాని టైప్ చేయనవసరము లేదు.
07:29 మనకు కావలసినదంతా localhost మరియు మనము టైప్ చేయాలి.. చూద్దాము..మనము మన ఫైల్ను ఏమని పిలుద్దాము - phpinfo dot php. ఎంటర్ ప్రెస్ చేయండి.
07:41 మనకు అండర్ స్కోర్ అవసరము లేదు. కాబట్టి దానిని తీసివేద్దాము మరియు తరువాత మీరు రిఫ్రెష్ చేయాలి.
07:50 మనకు ఎంతో డేటా కలిగిన మన php సమాచార ఫైల్ ఇక్కడ లభించిందని మీరు చూడవచ్చు
07:55 ఇక్కడ ఏమి జరుగుతోందంటే, మనము ఒక php స్క్రిప్ట్ను మన htdocs ఫైల్లో రన్ చేస్తున్నాము.
08:01 కాబట్టి, నేను అడ్రెస్ favicon dot ico అని అంటే, మనకు అది లభిస్తుందని మీరు చూడవచ్చు.
08:10 మీరు htdocs లో వేసిన ఏ ఫైల్స్ అయినా php ద్వారా మీ వెబ్సర్వర్ ప్రాసెస్ చేస్తుంది.
08:18 ఇక్కడ నా వద్ద ఉన్న ట్యుటోరియల్లో మీరు వ్రాసే ఏ ఫైల్ అయినా, వాటిని c : \ xampp and htdocs లో htdocs ఫోల్డర్లో వేయండి మరియు అక్కడ ఉన్నది ఏదైనా ప్రాసెస్ చేయబడుతుంది.
08:34 దానిని మీరు localhost ద్వారా కాని లేక 127.0.0.1 ద్వారా కాని అడ్రెస్ చేయవచ్చు. ఎంటర్ ప్రెస్ చేయడముతో, ఏదీ మారలేదని మీరు గమనించవచ్చు. ఇది అదే. ఇది మీ లోకల్ వెబ్సర్వర్.
08:50 మనము XAMPP ఇన్స్టాల్ చేసాము. ఇది చాలా సులభమైన పద్ధతి, మీ Apache సర్వీస్ను మరియు మీరు తరువాత ఉపయోగించే డేటాబేస్ సర్వీస్ అయిన మీ mysql సర్వీస్ను మరియు Apache కొరకు php ఫైల్స్ను ప్రాసెస్ చేసే php module ను ఇన్స్టాల్ చేయుటకు షార్ట్-కట్ మార్గము; నిజంగా ఇది చాలా ఉపయోగకరమైనది.
09:10 మనము XAMPP ను డౌన్లోడ్ చేసుకున్నాము మరియు ఇన్స్టాల్ చేసుకున్నాము మరియు నేను మీకు ఒక ఫైల్ను ఎలా క్రియేట్ చేయాలి మరియు దీనిని మీ వెబ్సర్వర్ ద్వారా ఎలా రన్ చేయాలి అని చూపించాను.
09:16 ట్యుటోరియల్స్తో మొదలుపెట్టుటకు ఇది మీకు చాలా ఉపయోగకరముగా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఏవైనా సమస్యలు ఉంటే నన్ను సంప్రదించుటకు సందేహించకండి.
09:23 దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నేను రాబోయే ట్యుటోరియల్స్లో మిమ్మల్ని కలుస్తాను. చూసినందుకు ధన్యవాదములు!
09:26 ఈ స్క్రిప్ట్ రచనకు సహకరించినవారు భరద్వాజ్ మరియు నిఖిల

Contributors and Content Editors

PoojaMoolya, Udaya, Yogananda.india