PHP-and-MySQL/C2/Logical-Operators/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | హలో, “లాజికల్ ఆపరేటర్స్” ట్యుటోరియల్ కు స్వాగతము. ఇది చాలా సంక్షిప్తము అయిన ట్యుటోరియల్, కానీ ప్రస్తుతమునకు నేను దానిని అలాగే ఉంచుతాను. |
00:09 | ప్రస్తుతము నా వద్ద "if" స్టేట్మెంట్ యొక్క ఒక ఉదాహరణ మాత్రమే ఉన్నది కనుక నేను దానినే వాడతాను. |
00:18 | ఒక లాజికల్ ఆపరేటర్ అంటే ఏమిటి? ఇప్పుడు కొంచెము లాజిక్ ను యాడ్ చేద్దాము మరియు దానిని ఒక 'and' లేదా 'or' ఆపరేటర్ అని చెపుదాము. |
00:27 | ఇప్పుడు నా యొక్క "if" స్టేట్మెంట్ కొరకు నా స్వంత లే అవుట్ ను క్రియేట్ చేయడము మొదలుపెడితే మీరు వీటితో ఏమి చేయగలరో నేను మీకు చూపించగలుగుతాను. |
00:43 | ఇంతకు పూర్వము మన వద్ద 1 కంటే ఒకటి ఎక్కువ అనే ఉదాహరణ ఉన్నది, అది ప్రస్తుతము తిరిగి మనకు ‘తప్పు’ అనే సమాధానమును ఇస్తుంది. |
00:54 | మనము ఎక్కడ ఒప్పు అనేది ఇప్పుడు చెక్ చేసి చూద్దాము. కనుక అది “తప్పు”. |
01:02 | ఇప్పుడు నేను కనుక “1 కంటే 1 పెద్దది లేదా సమానము అవుతుంది". అని అంటే ఏమి అవుతుంది. |
01:18 | ఇప్పుడు మనము దానిని 'or' అని వ్రాయము, మనము దానిని రెండు వరుస లైన్లు గా లేదా రెండు పైప్ లలా వ్రాస్తాము. |
01:27 | నాకు ఖచ్చితముగా నమ్మకము లేదు కానీ నాకు తెలిసినంత వరకు అది నా కీ బోర్డ్ లో షిఫ్ట్ కీ ప్రక్కన రెండు వరుస లైన్లుగా ఉంటుంది మరియు దాని అర్ధము 'or' అవుతుంది. |
01:38 | కనుక మనము దీనిని కంపైల్ చేస్తే దాని ఫలితము ఏమి అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? |
01:43 | ఇప్పుడు దీనిని ఒకసారి చూద్దాము - 1 కంటే 1 పెద్దది అయినట్లు అయితే - "తప్పు" మరియు మనము “తప్పు" అని వ్రాసాము లేదా 1 కి 1 సమానము అవుతుంది. |
01:54 | 1 కి 1 సమానము అవుతుంది అని మనకు తెలుసు, కనుక అది “ఒప్పు”. కాబట్టి, ఇక్కడ మనము 'or' 1 కి 1 సమానము అవుతుంది నాట్ 'and' అని టైప్ చేస్తాము, మనము 'and' అని చెపితే అప్పుడు రెండు కూడా "true" అయి ఉండాలి. |
02:04 | లేదా దీనిని చేయడము కొరకు వాటిలో ఏదీ కూడా "true" అవ్వకూడదు. |
02:07 | అవుట్ పుట్. కనుక బహుశా మనకు "true" అని అవుట్ పుట్ రావచ్చును. |
02:14 | ఇంక 'or' గురించి. |
02:17 | ఇది మీకు రెండు పోలికలు చేసే అవకాశము ఇస్తుంది. వాటిని మీ "if" స్టేట్మెంట్ లో చూపించండి మరియు వాటిలో ఏదో ఒకటి "true" అయితే సరిపోతుంది - కనుక అది ఒక "either" ఆపరేటర్ వంటిది ... |
02:29 | వాటిలో ఏదో ఒకటి "ఒప్పు" అయితే మీకు సమాధానము చివరకు "ఒప్పు" అని వస్తుంది. |
02:35 | "and" ఆపరేటర్ మరొక పద్ధతిలో పని చేస్తుంది. |
02:39 | "and" ఆపరేటర్ యొక్క ఎగ్జిక్యూట్ కావాలి అని అంటే దాని రెండు ఆపరాండ్ ల అవుట్ పుట్ కూడా "ఒప్పు" అవ్వవలసి ఉంటుంది. |
02:44 | కనుక 1 కంటే 1 ఎక్కువ కాదు కనుక మనకు “తప్పు” అనే సమాధానము రావాలి. |
02:51 | మనము మరలా మన పోల్చి చూసే ఆపరేటర్ల వద్దకు వెళదాము "if 1 ఈజ్ గ్రేటర్ దాన్ or ఈక్వల్ టు 1 'and' 1 ఈక్వల్ 1" అని టైప్ చేస్తే మనకు దాని ఫలితము "ఒప్పు" గా వస్తుంది. |
03:01 | కనుక ఇప్పుడు దీనిని పరీక్షించి చూడడము కొరకు నేను మరికొన్ని వేరియబుల్ లను దీనికి యాడ్ చేయాలి అని ఆలోచిస్తున్నాను. |
03:08 | కానీ ఇప్పటికే నా ఇతర ట్యుటోరియల్ లను అనుసరిస్తూ మీకు వేరియబుల్ లతో తగినంత పరిచయము ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. |
03:12 | కనుక ఇవి రెండు లాజికల్ ఆపరేటర్లు. . |
03:17 | మీకు ఇవి చాలా ఉపయోగకరముగా అనిపిస్తాయి, ఎందుకు అంటే మీరు ఉదాహరణకు ఇలా చెప్పాలి అని అనుకోవచ్చు—ఇది చాలా క్లాసిక్ ఉదాహరణ. మీరు దీనిని నా ప్రాజెక్ట్ లలో ఒకదానిలో కనుగొనవచ్చు..... |
03:27 | అది ఒక "login" ఫామ్. ఒక యూజర్ ఒక వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి అనుకుంటున్నాడు అనుకోండి. |
03:34 | మీరు ఇంతకు ముందు బహుశా ఒక వెబ్ సైట్ లోకి లాగిన్ అయి ఉండవచ్చు మరియు అది మిమ్మల్ని మీ "username" మరియు "password" లను ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు అక్కడ ఈ కీవర్డ్ లు ఉంటాయి. |
03:40 | యూజర్ "username" మరియు "password" లను ఎంటర్ చేసారో లేదో మనము చెక్ చేయాలి. |
03:44 | వారు ఎంటర్ చేయకపోతే "username" మరియు "password" లను పోల్చి చూడడములో అర్ధము లేదు. |
03:48 | కనుక మనము "if username and password" అని చెప్పే ఒక ఉదాహరణను చూద్దాము. |
03:52 | నిజమునకు ఇలా చేద్దాము. నేను "username" ఈజ్ ఈక్వల్ టు "alex" మరియు నా password ఈజ్ ఈక్వల్ టు "abc" అని అంటాను. |
04:04 | ఇప్పుడు నేను దీనిని ప్రతిక్షేపిస్తాను. నేను "username" మరియు "password" అని చెపుతాను. |
04:11 | ఈ క్షణములో అది "ఒప్పు" అని చెపుతుంది. |
04:15 | నేను దీనిని మారుస్తాను. నేను 'ok' అని చెపుతాను లేదా అక్కడ చివరకు HTML ఫీల్డ్ లు ఉంటాయి కనుక 'you forgot to fill out a field' అని చెపుతాను. |
04:27 | మన వద్ద రెండు వాల్యూస్ కూడా ఉన్నాయి కనుక ఇది సరిగానే ఉంటుంది. |
04:32 | కనుక దీనిని ప్రయత్నించి చూద్దాము. అవును, అది "ok" అని చెపుతోంది.. |
04:37 | ఇప్పుడు, నేను అక్కడ నా పాస్ వర్డ్ ను టైప్ చేయడము మరచిపోతే ఏమి జరుగుతుంది? ప్రస్తుతము అక్కడ ఏమీ లేదు- ఖాళీ కూడా లేదు- ఈ సమస్య నుంచి బయటపడదాము. |
04:45 | 'మీరు ఒక ఫీల్డ్ ను నింపడము మరచి పోయారు '. |
04:50 | కనుక ఇది యూజర్ నుంచి వస్తుంది అని మీరు ఊహించినట్లు అయితే, అది మీరు మీ “username" మరియు "password” లను టైప్ చేసినప్పుడు వచ్చింది. |
04:57 | మనము "username" మరియు "password" అని చెపుతున్నాము ; నిజమునకు "username" తప్పకుండా ఉంటుంది కనుక అది తనంత తానే నిజమైనది. ... |
05:03 | మీరు దానిని దాని స్థానములో ఉంచినట్లు అయితే అది ఆమోదనీయము అవుతుంది; అది “ఒప్పు” అవుతుంది. |
05:14 | మీరు అక్కడకు వెళ్ళారో లేదో మేము చెక్ చేస్తాము. |
05:18 | మీకు "username"మరియు "password" లు లభించాయి కనుక అది బాగానే ఉన్నది. |
05:23 | కానీ ఇక్కడ 'or' అనేదానికి నిజముగా అర్ధము లేదు మరియు ఏమి జరుగుతుందో మీరు ఉహించగలరు. |
05:28 | ప్రస్తుతము మనకు రెండు విలువలు లభించాయి కనుక అది “ఒప్పు” అవుతుంది. కనుక ఇది 'ok'. |
05:36 | ఇప్పుడు నేను ఆ రెంటినీ తీసుకుంటే ఏమి జరుగుతుంది, ఇప్పుడు ప్రయత్నించి చూద్దాము. |
05:42 | "if the username exists" , username కనుక "ఒప్పు" అయినట్లు అయితే... |
05:46 | ప్రస్తుతము అక్కడ ఏమీ విలువ లేదు—కనుక దాని విలువ "తప్పు" అవుతుంది. |
05:48 | "or the password is true" – అంటే విలువ ఉన్నది; కానీ ఈ క్షణములో విలువ లేదు, కనుక ‘తప్పు’ అవుతుంది. |
05:52 | కనుక మనము "You forgot to fill out a field" అని చెపుతాము. |
05:56 | ఈ క్షణములో దానికి అర్ధము లేదు కనుక నేను అక్కడ ఏమీ వ్రాయబోవడము లేదు. |
06:03 | కనుక రిఫ్రెష్ చేయండి మరియు మనకు అక్కడ ఏమీ రావడము లేదు. |
06:05 | నేను ఇప్పటికే చాలా రోజు వారీ php అప్లికేషన్లలో ఇవి ఎంత ఉపయోగకరము అవుతాయి అనేది వివరించి ఉన్నాను. |
06:13 | ఉదాహరణకు – ఎవరైనా ఒక ఫామ్ ను ఫిల్ చేయవచ్చు. దానికి ఇంకా చాలా మంది ఇతర యూజర్లు ఉండడమును మీరు గమనించవచ్చు. |
06:16 | కానీ అది అంతే. |
06:19 | లాజికల్ ఆపరేటర్లు అయిన రెండు ఆపరేటర్లు. |
06:24 | వాటిని ప్రయత్నించి చూడండి మరియు వాటితో మీరు ఏమేమి చేయగలరో చూడండి. |
06:28 | వీటిని చాలా త్వరలో నా ప్రాజెక్ట్ లలో ఒకదానిలో తప్పనిసరిగా వాడబోతున్నాను. |
06:30 | గమనించినందుకు కృతజ్ఞతలు. |
06:35 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెప్పింది: నిఖిల. |