PHP-and-MySQL/C2/Common-Way-to-Display-HTML/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | మీ php లోపలివైపు HTML ను చూపించడానికి ఒక చిట్కా. ఇది మీరు if స్టేట్ మెంట్స్ వాడునపుడు లేదా బ్లాక్ ను వాడునపుడు మరియు ఒక షరతు ప్రకారం చేయవలసినపుడు, లేదా php లో పనిచేయునపుడు, లోపల, HTML ద్వారా, చాలా అవుట్ పుట్ కావలసినపుడు, మీకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. |
00:22 | ఈ ఉదాహరణలో, నాకు ఒక వేరియబుల్-పేరు ఉంది, దీనిని అలెక్స్ గా సెట్ చేసాను. |
00:30 | కాబట్టి, నేను పేరును అలెక్స్ గా టైప్ చేస్తే, అపుడు, అది హాయ్ అలెక్స్ గా echo అవుతుంది. |
00:36 | పేరు అలెక్స్ కానట్టయితే, మనం else- అని టైప్ చేద్దాం, అపుడు మీరు అలెక్స్ కాదు. దయచేసి మీ పేరును టైప్ చేయండి. అని ఎకొ వస్తుంది. |
00:47 | ఇక్కడ మనకొక ఇన్ పుట్ ఫీల్డ్ ఉంది, దాని చుట్టూ ఒక ఫారం ఉంది. |
00:53 | కాబట్టి, ఫారం ఏక్షన్ = Index.php మెథడ్=పోస్ట్, మనం ఇక్కడ ఆపేద్దాం. |
01:02 | మనం దీనిని కొంచెం క్రిందకు తెద్దాం, ఇప్పుడు బాగా కనపడుతోంది. కాబట్టి, మన వద్ద Else బాక్స్ లో కొన్ని HTML కోడ్స్ ఉన్నాయి. |
01:15 | కాబట్టి మనం If else అని టైప్ చేసి, ఇక్కడ ఒక బ్లాక్ ప్రారంభించి, ఇక్కడ ఆపేద్దాం. HTML కోడ్ చాలా ఎక్కువగా ఉంది. |
01:27 | మీరు HTML కోడ్ ను Echo చేసి, echo out చేయాల్సిన పనిలేదని చెప్పడమే ఈ ట్యుటోరియల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. |
01:34 | ఈ కోడ్ లో సింగిల్ ఇన్వర్టెడ్ కామాల బదులుగా కొటేషన్ మార్క్స్ ఉపయోగించడం వల్ల, మీకు సులభంగా ఉంటుంది మరియు సమయము కూడా మిగులుతుంది. |
01:41 | బ్లాక్స్ లోపల కోడ్ ఉండడం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, మీరు టైప్ చేసే దాని గురించిన చింత ఈ బ్లాక్ లో ఉండదు. |
01:58 | మీరు మార్కులను కొటేషన్ చేస్తే, ఈ ఫార్వర్డ్ స్లాష్, క్యారెక్టర్ ను తప్పిస్తుంది. |
02:09 | కాబట్టి, ఇది చూపబడుతుంది, కానీ, ఇక్కడ, ఎకొ ప్రారంభం లోనూ, చివర లోనూ ఇది ఉపేక్షించబడుతుంది. |
02:19 | ఉదాహరణకు, ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. |
02:25 | పేరు అలెక్స్ కాబట్టి, మనం ముందు చూసినట్టుగా, అది నాకు శుభాకాంక్షలు చెబుతోంది. |
02:31 | చిన్న టెక్ట్స్ లకు, ఎకొ సరిపోతుంది కానీ పెద్దవయిన ఫారం మొదలైన వాటికి, ఎకొ ని వాడలేము. |
02:42 | ప్రస్తుతం అది పని చేయదు. మనకు ఎర్రర్ వస్తుంది. ఈ టెక్ట్స్ లో మనం అవుట్ పుట్ పద్ధతిని అమర్చలేదు. |
02:56 | ఇది 12వ లైన్. కాబట్టి, మీరు 12వ లైన్ కు వెళ్ళినట్లయితే, మీరు దీనిని చూడగలరు. మనం ఈ సమస్యను ఇలా సరి చేయవచ్చు. |
03:08 | మన php ఓపెనింగ్ ట్యాగ్ ఇక్కడ చూడవచ్చు. నేను ట్యాగ్ ను ఇక్కడే ఆపేస్తున్నాను. |
03:19 | కాబట్టి, బ్లాక్ మొదలయిన తరువాత మనం ట్యాగ్ ను ఆపేస్తున్నాం. ఇపుడు, కర్లీ బ్రాకెట్ ప్రక్కనే, నేనొక కొత్త ట్యాగ్ ను మొదలుపెడుతున్నాను. |
03:30 | కాబట్టి, ఇపుడు మనం php కోడ్ మరియు ఒక అంశాన్ని చూస్తున్నాము. ఇక్కడ మిగిలినది, php కాదు. ఇది HTML కాబట్టి, దానిని HTML కోడ్ గా చూపబడింది. |
03:46 | కాబట్టి, ముందుగా నేనేం చేస్తానంటే, ఈ కొటేషన్ మార్స్ ను మార్చేస్తాను. |
04:02 | ఈ పద్ధతిని ప్రారంభం నుండే అమలుపరిస్తే, మీరు సులభంగా కోడ్ చేయవచ్చు. అలాచేస్తే, బాగా పనిచేస్తుంది. |
04:07 | కాబట్టి, తెర పై దీనిని తిరిగి చూడవచ్చు. మనకు బ్లాక్ కనిపిస్తోంది, ఇక్కడ బ్లాక్ చేయండి. ఇక్కడ php దాదాపుగా సమాప్తమయినట్టుగా అనిపిస్తుంది. |
04:21 | కానీ మనం బ్లాక్ ను ఈచోట లోపలి వైపున ముగించలేదు, ఇక్కడ, ఇంకా క్రిందికి వెళుతున్నాం. మనం ఎకో చేయబోవట్లేదు కానీ చూపిన్తున్నాము. |
04:37 | ఇది Else బ్లాక్ కు ప్రత్యేకంగా అమలుకాబడుతుంది. మనం ఇక్కడ మరియు ఇక్కడ నీలిరంగులో హైలైట్ చేసిన లైన్ లో, బ్లాక్ ను ముగిద్దాం. |
04:46 | కాబట్టి, తిరిగి మనకు హాయ్ అలెక్స్ వస్తుంది. ఇపుడు, మనం పేరును, కైల్ లాగా మారిస్తే, రిఫ్రెష్ చేయండి. |
04:58 | HTML బాగా కనబడడం మనం చూస్తున్నాము. కానీ అది, php ని ఉపయోగించుకుని, ఎకొ కాబడలేదు. |
05:08 | ఇది HTMLను సరిగా ప్రదర్శించుటకు, ఒక మంచి పద్ధతి మరియు సులభంగా అర్థమవుతుంది.
మీకు అర్థమవడంలో, ఈ ట్యుటోరియల్ సహాయపడిందని అనుకుంటాను. వీక్షించినందుకు ధన్యవాదములు. |