PERL/C3/Including-files-or-modules/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | PERL లో Including files or modules ఫై Spoken Tutorial కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do use మరియు require method లను ఉపయోగించడం గురుంచి నేర్చుకుంటాము. |
00:16 | ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం, Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:28 | మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు. |
00:32 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన ఉండాలి. |
00:37 | లేకపోతే, సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:44 | do() method: ఇవి ప్రస్తుత స్క్రిప్ట్ ఫైల్ లోనికి ఇతర ఫైల్స్ నుండి సోర్స్ కోడ్ ను చేర్చడానికి సులభమైన మార్గాలు. |
00:53 | do() methodను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకుందాం. |
00:57 | ఒక కొత్త ఫైల్ ను మీ టెక్స్ట్ ఎడిటర్ లో తెరచి, దానికి datetime dot pl అని పేరు పెట్టండి. |
01:03 | datetime dot pl లో, క్రింద స్క్రీన్ పై ప్రదర్శించిన కోడ్ ను టైప్ చేయండి. |
01:09 | ఇక్కడ నుంచి, terminal పై ప్రతి కమాండ్ తర్వాత Enter నొక్కాలి అని గుర్తుంచుకోండి. |
01:15 | మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం. |
01:18 | ప్రస్తుత తేదీ మరియు సమయం dollar datestring వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి. |
01:23 | ఇక్కడ, నాకు msgThanks అనే పేరుతో ఒక ఫంక్షన్ ఉంది అది “Thank you” సందేశాన్ని రిటర్న్ చేస్తుంది. |
01:31 | ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl+ S నొక్కండి. |
01:35 | తరువాత, మనము ఈ datetime dot pl ఫైల్ ను ఉపయోగించుకునే మరొక Perl ప్రోగ్రాం ను చూద్దాం. |
01:43 | మీ text editor లో కొత్త ఫైల్ ను తెరచి, దానికి main dot pl అని పేరు పెట్టండి. |
01:49 | main dot pl ఫైల్ లో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చెయ్యండి. |
01:55 | నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి. |
01:58 | ఇక్కడ, మొదటి లైన్ స్వాగతపు సందేశాన్ని ముద్రిస్తుంది. |
02:03 | మనం కోడ్ ను ఉపయోగించాలనుకుంటున్న చోటు నుండి do() పద్ధతి ఫైల్ పేరుతో పిలువబడుతుంది. |
02:09 | datetime dot pl file లో $datestring వేరియబుల్ లో ప్రస్తుత తేదీ మరియు సమయం నిల్వ చేయబడి ఉంటుంది. |
02:16 | చివరికి, మనం అదే ఫైల్ నుండి msgThanks() ఫంక్షన్ ను పిలుస్తాము. |
02:21 | ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. |
02:25 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
02:27 | terminal కు తిరిగి మారి, perl main dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:34 | టెర్మినల్ పై అవుట్పుట్ ను గమనించండి. |
02:37 | తరువాత, మనం Perl ప్రోగ్రాం లో require() method మరియు use() methodని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము. |
02:44 | మనం సేకరించిన subroutines ను బహుళ Perl ప్రోగ్రామ్స్ లో ఉపయోగించినప్పుడు ఈ methods ఉపయోగబడతాయి. |
02:52 | use() method, modules లో మాత్రమే ఉపయోగబడతాయి. |
02:56 | ఇది compilation సమయంలో తనిఖీ చేయబడుతుంది. |
02:59 | ఫైలు కు extension ఇవ్వాల్సిన అవసరం లేదు. |
03:03 | require() method పెర్ల్ ప్రోగ్రామ్ లో మరియు modulesలో రెండింటి కొరకు ఉపయోగించబడుతుంది. |
03:08 | ఇది run time లో తనిఖీ చేయబడును. |
03:10 | file extension ఇవ్వాల్సిన అవసరం ఉంది. |
03:14 | use method సింటాక్స్: use module name semicolon |
03:20 | Perl modules అనేవి .pm పొడిగింపుతో ఉండే ఫైల్స్. |
03:25 | కోడ్ ను తిరిగి వినియోగించుట, modules ద్వారా అమలు జరుగును. |
03:30 | ఇవి ఇతర (కంప్యూటర్) భాషల్లో librariesని పోలి ఉంటాయి. |
03:35 | ఇప్పుడు నేను మాడ్యూల్ ను పెర్ల్ కోడ్ లో ఉంచడానికి use methodతో సులభమైన ప్రోగ్రాం ను చూపిస్తాను. |
03:43 | మీ text editor లో ఒక కొత్త ఫైలు ను తెరవండి మరియు దానికి sum dot pm అని పేరు పెట్టండి. |
03:49 | sum dot pm ఫైలులో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చెయ్యండి. |
03:55 | ఇక్కడ నేను ఇచ్చిన సంఖ్యల సమితి మొత్తాన్ని గుణించగల సాధారణ function ఉంది. |
04:01 | ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. |
04:05 | మనం sum dot pm ఫైల్ ను ఉపయోగిస్తూ, అక్కడ మనం మరొక్క Perl script ను వ్రాస్తాము. |
04:11 | నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ ఫైల్ app dot pl ను నన్ను తెరవనివ్వండి. . |
04:17 | App dot plలో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. |
04:22 | నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి. |
04:25 | మొదటి లైన్ మాడ్యూల్ పేరుతో use మేథోడ్ ను చూపిస్తుంది. |
04:29 | మన కేస్ లో మాడ్యూల్ పేరు sum. |
04:33 | మనం sum dot pm ఫైలులో total() ఫంక్షన్ కు 1, 7, 5, 4, 9 ను input parameters గా పంపిస్తున్నాము. |
04:44 | మళ్ళీ, తరువాత లైన్ లో, మనము అదే ఫంక్షన్కు 1 నుండి 10 లను input parameters గా పంపిస్తున్నాము. |
04:52 | ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl+ S ను నొక్కండి. |
04:56 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
04:59 | తిరిగి టెర్మినల్ కు మారి, perl app dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
05:06 | టెర్మినల్ పై ప్రదర్శించబడిన అవుట్పుట్ ను గమనించండి. |
05:10 | use methodలో మరికొన్ని ఎంపికలను చూద్దాము. తిరిగి టెక్స్ట్ ఎడిటర్ లో sum dot pm కు మారండి. |
05:18 | సోర్స్ కోడ్ ప్రారంభంలో, use strict సెమికోలన్, use warnings సెమికోలన్ లైన్ లను జోడించండి. |
05:27 | use strict మరియు use warnings అనేవి compiler flags, ఇవి పెర్ల్ ను కఠినమైన రీతిలో ప్రవర్తించేలా సూచిస్తాయి. |
05:35 | ఇవి సాధారణ ప్రోగ్రామింగ్ తప్పులను నివారించడానికి ఉపయోగించబడతాయి. |
05:39 | use strict ప్రోగ్రాం లో ఉపయోగించిన అన్ని వేరియబుల్స్ ను డిక్లేర్ చేయటం తప్పనిసరి చేస్తుంది. |
05:45 | errors ఉంటే, use strict అమలును రద్దు చేస్తుంది. |
05:50 | use warnings హెచ్చరికలను మాత్రమే అందిస్తూ, అమలుతో కొనసాగుతుంది. |
05:56 | వేరియబుల్ $sum ను my గా మనం డిక్లేర్ చేయడం మరచిపోయాం అని అనుకోండి. |
06:02 | ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ఎలా అమలు చేయబడుతుందో మనం చూద్దాము. |
06:06 | ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. |
06:09 | తిరిగి టెర్మినల్ కు మారి, perl app dot pl అని టైప్ చేయండి. |
06:15 | ఫలితాన్ని అమలు చేయకుండా, ప్రోగ్రాం రద్దు చేయబడడం మనం చూడవచ్చు. |
06:21 | టెర్మినల్ పై ప్రదర్శించబడిన మొదటి లైన్ల సమూహం, “use strict” ద్వారా వచ్చిన error messages. |
06:29 | చివరివి రెండు abort సందేశాలు. |
06:32 | కాబట్టి, ఇది use method ఎంపికలు పని చేసే విధానం. |
06:36 | తరువాత, మనం పెర్ల్ ప్రోగ్రాం లో require మెథడ్ ఉపయోగం చూద్దాము. |
06:41 | నేను ఇప్పటికే సేవ్ చేసిన commonfunctions dot pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి. |
06:48 | స్క్రీన్ పై క్రింద ప్రదర్శించబడిన కోడ్ ను మీ commonfunctions డాట్ pl ఫైల్ లో టైప్ చేయండి. మనం ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం. |
06:57 | ఇక్కడ, సామాన్యంగా ఉపయోగించే ఫంక్షన్ల సమూహం ను మనం చూడవచ్చు. |
07:01 | మొదటి ఫంక్షన్, square() ఒక సంఖ్య యొక్క స్క్వేర్ ని తిరిగి అందిస్తుంది. |
07:06 | రెండవ ఫంక్షన్, square underscore root() ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమూలాన్ని తిరిగి అందిస్తుంది. |
07:12 | తదుపరి ఫంక్షన్, random underscore number() ఒక యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది. |
07:18 | చివరి ఫంక్షన్, random underscore range() కనిష్ట మరియు గరిష్ట శ్రేణి సంఖ్యల మధ్య యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది. |
07:26 | మనకి ఫైల్ చివరిలో 1 semicolon (1;) అవసరం అని గమనించండి. |
07:31 | ఇది ఎందుకంటే Perl ఫైలులో చివరి expression true విలువను తిరిగి ఇవ్వడం అవసరం. |
07:37 | ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. |
07:41 | తరువాత, మనం require మెథడ్ ను ఉపయోగించి ఈ subroutines ని call చేస్తూ ఒక పెర్ల్ ప్రోగ్రాం ను వ్రాస్తాము. |
07:48 | నేను ఇప్పటికే సేవ్ చేసిన, callprogram dot pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి. |
07:54 | మీ ఫైల్లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి.
ఇప్పుడు నను కోడ్ ను వివరించనివండి. |
08:02 | require పెర్ల్ కోడ్ను కలిగి ఉన్న commonfunctions dot pl ఫైలు చదువుతుంది మరియు కంపైల్ చేస్తుంది. |
08:09 | ఈ ప్రోగ్రామ్ వినియోగదారునికి 4 ఎంపికలను ఇస్తుంది. వినియోగదారు ఒక సమయంలో ఒక ఎంపికను ఎంచుకోవాలిసి ఉంటంది. |
08:17 | 1: (ఒకటి) సంఖ్య వర్గం ను గుర్తించడం కోసం. |
08:20 | 2: రెండు సంఖ్య యొక్క వర్గ మూల కోసం. |
08:23 | 3: ఇచ్చిన శ్రేణిలో యాదృచ్ఛిక సంఖ్య కోసం.
4: నాలుగు ప్రోగ్రాం నుండి నిష్క్రమించడం కోసం. |
08:29 | ఒకవేళ 1 (ఒకటి) ఎంపిక టైప్ చేసినట్లైతే, అది వినియోగదారుని, ఒక సంఖ్యను ఎంటర్ చెయ్యమని అడుగుతుంది. |
08:34 | ఈ విలువ $ number లో భద్రపరచబడుతుంది. విలువ commonfunctions dot pl file లో square() ఫంక్షన్ కు పంపించబడుతుంది. |
08:44 | function సంఖ్య యొక్క వర్గం ను తిరిగి పంపుతుంది. |
08:47 | print స్టేట్ మెంట్ సంఖ్య యొక్క వర్గం ను అవుట్పుట్ గా ముద్రిస్తుంది. |
08:52 | ఒకవేళ 2 (రెండు)ఎంపిక చేసినట్లు అయితే, సంఖ్య వర్గమూలం అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. |
08:58 | మునుపటి square() లో వివరించిన విధంగా చర్య అమలు జరుగుతుంది. |
09:03 | ఒకవేళ 3 (మూడు) ఎంపిక టైప్ చేయబడితే, ఇచ్చిన పరిధిలో యాదృచ్చిక సంఖ్యను అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. |
09:09 | లేదా ఒకవేళ ఎంపిక 4 (నాలుగు) అయితే, ప్రోగ్రామ్ నిష్క్రమించబడుతుంది. పేర్కొన్న వాటి కంటే వేరే ఎంపిక ఇవ్వబడినట్లయితే, print స్టేట్మెంట్ Incorrect option అని ఇస్తుంది. |
09:20 | ఈ ప్రోగ్రాంలో మనం commonfunctions dot pl, లో ఉన్న నాలుగు నుండి మూడు ఫంక్షన్ లు మాత్రమే పిలిచామని గమనించండి. |
09:28 | ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. |
09:31 | ఇపుడు మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
09:34 | టెర్మినల్ కు తిరిగి మారి, perl callprogram dot pl అని టైప్ చేయండి. |
09:41 | అవుట్పుట్ ను గమనించండి. |
09:44 | నేను వేరొక ఎంపికలతో, మరొకసారి ప్రోగ్రామ్ ను అమలు చేస్తాను. |
09:49 | perl callprogram dot pl అని టైప్ చేయండి. |
09:53 | ఇప్పుడు, ఎంపికను 3 గా ఎంటర్ చేయండి. |
09:56 | 50 గా Enter a lower rangeను ఎంటర్ చేయండి. |
09:59 | 99గా Enter a upper range ను |
10:02 | ఇచ్చిన శ్రేణిలో యాదృచ్చిక సంఖ్య సృష్టించబడిందని మనము చూడవచ్చు. |
10:08 | మీ స్వంతంగా ఇతర ఎంపికలు ప్రయత్నించండి. |
10:11 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తెస్తుంది. సారాంశం చూద్దాం. |
10:16 | ఈ ట్యుటోరియల్ లో మనము పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do, use, require methods ఉపయోగించడ గురుంచి నేర్చుకున్నాము. |
10:24 | గమనిక: use module require మాడ్యూల్ పై సిఫార్సు చేయబడింది, ఎందుకంటే ఇది compile time లో మాడ్యూల్ లభ్యతను నిర్ణయిస్తుంది. |
10:33 | ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది.
మీరు పాల్గొనే వారికీ ఒక లేఖ వ్రాసే reminder.pl ప్రోగ్రాం ను వ్రాయండి. |
10:41 | To మరియు From పేరును ఎంటర్ చేయడానికి వినియోగదారుని ప్రాంప్ట్ చేయండి. |
10:45 | use పద్ధతి ని ఉపయోగించి Letter dot pm నుండి సబ్ రౌటిన్స్ ని Call చేయండి. |
10:50 | క్రింది ఫంక్షన్ ల ను Letter dot pm ఫైల్ లో వ్రాయండి. |
10:54 | LetterDate() ఫంక్షన్ ప్రస్తుత తేదీ మరియు సమయాన్ని తిరిగి పంపుతుంది. |
10:58 | To() ఫంక్షన్ లో పాల్గొనేవారి పేర్లను తిరిగి పంపుతుంది. |
11:02 | From() ఫంక్షన్ పంపినవారి పేరును తిరిగి పంపుతుంది. |
11:05 | Lettermsg() ఫంక్షన్ లేఖలోని కంటెంట్లను తిరిగి పంపుతుంది. |
11:09 | Thanksmsg() ఫంక్షన్ thanks మరియు regards తిరిగి ఇస్తుంది. |
11:13 | ఇక్కడ చూపిన విధంగా అవుట్పుట్ ప్రసర్శించబడుతుంది. |
11:20 | కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
11:27 | Spoken Tutorial Project బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
11:36 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
11:40 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది |
11:51 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి ధన్యవాదాలు. |