PERL/C2/More-Conditional-statements/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 PERLలో if-else if-else మరియు switch conditional statements పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము,
00:10 Perl లో if-elsif-else స్టేట్మెంట్ మరియు switch స్టేట్మెంట్ గురుంచి నేర్చుకుంటాము.
00:15 నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు Perl 5.14.2 ఉపయోగిస్తున్నాను.
00:22 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తాను.
00:25 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
00:29 మీకు Perl లో వేరియబుల్స్ మరియు comments గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి.
00:34 for, foreach, while, do-while మరియు if మరియు if-else స్టేట్మెంట్ లపై,
00:38 అవగాహన ఉండడం ఆదనపు ప్రయోజనం.
00:43 సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:48 Perl లో If-elsif-else స్టేట్మెంట్ ను
00:52 బహుళ కండిషన్ లను పరీక్షించడానికి మరియు
00:54 అన్ని కండిషన్ లు విఫలమైనప్పుడు డిఫాల్ట్ else బ్లాక్ ను అమలు చేయడానికి ఉపయోగించవచ్చు.
00:59 If-elseif-else సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది.
01:04 if space open bracket condition1 close bracket space open curly bracket Enter నొక్కండి.
01:13 కండిషన్ true అయినప్పుడు అమలు కావలసిన కోడ్ సెమికోలన్.
01:18 మరియు Enter నొక్కండి.
01:20 Close curly bracket space elsif space open bracket condition2 close bracket space open curly bracket.
01:30 మరియు Enter నొక్కండి.
01:33 Elsif condition true అయినప్పుడు అమలు కావలసిన మరొక కోడ్ సెమికోలన్.
01:37 Enter నొక్కండి.
01:39 క్లోజ్ కర్లీ బ్రాకెట్ స్పేస్ else స్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్
01:44 Enter. పైన ఉన్న రెండు కండిషన్ లు false అయినప్పుడు కోడ్ అమలు అవుతుంది సెమికోలన్.
01:51 Enter నొక్కండి క్లోజ్ కర్లీ బ్రాకెట్.
01:55 ముందుగా, ఒకవేళ condition1 true అయితే if కండిషన్ తనిఖీ చేయబడుతుంది మరియు అమలు అవుతుంది.
02:01 లేకపోతే, అప్పుడు else if కండిషన్ తనిఖీ చేయబడుతుంది మరియు ఇది true అయితే అమలు అవుతుంది.
02:06 లేకపోతే, else బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలు చేయబడుతుంది.
02:11 ఇప్పుడు if-elsif-else స్టేట్మెంట్ యొక్క ఉదాహరణను చూద్దాము.
02:16 టెర్మినల్ ను తెరచి,
02:19 gedit conditionalBlocks dot pl space ampersand అని టైప్ చేసి,
02:26 Enter నొక్కండి.
02:28 ఇది gedit లో conditionalBlocks.pl ఫైల్ ను తెరుస్తుంది.
02:33 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
02:38 మనము వేరియబుల్ language కు పెర్ల్ విలువను కేటాయించాము.
02:44 eq అనేది string comparison ఆపరేటర్ అని గమనించండి.
02:49 ఆపై మనకు తనిఖీ చేయవలసిన వివిధ కండిషన్ లు ఉన్నాయి.
02:55 ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
02:58 టెర్మినల్ కు మారి, ఫైల్ ను నేరుగా అమలు చేయండి.
03:02 perl conditionalBlocks dot pl అని టైప్ చేయండి.
03:09 గమనిక: నేను కంపైలేషన్ దశను వదిలేస్తున్నాను. ఇది పెర్ల్ స్క్రిప్ట్స్ ను అమలు చేయడానికి తప్పనిసరి దశ కాదు.
03:16 ఒకవేళ కంపైలేషన్ లోపం ఉంటే,
03:18 ఎగ్జిక్యూషన్ ఒక ఎర్రర్ ను పంపుతుంది మరియు స్క్రిప్ట్ అమలవడాన్ని ఆపుతుంది.
03:23 ఇప్పుడు Enter నొక్కండి.
03:25 టెర్మినల్ పై చూపించబడే అవుట్పుట్,
03:27 Hi, I am Perl.
03:29 ఇప్పుడు, మనం మన తదుపరి కేసును చూద్దాము.
03:31 Gedit కు మారండి.
03:33 చూపిన విధంగా వేరియబుల్ languageకు Java ను కేటాయించండి.
03:37 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
03:40 టెర్మినల్ కు మారి, ఫైల్ ను అమలు చేయండి.
03:43 perl conditionalBlocks dot pl అని టైప్ చేసి,
03:50 Enter నొక్కండి.
03:53 టెర్మినల్ పై చూపించబడిన అవుట్పుట్ Hi, I am Java.
03:59 మరల మనం తిరిగి gedit కు మారుద్దాం.
04:03 ఇప్పుడు, language వేరియబుల్ కు English ను కేటాయిద్దాం.
04:07 ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి.
04:09 టెర్మినల్ కు మారి, ఫైల్ ను అమలు చేయండి.
04:13 perl conditionalBlocks dot pl అని టైప్ చేసి,
04:18 Enter నొక్కండి. టెర్మినల్ పై చూపించబడే అవుట్పుట్
04:22 I am not a computer language.
04:27 ఈ మూడు కేసులు
04:29 condition సంతృప్తి చెందిన ఒక if block మాత్రమే అమలు అవడాన్ని సూచిస్తుంది.
04:35 లేదంటే డిఫాల్ట్ else block అమలు అవుతుంది.
04:39 ఈ విధంగా మన అవసరానికి అనుగుణంగా బహుళ elsif కండిషన్ లు ఉండవచ్చు.
04:46 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది-
04:48 if-elseif-else స్టేట్మెంట్ ను ముద్రించుటకు వ్రాయండి.
04:51 ఒకవేళ stream science అయితే I am a Science graduate.
04:55 ఒకవేళ stream commerce అయితే I am a commerce graduate.
04:59 ఒకవేళ stream science మరియు commerce కాకపోతే I am an Arts graduate.
05:06 ఇప్పుడు మనం switch స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం.
05:10 పెర్ల్ 5.8 వరకు పెర్ల్ లో switch స్టేట్మెంట్ లేదు.
05:14 ఆ తరువాత, Switch module ప్రవేశపెట్టబడింది.
05:18 ఇది switch స్టేట్మెంట్ యొక్క కార్యాచరణను అందిస్తుంది.
05:22 గమనిక: Perl లో Modules గురించి, తరువాత ట్యుటోరియల్స్ లో కవర్ చేయబడతాయి.
05:27 switch సింటెక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది:
05:30 use Switch సెమికోలన్
05:32 Enter నొక్కండి.
05:34 switch space open bracket $ (dollar) value close bracket space open curly bracket.
05:42 Enter నొక్కండి.
05:44 case space 1 space open curly bracket executes when dollar value equal to 1 close curly bracket.
05:53 Enter నొక్కండి.
05:55 case space single quote a single quote space open curly bracket executes when dollar value equal to single quote a single quote close curly bracket.
06:09 Enter నొక్కండి. else space open curly bracket executes when dollar value does not match any of the cases.
06:18 క్లోజ్ కర్లీ బ్రాకెట్ Enter నొక్కండి.
06:20 క్లోజ్ కర్లీ బ్రాకెట్.
06:22 నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి మనం switch ను అర్థం చేసుకుందాం.
06:26 టెర్మినల్ ను తెరిచి
06:29 gedit sampleSwitch dot pl space ampersand అని టైప్ చేసి,
06:36 Enter నొక్కండి.
06:38 ఇప్పుడు, నమూనా ప్రోగ్రామ్ ను స్క్రీన్ పై చూపిన విధంగా టైప్ చేయండి.
06:43 switch స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకుందాం.
06:46 use Switch స్టేట్మెంట్ Perl కోడ్ లోపల Switch మాడ్యూల్ ను కలిగి ఉంటుంది.
06:54 గమనిక: మనం తరువాత ట్యుటోరియల్లో use keyword గురుంచి క్లుప్తం గా నేర్చుకుంటాము.
07:00 ఇప్పుడు మనం వివిధ కేసులను పరిక్షిద్దాం.
07:03 మనము Perlను $var వేరియబుల్ కు కేటాయించాము.
07:08 వేరియబుల్ $var లో ఉన్న విలువ switch స్టేట్మెంట్ లో తనిఖీ చేయబడుతుంది.
07:14 మొదటి కేసు లో, ఇది Perl కేసుతో పోల్చుతుంది.
07:19 కాబట్టి, ఈ case కు వ్యతిరేకంగా వ్రాయబడిన కోడ్ అమలు చేయబడుతుంది.
07:24 ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి.
07:27 ఇప్పుడు టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను అమలు చేయండి.
07:31 perl sampleSwitch.pl
07:36 Enter నొక్కండి.
07:38 క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
07:41 I am Perl.
07:43 తిరిగి gedit లో sampleSwitch.pl కు మారండి.
07:48 ఇప్పడు మనం వేరియబుల్ $var కు Linux ను కేటాయిద్దాం.
07:52 ఫైల్ ను save చేయడానికి Ctrl+S ను నొక్కండి.
07:57 మళ్ళీ, వేరియబుల్ $var విలువ switch లో తనిఖీ చేయబడుతుంది.
08:03 ఇది Linux కేసు తో సరిపోల్చబడుతుంది.
08:05 కాబట్టి, ఈ case వద్ద వ్రాయబడిన కోడ్ అమలు చేయబడుతుంది.
08:10 ఇప్పుడు టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను అమలు చేయండి.
08:15 perl sampleSwitch.pl అని టైప్ చేసి,
08:19 Enter నొక్కండి.
08:21 క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
08:24 I am Linux.
08:26 geditలో sampleSwitch.pl కు మారండి.
08:30 అదేవిధంగా, ఒకవేళ $var వేరియబుల్ Java విలువని కలిగి ఉంటే అప్పుడు రెండవ case తనిఖీ చేయబడుతుంది.
08:38 ఇప్పుడు, మనం Englishను $var వేరియబుల్ కు కేటాయిద్దాం.
08:42 మళ్ళీ, వేరియబుల్ $var విలువ switch లో తనిఖీ చేయబడుతుంది.
08:47 ఇది ఏ caseకు స్టేట్మెంట్స్ తో సరిపోదు.
08:50 కాబట్టి else స్టేట్మెంట్ అమలవుతుంది.
08:54 ఇప్పుడు టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను అమలు చేయండి.
09:00 perl sampleSwitch.pl అని టైప్ చేసి,
09:07 Enter నొక్కండి.
09:09 క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
09:12 I am not a computer language
09:17 ఈ మూడు కేసులు:
09:20 expression యొక్క విలువ అమలు కావలసిన case ను నిర్ణయిస్తుంది.
09:25 చెల్లుబాటు అయ్యే ఒక case మాత్రమే అమలు చేయబడుతుంది మరియు
09:28 చెల్లుబాటయ్యే ఏ case లేనప్పుడు డిఫాల్ట్ else case అమలవుతుంది.
09:35 else case ను వ్రాయడం తప్పనిసరి కాదు.
09:39 అటువంటి సందర్భంలో,
09:41 ఒకవేళ ఏ cases సరిపోకపోతే,
09:44 అప్పుడు switch స్టేట్మెంట్ నుండి ఎటువంటి అవుట్పుట్ రాదు.
09:48 ఇక్కడ మీకు మరొక అసైన్మెంట్ ఉంది:
09:50 ఈ ట్యుటోరియల్లో, ముందు ఇచ్చిన మునుపటి అసైన్మెంట్ ను
09:53 switch స్టేట్మెంట్ ను ఉపయోగించి మరల వ్రాయండి.
09:57 సారాంశం చూద్దాం.
09:59 ఈ ట్యుటోరియల్ లో మనం,
10:01 if-elsif-else స్టేట్మెంట్ మరియు
10:04 Perl లో switch స్టేట్మెంట్ ను నమూనా ప్రోగ్రాం ఉపయోగించి నేర్చుకున్నాము.
10:08 క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
10:12 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షీప్తీకరిస్తుంది.
10:15 ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్ లోడ్ చేసి చూడవచ్చు.
10:20 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
10:25 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
10:30 మరింత సమాచారం కొరకు దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
10:36 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:40 NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా దీనికి సహకారం లభిస్తుంది.
10:47 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:58 మీరు ఈ PERL ట్యుటోరియల్ ను ఆస్వాదించారని భావిస్తున్నాను.
11:00 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్.
11:03 మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india