Moodle-Learning-Management-System/C2/User-Roles-in-Moodle/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 User Roles in Moodle అనే స్పోకన్ ట్యూటోరియా కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము, ఒక యూసర్ కు అడ్మిన్ రోల్ ని ఎలా కేటాయించాలి
00:13 ఒక కోర్స్ ని ఒక ఉపాధ్యాయుని ఎలా కేటాయించాలి మరియు ఒక కోర్స్ కు ఒక విద్యార్ధి ని ఎలా ఎన్రోల్ చేయాలో నేర్చుకుంటాము.
00:20 ఈ ట్యుటోరియల్, ఉబుంటు లైనక్స్ OS 16.04,
00:28 XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ లను ఉపయోగించి రికార్డు చేయబడింది.
00:42 మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.

ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక.

00:54 ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు తమ Moodle వెబ్సైట్లో సృష్టించిన కొన్ని కోర్సులను కలిగి ఉండాలి.
01:01 లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ చూడండి.
01:08 బ్రోసేర్ కి వెళ్ళి, మీ admin username మరియు password వివరాలతో Moodle వెబ్సైట్ కు లాగిన్ అవ్వండి.
01:16 మనము ఇప్పుడు admin డాష్ బోర్డు లో ఉన్నాము.
01:19 Course and Category Management పేజీ కి వెళ్దాం.
01:24 మీరు మీ Moodle ఇంటర్ఫేస్ పై ఈ కోర్సులను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.

లేకపోతే, ట్యుటోరియల్ ని పాజ్ చేసి, వాటిని సృష్టించి ఆపై పునఃప్రారంభించండి.

01:34 మనం సృష్టించిన అన్నియూజర్లను చూద్దాం.
01:38 Site Administration పై క్లిక్ చేయండి.
01:41 ఆపై Users ట్యాబు క్లిక్ చేయండి.
01:44 Accounts సెక్షన్ క్రింద, Browse list of users ని క్లిక్ చేయండి.
01:50 మనము 4 యూజర్స్ ని కలిగి ఉన్నాము.
01:53 యూజర్ ప్రియ Sinha పై క్లిక్ చేసి, ఆమె ప్రొఫైల్ ను సవరిద్దాం.
01:59 ఆపై User details సెక్షన్ లో Edit Profile లింక్ ని క్లిక్ చేయండి.
02:04 క్రిందికి స్క్రోల్ చేస, Optional విభాగాన్ని గుర్తించండి.

దానిని విస్తరించడానికి దాని పై క్లిక్ చేయండి.

02:11 Institution, Department, Phone మరియు Address ఫీల్డ్ లు స్వయంచాలకంగా నింపబడుతాయని గమనించండి.

ఇవి CSV ఫైల్లో ఇదివరకు నమోదు చేసినవి.

02:23 users యొక్క జాబితాకు మళ్ళీ వెళ్దాము.

ఆలా చేయుటకు Site Administration -> Users -> Browse list of users పై క్లిక్ చేయండి.

02:33 మనము యూసర్, System Admin2కు administrator role ని కేటాయిద్దాం.
02:39 ఎడుమ వైపు ఉన్న Site Administrationని క్లిక్ చేసి ఆపై యూజర్స్ ట్యాబు ని క్లిక్ చేయండి.
02:46 Permissions విభాగం వరకు స్క్రోల్ చేసి, Site Administrators ని క్లిక్ చేయండి.
02:52 ఇక్కడ 2 యూసర్ల యొక్క సెట్ లు ఉన్నాయి.

మొదటి సెట్ లో ప్రస్తుత site administrators ల పేర్లు ఉన్నాయి మరియు రెండవ సెట్ లో ఇతర యూజర్స్ యొక్క జాబితా ఉంది.

03:05 రెండు జాబితా ల మధ్య, వివిధ చర్యలను నిర్వహించడానికి బటన్లు ఉన్నాయి.
03:11 Users box బాక్స్ నుండి, System Admin2 user ని క్లిక్ చేద్దాం.
03:17 చాలా ఎక్కువ మంది యూసర్ లు ఉంటే, శోధన కోసం యూజర్స్ బాక్స్ క్రింద ఉన్న Search బాక్స్ ని ఉపయోగించండి.

ఆపై Add బటన్ క్లిక్ చేయండి.

03:26 Confirm బాక్స్ లో Continue బటన్ ని క్లిక్ చేయండి.
03:30 ఇప్పుడు ఇద్దరు అడ్మిన్ యూజర్స్ ఉన్నారు.

మనకు ఎందరు కావాల్సితే అందరు admin users ఉండవచ్చు.

03:38 అయితే, కేవలం ఒక్క Main administrator మాత్రమే ఉండవచ్చు.

మెయిన్ అడ్మినిస్ట్రేటర్ ని ఎప్పటికీ సిస్టమ్ నుండి తొలగించలేము.

03:48 ఇప్పుడు Rebecca Raymondని Calculus course కోసం టీచర్ గా అసైన్ చేద్దాం
03:55 దీని కోసం ఇక్కడ చూపిన విధంగా Course and category management పేజీ వెళ్ళండి.
04:02 1st Year Maths subcategory ని క్లిక్ చేసి, దాని క్రింద ఉన్న courses చూడండి.
04:09 Calculus కోర్స్ పై క్లిక్ చేయండి. స్క్రోల్ చేసి కోర్స్ యొక్క వివరాలను చూడండి.

Enrolled Users పై క్లిక్ చేయండి.

04:19 ఈ కోర్సు కి యూసర్ ప్రియా సిన్హా నమోదు చేసుకుందని మనం చూడవచ్చు.
04:25 దీనిని మనం అప్లోడ్ యూజర్ CSV ద్వారా చేశాము.
04:29 Moodle లో టీచర్ తో సహా ప్రతి ఒక్కరు కోర్సు లోకి నమోదు చేయాల్సి ఉంటుంది.
04:35 యూసర్ లకు కేటాయించే కొత్త రోల్, వారి కోర్స్ లో ఉన్న ప్రస్తుత రోల్ పై ఆధారపడి ఉంటుంది.
04:41 ఎగువ కుడి వైపు లేదా దిగువ కుడివైపు ఉన్న Enrol users బటన్ పై క్లిక్ చేయండి.
04:48 ఒక పాప్-అప్ విండో తెరుచుకుంటుంది.
04:51 విండో లో Assign rolesఅనే డ్రాప్ డౌన్, Enrolment options కోసం ఫీల్డ్స్ మరియు ఒక Search బటన్ ఉన్నాయి.
05:00 ఈ కోర్సు కు ప్రస్తుతం కేటాయించబడని యూజర్స్ ల జాబితా ని మనం ఇక్కడ చూడవచ్చు.
05:06 Assign roles డ్రాప్ డౌన్ నుండి, Teacherను ఎంచుకోండి.
05:11 Rebecca Raymond పక్కన ఉన్న Enrol బటన్ ని క్లిక్ చేయండి.
05:16 చివరిగా, పేజీ దిగువున Finish Enrolling users బటన్ ని క్లిక్ చేయండి.
05:24 స్టూడెంట్లను కూడా అదే విధంగా ఒక కోర్స్ కు కేటాయించవచ్చు.
05:28 Rebecca Raymond యొక్క టీచర్ రోల్ ని తీసివేయుటకు, Roles column లో ఉన్న Trash ఐకాన్ పై క్లిక్ చేయండి.
05:36 Confirm Role Change పాప్ అప్ బాక్స్ లో Remove బటన్ క్లిక్ చేయండి.
05:42 ఇప్పటికే ఎన్రోల్ చేసి ఉన్న యూజర్లకు కూడా Assign role ఐకాన్ ని ఉపయోగించి రోల్ ని కేటాయించవచ్చు.
05:50 దాని పై క్లిక్ చేస్తే, ఒక చిన్న పాప్ -అప్ విండో అన్ని రోల్ పేర్లతో తెరుచుకుంటుంది.
05:56 Rebecca Raymond కు టీచర్ రోల్ ని కేటాయించేందుకు Teacher పై క్లిక్ చేయండి.

బాక్స్ దాని సొంతంగా మూసుకుంటుంది.

06:04 ఒక కోర్సు నుండి యూసర్స్ యొక్క నమోదు ని కుడి వైపు ఉన్న trashఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా రద్దు చేయవచ్చు.
06:11 కుడి వైపు ఉన్న gear ఐకాన్ user enrolment వివరాలను సవరించుటకు వాదపడుతుంది.

Click on it. దాని పై క్లిక్ చేయండి.

06:20 దాని లో యూజర్ని నిలిపివేయుటకు మరియు enrolment start మరియు end dates ని మార్చుటకు ఎంపిక ఉంది.
06:28 enrolment పేజీ కి తిరిగి వెళ్ళడానికి, Cancel బటన్ పై క్లిక్ చేయండి.
06:33 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం.
06:39 ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, ఒక యూసర్ కు అడ్మిన్ రోల్ ని కేటాయించాలి,

ఒక కోర్స్ ని ఒక ఉపాధ్యాయుని కేటాయించాలి మరియు ఒక కోర్స్ కు ఒక విద్యార్ధి ని ఎలా ఎన్రోల్ చేయాలో నేర్చుకున్నాము.

06:52 మీ కోసం ఒక అసైన్మెంట్

Rebecca Raymondని Linear Algebra courseకు ఒక టీచర్ గా కేటాయించండి.

07:00 Priya Sinhaని Linear Algebra courseకు ఒక స్టూడెంట్ గా కేటాయించండి.
07:06 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
07:14 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
07:22 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
07:26 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

07:38 ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya