Moodle-Learning-Management-System/C2/Enroll-Students-and-Communicate-in-Moodle/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Moodle లో Enroll Students and Communicate అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి, ఒక కోర్సుకు ఒక csv ఫైల్ ద్వారా అప్లోడ్ చేయబడిన విద్యార్థులను నమోదు చేయడం. |
00:18 | కోర్సులలో సమూహాలను తయారు చేయడం, సందేశాలను మరియు గమనికలు విద్యార్థులకు పంపడం. |
00:26 | ఈ ట్యుటోరియల్: ఉబుంటు లైనక్స్ OS 16.04, |
00:33 | XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, |
00:41 | Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది.
మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. |
00:51 | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. |
01:00 | మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని
మరియు కనీసం మీకు ఒక కోర్స్ ని అసైన్ చేసి ఉన్నాడని అనుకుంటాము. |
01:11 | మరియు మీరు మీ కోర్స్ కి కొంత కోర్స్ సామాగ్రి, అసైన్మెంట్ లు క్విజ్ లు కూడా జోడించి ఉన్నారని అనుకుంటాము. |
01:19 | లేకపొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటుని సందర్శించండి. |
01:26 | ప్రారంభించడానికి ముంది, మీ Moodle సైట్ కొరకు, మీ Moodle సైట్ అడ్మినిస్ట్రేటర్ ని ఐదుగురు (5) లేదా ఆరుగురు(6) యూసర్లను జోడించమని అడగండి. |
01:36 | ఈ క్రొత్త యూసర్లను తరువాత మీరు మీ కోర్సు కు జోడించాలి.
కాబట్టి కొత్త యూసర్లు మీ Moodle సైట్కు జోడించబడ్డారని నిర్ధారించుకోండి. |
01:47 | Moodle లోని ఉపాధ్యాయులు సిస్టం కు కొత్త వినియోగదారులను జోడించలేరు.
వారు ఇప్పటికే సైట్ అడ్మినిస్ట్రేటర్ జోడించిన యూజర్స్ లను మాత్రమే నమోదు చేయగలరు. |
01:59 | బ్రౌజర్ కు మారి, మీ Moodle siteకు ఒక టీచర్ గా లాగిన్ చేయండి. |
02:06 | ఎడుమ వైపు ఉన్న navigation మెనూ లో నుండి Calculus course ని క్లిక్ చేయండి. |
02:11 | ఎగువ కుడి వైపు ఉన్న gear ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై More.. ని క్లిక్ చేయండి. |
02:18 | మనం Course Administration పేజీ లో ఉన్నాము. |
02:22 | Users ట్యాబు పై క్లిక్ చేయండి. |
02:25 | Users విభాగం లో ఉన్న Enrolled users లింక్ ను క్లిక్ చేయండి. |
02:30 | ఈ కోర్స్ కి ఇద్దరు (2) యూసర్ లు అనగా Rebecca Raymond మరియు Priya Sinhaలను ఎన్రోల చేసి ఉన్నారు. |
02:38 | Rebecca Raymondకు టీచర్ రోల్ మరియు Priya Sinha కు స్టూడెంట్ రోల్ ఉంది. |
02:44 | కుడి దిగువ భాగం ఉన్న Enrol users పై క్లిక్ చేయండి. |
02:49 | ఇందులో లో నేను నా Calculus courseకు నమోదు చేయాలనుకునే విద్యార్థుల జాబితా ఉంది. |
02:55 | Assign Roles డ్రాప్ డౌన్ నుండి Student ని ఎంచుకోండి. |
03:00 | ఆపై మీరు నమోదు చేయదలిచిన యూజర్స్ ప్రక్కన ఉన్న ఎన్రోల్(Enrol) బటన్ పై క్లిక్ చేయండి. |
03:06 | నేను ప్రస్తుతం నా కోర్సు లోకి కొంతమంది విద్యార్ధులను చేర్చుతాను. |
03:11 | అది పూర్త అయిన తర్వాత, దిగువ కుడి వైపు ఉన్న Finish enrolling users బటన్ పై క్లిక్ చేయండి. |
03:18 | మనము పేజీ యొక్క పైభాగంలో, కాలిక్యులస్ కోర్సు కోసం నమోదు చేసుకున్న యూజర్ల సంఖ్యను చూడవచ్చు. |
03:25 | తరువాత, మనము ఒక కోర్సు లో కొన్ని సమూహాలను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. |
03:30 | ఈ సమూహాలు గ్రూప్ కార్యకలాపాలకు విద్యార్థులను నియమించుటకు సహాయపడుతాయి. |
03:36 | నేను ఎక్స్ప్లోరర్స్ మరియు క్రియేటర్స్ అనే రెండు(2) సమూహాలను తయారు చేస్తాను. |
03:42 | కోర్సు పేజీ కు తిరిగి వెళ్ళడానికి, breadcrumb లో కాలిక్యులస్ ని క్లిక్ చేయండి. |
03:48 | Course Administrator పేజీ మళ్ళి వెళ్ళండి. |
03:52 | Users ట్యాబు లో Groups లింక్ పై క్లిక్ చేయండి. |
03:56 | క్రిందికి స్క్రోల్ చేసి Create group బటన్ పై క్లిక్ చేయండి. |
04:01 | Group name గా Explorers అని టైపు చేయండి. |
04:05 | ఇక్కడ ఇతర ఏ తప్పనిసరైన ఫీల్డ్స్ లేవు. |
04:08 | క్రిందికి స్క్రోల్ చేసి Save changes బటన్ పై క్లిక్ చేయండి. |
04:12 | ఇప్పుడు Explorers ని ఎడమ వైపున groupsల జాబితాలో చూడవచ్చు. |
04:19 | దానికి ప్రక్కన ఉన్న సున్నా సంఖ్య, గ్రూప్ లో ఇప్పటికి ఏ యూజర్స్ లేరు అని సూచిస్తుంది.
దానిని ఇప్పటికే ఎంపిక చేయకపోతే. ఎక్స్ప్లోరర్స్ ని ఎంచుకోండి, |
04:30 | దిగువ కుడివైపున ఉన్న Add/remove users బటన్ను క్లిక్ చేయండి. |
04:36 | నేను విద్యార్థుల జాబితా నుండి సుస్మితా మరియు సాయిని ఎంచుకుంటాను. |
04:42 | ఆపై 2 నిలువు వరుసల మధ్యలో ఉన్న Add బటన్ పై క్లిక్ చేయండి. |
04:48 | ఎడుమ వైపు న గ్రూప్ ఎక్స్ప్లోరర్స్ లోని యూజర్స్ యొక్క జాబితాను గమనించండి. |
04:54 | కుడివైపున, ఈ కోర్సు లో నమోదు చేయబడిన ఇతర విద్యార్థుల జాబితాను గమనించండి. |
05:00 | వారిని టీచర్ ద్వారా, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ సమూహానికి చేర్చవచ్చు. |
05:06 | మనము జాబితాల నుండి యూజర్స్ ని ఎంచుకున్నప్పుడు, 2 జాబితాల మధ్య ఉన్న Add మరియు Remove బటన్లు, ఎనేబుల్ చేయబడతాయి. |
05:15 | పేజీ యొక్క దిగువ భాగం లోని Back to groups బటన్ క్లిక్ చేయండి. |
05:21 | ఈ ట్యుటోరియల్ని పాజ్ చేసి ఒక చిన్న అసైన్మెంట్ చేయండి. క్రియేటర్స్ అనే కొత్త సమూహాన్ని జోడించండి. |
05:28 | ఆ గ్రూప్ కు ఇద్దరు (2) కొత్త యూజర్స్ ని కేటాయించండి.
అది పూర్తి చేసిన తరవాత ట్యుటోరియల్ను పునఃప్రారంభించండి. |
05:35 | ఇప్పుడు మీరు ఇలాంటి స్క్రీన్ ను చూడాలి. |
05:40 | Roles, Groups మరియు Enrollment Methods అనే కాలమ్స్ కు చిహ్నాలు ఉన్నాయి. |
05:48 | ప్రతి ఒక్క ఐకాన్ పై మౌస్ ని తరలిస్తే, అవి చేసే పనులు అర్థం అవుతాయి. |
05:55 | గమనిక: ఒక నమోదిత విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ సమూహాలకు చెందవచ్చు. |
06:02 | విద్యార్థులకు సందేశం ఎలా పంపించాలో చూద్దాం. |
06:07 | ఎడుమ వైపు ఉన్న నావిగేషన్ బార్ నుండి Participants లింక్ పై క్లిక్ చేయండి. |
06:12 | ఇది కోర్సు లో కేటాయించిన రోల్స్ తో పాటు, నమోదు చేసుకున్న అందరు యూసర్ల జాబితాను చూపిస్తుంది. |
06:19 | Moodle Participants పేజీ డిఫాల్ట్ గా 20 విద్యార్థులను మాత్రమే చూపిస్తుంది. |
06:25 | మీ వద్ద 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, అందరు విద్యార్థులను చూడడానికి Show all పై క్లిక్ చేయాలి.
ఈ లింక్ ప్రస్తుతం కనిపించదు ఎందుకంటే నా వద్ద 20 కంటే ఎక్కువ విద్యార్థులు లేరు. |
06:38 | users జాబితా పైన కొన్ని ఫిల్టర్లు ఉన్నాయి. వాటిని యూజర్స్ యొక్క సరైన సెట్ను ఎంచుకోవడానికి వాడండి. |
06:46 | నేను Current role డ్రాప్ డౌన్ నుండి Student ని ఎంచుకుంటాను. |
06:51 | ఇది student roleగా కేటాయించ బడిన యూజర్స్ ని మాత్రమే చూపించడానికి జాబితాను ఫిల్టర్ చేస్తుంది. |
06:58 | అందరు విద్యార్థులను ఎంచుకోవడానికి పేజీ యొక్క దిగువ భాగంలోని Select all బటన్ పై క్లిక్ చేయండి. |
07:04 | ఆపై With selected users డ్రాప్ డౌన్ నుండి Send a message ను ఎంచుకోండి. |
07:11 | ఇది ఎంచుకున్న విద్యార్థులందరికీ ఒక సాధారణ సందేశాన్ని పంపుతుంది. |
07:16 | ట్యుటోరియల్ని పాజ్ చేసి, మెసేజ్ బాడీ(Message body) లో చూపిన విధంగా సందేశాన్ని అని టైప్ చేయండి. |
07:22 | సందేశాన్ని పంపడానికి ముందు సందేశాన్ని ప్రివ్యూ చెయ్యటానికి, దిగువన ఉన్న ప్రివ్యూ బటన్ పై క్లిక్ చేయండి. |
07:29 | మీరు అప్డేట్ బటన్ పై క్లిక్ చేసి, సందేశాన్ని అవసరమైతే అప్ డేట్ చెయ్యవచ్చు. |
07:35 | మెసేజ్ ని పంపడానికి Send message బటన్ పై క్లిక్ చేయండి. |
07:40 | మీరు participants listsకు తిరిగి వెళ్ళడానికి నిర్ధారణ సందేశాన్ని మరియు లింక్ను చూస్తారు. |
07:46 | Back to participants list పై క్లిక్ చేయండి. |
07:50 | With selected users డ్రాప్ డౌన్ ని క్లిక్ చేయండి. ప్రైవేట్ మరియు సాధారణ నోట్స్ ని పంపడానికి ఎంపికలను గమనించండి. |
08:00 | ఎవరైనా ఇద్దరు 2 యూజర్స్ ని ఎంచుకుందాం. |
08:03 | With selected users డ్రాప్ డౌన్ నుండి Add a new note ని ఎంచుకోండి. |
08:09 | ఒక యూసర్ యొక్క కంటెంట్ టెక్స్ట్ ప్రాంతం లో, నేను చూపిన విధంగా గమనికను టైప్ చేస్తాను. |
08:15 | మరో యూజర్ పక్కన ఉన్న కంటెంట్ టెక్స్ట్ ప్రాంతం లో, ఇక్కడ చూపిన విధంగా నేను నోట్ను టైప్ చేస్తాను. |
08:22 | కుడి వైపు ఉన్న Context డ్రాప్ డౌన్ ని చుడండి. |
08:26 | నోట్ యొక్క కాంటెక్స్ట్ ను బట్టి, గమనిక ను ఏ యూజర్స్ చూడగలరో నిర్ణయిస్తుంది. |
08:31 | ఒక personal note, పంపబడిన, గురువు మరియు విద్యార్ధికి మాత్రమే కనిపిస్తుంది. |
08:38 | ఒక course note ఈ కోర్సు యొక్క ఇతర ఉపాధ్యాయులకు మాత్రమే కనిపిస్తుంది. |
08:44 | ఒక సైట్ నోట్ అన్ని కోర్సుల్లోని అందరు ఉపాధ్యాయులకు కనిపిస్తుంది. |
08:50 | చాలా సంస్థలు తమ టీచర్లు మరియు విద్యార్థుల మధ్య సంభాషణకు సంబంధించి, వారి స్వంత నియమాలు కలిగి ఉంటాయి. |
08:57 | మీరు ఈ మార్గదర్శకాల ఆధారంగా కాంటెక్స్ట్ ను నిర్ణయించండి. |
09:02 | నేను Context ని course ఉంచుతాను. |
09:06 | పూర్తీ అయినతరువాత Save changes బటన్ క్లిక్ చేయండి. |
09:10 | దీని తో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము
సారాంశం చూద్దాం. |
09:16 | ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, ఒక కోర్సు లో యూజర్స్ ని నమోదు చేయడం, |
09:22 | ఒక కోర్సు లో గ్రూపులు తయారు చేయడం, సందేశాలను మరియు గమనికలు పంపడాని నేర్చుకున్నాము. |
09:29 | ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్ ఉంది.
కాలిక్యులస్ కోర్సుకు, Moodle సైట్ నిర్వాహకుడు ద్వారా సృష్టించబడిన వినియోగదారులందరినీ నమోదు చేయండి. |
09:40 | ప్రరస్తుతం ఉన్న గ్రూపులు కు క్రొత్త విద్యార్థులను జోడించి వారికీ స్వాగత సందేశం పంపండి.
ఆపై విద్యార్థులకు గమనికలు పంపండి. |
09:50 | వివరాలు కోసం ఈ ట్యుటోరియల్ యొక్క అసైన్మెంట్ లింకును చూడండి. |
09:55 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
10:04 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
10:14 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
10:19 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
10:31 | ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |